సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వెయ్య రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి నెల నుంచే ఈ పెంపు వర్తిస్తుంది. ఈ నెలలో వెయ్య రూపాయలే ఇవ్వటంతో, వచ్చే నెల రెండు వేలు, ఈ నెల పెంచిన వెయ్య కలిపి, వచ్చే నెలలో మూడు వేలు ఇవ్వనున్నారు. మార్చ్ నెల నుంచి యధావిధిగా రెండు వేలు ఇస్తారు.

pensions 1112019

2014కి ముందు నెలకి రూ.200గా ఉన్న అన్నిరకాల పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదు రెట్లు పెంచి రూ.1,000 చొప్పున అందించింది. దివ్యాంగులకు, హిజ్రాలకు రూ.1,500 చేసింది. 2017 సెప్టెంబరు నుంచి డయాలసిస్‌ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై సమీక్షించి.. రెట్టింపు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వృద్ధాప్య, వితంతువులకు పింఛను మొత్తం నెలకు రూ.2,000 చెల్లించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి. డిసెంబర్‌ ఆఖరు నాటికి వివిధ రకాల పింఛన్లు కావాలని కోరుతూ ప్రభుత్వానికి 2.5లక్షల దరఖాస్తులందాయి.

pensions 1112019

తాజా జన్మభూమి గ్రామ సభల్లో తొమ్మిదో తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయి. ఇతర రూపాల్లో అందిన విజ్ఞప్తులకు మరో లక్ష మందికి ఇవ్వాల్సి వస్తుందనుకున్నా మొత్తం 4.55లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే వీలుంది. వీటికి సైతం ఫిబ్రవరి నుంచే పెంచిన మొత్తం అందుతుంది. కొత్త వాటినీ కలిపితే మొత్తం పింఛన్ల సంఖ్య 55.16లక్షలకు చేరుతుంది. ఈ మేరకు ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పింఛన్ల మంజూరుతోపాటు పెంచే మొత్తానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు చంద్రబాబు చెయ్యటంతో, ప్రతి పేదవాడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైన సంక్రాంతి అని చెప్తున్నారు.

గత కొన్ని రోజులుగా తన పై వస్తున్న పుకార్లకు, అఖిల ప్రియ ఫుల్ స్టాప్ పెట్టారు. తెలుగుదేశం పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. అసలు జనసేనలోకి ఎలా వెళ్తాను అంటూ ఒక్క దెబ్బతో ఆ పార్టీని తీసి పడేసారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు. పోలీసులు నతన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రి అఖిలప్రియ తెలిపారు.

akhila 11012019 2

ఇదిలా ఉంటే, తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవం అయ్యారు. ఆ తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే అఖిలప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. పిన్న వయసులోనే అనూహ్య పరిణామాల మధ్య అఖిలప్రియని మంత్రి పదవి వరించడం విశేషం. అఖిలప్రియ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకూ ప్రతి అంశం కలిసొచ్చింది. అయితే వచ్చే ఎన్నికలు మాత్రం ఆమెకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి జతకడితే.. 2019 ఎన్నికల్లో అఖిలప్రియ ప్రత్యర్ధులతో గట్టిగానే పోరాడాల్సి ఉంటుంది.

akhila 11012019 3

ప్రత్యర్ధులందరూ ఏకమైనా గెలుపు తమదే అనే ధీమాలో ప్రస్తుతం అఖిలప్రియ ఉన్నారు. మెజారిటీపైనే ఫోకస్ పెట్టానని చెబుతున్నారు. ఇప్పటినుంచే సరికొత్త వ్యూహాలతో ఆమె తీవ్ర కసరత్తు మొదలుపెట్టారు. అయినప్పటికీ బలమైన క్యాడర్ కలిగిన ప్రత్యర్ధులను అఖిలప్రియ వ్యూహాలు ఏమేరకు బలహీనపరుస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు పోలీసులతో నెలకొన్న వివాదంపై ఆమె ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు అకస్మాత్తుగా తెరపైకి వస్తున్న ఇలాంటి పరిస్థితులను మంత్రి అఖిలప్రియ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి!

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా చూసేందుకు సీఎం చంద్రబాబు నగరంలోని నిన్న క్యాపిటల్ థియేటర్‌కు వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నటుడు నారా రోహిత్, మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, పలువురు టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల సమేతంగా సినిమాను వీక్షించారు. కాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ చిత్రం బుధవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించారు. ఎన్టీఆర్ బయోపిక్‌‌లోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కాగా రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.

ntr 11012019 2

సినిమా చూసిన తరువాత చంద్రబాబు, మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని, ఇవన్నీ చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. ఎన్టీఆర్ సినిమాలో తన పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు’ అని పేర్కొన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని, బాలకృష్ణ బాగా నటించారని కొనియాడారు.

ntr 11012019 3

ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలిసారు. ఇద్దరినీ ముఖ్యమంత్రి సత్కరించారు. ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నటించారని తరువాత, బాలకృష్ణను ప్రశంసించారు చంద్రబాబు. 'ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని,త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు క్రిష్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రజలకు స్పూర్తిని ఇచ్చే, ఇలాంటి బయోపిక్ లు ఇంకా రావాలని, భావితరాలు ఇవి చూసి, ఆ మహోన్నత వ్యక్తులు ఎలా పైకి వచ్చింది తెలుసుకుని, ఆ స్పూర్తి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతుంది. ఇప్పటికే జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అలాగే జగన్, బీజేపీ, అంతర్గత పొత్తు వ్యూహాలు నడుస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో, మోడీని ఎదుర్కుంటానికి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర స్థాయిలో ఏమి చేస్తుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పై, ఇప్పటికీ కోపం ఉన్నా, నమ్మించి మోసం చేసిన మోడీ పై, దానికి పదింతలు కోపం ప్రజల్లో ఉంది. మరో పక్క కాంగ్రెస్ ప్రత్యెక హోదా హామీ కూడా ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి సంతకం హోదా పైనే, అంటూ రాహుల్ చెప్పారు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు పై చర్చ నడుస్తుంది. కాంగ్రెస్‌, తెదేపా ఏపీలో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పించడంలేదు.

cbn rahul 11012019

చంద్రబాబు, రాహుల్‌గాంధీ ఈ మేరకు తమ పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో భాజపాకు వ్యతిరేకంగా కలిసి నడవాలని నిర్ణయానికి వచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన ఈ బంధం క్రమంగా భాజపాయేతర కూటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ జతకలిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూటమి బలోపేతం దిశగా రాహుల్‌గాంధీ, చంద్రబాబు పలుమార్లు సమావేశమయ్యారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న భావన ఇరుపార్టీల శ్రేణుల్లో నెలకొంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ప్రజల మనోభావాలకు తగట్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు లేకున్నా ఏపీ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భాజపాయేతర కూటమికి అన్ని పార్టీలు మద్దతు పలకాలన్నారు. రాహుల్‌గాంధీ కూడా ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

cbn rahul 11012019

దిల్లీ పర్యటనలో రాహుల్‌గాంధీతో సమావేశమైన చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల్లో పొత్తు గురించే కాకుండా జాతీయస్థాయిలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చరిత్రాత్మక అవసరమనే అభిప్రాయానికి నేతలు ఇద్దరూ వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాల నుంచి పుట్టిన పార్టీ అయినందున రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే తెదేపాకు ఇబ్బంది అవుతుందేమోనన్నది పార్టీ వర్గాల ఆలోచన. బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో, కేరళలో సీపీఎంతో కాంగ్రెస్‌కు సఖ్యత సరిగా లేనందున రాష్ట్రాల్లో పొత్తులకు పోయి నష్టపోవడం కన్నా జాతీయస్థాయిలో ఐక్యంగా ఉండడం సబబు అనే నిర్ణయానికే రాహుల్‌, చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read