వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదంటూనే రాయబారాలు నడిపిస్తున్నారని పవన్ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాయబారం నడిపిన టీఆర్ఎస్ నేతలు ఎవరనే విషయాన్ని చెప్పడానికి పవన్ సాహసించలేదు. దీంతో పొత్తు కోసం రాయబారం నెరపుతున్న ఆ నేతలు ఎవరు, పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఎవరనే చర్చ సాగుతోంది.

kcr 120012019 2

టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా పొసగడం లేదు. అదే సమయంలో ఏపీలో కేసీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను జగన్ స్వాగతించారు. అంతేకాదు, ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి సహా పలుచోట్ల వైసీపీ.. తెరాసకు మద్దతు పలికిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెరాస నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ చెప్పడం చూస్తుంటే, వైసీపీ, తెరాస కలిసి ఏపిలో ఎలాంటి రాజకీయం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెరాసకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని అర్థమవుతోందని అంటున్నారు. ఇప్పటికే జగన్, తెరాస మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

kcr 120012019 3

మోడీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని చెబుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్పడం గమనార్హం. పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్.. జనసేతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు రోజుకూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్‌‌తో నిజంగానే టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదింపులు జరిపారా..? లేదా..? అనే విషయాలు తెలియాలంటే వైసీపీ లేదా టీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజుతోపాటు మరో ముగ్గురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

vishnu 11012019

ఇప్పటికే ఒక ప్రధాన పార్టీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమైన మహిళా నాయకురాలు కూడా కమలానికి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. కుమారుడికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా... ఆమెకు ఎంపీ టికెట్‌ పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన మరో కీలక నేత చల్లాపల్లి నరసింహారెడ్డి సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు స్టేక్ లేకపోవటంతో, ఆ పార్టీలో ఉండటానికి ఎవరూ సాహసించటం లేదు.

vishnu 11012019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడీ నమ్మించి మోసం చేసిన తీరుతో, ప్రజలు బీజేపీ పై రివర్స్ అయ్యారు. దానికి తోడు, అడుగు అడుగునా రాష్ట్రాన్ని అవమానించటం, రాష్ట్రానికి అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం అంటూ హడావిడి చెయ్యటం, ప్రతి సందర్భంలో నిధులు ఆపెయ్యటం, ఇవన్నీ చూస్తున్న ప్రజలకు బీజేపీ అంటే మంట ఎక్కుతుంది. దీనికి తోడు, జీవీఎల్ లాంటి వాళ్ళ మాటలు వింటుంటేనే, ప్రజలు మండిపడుతున్నారు. దీంతో బీజేపీ అంటేనే, మండే పరిస్థితి వచ్చింది. కనీసం పంచాయితీ ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా కూడా, బీజేపీని గెలిపించని స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకే ఆ పార్టీలో ఉన్న నేతలు అందరూ, రాజకీయ భవిషత్తు కోసం, పార్టీలు మారుతున్నారు.

ఎప్పుడూ లేని విధంగా, రాజకీయాల కోసం, సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగింపుకు గురైన అలోక్ వర్మ, అదే స్థాయిలో మోడీకి జవాబు ఇచ్చారు. మోడీ నిన్న, ఆయన్ను పదవి నుంచి తొలగించి, ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అవమానం భరించలేని అలోక్ వర్మ, మోడీ మొఖం మీద కొట్టినట్టు, ఆ పదవికి కూడా రాజీనామా చేసి పడేసారు. ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు మేరకు అలోక్ వర్మ బుధవారం సీబీఐ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఆయన ఆ పదవి నుంచి తొలగింపుకు గురయ్యారు. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయవలసి ఉంది.

verma 10012019

సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఇరువురి అధికారుల మధ్య నెలకొన్న పరిస్థితి సీబీఐ పరువు తీసేవిధంగా ఉందంటూ అక్టోబర్‌ 23న అర్ధరాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారులనూ బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీచేయడంతో పాటు సీబీఐలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

verma 10012019

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా, అన్యాయంగా పదవి నుంచి తప్పించడంతో పాటు బలవంతంగా సెలవుపై పంపడాన్ని ఆలోక్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సీవీసీని నివేదిక కోరింది. ఈ పరిణామాలపై సీవీసీ సీల్డు కవర్‌లో నివేదికను అందజేసింది. ఉన్నతస్థాయి ప్యానల్‌ ఏర్పాటు చేసి నియమనిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవస్థలో అర్ధరాత్రి పూట నిర్ణయాలు తగవంటూ సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ రెండు రోజల పాటు చర్చించాక కేంద్రం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతస్థాయి ప్యానల్‌ ఇచ్చిన సూచనల ఆధారంగా ఆలోక్‌ను డైరెక్టర్‌ బాధ్యతల నుంచి మరోసారి తప్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవీ విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపారు.

దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ పై స్పష్టమైన ప్రకటన చేసారు. 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్ఘాటించారు. ఆయన దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే మొదట చేసేపని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నారు. గత ఏడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని నరేంద్ర మోడీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

rahul 11012019 2

ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా భారత ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. స్థానిక లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే మేం చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం. గతేడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోదీకి అర్థమయ్యేలా చెప్పాలి.’’ అని అన్నారు.

rahul 11012019 3

దుబాయ్‌లోని భారత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘దుబాయ్‌ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్ర చాలా ఉంది. ఇక్కడి ఎత్తైన భవనాలు, పెద్ద మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, రోడ్లు మీ శ్రమ, చెమటతోనే నిర్మితమయ్యాయి. మీరు లేకుండా ఇదంతా ఇక్కడ సాధ్యమయ్యేది కాదు.భారత కార్మికుల వల్లే ఈ రోజు దుబాయ్‌ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా ఉంది. అంతేకాక పేదరికంలో ఉన్న మీ ఆప్తులకు అండగా ఉంటున్నారు. ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని రాహుల్‌ అన్నారు. నా 'మన్ కీ బాత్'ను ఇక్కడ మాట్లాడలేనని ప్రధాని మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Advertisements

Latest Articles

Most Read