ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్య‌క‌లాపాలు బుధవారం మొద‌ల‌య్యాయి. గ‌డిచిన 56 ఏళ్లుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు హైద‌రాబాద్‌లో కొన‌సాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జ‌న‌వ‌రి 1వ తేదీని అపాయింట్ మెంట్ డే గా నిర్ణ‌యించి, హైకోర్టు విభ‌జ‌నకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్‌గా ప్ర‌వీణ్ కుమార్‌, ఆయనతో పాటు మ‌రో 13 మంది న్యాయ‌మూర్తులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైకోర్టు భ‌వ‌నం మరో నెలరోజుల్లో అందుబాటులోకి వ‌స్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈలోగా తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నారు.

amaravati 02012019

ఈ రోజు (జ‌న‌వ‌రి 2వ తేదీ) నుంచి ఏపీ హైకోర్టులో కేసుల విచార‌ణను ప్రారంభించారు. తొలి కేసు విశాఖ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థకు సంబంధించినది. రిట్ పిటిష‌న్ నెం. 1731/2018 గా న‌మోద‌యిన విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో పిటిష‌న‌ర్లు.. జీవీఎంసీ క‌మిష‌న‌ర్, జీవీఎంసీ జోన్-2 జోన‌ల్ క‌మిష‌న‌ర్ కాగా, రెస్పాండెంట్స్ (ప్రతివాదులు) గాజుల శోభారాణి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మునిసిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ, విశాఖ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ. 2018 న‌వంబ‌ర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఈ పిటీష‌న్ దాఖ‌ల‌య్యింది. ఈ కేసులో పిటిష‌న‌ర్ల త‌రుపున న్యాయవాది ఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ రెడ్డి వాదిస్తుండ‌గా, ప్ర‌తివాదుల ప‌క్షాన న్యాయవాది ప‌రావ‌స్తు కృష్ణ వాదిస్తున్నారు.

amaravati 02012019

దీంతో పాటు మొత్తం 12 కేసులపై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే తొలి రోజు కేసుల విచార‌ణ జ‌ర‌గ‌కుండానే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వాటిని వాయిదా వేశారు. ఇక తొలి రోజు మరో విశేషం ఏంటి అంటే, తెలుగులో మొట్టమొదటి పిటిషన్ వేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన న్యాయవాది ప్రకాష్ మాట్లాడుతూ 2012లో తొలిసారిగా పుంగనూరు కోర్టులో పిటిషన్ వేశానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగులోనే అన్ని దావాలు, కేసులను దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. 2012-13లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు జస్టిస్ ఎల్వీ రమణ తెలుగులో కేసులు దాఖలు చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని ఒక సందేశం ఇచ్చారని, ఆయన సూచనలు పాటిస్తూ తెలుగులో కేసులు వేస్తూ.. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రకాష్ చెప్పారు. ఇదే మొదటి కేసని, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరూ దాఖలు చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పాలకొల్లులో ఉన్న న్యాయమూర్తి మోతీలాల్ కూడా తెలుగు భాషలో తీర్పులు ఇస్తున్నారని ఆయన తెలిపారు.

కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఈ నాలుగేళ్లలో ఎదుర్కోలేని వ్యక్తి మన దేశ ప్రధాని అంటే నమ్మగలరా. మళ్ళీ నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, దానిలో దమ్ము ఉంది అంటూ డైలాగులకి కొదవే లేదు. ఇలాంటి వ్యక్తి చెప్పే అబద్ధాలు విని, విసుగెత్తి, బహిరంగ చర్చకు రండి అంటే, పారిపోతున్నారు. నిన్న చంద్రబాబు, ఈ రోజు రాహుల్, ఇద్దరికీ సమాధానం చెప్పే దమ్ము మన ప్రధానికి లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ‘కాపలాదారు దొంగ’ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం సంచలన డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముఖాముఖి చర్చించేందుకు రావాలని కోరారు. ఏ అంశంపైన అయినా తాను మాట్లాడతానని, కేవలం 20 నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు.

rahul 02012019

కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి తెలియదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ సవాల్ విసిరారు. పారికర్‌ పడకగదిలో రఫేల్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలను దాచి పెట్టారంటూ ప్రశ్నించారు. మోదీ నిజాన్ని ఎంత దాచి పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది ఎన్నటికీ దాగలేదని ఆయన అన్నారు. ‘రఫేల్‌ ఒప్పందం విలువ రూ.58వేల కోట్లు అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చెప్పారు. అంటే ఒక్కో విమానం ధర రూ.1600కోట్లు. విమానం ధర రూ.526కోట్ల నుంచి రూ.1600కోట్లకు ఎలా వెళ్లింది. అంతలా ధరను ఎవరు పెంచారు. ధరను పెంచడంపై వైమానిక దళం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణ చేస్తే కచ్చితంగా ఇద్దరు పేర్లు బయటకు వస్తాయని మాకు నమ్మకం ఉంది. రఫేల్‌ ద్వారా మోదీ అనిల్‌ అంబానీకి సాయం చేశారనే విషయం బయటపడుతుంది’. అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.

 

rahul 02012019

నిన్న చంద్రబాబు కూడా ఇదే విధమైన ఛాలెంజ్ చేసారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ సహా సమస్త వ్యవస్థల్నీ ఆయన భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆక్రోశంతో మాట్లాడుతున్నానని మోదీ అనడంపై అభ్యంతరం తెలిపారు. ‘నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. ఆయన ఢిల్లీలో కూర్చుని ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై ఆయన చర్చకు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. దేశంలో అవినీతిని మోదీ ఏ మాత్రం తగ్గించారని నిలదీశారు. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలపై ఏం చెబుతారని అడిగారు. ‘బ్యాంకులను ముంచిన అవినీతిపరులు దేశాన్ని వీడి దర్జాగా వెళ్లిపోతున్నారు. దేశంలో ప్రగతి రేటు పడిపోయింది. ప్రజల ఆదాయం క్షీణించిపోయింది. మోదీ ఆర్థిక, పాలనా విధానాలు దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ప్రతిపక్ష కూటమి విఫలం కాలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి నమ్మకం నిలుపుకోవడంలో మోదీ, ఎన్డీఏ కూటమే విఫలమయ్యాయి’ అని ఆయన అన్నారు.

చంద్రబాబుకు ఆక్రోశం ఉందంటూ నిన్న ఏఎన్‌ఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ ఉన్నాయన్నారు. తన కోపానికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. అందుకే కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని, ఇప్పటివరకు 11 ధర్మపోరాట దీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమేనన్నారు.

cbn 02012019

తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలన్నారు. అందుకే కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇటీవల తనపై అసభ్యంగా మాట్లాడారని అన్నారు.

cbn 02012019

తన వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా తాను ప్రజల కోసమే భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్యలోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టమంటే, పెట్టమనే విధంగా కేంద్రం మాట్లాడితే తామే సాహసం చేసి పరిశ్రమను పెట్టుకొనేందుకు సిద్ధపడ్డామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు... ఇలా విభజన చట్టంలో పేర్కొన్న ఏ పనీ కేంద్రం చేయడంలేదని సీఎం దుయ్యబట్టారు.

అనంతపురంలో అమ్యూనేషన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు స్టంప్ ష్యూలే కేసింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ దేశ రక్షణ రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో అమ్యూనేషన్ ఉత్పత్తులను దేశీయంగా తయారుచేసి సరఫరా చేస్తుంది. తొలి రెండు దశల్లో 520 కోట్ల రూపాయలను, మూడో దశలో 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి ప్రారంభిస్తే దక్షిణ భారత్‌లో అమ్యూనేషన్ తయారుచేసే సంస్థ ఇదే మొదటిది కానుంది. ఈ సంస్థకు దేశంలో 11చోట్ల తయారీ యూనిట్లు ఉండగా, స్ప్రింగ్స్ తయారీలో దేశంలోనే నెంబర్-1 పేరు పొందింది. ఏరోస్పేస్, డిఫెన్సు రంగాల్లోకి కూడా అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఈడీబీ జె కృష్ణకిషోర్, ఎస్‌ఎస్‌సి ఎండీ సతీష్ మచ్చాని ఒప్పందాలపై సంతకాలు చేశారు.

stumpp 02012019 2

ఇది ఇలా ఉంటే, పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి’పై రూపొందించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. సేవలు, పారిశ్రామికం, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. చాలా మంది పోటీపడినా.. మనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే కియా మోటార్స్‌, ఇసుజు, జియో, అశోక్‌లేలాండ్‌, అపోలో టైర్స్‌ తదితర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. వెనకబడిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు మనకూ ఇచ్చి ఉంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు వచ్చేవారని వివరించారు. ‘నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం. ప్రపంచమంతా తిరిగాం. అధికారులు నిరంతరం శ్రమించారు. వ్యక్తిగతంగా నాపై ఉన్న విశ్వసనీయత కూడా ఇందుకు ఉపయోగపడింది’ అని చంద్రబాబు చెప్పారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రూపాయి అవినీతి లేకుండా అన్ని అనుమతులు ఇప్పించే విధానం తెచ్చామని అన్నారు.

stumpp 02012019 3

12 పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టామన్నారు. విశాఖ ఐటీ కారిడార్‌ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. దుగరాజపట్నం నౌకాశ్రయం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవకు నిధులు మంజూరులోనూ కేంద్రం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పెట్రో కెమికల్‌ కారిడార్‌ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోందని.. దీన్ని తామే ఏర్పాటు చేయించబోతున్నట్లు వివరించారు. నిమ్జ్‌ల(జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) ప్రకటన తప్పితే కేంద్రం పైసా విదల్చలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్జ్‌ తామే చేపట్టి రామాయపట్నానికి అనుసంధానించబోతున్నట్లు వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read