ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు నిరసనగా తొలుత అనుకున్నట్టుగా జనవరి ఒకటిన కాకుండా మరో రోజు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. జనవరి 1న నిరసన తెలపాలి అని అనుకున్నా, ఆ రోజున ప్రజలు కొత్త సంవత్సర మూడ్ లో ఉంటారని, అది చెడగొట్టకుండా, ముందు రోజు కాని, తరువాత రోజు కాని చెయ్యాలనే యోచనలో ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. గుంటూరులో జరిగే నిరసన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. దాదపుగా 20 కిమీలు పాదయాత్ర చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రదర్శన చివర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. నిరసన ప్రదర్శన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలి? సభ ఎక్కడ నిర్వహించాలి? అన్న అంశాన్ని నిర్ణయించే బాధ్యతను గుంటూరు జిల్లా నాయకులకు పార్టీ అప్పగించింది.

cbn 24122018 3

మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆదివారం గుంటూరులో సమావేశమై దీనిపై చర్చించారు. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తున్నారు. గుంటూరు సమీపంలో జరిగే సభలో పాల్గొంటారు. మరో పక్క ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వైపు నుంచే కాకుండా, వివిధ సంస్థలు, సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపి ప్రజల బాధను, నిరసనను మోడీకి తెలిసేలా, కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

cbn 24122018 2

రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి వీల్లేదని, ‘ప్రధాని మోదీ గో బ్యాక్‌’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అశోక్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్రలు మాట్లాడారు. అన్ని రకాలుగా ఏపీని మోసం చేసిన ప్రధాని రాకను అడ్డుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన, జనవరి 3న మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావద్దని, జనవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వరకు ఆందోళనలు, జనవరి 6న గుంటూరులో కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు చెప్పారు. అయితే మోడీ రాక పై పవన్, జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

నిన్న చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. పోలవరంలో మొదటి గేటు బిగింపు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, పూజా కార్యక్రమాలు అన్నీ ప్రాజెక్ట్ కింద భాగంలో ఏర్పాటు చేసారు. కాని చంద్రబాబు మాత్రం, ఇంతటి గొప్ప సంఘటన జరుగుతుంటే, మొక్కుబడిగా చేస్తామా అతను, పోలీసులు వద్దని వారిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సాహసం చేశారు. నిచ్చెన మెట్లపై 25 మీటర్లు ఎక్కి పూజలు చేశారు. స్పిల్ వే‌పై 25 మీటర్ల ఎత్తున క్రస్ట్ లెవల్‌లో తొలి రేడియల్ గేటును బిగించాల్సి ఉంది. దీంతో చంద్రబాబు పైకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు. భద్రతా పరమైన కారణాల వల్ల సీఎం పైకి ఎక్కేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పారు.

polaavaram 25122018 2

వారి అభ్యంతరాలను పక్కన పెట్టిన చంద్రబాబు ఇలాంటి చిన్నచిన్న విషయాలకు కూడా భయపడడం సమంజసం కాదన్నారు. తానే భయపడితే ఎలాగని, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందికి భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అనంతరం నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి పూజలు చేశారు. అయితే చంద్రబాబు పైకి ఎక్కటం, అక్కడే కొంచెం సేపు ఉండటంతో, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అవాక్కయ్యారు.ఆయన కిందకు దిగే దాకా, అలెర్ట్ గా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో గేటు బిగింపునకు సంబంధించి సోమవారం ఉదయం 9.45 నిమిషాలకు పూజ ముగించి స్కిన్‌ ప్లేట్‌ అమర్చే ప్రక్రియ ప్రారంభించాలి. ఆ సమయం దాటితే ముహూర్తం మంచిది కాదని పండితులు నిర్ణయించారు.

polaavaram 25122018 3

ఆ మేరకు సీఎం 8.15 గంటలకే చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు. 9.35 నిమిషాలకు చంద్రబాబు కాన్వాయ్‌ స్పిల్‌వేలోకి ప్రవేశించింది. కారు దిగిన వెంటనే వడివడిగా స్పిల్‌వేపై 25.72 మీటర్ల క్రస్ట్‌ స్థాయికి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం పూజలు చేయడం, స్కిన్‌ప్లేట్‌ పైకి లేపి అమర్చడంతో అందరి మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు 20 నిమిషాలు చంద్రబాబు అక్కడే ఉన్నారు. పోలవరంలో తలుపులు ఏర్పాటు చేస్తోంటే జగన్‌ దీన్ని సాక్షి పత్రిక ద్వారా ‘గేట్‌ షో’గా వ్యంగ్యంగా చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే, అమరావతి నిర్మిస్తున్నామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో కలిస్తే ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసినట్లుగా ప్రధాని మోదీ మాట్లాడటం దారుణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధ్యత నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పురస్కారం ఇస్తారని, డబ్బులు ఇవ్వరని కేంద్రం తీరుపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ తన దగ్గర ఉన్న డబ్బుతో ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని చిప్ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు అప్పగిస్తారా అని ఎద్దేవా చేశారు.

cbn 24122018 3

పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్తే సమస్య ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అమెరికా వంటి అనేక దేశాలలో ఈవీఎంలను విశ్వసించట్లేదని, పేపర్ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై మోదీ ప్రభుత్వానికి నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు ఎదో నమ్మక ద్రోహం చేసారు, అంటున్నారని, కాని మేము ఎన్టీఆర్ బాటలో నడిచి, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కుంటున్నామని అన్నారు.

cbn 24122018 2

ఇటీవలి కాలంలో మీరు ఎన్ని స్థానాల్లో గెలిచారో చెప్పాలని చంద్రబాబు బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క స్థానానికి పరిమితం అయ్యారని, వచ్చిన ఓట్ల కంటే బీజేపీ నేతలు తిరిగిన హెలీకాప్టర్లే ఎక్కువని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ప్రకటిస్తే... దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.అసాధ్యం అనుకున్న పోలవరాన్ని సుసాధ్యం చేస్తున్నామని, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

 

‘మీ వస్తువులు జాగ్రత్త.. వాటి బాధ్యత మాది కాదు’ అనే రాతలు దాదాపు ప్రతి ఆర్టీసీ బస్సులోనూ కనిపిస్తుంటాయి. అయినా ప్రయాణీకులు కంగారులో ఏదో వస్తువులు మరిచి పోతుంటారు. ఆ తర్వాత వాటిపై ఆశలు వదిలేసుకొంటుంటారు. అయితే, తాజాగా తిరుపతిలో జరిగిన ఓ ఘటన ప్రయాణికుల సేవలో ప్రజా రవాణా సంస్థ నిబద్ధతతను తెలియజేస్తోంది. ఖరీదైన సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న ప్రయాణికుడికి కేవలం మూడు గంటల్లోనే ఆ సెల్‌ఫోన్‌ను అందించి శెభాష్‌ అనిపించుకుంది. తిరుమల స్వామి దర్శనానికి చెన్నై నుంచి గణేశ్‌ వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొండపై శనివారం వేకువ జామున ఆర్టీసీ బస్సెక్కి తిరుపతిలో దిగిపోయారు.

rtc 24122018 2

అయితే, రూ.35 వేల విలువైన ఫోను కనిపించక పోవడంతో హుటాహుటిన తిరుపతి బస్టాండులో కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశా రు. తాను దిగిన బస్‌ టికెట్‌ చూసిన కంట్రోలర్‌ ఆ బస్సు చిత్తూరుకు వెళుతున్నట్లు గుర్తించి ట్రాకింగ్‌ ద్వారా లొకేషన్‌ పసిగట్టారు. వెంటనే ఆ బస్సు కండక్టర్‌కు ఫోను చేసి విష యం చెప్పగా సీటు కింద ఫోను కనిపించింది. ఎదురుగా వస్తున్న చిత్తూరు-తిరుపతి బస్సు డ్రైవర్‌కు ఆ ఫోను ఇచ్చి పంపారు. టెక్నాలజీ ద్వారా తన ఫోను పసిగట్టడంతోపాటు కేవలం 3 గంటల వ్యవధిలో తనకు తిరిగి అందజేసిన ఆర్టీసీ సిబ్బందికి ఆ ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అర్ధరాత్రి సమయంలోనూ అప్రమత్తంగా ఉండి, ప్రయాణికుడి ఫిర్యాదుపై స్పందించి ఖరీదైన వస్తువును నిజాయితీగా అందించిన సిబ్బందిని ఎండీ సురేంద్రబాబు అభినందించారు.

 

rtc 24122018 3

కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. తన సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగును పోగొట్టుకుని తిరిగి బ్యాగును దక్కించుకున్న ఓ తమిళనాడు వాసి ఎపిఎస్ ఆర్టీసికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కార్యాలయానికి మెయిల్ చేశారు. ఆర్టీసీ బస్సులో చెన్నైకి ప్రయాణించిన తమిళనాడు వాసి తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగును బస్సులో మర్చిపోయాడు. తొలుత కోయంబేడు, పొన్నేరి బస్టాండ్లలో బ్రాంచ్ మేనేజర్ల ద్వారా, తమిళనాడు ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ఆర్టీసికి సంబంధించిన కాంటాక్ట్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఎపిఎస్ఆర్టీసి హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేశారు. దీంతో ఎపిఎస్ఆర్టీసి సిబ్బంది వెంటనే స్పందించిమ, బస్సు డ్రైవర్ నెంబరును, బస్సు ఉన్న ప్రాంతాన్ని ఆన్లైన్ ద్వారా ట్రేస్ చేసి సిబ్బంది ఇచ్చారు. దాంతో ఆ ప్రయాణికుడు తన బ్యాగును సురక్షితంగా తీసుకోగలిగాడు.

Advertisements

Latest Articles

Most Read