చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. ఒక పక్క ప్రతిపక్షాలు, అగ్రిగోల్ద్ బాధితుల్ని రెచ్చగొడుతూ పనులు చేస్తున్నా, చంద్రబాబు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, బాధితులకు న్యాయం చేస్తున్నారు.

agrigold 21122018 2

అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హాయ్‌లాండ్‌ను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. హాయ్‌లాండ్‌ కనీస ధర రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హాయ్‌లాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. అనంతరం హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. హాయ్‌లాండ్‌లో కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున.. ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి.. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది.

agrigold 21122018 3

ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ప్రారంభమైన ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నటి విద్యా బాలన్, దర్శకుడు క్రిష్, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నందమూరి కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను ఈ బయోపిక్ లో పోషిస్తున్న బాలకృష్ణ పట్టువస్త్రాల్లో మెరిసిపోయారు. ఈ చిత్రం ట్రైలర్ ను ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమా మహేశ్వరి ఆవిష్కరించారు. https://youtu.be/1-2J7avI9W8

trailer 21122018 2

కాగా.. ఈ వేడుక మొత్తానికి నందమూరి బాలయ్య హైలైట్‌గా నిలిచారు. అచ్చుగుద్దినట్లుగా అన్నగారి గెటప్‌‌లోనే బాలయ్య ఆడియో వేడుకకు హాజరయ్యారు. అన్నగారిలాగే పంచెకట్టులో రావడంతో అభిమానులు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించారు. అన్నగారిని బాలయ్య బాబు రూపంలో చూస్కుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ప్రముఖులకు చేయెత్తి అభివాదం చేస్తూ బాలయ్య ముందుకు కదిలారు.

పార్టీ నేతలపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కొరడా ఝులిపించారు. నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్‌ఛార్జిలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు. వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా అంటూ నిలదీశారు. ‘‘గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా. తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావేదిక హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో సభ్యత్వ నమోదు పై చర్చ చేపట్టారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలు నేతలు వెల్లడించారు.

cbn party 21122018 2

సభ్యత్వ నమోదు మొదటి 3 స్థానాల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణ జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు విశ్లేషణ చేశారు. నేతలు సరిగా సభ్యత్వ నమోదుకు హాజరుకాకపోవటం పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ భేటీకి రాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నేతలకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని వ్యాఖ్యానించారు. సమన్వయ కమిటీ సమావేశానికి అయ్యన్న, శిద్ధా, మోదుగుల, జేసీ ప్రభాకర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై బాబు అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లు కూడా పదే పదే చెప్పించుకోవడం సరికాదన్నారు.

cbn party 21122018 32

సమన్వయకర్తలను నియమించకపోవడమేంటని నేతలను ప్రశ్నించారు. సమయం దొరకడం లేదని కొందరు నేతలు చెబుతున్నారని.. తనకు దొరికిన సమయం వాళ్లకు దొరకడం లేదా అన్నారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేస్తూ కాదని హితవు పలికారు. ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని కూడా కొందరు గమనించడం లేదని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సీరియస్‌గా తీసుకోలేని వారికి మళ్లీ అన్ని పనులూ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్ధం చేసుకోవడం లేదని, ఇలాగే ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. రాబోయే 6 నెలలు తాను కఠినంగానే ఉంటానని స్పష్టంచేశారు. రాబోయే ఆరు నెలలు తాను కఠినంగా ఉంటాననీ, నేతలందరూ ఎమర్జెన్సీ తరహాలో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు సేవ చేసుకుని మెప్పు పొందాలనీ, పార్టీని మోసం చేయవద్దని హితవు పలికారు. తిట్టకపోతే మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేలు పెడతా, కాలు పెడతా అంటున్న కేసీఆర్, మొత్తానికి ఏపిలో అడుగు పెట్టనున్నారు. కేసీఆర్‌ ఈ నెల 23నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగ, దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరతారు. విశాఖలో శారద పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయితే ఇక్కడ రాజకీయంగా ఎవరిని కలుస్తారు అనేదాని పై క్లారిటీ లేదు. వైజాగ్ లో బాధ్యతలు చూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఈ పర్యటన ఏర్పాట్లు చూస్తున్నట్టు తెలుస్తుంది.

kcrcbn 211122018

అయితే కేసీఆర్ పర్యటన పై చంద్రబాబు స్పందించారు. మంచిది రానివ్వండి అంటూ ఆహ్వానించారు. తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారానికి తాను వెళ్లిన నేపథ్యంలో కేసీఆర్‌ తనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని చేసిన వ్యాఖ్యలను, చంద్రబాబు నాయుడు తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. అందరినీ గందరగోళం చేసేందుకే కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం రావడంలేదని, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కు అని, ఈవీఎంల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

kcrcbn 211122018

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావడాన్ని తెదేపా పరిశీలిస్తోంది. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపుపై కుట్ర ఉందని తెదేపా భావిస్తోంది. ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అప్రమత్తం చేసే బాధ్యతను పార్టీ నాయకులకు చంద్రబాబు అప్పగించారు.

Advertisements

Latest Articles

Most Read