సందర్భం దొరికితే, ఏపిలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఏపికి మేము లక్షల లక్షల కోట్లు ఇస్తుంటే, చంద్రబాబు తినేస్తున్నాడు అంటూ, ఆరోపణలు చేసే రాష్ట్ర బీజేపీ నేతలకు, నిన్న విడుదల అయిన, నీతి ఆయోగ్‌ రిపోర్ట్ చూసి, వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయి పడినంత పని అయ్యింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల(సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) ఆధార నివేదిక-2018ని నీతి ఆయోగ్‌ శుక్రవారం విడుదల చేసింది. 2030 నాటికి సాధించాలనుకున్న స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలోని రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇది సూచిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఐక్యరాజ్యసమితి భారతీయ విభాగాలు కలిసి రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. దేశంలో ఈ స్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను నీతి ఆయోగ్‌ నిర్వర్తిస్తోంది.

niti 22122018

ఈ కార్యక్రమంలో 0-49 నడుమ మార్కులు సాధించిన రాష్ట్రాలను ఆకాంక్షిత రాష్ట్రాలుగా, 50-64 మధ్య మార్కులు పొందిన వాటిని ప్రతిభావంత రాష్ట్రాలుగా, 65-99 మార్కులు సాధించిన వాటిని పురోగాములు(ఫ్రంట్‌రన్నర్‌)గా, 100 మార్కులు చేరుకున్న వాటిని లక్ష్యసాధకులుగా పేర్కొన్నారు. ఇందులో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ 64, తెలంగాణ 61 మార్కులతో ప్రతిభావంత రాష్ట్రాల జాబితాలో నిలిచాయి. హిమాచల్‌, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌, పుదుచ్చేరిలు పురోగాములుగా సత్తాచాటుకున్నాయి. ఏపీలో మొత్తం 8 లక్ష్యాల్లో పురోగామిగా, రెండు లక్ష్యాల్లో పర్‌ఫార్మర్‌గా, మూడు విభాగాల్లో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అభివృద్ధిని, లక్ష్యాలను పర్యవేక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్‌ చేసిన ప్రయత్నాలను నీతీ ఆయోగ్‌ ప్రసంశించింది.

niti 22122018

రియల్‌ టైమ్‌ అవుట్‌కమ్‌ బేస్డ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను(ఆర్టీజీ) రాష్ట్రం అమలు చేస్తున్నదని తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. ‘‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌- విజన్‌ 2029’’ పేరిట లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. పనిచేస్తున్న తీరు బాగుందని కొనియాడింది. సామర్థ్య పెంపు వనరులను సమకూర్చుకొన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉన్నదని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదకారిగా ఉన్నదని నీతీ ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు అన్ని గ్రామాలకు వెళ్లి, ప్రభుత్వ లక్ష్యాలపై ప్రజలతో 30 నిమిషాలు చర్చిస్తున్నారని వెల్లడించింది. 2017 నవంబరులో రాష్ట్ర శాసన సభలో కూడా దీనిపై చర్చించారని కూడా వివరించింది. లక్ష్యాల సాధనకు అవసరమైన సామర్థ్యాల పెంపునకు ఇప్పటికే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు చర్యలు చేపట్టాయని తెలిపింది.

ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అందరం కలిసి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు. మహాకూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారన్న దానిపై స్పందిస్తూ... ‘‘ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే మేము దీనిపై మాట్లాడకూడదు. ఈ అంశంపై మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...’’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఇటీవల ఎంకే స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

cbn 22122018 1

కాగా ఇవాళ జరిగిన కాన్‌క్లేవ్‌లో ఎన్డీయే ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన విభజన హామీలను ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా ఈ సమావేశంలో పాల్గున్నారు. దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని సీఎం నారాయణ స్వామి అన్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ సౌత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 

cbn 22122018 1

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్‌) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్న పోలవరం ప్రాజెక్టు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులన్నీ కేంద్రమే మంజూరు చేయాల్సివుంది. ఇప్పటి వరకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఖర్చుచేయడం, తదనంతరం కేంద్రం నుండి రీయింబర్స్ అయినపుడు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటివరకు ఖర్చుచేసిన నిధుల్లో ఇంకా కేంద్రం నుండి మూడు వేల కోట్ల రూపాయలకు పైగా రావలసివుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందస్తుగా ఖర్చుచేసే స్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.

polavaram 22122018 2

కొత్త డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) పూర్తిస్థాయిలో ఇంకా ఆమోదం పొందలేదు. కొత్త డీపీఆర్‌లో ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినంత వరకు మాత్రమే సీడబ్ల్యూసీ ఓకే చేసింది. ఇక పునరావాస, పునర్నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సీడబ్ల్యూసీ గత ఇరవై రోజులుగా పరిశీలన జరుపుతోంది. ఈ నేపధ్యంలో నిధుల్లేక పోలవరం పనులు స్ధంభించే అవకాశం కూడా లేకపోలేదనే ఆందోళన వెంటాడుతోంది. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు సంస్థల్లో ఒకటైన నవయుగ కంపెనీకి సబంధించి సుమారు రూ.70 కోట్ల బిల్లులు పీపీఎకు పంపించి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నా ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిసింది.

polavaram 22122018 3

సవరించిన డీపీఆర్ ఆమోదం పొందే లోపుపనులు నిర్ధేశిత కార్యాచరణ ప్రకారం పనులు జరిపించడానికి కనీసం రూ.10వేల కోట్లయినా ముందుగా విడుదలచేయాలని పీపీఏను పోలవరం అధికారులు కొంత కాలంగా అడుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదన విషయంలో కనీసం స్పందన కూడా కన్పించలేదని సమాచారం. ప్రస్తుతం రూ. పది వేల కోట్లు కాదు గదా కనీసం రూ.100 కోట్లు ఇచ్చినా మహదానంద పడే విధంగా పరిస్థితి తయారైంది.
ఈ నేపధ్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు నిధుల ఖర్చు పరిశీలిస్తే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,205.53 కోట్లు ఖర్చుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ.10,069.66 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వానికి రూ.6727.26 కోట్లు విడుదలయ్యియి. ఇంకా రూ.3342.40 కోట్లు విడుదల కావాల్సివుంది. అయితే 2017-18కి సంబంధించి సుమారు రూ.3787 కోట్ల విలువైన 1398 బిల్లులు పీపీఏకి సమర్పించారు. 2018-19కి సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.1428 కోట్ల విలువైన 4530 బిల్లులు సమర్పించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను 2019 ఫిబ్రవరి 8వ తేదీలోపు వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అగ్రిగోల్డ్‌ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. హాయ్‌ల్యాండ్‌ వేలంపై హైకోర్టు ఆదేశాలను అధికారులు మంత్రి మండలి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ..‘‘బాధితులకు ఎంత త్వరగా న్యాయం జరిగితే ఆ కుటుంబాల్లో అంత భరోసా వస్తుంది. హాయ్‌ల్యాండ్‌తో పాటు మిగతా అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం త్వరితగతిన జరిగేలా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నెల 28న జరగబోయే విచారణలో హైకోర్టుకు వాస్తవ వివరాలను నివేదించాలి. ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని’ సూచించారు.

agrigold 21122018 2

అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన హాయ్‌లాండ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఉహాయ్‌లాండ్ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం చెప్పటంతో, హైకోర్టు ఆ ధర ఖరారు చేసింది. హైకోర్టు ఈ ఆస్తులను అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని ఆదేశించింది. శుక్రవారం ఉమ్మడి హైకోర్టు జస్టిస్ రామసుబ్రమణ్యం, జస్టిస్ బట్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తూ అగ్రిగోల్డ్ యాజమాన్యం సూచించినట్టుగా హాయ్‌లాండ్ విలువ రూ 1,000 కోట్ల రూపాయలుగా సూచించందని, అయితే, వాటి విలువ 600 కోట్ల రూపాయలుగా నిర్ధారించడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ మాత్రం 550 కోట్ల రూపాయల విలువగా పేర్కొందని కోర్టు తెలిపింది. 2019 ఫిబ్రవరి 9వ తేదీన కోర్టు హాల్‌లో హాయ్‌లాండ్ కొనుగోలుకు సీల్డ్ కవర్‌లో బిడ్డర్ల వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

agrigold 21122018 3

బిడ్డర్ల వ్యవహారాలను అంతా ఎస్‌బీఐ పర్యవేయణలో జరగాలని కోర్టు సూచించంది. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ముందకు వచ్చిన జీఏస్‌ఎల్ గ్రూపు ఆతర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందుకు జీఎస్‌ఎల్ గ్రూపుకు మూడు కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాయ్‌లాండ్‌లోని కొంత భూమని ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున, తదుపరి ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన అనంతరం ఆ బ్యాంకుకి ఎంత ఇవ్వాలి, అగ్రిగోల్డ్ బాధితులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇలావుంటే, కోర్టు నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అయితే హాయ్‌లాండ్ పై ప్రేమ చూపించిన వైసీపీ, బీజేపీ ఇప్పుడు మాత్రం అడ్డ్రెస్ లేరు. ఎందుకంటే ఇప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది, ఎంత రెచ్చగొట్టినా ప్రయోజనం ఉండదు కాబట్టి.

Advertisements

Latest Articles

Most Read