రాష్ట్రంలో కాగిత రహిత పాలన కొనసాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన క‌లెక్టర్ల స‌దస్సును పూర్తిగా కాగితరహితంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల పాలనాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే అందించడం విశేషం. పూర్తి కాగిత రహితంగా జరిగిన సమావేశం రాష్ట్ర చరిత్రలో ఇదేనని అధికారులు ప్రకటించారు. గ‌తంలో జ‌రిగిన స‌ద‌స్సుల‌కు భిన్నంగా ఈ సమావేశం మొత్తం డిజిట‌ల్ మ‌యంగా నిర్వహించారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ను సమావేశం ప్రారంభంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

collectors 01122018 2

ఎన్నో ప్రత్యేక‌త‌ల‌తో ఈ పోర్టల్‌ను రూపొందించారు. స‌ద‌స్సులో పాల్గొనే క‌లెక్టర్లు, వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రగతి నివేదికలను ఇందులో పొందుప‌రచారు. ఆన్‌లైన్ విధానంలోనే ముఖ్యమంత్రికి ప‌వ‌ర్‌పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. లోగడ జరిగిన క‌లెక్టర్ల స‌ద‌స్సులకు సంబంధించిన గణాంకాలు, నివేదిక‌ల‌ను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం విశేషం. ఆయా స‌దస్సులు తీసుకున్న నిర్ణయాలు, వాటిపై జిల్లా పాలనాధికారులు తీసుకున్న చర్యలు ఇకపై ఇందులో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అవుతున్నాయ‌నేది సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి అధికారికి సోషల్ మీడియా మొబైల్ అప్లికేషన్ల ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందించారు.

collectors 01122018 3

జిల్లా క‌లెక్టర్ల స‌మావేశాలలో ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు నివేదిక‌ల స‌మ‌ర్పణ‌కు కాగితాల ఖ‌ర్చు ప్రతిసారి ఐదారు ల‌క్షల రూపాయ‌లు అయ్యేది. ఈ పర్యాయం ఆ మేరకు వ్యయాన్ని నియంత్రించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నన్స్‌ విభాగాన్ని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో ఆర్టీజీఎస్‌ను అమలుచేస్తుండటం గర్వకారణమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభుత్వం స‌త్ఫలితాలను సాధించగలుగుతోందని చెప్పారు. ఆర్టీజీకి అనుబంధంగా ఉన్న ‘ప‌రిష్కార వేదిక’ 1100 కాల్ సెంట‌ర్ ద్వారా ప్రజ‌ల‌కు అనుసంధానం అవుతుండటంతో పరిపాలనలో అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలుగుతున్నామన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజ‌ల స‌మస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే కాకుండా మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌ సాధ్యమవుతోందని అన్నారు.

కేసీఆర్ నోరు తెరిస్తే ఎలా బూతులు తిడతారో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఆ తిట్లే తనను గెలిపిస్తాయనే భ్రమలో కేసీఆర్ ఉంటారు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని, బూతులు తిడుతూ, ప్రచార సభలని మార్చేస్తూ ఉంటారు. నిన్న లగడపాటి రాజగోపాల్, తెలంగాణాలో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారు అని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై, సన్నాసులు అంటూ తిట్ల దండకం అందుకున్నారు కేసీఆర్. రెండు నెలల క్రిందట ఇదే లగడపాటి సంస్థ, కేసీఆర్ గెలుస్తాడు అని చెప్తే, ఆహా ఓహో అంటూ ప్రచారం చేసి, ఇప్పుడు లగడపాటి ఎవరు గెలుస్తారో చెప్పకుండా, కేవలం కొంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు అని చెప్పాగానే, అతను సన్నాసాడు అయిపోయాడు.

kcr 01122018

శుక్రవారం సాయంత్రం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. కేసీఆర్ సర్వేలపై స్పందిస్తూ.. ‘కొంతమంది సన్నాసులు.. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా శాపాలు పెట్టినోళ్లు.. కొన్ని వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తారు. ఆ సర్వేలను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓటర్లు పట్టించుకోవద్దు. ఆ సర్వేలతో ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలు చెప్పింది విని.. ఏది నిజమో ఆలోచించుకొని ఓటేయండి. గత్తరగా ఓటేస్తే.. వచ్చే ఐదేళ్లు గత్తర, గత్తరగానే ఉంటుంది’అన్నారు.

kcr 01122018

స్వతంత్ర ప్రభంజనం దేనికి సంకేతం? స్వతంత్రులకు ఓటేయాలని ఓటర్‌ సంకల్పించుకున్నాక నియోజక వర్గం బయటి అంశాలేవీ పని చేయబోవని, పోలింగ్‌ తేదీనాటికి స్వింగ్‌లో మార్పులేవీ ఉండబోవని కూడా లగడపాటి చెప్పారు. ఇప్పటివరకు ఆయన సర్వేలు చాలా వరకు నిజం కావడంతో ఇది కూడా నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్రులు ఎక్కువగా ఎన్నికవడానికి కారణాలేంటి? గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర చూస్తే సాధారణంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం వీస్తున్నపుడు స్వతంత్రులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటోంది.

లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికలొచ్చాయంటే.. లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో.. అందరూ రాజగోపాల్ సర్వేలో ఏం చెప్పబోతున్నారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతగా ఉత్కంఠగా మారిన ఎన్నికలపై లగడపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారంటున్నారు.

lagadapati 30112018

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేటలో శివకుమార్.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు. తనకు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు లగడపాటి. తెలంగాణ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని.. డిసెంబర్ 7న సాయంత్రం పూర్తి ఫలితాలు ప్రకటిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని రాజగోపాల్ బాంబ్ పేల్చడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, లగడపాటి రాజగోపాల్ చెప్పకనే విషయం చెప్పేశారని అంటున్నారు. ఇండిపెండెంట్లు ఎనిమిది నుంచి పది మంది గెలుస్తారని లగడపాటి చెప్పటంతో ఒక భారీ హింట్ ఇచ్చారని చెప్తున్నారు.

lagadapati 30112018

రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం, అంత మంది ఇండిపెండెంట్ లు గెలుస్తున్నారు అని చెప్తున్నారు అంటే, అది పాలక పక్షం పై ఉన్న వ్యతిరేకత అంటున్నారు. రులింగ్ పార్టీకి ప్రజల్లో ఊపు ఉంటే, ఇండిపెండెంట్లు గెలవరనేది రాజకీయంలో సూత్రం అని, అంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి చెప్పటం, రులింగ్ పార్టీకి వ్యతిరేకతను చెప్పకనే చెప్తున్నారని అంటున్నారు. అందులోనూ ఇంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని చెప్పటంతో, అందరూ హంగ్ వస్తుంది అనే అభిప్రాయం చెప్తూ ఉండటంతో, దాన్ని కూడా లగడపాటి కొట్టి పారేసారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చే సమస్యే లేదని.. స్పష్టమైన మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పారు. 2014లో వచ్చినట్టే ఇప్పుడూ కచ్చితమైన తీర్పు వస్తుందన్నారు. ఒక పక్క ఇండిపెండెంట్లు ఎక్కవ గెలుస్తున్నారు అని చెప్పటం, హాంగ్ మాత్రం రాదు అని చెప్పటంతో, లగడపాటి తాను చెప్పాలనుకుంది ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏసీబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మచిలీపట్నంలో ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడ్డాడు. సీజీఎస్టీ రేంజ్‌ ఆఫీస్‌ సూపరిండెంట్‌ రమణేశ్వర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. లోకేష్‌బాబు అనే వ్యక్తిని రమణేశ్వర్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మచిలీపట్నం సెంట్రల్ టాక్స్, సెంట్రల్ ఎక్స్సైజ్ శాఖ సూపరిండెంట్ రమనేశ్వర్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. స్థానిక జయలక్ష్మి స్టీల్స్ యజమాని గిరిబాబు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ క్లయిమ్ కోసం వెళ్లగా.. అతనిని రమనేశ్వర్ కొద్ది రోజులుగా లంచం ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.

acb 30112018

ఈ క్రమంలో అతను లంచం ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. ఏపీలో సీబీఐకి జనరల్‌ కన్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రమణేశ్వర్ తొలిసారి పట్టుబడ్డాడు. ఏపీలో సీబీఐ ప్రవేశానికి ఏపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతోందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు నిర్లజ్జగా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

acb 30112018

టీడీపీ నేతలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో... కక్షపూరిత సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. ఏదో ఒక లింకులు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో పక్క ఇప్పటికే సిబిఐ వ్యవస్థ రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. సిబిఐ లో ఉన్న ఇద్దరు టాప్ బాస్ లు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటంతో, వారిని తప్పించారు. ఇందులో ఒకరు మోడీ వర్గం కాగా, మరొక డైరెక్టర్ అలోక్ వర్మ, తనను తప్పించటం పై కోర్ట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read