ఈ రోజు ఖమ్మం, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కేసీఆర్ కు వణుకు మొదలైంది. ఒక్క 6 గంటలు చంద్రబాబు అలా తిరిగితేనే, తెలంగాణా మొత్తం వాతవరణం మారిపోవటంతో, చంద్రబాబుకి ఇబ్బందులు పెట్టాలనే కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో కేటీఆర్ రోడ్‌షో ఉన్నందున అనుమతివ్వలేమని పోలీసులు చెబుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెండు రోజుల ముందే దరఖాస్తు చేసినప్పటికీ కావాలనే అనుమతివ్వలేదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

kukatapalli 28112018

ప్రత్యామ్నాయ మార్గాల్లో చంద్రబాబు రోడ్‌షోను నిర్వహిస్తామని చెప్పినా, పోలీసులు అనుమతించడం లేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణాలో వస్తున్న స్పందన చూసి, కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వటం లేదని అంటున్నారు. ఈ రోజు ఖమ్మంలో ప్రజాకూటమి ఏర్పాటు చేసిన సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసమే టీడీపీ, కాంగ్రెస్ కలిసి ముందుకెళుతున్నాయని చంద్రబాబు తెలిపారు. దేశంలో అసహనం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని చంద్రబాబు చెప్పారు. రాహుల్‌తో టీడీపీ వేదిక పంచుకోవడం చరిత్రలో మిగిలిపోతుందని ఆయన తెలిపారు.

kukatapalli 28112018

బుధవారం సాయంత్రం సనత్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా కూటమి సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో తెరాస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు వల్లే తెలంగాణ సంపద పెరిగిందని ఎంపీ కవిత చెప్పారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ అయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కానీ, ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. 13సీట్లతో నేను ఇక్కడ సీఎంను కాలేను. ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. బంగారు తెలంగాణ రావాలి. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ అన్నారు. నేను అడ్డుపడ్డానా? డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు నేను అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రి పదవి నేను ఇవ్వొద్దని చెప్పానా? తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ఆగస్టులోనే ప్రణాళిక రూపొందించారు. నరేంద్రమోదీ సహకారంతోనే ఎన్నికల నిర్వహణ జరుగుతోంది.’’ అని అన్నారు.

అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపారు. వందకోట్లైనా ఫర్వాలేదు రేవంత్ రెడ్డి ని ఓడించాలని టార్గెట్ పెట్టారు. కేసీఆర్ ఆదేశం... నోట్ల ఆశీర్వాదం చూసుకుని పట్నం ముఠా రంగంలోకి దిగింది. గడచిన నాలుగు నెలలుగా పచ్చనోటు పుచ్చుకుని కొడంగల్ గడ్డ పై స్వైరవిహారం చేస్తోంది.

kodangal 28112018 2

ఈ క్రమంలోనే కోస్గీలోని తమ బంధువు, విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ రేంజ్ లో పని చేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని నరేందర్ రెడ్డి అండ్ కో... డబ్బులు వెదజల్లడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడి తనంగా వ్యవహారం చేస్తే ఏమౌతుంది... అవ్వాల్సిందే అయింది. మంగళవారం అర్థరాత్రి నరేందర్ రెడ్డి స్టే చేస్తోన్న ఫౌంహౌస్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పక్కా సమాచారంతో విరుచుకుపడ్డారు. సుమారు 15 కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లెక్కల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ సీజ్ చేశారు.

kodangal 28112018 3

15 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని రాజీ చేసే ప్రయత్నం చేసినా ఐటీ అధికారులు వినలేదు. దీంతో నరేందర్ రెడ్డి సొమ్ములు అడ్డంగా బుక్కయ్యాయి. పంచనామా కూడా నిర్వహించారు. ఇంత జరిగినా విషయం మాత్రం బయటకు పొక్క లేదు. పొక్కలేదు అనే కంటే... పొక్కకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వీటిని టీఆర్ఎస్ నేతలు కొట్టి పారేసినప్పటికీ, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ దీన్ని ధృవీకరించడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిగాయని, సోదాకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేస్తామని రజత్ కుమార్ తెలిపారు. పట్టుబడిన నగదంతా టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువునివిగా భావిస్తున్నారు. ఐటీ సోదాలతో కొడంగల్ రాజకీయాల్లో కలకలం రేగింది.

విభజన జరిగినా జరగకపోయినా.. తెలుగుజాతి కలిసుండాలనేదే తాను ఆకాంక్షించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో ఆయన మాట్లాడారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ కూడా హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో అందరూ రెండుగా విడిపోయినా .. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని తాను ఒకే మాటపై ఉన్నానన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను మోదీ నెరవేర్చలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తానేదో పెత్తనం చేస్తానని బూచిగా చూపిస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటానన్నారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు.

kcr question 28112018

దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్‌, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్‌ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్‌ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈవీఎంలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేసింది వచ్చిన స్లిప్పుతో చూసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను హ్యాక్‌ చేయడం చాలా తేలికని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీనీ అధికంగా వాడే వ్యక్తిగా లోటుపాట్లు తనకు తెలుసునని చంద్రబాబు పేర్కొన్నారు.

kcr question 28112018

నూటికి నూరుశాతం కాదు... తెలంగాణలో 1000 శాతం ప్రజాకూటమిదే గెలుపని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ధైర్యంగా పోరాడుదామని, భయపడితే జీవితాంతం నష్టపోతామని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ప్రోత్సహిస్తే... ప్రపంచాన్నే శాసించే శక్తి ఉందని, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే... తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి జరగలేదని, అప్పులు పెరిగిపోయాయని విమర్శించారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ... హెలికాప్టర్లు ఉన్నాయని, బీజేపీ నేతలు డబ్బు సంచులతో తిరుగుతున్నారని బాబు విమర్శించారు.

 

తాను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియప్రాంతమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనను తెలంగాణ ప్రజలంతా ఎంతో అభిమానించారని, ఎవరికీ దక్కని గౌరవం తనకు ఇచ్చారని.. దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనన్నారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్‌, తెదేపా ఒకరిపై మరొకరు పోరాటం చేసినా దేశ ప్రయోజనాల కోసమే ఈ రోజు ఏకమయ్యామన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే.. తనపై కేసీఆర్‌, తెరాస చేసిన విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. నేను నీళ్ళు ఆపుతున్నా అని కేసీఆర్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, పైన తెలంగాణా ఉంది, తెలంగాణా వదిలిన నీటినే, ఏపి వాడుకుంటుంది, మరి నేను తెలంగాణాకు నీళ్ళు ఎలా ఆపుతాను అంటూ, ఒక్క సమాధానంతో, కేసీఆర్ నోరు ముపించారు చంద్రబాబు.

kcr water 28112018

‘‘నేనేదో పెత్తనం చేస్తానంటున్నారు. ఈ రోజు నేను తెలంగాణకు వచ్చి పోటీచేసే అవకాశం లేదు. నేనే ఏపీకి సీఎంగా ఉంటాను. తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా. గోదావరి జలాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది ఆనాడు ఆలోచించాం. కృష్ణానదిలో నీళ్లు రాలేదు. గోదావరి 2500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. దాన్ని ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి. తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు? దేవాదుల, మాధవరెడ్డి ఎత్తిపోతల, భీమ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నేనే నాంది పలికాను. తెలుగుజాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తా. విద్యకు నేనే ప్రాధాన్యమిచ్చాను. హైదరాబాద్‌ను నేనే నిర్మించాని చెప్పుకొంటున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని ఎక్కడా అనలేదు. సైబరాబాద్‌ను నేనే నిర్మించా’’ అని చంద్రబాబు వివరణ ఇచ్చారు.

kcr water 28112018

‘‘ఎన్డీయే పాలనతో ప్రజలకు లాభం వచ్చిందా? పెద్ద నోట్ల రద్దుతో లాభం వచ్చిందా? ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయా? బ్యాంకుల్లో కరెన్సీ ఉందా? దానికి కారణం ఎన్డీయే కాదా? జీఎస్టీ తీసుకొచ్చి అమలు సరిగా చేయలేదు. దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూపాయి విలువ పడిపోయింది. రైతులు, పేదలు ధరలు పెరుగుదలతో అవస్థలు పడుతున్నారు. పద్ధతి ప్రకారం ఆలోచించకుండా దేశహితం గురించి ఆలోచించకుండా స్వార్థంతో పనిచేస్తున్నారు. ముస్లిం సోదరుల పట్ల అసహనంతో వ్యవహరించి అభద్రతా భావంతో ఉన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆవేశాలు ఉన్నాయి. విభజన జరిగినా, జరగకపోయినా తెలుగు జాతి కలిసి ఉండాలని ఆనాడే చెప్పాను. సమన్యాయమని చెప్పాను తప్ప ఏకపక్షంగా విభజన చేయాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణలో కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు. ఇవన్నీ తెరాస అడగకపోవడం న్యాయమా? నేనెక్కడున్నా తెలంగాణ నాకు ప్రియప్రాంతమే’’ అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read