శ్రీకాకుళంలో ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డికి, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఏ మొహం పెట్టుకొని జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ తితలీ తుపానుతో ప్రజలు సర్వస్వం కోల్పోతే పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, రాష్ట్ర యంత్రాంగమంతా వచ్చి సహాయ చర్యలు చేపట్టడం ఈ ప్రాంత ప్రజలు మరువలేదన్నారు. రికార్డుస్థాయిలో తక్కువ వ్యవధిలో బాధితులకు పరహారం అందిందన్నారు. కానీ జగన్‌ పక్క జిల్లాలో ఉన్నా కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

jagan 26112018 2

ఆయనకు జిల్లాలో అడుగు పెట్టడానికి అసలు అర్హతే లేదన్నారు. ప్రజలు ప్రశ్నించాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగురీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా..ఇప్పుడు సిగ్గు లేకుండా పాదయాత్రకు బయలుదేరారని జగన్‌పై మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో రాజాంలో ఆదివారం భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద మాన వహారం చేపట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోండ్రు మురళీమోహన్‌ మాట్లాడుతూ తితలీ బాధితులకు సీఎం చంద్రబాబు కన్నతండ్రిలా ఆదుకున్నారని కొనియాడారు. బాధితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

jagan 26112018 3

గంటల వ్యవధిలో వెళ్లి పరామర్శించడానికి అవకాశం ఉన్నా జగన్‌ ముఖం చాటేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ, విపక్ష పాత్రను కూడా సరిగ్గా చేపట్టడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆటవిడుపు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పాద యాత్రకు ఒక ల క్ష్యం, సిద్ధాంతం లేదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో రెండు లక్షల ఎక రాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ఘనుడు జగన్‌ అన్నారు.. అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి జిల్లాలో పాదయాత్రకు అడుగుపెట్టడం దురదృష్టకరమన్నారు. సుమారు రెండున్నర లక్షల కుటుంబాలు తితలీ తుపానుతో నష్టపోతే...ఒక్క కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేకపోవడం దారుణమన్నారు. కోడికత్తి డ్రామాలకు ఉన్న సమయం తితలీ బాధితుల పరామర్శకు లేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే హక్కు జగన్‌కు లేదని... ప్లకార్డులు పట్టుకుని జగన్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే, కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని, ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తనతోనే ఉన్నారని,తన అనుచరుడుగా ఉన్నారని, ఇప్పుడు తిడుతూ ఉంటే బాధనిపించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఫర్వాలేదన్నారు.

cbn 261120182

హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డ, ఎయిర్ పోర్టు, ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాదును డెవలప్ చేసినప్పుడు అమరావతిని ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, ఈరోజు ఒకటే చెబుతున్నానని, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని చెప్పారు. అమరావతి వచ్చి చుస్తే, ఏమి జగుతుందో తెలుస్తుందని అన్నారు. 40 వేల కోట్లు విలువ చేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయని, వీళ్ళు మనల్ను విమర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా, తెలుగు రాష్ట్రాల అభివృద్ధినే తాను కోరుకుంటానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ మద్దతు అని మీటింగుల్లో వైసీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు.

cbn 26112018 3

దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కేంద్ర మంత్రికే షాక్ ఇచ్చారు. నిబంధనలు ప్రకారం నడుచుకోకపొతే, ఎవరైనా ఒకటే అనే సందేశం ఇచ్చారు. టిటిడి ఉద్యోగులకి ఇబ్బంది అయినా, ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని తేల్చి చెప్పారు. జరిగిన విషయం తెలుసుకుని ఆ కేంద్ర మంత్రి కూడా షాక్ కు గురయ్యారు. నా సిఫారుసు పక్కన పడేస్తారా, మీ సియం చెప్పినట్టు ఆడతారా, ప్రధాని మోడీకి కంప్లైంట్ చేస్తాను అంటూ, ఆ మంత్రి ఊగిపోయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబధించి వివరాలు ఇలా ఉన్నాయి.

singhal 26112018 2

తిరుమలలో ఉద్యోగ బదిలీ కోసం ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు విరుద్దంగా సిఫార్సులు ఇప్పించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సింఘాల్ చర్యతో టీటీడీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. టీటీడీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువరాజు తిరుమలలో విధులు నిర్వర్తించాలని కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కేంద్ర మంత్రి చేత సిఫార్సు చేయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. యువరాజ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

singhal 26112018 3

నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులు చేయించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సింఘాల్ స్పష్టం చేశారు. మరోవైపు ఈవో చర్య పై టీటీడీ ఉద్యోగులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు చాలామంది ఉద్యోగులు మంత్రుల ద్వారా సిఫార్సులు చేయిస్తూ ఉంటారనీ, కుటుంబం, ఇతర సమస్యల కారణంగా ఇలాంటి విజ్ఞప్తులు చేస్తుంటారని తెలిపారు. ఇలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. అయితే సింఘాల్ మాత్రం, నా హయంలో, ఇలాంటివి జరగటానికి వీలు లేదని, నేను రూల్ ప్రకారం నడుచుకుంటానని చెప్తున్నారు.

దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము... శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము... బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం... సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ ... నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది.

polavaram 26112018 2

కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. 24 గంటల్లో 11వేల 289 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసింది. గతంలో ఒకే రోజులో 11వేల 158 క్యూబిక్ మీటర్లు చేసిన జాతీయ రికార్డును నవయుగ కంపెనీ అధిగమించింది. ఇదే స్పూర్తితో త్వరలో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ రికార్డునూ అధిగమిస్తామని ‘నవయుగ’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

polavaram 26112018 3

ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. అయితే ఈ రికార్డు ని జూన్ నెలలోనే పోలవరం అధిగమించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అయితే తన రికార్డును తానే, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు అధిగమించింది. చైనాలోని త్రీగోర్జె్‌సలో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేశారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read