వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చేసే ఫేక్ అందరికీ తెలిసిందే. ఫేక్ పునాదుల మీద పుట్టి, ఫేక్ చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలా ఫేక్ చేయటానికి , పేటీయం బ్యాచ్ ని పెట్టుకుని, సోషల్ మీడియాలో బ్రతికేస్తూ ఉంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి చూపించటం, ఈ పేటీయం బ్యాచ్ స్పెషల్. వీళ్ళకు డైరెక్ట్ రాజకీయం చేయటం రాదు. అసలు వీళ్ళు ఏమైనా చేస్తే కదా చెప్పుకోవటానికి, అందుకే వేరే వాళ్ళ పైన కూడా ఫేక్ చేసి, మాతో పాటు వాళ్ళు కూడా పనికి మాలిన వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మొన్నటి వరకు ఈ ఫేక్ లను ఈ పేటీయం బ్యాచ్ చేసే వాళ్ళు, అయితే ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మకపోవటంతో, ఇలా ఫేక్ చేయటానికి మంత్రులు కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పొత్తుల పై చేసిన వ్యాఖ్యల పై, దేవినేని ఉమా, పవన్ ని తిట్టినట్టుగా ఓక ఫేక్ క్రియేట్ చేసి, అంబటి ట్వీట్ చేసి, దేవినేని ఉమా ఈ ట్వీట్ వేసాడు అని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అది మార్ఫింగ్. దీంతో తెలుగుదేశం పార్టీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అయ్యన్నపాత్రుడు, ట్వీట్ చేస్తూ అంబటిని తిట్టారు. టిడిపి ఆఫిషియల్ పేజిలో కూడా తిట్టారు. అంబటి మాత్రం, సిగ్గు లేకుండా, ఇంకా ఆ ట్వీట్ ఇప్పటికీ అలాగే ఉంచారు. మంత్రులే ఫేక్ చేస్తుంటే, ఏమి చేస్తాం ?

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 151 సీట్లు ఉన్నాయి, తమకు తిరిగు లేదు అంటూ ఎగురుతున్న వైసీపీ పార్టీ, ప్రజల పై అనేక భారాలు మోపింది. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, వ్యవసాయం దెబ్బతింది, మహిళలకు భద్రత లేదు, చివరకు రోడ్లు వేయటం కూడా రావటం లేదు. అప్పులు చేస్తే కానీ రోజు గడవని పరిస్థితి. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, బాదుడే బాదుడు అనే కర్యకరమం పెట్టింది. ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చేసిన పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇక తరువాత వచ్చిన మహానాడు అన్నిటి కంటే హైలైట్. తెలుగుదేశం పార్టీ కూడా, అంత మంది వస్తారాని ఊహించలేదు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. మహానాడు మంచి కిక్ ఇవ్వటంతో, తెలుగుదేశం శ్రేణులు మంచి ఊపులో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు మరో కిక్ ఇస్తుంది టైమ్స్ అఫ్ ఇండియా సర్వే. జగన్ పరిపాలన పై టైమ్స్ అఫ్ ఇండియా సర్వే చేయగా, అన్ని రంగాల్లో, జగన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు. పరిపాలన, అవినీతి, మూడు రాజధానులు, స్థానిక ఎమ్మల్యేల పని తీరు, అభివృద్ధి, అప్పులు, ఎవరికి ఓటు వేస్తారు, ఇలా ప్రతి దాంట్లో జగన్ కు వ్యతిరేకంగా, టిడిపికి అనుకులంగా సర్వే ఫలితాలు వచ్చాయి. టైమ్స్ అఫ్ ఇండియా లాంటి దాంట్లోనే, జగన్ కు వ్యతిరేకత చూపించారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

భవానిపురంలోని పున్నమి హోటల్‌లో మంత్రి జోగి రమేష్ అనుచరుల టూరిజం శాఖ అధికారులపై దా-డి-కి పాల్పడారు. మంత్రి అనుచరులు విజయవాడ భవానీపురంలో ఉన్న పున్నమి హోటల్‌లో ఫొటో షూట్ తీస్తుండగా అక్కడకు వచ్చిన టూరిజం శాఖ అధికారులు , ఫొటో షూట్ కు పర్మిషన్ లేదని చెప్పటంతో మంత్రి వర్గీయులు అధికారుల పై తిరగాబడ్డారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ, అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా వారిపై దా-డి చేసారు. దీనితో భవానిపురం పోలీస్ స్టేషన్ లో టూరిజం శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే మంత్రి జోగి రమేష్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చూపిస్తారో, లేక వదిలేస్తారో చూడాలి.

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హ-త్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని ఈ రోజు  రాజమండ్రి  కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ప్రస్తుతం  ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు.  ఈ రోజు తో ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా పూర్తవుతుంది. అయితే  ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ని, ఈ రోజు  రాజమండ్రి కి సంబంధించిన SC , ST అట్రాసిటి  కోర్టులో  హాజరు పరచాల్సి ఉంది. అయితే  SC , ST అట్రాసిటి కోర్టుకు సంభందించిన న్యాయమూర్తి విధి నిర్వహణలో భాగంగా అమలాపురం వెళ్లినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో అనంత బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు హాజరు పరుస్తారా లేదా అనేదిఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటి వరకు అనంతబాబుని, పోలీసులు కస్టడీకి తీసుకోక పోవటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. చిన్న చిన్న కేసులకు కూడా కస్టడీకి తీసుకునే పోలీసులు, అనంతబాబుని ఎందుకు కస్టడీకి తీసుకోలేదు అనేది ఎవరికీ అంతు బట్టటం లేదు. మరో పక్క అనంతబాబు, ఇప్పటికే బెయిల్ పిటీషన్ వేసారు. మరి ఈ బెయిల్ వద్దు అని, పోలీసులు వాదిస్తారో లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read