జగన్ మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చెప్పే వివిధ వ్యవస్థలు ఆయన దగ్గర ఉంటాయి. సొంత ఆలోచనలతో కూడా, ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రులు అర్ధం చేసుకుంటారు. అయితే జగన్ మోహన్ రెడ్డి సమాచారం ఇచ్చే వారు తేడాగా ఇస్తున్నారో, లేక జగన్ మోహన్ రెడ్డే తేడాగా ఉన్నారో కానీ, ఆయన అయితే రియాలిటీలో లేరు అనే విషయం అర్ధం అవుతుంది. తాను ఇచ్చే పధకాలతో ప్రజలు, సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నారు అనే భ్రమలో జగన్ ఉన్నారని అర్ధం అవుతుంది. రెండు రోజుల క్రితం ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో మాదిగ కార్పొరేషన్ గురించి అడగగా, పధకాలు ఇస్తున్నాంగా ఇంకా ఎందుకు అని జగన్ చెప్పటంతో, అందరికీ దిమ్మ తిరిగింది. నిన్న ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కూడా ఇదే తీరు. ముస్లిం యువతులకు షాదీముబారఖ్ ఇవ్వాలని కొంత మంది ఎమ్మెల్యేలు కోరితే, అమ్మఒడి ఇస్తున్నాం కదా అని అనటంతో, దిమ్మ తిరిగింది. అలాగే అమ్మఒడి పధకానికి కోతలు పెట్టారని చెప్పటంతో, నిబంధనల ప్రకరం ఇస్తాం, అర్హత లేని వారికి ఎలా ఇస్తాం, గతంలో తప్పు చేసాం, ఇప్పుడు దిద్దుకుంటున్నాం అని జగన్ తేల్చి చెప్పారట. రోడ్డులు గురించి అడిగితే డబ్బులు లేవని చెప్పారట. ఇక కరెంటు, ఇసుక గురించి అడిగితే, ఎల్లో మీడియా కధనాలు నమ్మి, నన్ను ప్రశ్నిస్తారా, అసలు కరెంటు ఎక్కడ పోయిందని దబాయించారట. జగన్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో తెలుసుకుని, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారట.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మంచి వాతావరణం వచ్చింది. బాదుడే బాదుడు కార్యక్రమం, ఆలాగే మహానాడు కార్యక్రమాలతో, మంచి ఊపు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన ప్రజలు, టిడిపి వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా స్పీడ్ పెంచారు. మరీ ముఖ్యంగా టిడిపి నేతలు కొంత మందికి వార్నింగ్ లు ఇస్తున్నారు. గ్రూపులు కట్టి పార్టీని నాశనం చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సర్వే రిపోర్ట్ లో వారి ముందే పెట్టి, సమాధానాలు కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వీరిని పార్టీ ఆఫీస్ కు పిలిపించటం కాకుండా, వారి వద్దకే వెళ్లి తేల్చేయాలని చంద్రబాబు సరి కొత్త వ్యూహం పన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏడాది పాటు, మినీ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా, ఏడాది పాటు ప్రజల్లోనే ఉండాలని, నెలకు రెండు జిల్లాలు తిరగాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి చంద్రబాబు తదుపరి పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒక రోజు సభ, ఒక రోజు రోడ్ షో చేసి, మూడో రోజు మాత్రం ఆయా పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పై సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో సర్వే రిపోర్ట్ లు చూపించి, నేతల పని తీరు పై సమీక్ష చేసి, తేడా ఉంటే అక్కడే వారిని పీకేసి, కొత్త ఇంచార్జ్ ను నియమించనున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించి, రేపు ఒక కీలక సమావేశం తాడేపల్లిలో పెట్టుకుంది. మొత్తం పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను ఈ సమావేశానికి పిలిచారు. ప్రధానంగా మూడు అంశాల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బస్సు యాత్ర ఫెయిల్ అవ్వటం, గడపగడపకూ కార్యక్రమం ఫెయిల్ అవ్వటం, కొత్త సలహాదారుని పరిచయం చేయటం వంటి వాటి పై చర్చించనున్నారు. కేవలం 24 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గున్నారని రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసలు ఈ కార్యక్రమమే మొదలు పెట్టలేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించాలి అనేదాని పై చర్చించనున్నారు. ఇక దీంతో పాటు, ముఖ్యమైన విషయం, ప్రశాంత్ కిషోర్ ఇప్యాక్ నుంచి తప్పుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్లేస్ లో, రిషీ రాజ్ సింగ్ అనే కొత్త వ్యక్తి, ఐప్యాక్ తరుపున, ఆయన రేపు వైసీపీ తరుపున చార్జ్ తీసుకుంటారని తెలుస్తుంది. రేపు పార్టీ మొత్తానికి, రిషీని జగన్ పరిచయం చేయనున్నారు. గతంలో ఈ రిషీ పెళ్లికి, జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ జగన్, ఆయన సతీమణి వెళ్లారు. పడిపోతున్న తమ గ్రాఫ్ ని, రిషీ చేతిలో జగన్ పెట్టి, రేపు పార్టీకి పరిచయం చేయనున్నారు.

వైఎస్ వివేక కేసులో సిబిఐ మళ్ళీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా సిబిఐ వేసిన అడుగులు అనూహ్యంగా ఉన్నాయి. ఏకంగా పులివెందులలో జగన మోహన్ రెడ్డి ఇంటిని ఫోటోలు తీయటం, సర్వే చేయటంతో, ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. అలాగే అవినాష్ రెడ్డి ఇంటిని కూడా సర్వే చేసారు. భారతీ తండ్రి హాస్పిటల్ లో కూడా సిబిఐ సర్వే చేసింది. వీటి అన్నిటి నేపధ్యంలో, వివేక కేసులో ఏమి జరుగుతుంది అంటూ అందరూ  చర్చించుకుంటున్న వేళ, తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. వివేకాను చంపిన తరువాత, దస్తగిరి తప్ప, మిగతా వారు మొత్తం వివేక ఇంటి గోడ దూకి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారని అన్నారు. అలాగే కొంత మంది భారతి తండ్రి హాస్పిటల్ కు వెళ్లి, అక్కడ నిద్రించారని చెప్పారు. ఈ విషయాలు అన్నీ, వాళ్ళ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా సిబిఐ గుర్తించిందని, అందుకే సిబిఐ సర్వేలు చేస్తుందని అన్నారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారనే ఉద్దేశంతోనే, సిబిఐ పక్కాగా మొత్తం రికార్డు చేస్తుందని తెలిపారు. మొత్తానికి, అసలు విషయం బీటెక్ రవి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read