ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ దేశానికీ, రాష్ట్రానికి చేసిన మోసాన్ని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చూపిస్తూ, మోడీ-షా విధానాలని చాకిరేవు పెట్టారు.... స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయంపైనా నిలదీసిన చంద్రబాబు.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను దిల్లీ వేదికగా ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కుట్రపూరిత వైఖరి అనుసరిస్తోందని ధ్వజమెత్తడంతో పాటు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయ మీడియాకు సీఎం వివరించారు.

delhi 27102018 2

‘‘దేశంలో ఏం జరుగుతోందో వివరించడానికే మీ ముందుకొచ్చాను. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో మేం అధికారంలోకి వచ్చాం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీలో ఒక్కసారిగా 19 ఐటీ బృందాలను దాడులకు పురిగొల్పారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమచేస్తామన్నారు.డాలర్‌తో రూపాయి మారకపు విలువ విపరీతంగా పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. ఎప్పుడు చేస్తారు? వ్యవసాయంలో 3శాతం వృద్ధి మాత్రమే ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

delhi 27102018 3

‘‘ ఏపీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైకాపా మద్దతును భాజపా తీసుకుంది. వైకాపా, భాజపా మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన నిధులను కూడా ఇటీవల వాపస్‌ తీసుకున్నారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేరుస్తామని ప్రధాని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీనీ సరిగ్గా నెరవేర్చలేదు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో రూ.1000 కోట్లు ఇస్తామన్నారు. కేవలం రూ.650 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు.. అది రాజకీయ కారణం. నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? రాష్ట్రంలో తిత్లీ తుపాను వస్తే పరిశీలనకు కేంద్రమంత్రులు రాలేదు. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించి రాజ్‌నాథ్‌సింగ్‌ దిల్లీకి వెళ్లిపోయారు గానీ.. తిత్లీ బాధితులను పరామర్శించేందుకు రాలేదు’’ అని చంద్రబాబు అన్నారు.

విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4నుంచి విమాన సర్వీసులు నడపనున్నట్టు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు క్లియరెన్స్‌ రిపోర్టు ఇవ్వడంతో పాటు సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టింది. తొలుత వెబ్‌పోర్టల్‌లో రూ.8,112గా ఉన్న ప్రారంభ ధర గంట తర్వాత రూ.7,508కి తగ్గింది. విజయవాడ నుంచి 180సీట్లతో కూడిన ఎయిర్‌బస్‌ 320, 321 నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును అందుబాటులోకి తేనుంది. మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విమానం తెల్లవారుజామున 2గంటలకు సింగపూర్‌ చేరుకుంటుంది.

singapore 27102018 2

ఏడాదిన్నర కిందట గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు గాలిలోకి లేస్తాయని ప్రకటించారు. కానీ.. అనేక ఆటంకాలను దాటి ఇన్నాళ్లకు అంతర్జాతీయ కలను సాకారం చేసుకునే రోజొచ్చింది. ఈనెల 25నే సింగపూర్‌కు తొలి సర్వీసును నడపాలని అధికారులు భావించినా.. కస్టమ్స్‌ అనుమతుల జాప్యంతో వాయిదా పడింది. డిసెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేశారు. ఇండిగో తన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని ఆరంభించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరిపోయేలా శీతాకాల షెడ్యూల్‌ను ఇండిగో ప్రకటించింది.

singapore 27102018 3

విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు, అటు నుంచి వచ్చేందుకు వారంలో రెండు రోజులు అక్కడ, ఇక్కడ అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. రూ.18వేల లోపే సింగపూర్‌కు వెళ్లి వచ్చేందుకు టిక్కెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్‌కు విమాన సర్వీసును డిసెంబర్‌ 4 నుంచి నడపనున్నట్టు ఇండిగో సంస్థ క్లియరెన్స్‌ ఇచ్చి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టడంతో గత అర్థ సంవత్సరకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంబన ఎట్టకేలకు వీడింది. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా, విదేశానికి విమానం ఎగరలేదన్న అపప్రద కూడా తొలగిపోయింది. సింగపూర్‌కు విమాన సర్వీసు బుకింగ్‌ కాగానే మనవాళ్ళు ఉత్సాహంతో బుకింగ్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి సింగపూర్‌ కంటే దుబాయ్‌కు మన దగ్గర నుంచి డిమాండ్‌ బాగా ఉంది. దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు నడపాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉండటంతో ఈ సర్వీసుపై కూడా ఆశలు కలుగుతున్నాయి.

డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పోలీసు అసోసియేషన్‌ తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సంఘటన జరిగినప్పుడు లభించిన సాక్ష్యాధారాలను బట్టి వాస్తవాలు పోలీసులు చట్టబద్ధంగా వెలుగులోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీజీపీపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చట్ట ప్రకంగా వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు.

vsreddy 27102018 2

డీజీపీ పరీక్షలు రాస్తూ ఉంటే ఆయన చిట్టీలు అందించారా అని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘డీజీపీ.. టీడీపీ కార్యకర్తవా? కాపీ కొట్టి ఐపీఎస్‌ పాసయ్యావా?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌పై జరిగిన దాడిమీద స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్‌కు అభిమానిగా పేర్కొంటూ.. ఉద్దేశపూర్వకంగా అతను దాడి చేయలేదని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. డీజీపీకి మతి భ్రమించినట్టుందని వ్యాఖ్యానించారు.

vsreddy 27102018 3

మరో పక్క ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత జగన్‌కు నమ్మకం లేదనడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. జగన్‌ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించిందన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోందని తెలిపారు. జగన్‌ పోలీసులకు సహకరించకుండా.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం దురదృష్టకరమన్నారు. ఒక పక్క విజయసాయి రెడ్డి డీజీపీని అలా అంటుంటే, జగన్ ఏపి పోలీసుల్ని ఇలా అంటున్నారని అన్నారు. జగన్‌ విశాఖలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారు?అని అడిగారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేస్తే గవర్నర్ స్పందించలేదన్నారు. అలాంటిది జగన్‌పై దాడి జరిగిన వెంటనే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం హస్తినకు బయల్దేరి వెళ్లిన ఆయన తొలుత తెదేపా ఎంపీలతో ఏపీ భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబుతో లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ వ్యవస్థాపకుడు శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. జాతీయ సమస్యలపై మరియు ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశత్వ పాలనపై చర్చించారు. దేశ ప్రజలందరూ కలిసి రాజ్యాంగాన్ని కాపాడాలని సూచించారు.

cbn delhi 27102018 2

మరి కాసేపట్లో, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతోనూ కాసేపట్లో సీఎం భేటీ కానున్నారు. అనంతరం ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు ఏపీలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రఫేల్‌ అంశంతో పాటు సీబీఐ వ్యవహారాలపైనా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

cbn delhi 271020183

చంద్రబాబుని కలిసిన తరువాత, కేజ్రివాల్ ట్వీట్, చేసారు. "Had a gud meeting wid Sh Chandrababu Naidu ji. Sh Sharad Yadav ji was also present for a while. Discussed national issues. Present BJP govt is a threat to the nation n to the Constitution. People across India will need to join hands to save India n the Constitution"

Advertisements

Latest Articles

Most Read