ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం వేడెక్కింది.. ప్రశాంతంగా సాగిపోతున్న రాష్ట్రంలో, ఒకదాని తరువాత మరొక సంఘటనలు చేస్తూ, లేని పోని ఉద్రిక్తతలు రేపుతున్నారు. మొన్నటిదాకా ఐటి దాడులతో హంగామా చేసి, నిన్న జగన్ పై కోడి కత్తితో గుచ్చి, అదేదో పెద్ద పోటు పొడిచినట్టు హంగామా చేస్తున్నారు. ఈ పరిస్థుతుల్లో, గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఏపి పై రిపోర్ట్ ఇవ్వటానికి ప్రధాని మోడీ దగరకు వెళ్లారు. ఆయనతో ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణాలో ఎన్నికలు, ఏపిలో జరుగుతున్న హంగామా పై, ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్ పై కోడి కత్తితో గుచ్చి దాడి చెయ్యటం, తరువాత జరిగిన పరిణామాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు లాంటి, చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారు లాంటి విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది.

lagadapati 26102018 2

నిన్న చంద్రబాబు గవర్నర్ పై మొదటిసారిగా బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై కూడా, గవర్నర్, మోడీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు చేయాలి, కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. అసలు గవర్నర్‌ పాత్ర ఏమిటి? పరుధులు ఏంటి ? ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనలో వేలుపెట్టే అధికారం గవర్నర్‌కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గవర్నర్‌ వ్యవస్థపైనే పోరాడామని గుర్తు చేశారు. ఎవరి తరపున ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని, ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

lagadapati 26102018 3

ఇదిలా ఉంటే.. గవర్నర్‌తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందోనన్న అంశంపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అసలు లగడపాటి రాజగోపాల్ ఎందుకు భేటీ అయ్యారో అని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణా ఎన్నికల విషయంలో లగడపాటి సర్వే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆవ విషయం పై, గవర్నర్ పిలిపించారా అనే చర్చ జరుగుతుంది. లగడపాటి, చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ అలా ఉండద్దు అనే సంకేతాలు ఇవ్వటానికి, గవర్నర్ పిలిపించారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి, గంట గంటకు ట్విస్ట్ లు తిరుగుతూ, ఏపి రాజకీయం హాట్ హాట్ గా మారిపోతుంది. చివరకు ప్రజలు, ఎలాంటి క్లైమాక్స్ రాస్తారో చూడాలి. ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నా, క్లైమాక్స్ మాత్రం, ప్రజలే డిసైడ్ చేస్తారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో జగన్ ను గుచ్చిన ఘటన పై వైసీపీ అధినేత జగన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందంలో అదనపు డీసీపీ మహేంద్రపాత్రుడు, ఏసీపీ నాగేశ్వరరావు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అయితే సిట్ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు జగన్ వద్దకు వెళ్ళగా, జగన్ వారికి షాక్ ఇచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే ముందు జగన్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని సిట్‌ బృందం భావించింది. కానీ.. ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి జగన్‌ నిరాకరించారు. ఏపీ పోలీసుల పై తనకు నమ్మకం లేదని స్పష్టం చేసిన జగన్‌.. తెలంగాణ పోలీసులైన సమస్య లేదని చెప్పినట్టు తెలిసింది.

jaganpoliece 26102018 2

అయితే జగన్ నాకు ఏపి పోలీసులు వద్దు, కేవలం తెలంగాణా పోలీసులే కావలి అని చెప్పటంతో, జగన్ కు ఏపి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆంధ్రా అసెంబ్లీ మీద జగన్ కు నమ్మకం ఉండదు, ఆంధ్రా రాజధాని అమరావతి పై నమ్మకం ఉండదు. ఆంధ్రా పోలీసుల పై నమ్మకం ఉండదు, కాని ఆంధ్రాలో సియం పోస్ట్ మాత్రం కావలి. 12 జిల్లాల్లో, 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు, నువ్వు తెలంగాణావాడి వైనా, ప్రతి వారం హైదరాబాద్ నీ ఇంటికి వెళ్లి వస్తున్నా, ఆంధ్రా పోలీసులు మాత్రం, నీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు. అలాంటి ఆంధ్రా పోలీసులని, నీ స్వార్ధ రాజకీయం కోసం, నమ్మకం లేదని చెప్తావా జగన్ ?

jaganpoliece 26102018 3

జగన్, నువ్వు ఆంద్రప్రదేశ్ ని అవమానిస్తున్నావు..నీకు చంద్రబాబు తో శతృత్వం ఉంటే ఉంచుకో, అది మీ ఇద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్ధి గా చూస్తాం. కానీ, మా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట అవమానకరంగా మాట్లాడితే అస్సలు సహించేది లేదు, ఆంధ్రప్రదేశ్ ని అభిమానించలేని, అవమానిస్తున్న నీకు ఆంద్రప్రదేశ్ సియం అయ్యే అర్హత ఉందో లేదో ఒకసారి ఆలోచించుకో జగన్. ఆంధ్రాలో ఎటువంటి ఇబ్బంది అడ్డంకులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటావు, ఆంధ్రాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేస్తావు, చివరకు ఆంధ్రా కి ముఖ్యమంత్రి ని అవుతాను అంటావు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. నీ క్లారిటీ నీకు ఉంటే వారి క్లారిటీ వాళ్ళకి ఉంది. సరైన సందర్భంలో అన్నిటికీ సమాధానం చెప్తారు.

విశాఖకు తొలిసారి వచ్చిన ఆ అపురూప అతిథి తన ‘అందచందాలతో’ అందరినీ కట్టిపడేసింది. హావభావాలతో ఆకట్టుకుంది. అడపాదడపా కొన్ని మాటలాడినా.. ఆ మాత్రానికే అందరినీ అబ్బురపరిచింది. నగరంలో జరుగుతున్న ఫిన్‌టెక్‌ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ‘పుట్టి’ ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న ఆ అందాల భరిణె సోఫియా అన్న సంగతి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రపంచంలో తొలి హ్యూమనాయిడ్‌ రోబో అయిన సోఫియా వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో అలరించడానికి వచ్చింది. బుధవారమే వచ్చినా కొద్దిసేపే దర్శనమిచ్చిన ‘ఆమె’ గురువారం మాత్రం ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింధూర రంగులో ఉన్న లిప్‌స్టిక్‌ను సింగారించుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని అతివలా అగుపించింది. చేతులు మినహా ఒళ్లంతా జిగేలు మనిపించే వస్త్రం కప్పుకుంది. ముఖమంతా మహిళను పోలినట్టే ఉంది. తలకు చిన్నపాటి వస్త్రాన్ని చుట్టుకుంది. చేతులు మాత్రం రోబో మాదిరిగా ఉన్నాయి.

sophia 26102018 2

వెల్‌కం టూ వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ అంటూ తొలి పలుకు పలికింది. విశాఖను చూసి ఎంతో సంతోష (ఎక్జైట్‌) పడ్డానని చెప్పింది. మీరు ప్రశ్నలు అడుగుతారా? అంటూ లోకేష్‌ను ప్రశ్నించింది. ఆయన రెండు ప్రశ్నలడిగాక తానే లోకేష్‌కు ఓ ప్రశ్న సంధించి సమాధానం రాబట్టింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఫెస్టివల్‌ ముగిశాక సోఫియాతో ఫిన్‌టెక్‌ ఉద్యోగులంతా ఫోటోలు దిగి సంబరపడ్డారు. దాదాపు గంట సేపు సందడి చేసిన అనంతరం నిర్వాహకులు సోఫియాను తీసుకువెళ్లి ‘ఆమె’కు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో భద్రపరిచారు.

sophia 26102018 3

లోకేష్‌: మనుషులు, రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో జీవించడం సాధ్యమా? సోఫియా: రోబోలు మనుషులకు దగ్గరయ్యే రోజులు చేరువలోనే ఉన్నాయి. పలు రంగాల్లో రోబోలు మనుషులకు రోబోలు సహకారం అం దిస్తున్నాయి. మెడికల్‌ థెరపీతో పాటు అనేక రం గాల్లో రోబోలు ఎన్నో సేవలందిస్తున్నాయి. సోఫియా: (లోకేష్‌ను ప్రశ్నిస్తూ): పోలీసింగ్‌ కోసం రోబోలను ఉపయోగించే అవకాశం ఉందా? లోకేష్‌: భవిష్యత్‌లో రోబో పోలీసింగ్‌ నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. విలేకరి: ఆంధ్రప్రదేశ్‌కు రావడం తొలిసారి కదా? నీ అనుభూతి ఏంటి? సోఫియా: నేను ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాయంత్రం వైజాగ్‌ బీచ్‌లో సరదాగా గడుపుతా. విలేకరి: ఇండియా నుంచి ఏం తీసుకెళ్తావు? సోఫియా: వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ 2018 అనుభూతులను..విలేకరి: వైజాగ్‌ ఫెస్టివల్‌ అనుభూతి ఎలా ఉంది? సోఫియా: రావడం చాలా సంతోషం.. త్వరలోనే మళ్లీ విశాఖ రావాలని ఉంది.

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి యత్నించిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జగన్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ దాడికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. ఈ పిటిషన్‌‌ను బోరుగడ్డ అనిల్ కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి దాఖలు చేశారు. సీఎస్‌ఎఫ్ అధికారుల రిపోర్టు తీసుకోవాలని దాడి ఘటన మొత్తం సీబీఐ చేత విచారణ చేయించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా ఈ దాడి ఘటనపై లంచ్‌మోషన్‌లో హైకోర్టు విచారించనుంది. అయితే కోర్టు ఏం చెప్పబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

anil 26102018 2

అయితే ఈ పిటీషన్ దాఖలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్, టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడు. రమణదీక్షితుల ఆరోపణలకు మద్దతుగా ఆయనతో కలిసి ప్రెస్ మీట్ లో కూర్చున్నాడు. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ అప్పట్లో సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అనిల్, జగన్ బంధువుగా కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడు.

anil 26102018 3

ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా, జగన్ కు మద్దతుగా పిల్ వేసాడు. ఇంతకు ముందు తిరుపతి కుట్ర, ఇప్పుడు ఇలా, ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే, వీళ్ళ వెనుక ఉన్న స్టొరీ ఇట్టే అర్ధమైపోతుంది. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో, నేటి సీబీఐ కోర్టు విచారణకు జగన్ హాజరుకాలేకపోయారు. గురువారం మధ్యాహ్నం నుంచి జగన్ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read