రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము పోరాడుతుంటే.. ప్రతిపక్షాలు తెదేపాపై పోరాడుతున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు తెదేపాపై చూపుతున్న అభిమానాన్ని ఓర్వలేక నాలుగు పార్టీలు ఏకమై అక్కసు పెంచుకున్నాయని సీఎం ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, తెరాస, జనసేన పార్టీలు టిడిపినే లక్ష్యంగా చేసుకున్నాయని దుయ్యబట్టారు. తాను బాధితుల్ని పరామర్శిస్తుంటే.. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక పవన్‌కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని ఆరోపించారు.

cbn 19102018 2

వారు తమపై ఎంతగా గురి పెడితే తమకు అంత లాభమని.. వారి తిట్లే తమకు ప్రజా దీవెనలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదు, కౌన్సిల్‌ ఎన్నికలు, బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై నేతలతో సీఎం చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించినా.. కేంద్రం నుంచి ఒక్క భాజపా నేత కూడా రాలేదని, ఎలాంటి సాయం అందించలేదన్నారు. రాజమహేంద్రవరంలో పవన్‌ కవాతును ప్రశంసించిన కేటీఆర్‌.. తిత్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు.

cbn 19102018 3

వైకాపా అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమన్నారు. జగన్‌ చిత్తశుద్ధితో పాదయాత్ర చేయట్లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మరో నాలుగేళ్లు ఆయన పాదయాత్ర చేసిన ఫలితం రాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానం తమపై ఉందని, అదే తమ నైతిక బలమని పేర్కొన్నారు. తాను ఒక్కడినే కష్టపడితే చాలదని.. పార్టీ సభ్యులంతా కష్టించి పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

శ్రీకాకుళం తుఫాను పై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తానికి పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాల చేస్తున్నారు. ఇప్పటికి 7 రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాక, శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు.

pk 18102018 2

సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చెయ్యాలి, లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు, పేపర్ లో ఎదో రాసుకుని, ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని ట్వీట్ మొదలు పెట్టి, మీ అంతు చూస్తా అని అన్నాడు. తరువాత కరెంటు విషయంలో, ఇప్పటికి ఆరు రోజులు అయ్యింది, కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసాడు పవన్. నిజానికి, పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు, గ్రౌండ్ లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్ ని.. పవన్ చౌకబారు ఆరోపణకు, ఆధారాలతో సహా సమాధానం ఇది..

pk 18102018 3

ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరోచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7 వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా, దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాంబిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా ? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తవాత 11కేవీ లైన్లు సరిచెయ్యలి. ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయే. అవి నిలబెట్టాలి. అప్పుడు LT లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్ లా అయిపోదు. ఇప్పటికి దాదపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం, కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి..

జనసేన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని పవన్ చేసే ప్రతి చర్యతో అర్ధమవుతుంది. సరి కొత్త రాజకీయం అని చెప్పే పవన్, ఇప్పటి వరకు, కేవలం ఆ పార్టీ, ఈ పార్టీ వదిలేసిన నేతలనే, పవన్ చేర్చుకుంటున్నారు. 2014కి ముందు శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసినప్పటికీ కాంగ్రెస్ తరఫున నాదెండ్ల మనోహర్ పోటీచేశారు. మెడలో మూడు రంగుల కండువా ధరించి ఫక్తు కాంగ్రెస్ నేతగా దర్శనమిచ్చే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం కాంగ్రెస్‌వాదులకు ఆశ్చర్యం కలిగించింది. నాదెండ్ల మనోహర్‌ను జనసేనపార్టీలో చేర్చుకోవడం వెనుక విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం నెరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

janasena 18102018 2

ఎందుకంటే ఆ పారిశ్రామికవేత్త అటు మనోహర్‌కీ, ఇటు పవన్కీ కూడా సన్నిహితుడే. ఏ ఉద్దేశంతో మనోహర్ జనసేనలో చేరారో తెలియదు కానీ.. ఈ పరిణామం వల్ల పవన్‌కల్యాణ్‌కు రెండు ప్రయోజనాలు నెరవేరాయి. జనసేన పార్టీ ఒకే సామాజికవర్గానికి పరిమితమైందనే భావన ఈ ఘటనతో సమసిపోయిందని జనసైనికులు అంటున్నారు. రెండవది నాదెండ్ల మనోహర్ వివాదాలకు దూరంగా ఉంటారు. నిజాయితీపరుడు. మనోహర్‌తో పాటు గుంటూరు జిల్లాలకు చెందిన మరికొంతమంది నేతలకు జనసేన, వైసీపీలు వల విసిరాయి. రేపల్లె మాజీ ఎమ్మల్యే దేవినేని మల్లిఖార్జునరావును రెండు పక్షాలు సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని మల్లిఖార్జునరావును ఆ పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉంది.

janasena 18102018 3

అటు రేపల్లె, ఇటు వేమూరు నియోజకవర్గాల్లో మల్లిఖార్జునరావుకు పట్టు ఉంది. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌ను ఆ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి పార్టీ అధ్యక్షులు జగన్ ఆకస్మికంగా తప్పించారు. కేవలం డబ్బులు లేవనే సాకుతోనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారన్నది పలువురి అభిప్రాయం. దీంతో ఆయన అనుచరులు పార్టీకి రాజీనామా చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో రాజశేఖర్‌ను జనసేన పార్టీ నేతలు సంప్రదించినట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా కోస్తాలో అత్యంత కీలకమైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా జనసేనను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో జనసేన పావులు కదుపుతోంది. ఇలా వాళ్ళు వీళ్ళు వదిలేసిన నేతలను టార్గెట్ గా పెట్టుకుని, వారిని పార్టీలో చేర్చుకుని, సరి కొత్త రాజకీయం అని పవన్ చెప్పటం, మనం వినటం సరిపోయింది..

తుఫాను అంటేనే వణుకుతున్న శ్రీకాకుళం జిల్లాకు మరో గండం పొంచి ఉన్నదని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. తితలీ దెబ్బ నుంచి ఇంకా కుదుటపడనేలేదు. ఇటువంటి సమయంలో మరో తుఫానా? అంటూ శ్రీకాకుళం ప్రజలు కంగారుపడుతున్నారు. కొందరు విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్‌ చేసి వాకబు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే ఈ నెల 23కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ బుధవారం బులెటిన్‌లో పేర్కొంది.

cyclone 18102018 2

ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల మేరకు అల్పపీడనం ఏర్పడుతుందని మాత్రమే అంచనా వేసిందని, దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాలని సంబంధిత శాఖ అధికారి ఒకరు తెలిపారు. అల్పపీడనం బలపడి వాయుగుండం, ఆ తరువాత తుఫానుగా మారితే అప్పుడు దాని గమనం తెలుస్తుందని...ఈలోగా దానిపై ఏమీ చెప్పలేమన్నారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత బంగాళాఖాతంలో వాతావరణం, గాలుల తీవ్రత తదితర అంశాలపై ఆధారపడి దాని పయనం ఉంటుందన్నారు. ఈసారి ‘దయె’ తుఫాను వస్తుందన్న వదంతులను కొట్టివేశారు. దయె తుఫాను గత నెలలోనే వచ్చిందన్నారు.

cyclone 18102018 3

ఒకవేళ బంగాళాఖాతంలో తుఫాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతారన్నారు. వదంతులు నమ్మవద్దని కోరారు. కాగా. ఈనెల 22 లేక 23 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ఆర్టీజీఎ్‌స/ఇస్రో నిపుణుడు తెలిపారు. దీనిపై మరింత స్పష్టతకు మూడు, నాలుగు రోజులు ఆగాలని, అప్పుడే దాని గమనం తెలుస్తుందన్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతులు తుఫానులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే తుఫానులు ఏర్పడకముందే వదంతులు నమ్మవద్దని సూచించారు.

 

Advertisements

Latest Articles

Most Read