పలమనేరుకు చెందిన వైసీపీ నేత రాకేష్‌ రెడ్డి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించనున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌(అసలు కథ) చిత్రం ప్రారంభోత్సవానికి తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వేదికైంది. శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో రామ్‌గోపాల్‌ వర్మ క్లాప్‌ కొట్టి చిత్రం షూటింగును ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపార్వతి తదితరులతో కలసి చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం ఆద్యంతం వైసీపీ నేతల హడావుడే కన్పించింది. ముగ్గురు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, పార్టీ నాయకులు ఆదిమూలం, గణపతి నాయుడు తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు విచ్చేశారు.

varma 20102018 2

ఒకరోజు ముందే జిల్లాలోని వైసీపీ నేతల ఫొటోలతో రామ్‌గోపాల్‌ వర్మకు స్వాగతం పలుకుతూ శిల్పారామం వద్ద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. సినిమా ప్రారంభోత్సవ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ ప్రసంగించిన తరువాత పాత్రికేయులు సినిమా వెనుక వైసీపీ పాత్ర గురించి అడిగారు. వైసీపీ కార్యకర్తలు రామ్‌గోపాల్‌వర్మకు అండగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. మరో వారం పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం షూటింగ్‌ ఉంటుందని రామ్‌గోపాల్‌వర్మ వివరించారు. జనవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

varma 20102018 3

రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపిస్తామని నిర్మాత రాకేష్‌ రెడ్డి చెప్పారు. గగతంలో హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్ హోటల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, వైసీపీ అధినేత జగన్ బావ బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ పెదనాన్న కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఎందుకో కాని, అప్పట్లో ఆ సినిమాను పక్కన పెట్టేసిన వర్మ, ఇప్పుడు మళ్ళీ పక్కన లక్ష్మీ పార్వతిని వేసుకుని, తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. ఈ రోజు సినిమాని మొదలు పెడుతున్నా అంటూ హడావిడి చేస్తున్నారు.

నాలుగున్నరేళ్లుగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి సానుకూల కదలిక కనిపించింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉంటుందని, దాని కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నారు. మరో పక్క వైజాగ్ రైల్వే జోన్ పై కూడా త్వరలోనే ఎదో ఒక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకపోవడం వల్ల రాజకీయంగా వచ్చే ముప్పును గ్రహించినట్లు కనబడుతోంది. కొద్దినెలల క్రితం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రమేశ్‌ ఆమరణ దీక్ష చేపట్టడం, కొన్ని రోజుల కింద టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలసి వినతి పత్రం సమర్పించిన అనంతరం కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి.

modi 20102018 2

వారంలోగా సానుకూల ప్రకటన వెలువడుతుందని వారికి మంత్రి హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో తన శాఖ అధికారులతో, మెకాన్‌ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై మెకాన్‌ ఇప్పటికే ముసాయిదా నివేదిక సమర్పించిన విషయం చర్చకు వచ్చింది. రాష్ట్రంలో ఎంత ఇనుప ఖనిజం లభ్యత ఉందో.. ఉక్కు ప్లాంటుకు అనువైన గ్రేడ్‌ ముడిఇనుము ఎంత లభిస్తుందో రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర సమాచారం కోసం వేచి ఉండకుండా.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు.

modi 20102018 3

ఈ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) సొంతంగా గానీ, ప్రైవేటు రంగంలో గానీ.. రెండింటి భాగస్వామ్యంతో గానీ స్థాపించడం సాధ్యమో కాదో త్వరితగతిన నివేదికను సమర్పించాలని మెకాన్‌ను ఆదేశించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తే.. రాయలసీమ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెకాన్‌ సంస్థ నిరంతం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ మైనింగ్‌ లీజులు, ఇనుప ఖనిజం లభ్యతపై త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఈ సాంకేతిక నివేదికను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కేంద్రం స్పందించకుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏపీఎండీసీ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ దిశగా కార్యాచరణ మొదలుకావడంతో.. ఇంతకాలం మెకాన్‌ నివేదిక రాలేదంటూ దాటవేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదని బుకాయిస్తుండడం గమనార్హం.

పర్యటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో నవంబరు 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని కృష్ణా నదీ తీరం పున్నమి ఘాట్‌లో విమాన విన్యాసాలు (ఎయిర్‌ షో) నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.15 - 10.45 గంటల మధ్య, సాయంత్రం 4.15 - 4.45 గంటల మధ్య విన్యాసాలు ఉంటాయన్నారు. నవంబరు 16 నుంచి 18 వరకూ నిర్వహించే బోటు రేసింగ్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. 400 మంది బోటు రేసింగ్‌ రైడర్లు పాల్గొంటారని వివరించారు.

boating 20102018 2

ఎఫ్‌1 హెచ్‌2వో పవర్‌ బోట్‌ రేసింగ్‌ నిర్వహణ ద్వారా ప్రపంచ దృష్టిని అమరావతి వైపు ఆకర్షింపచేయాలని సీఎం చంద్రబాబునాయడు భావిస్తున్నారని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణకు ప్రతి శాఖ నుంచి తాము సహకారం ఆశిస్తున్నామని మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రకాశం బ్యారేజీ వేదికగా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడాపోటీలను నిర్వ హిసు ్తన్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు ఒక్కో జట్టు నుంచి 50 మంది సభ్యులు చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నారని వివరించారు. ఎక్కువమంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడి యాకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించాల్సి ఉందన్నారు.

boating 20102018 3

సాంస్కృతిక కార్యక్రమాలు, జలవ నరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజులపాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహి స్తామని చెప్పారు. పోటీలు జరిగే విధా నం, రేస్‌ ట్రాక్‌కు సంబంధించిన అంశాలను శుక్లా వివరించారు. నగర సుందీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసు కుంటానని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ తెలపగా, జిల్లా యం త్రాంగం అంతటినీ అందు బాటులో ఉంచుతామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న బోట్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. రేసింగ్‌లో ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించడంపై ప్రత్యేకంగా సమావేశంలో చర్చ జరిగింది.

గన్నవరం విమానాశ్రయం నుంచి మొదటి అంతర్జాతీయ సర్వీస్‌ ఈనెల 25న ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరబోతోంది. ఈనెల 25న తొలి సర్వీసు గాలిలోకి లేవబోతోంది. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన.. కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఇక విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న గురువారం తొలి విమానం బయలుదేరబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం శనివారం నుంచి ఆరంభం కాబోతోంది. మరో ఆరు రోజులే సమయం ఉన్నందున.. నేడు ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన చేయనుందని అధికారులు వెల్లడించారు.

indigo 20102018 2

విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆరు నెలల్లోనే విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌తో పాటు అన్ని సౌకర్యాలూ సిద్ధమైపోయాయి. అప్పటినుంచి పలురకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన వ్యవహారం.. ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ డైరెక్టర్‌ నుంచి ఇండిగో సంస్థకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ.. ఇండిగోకు తెలియజేశారు. దీంతో నేటి నుంచి టిక్కెట్ల విక్రయం ఆరంభం కాబోతోంది.

indigo 20102018 3

సాధారణంగా.. కనీసం 40 రోజుల ముందు టిక్కెట్ల విక్రయం ఆరంభించాల్సి ఉంటుంది. 180 సీట్ల ఇండిగో బోయింగ్‌ గన్నవరం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న బయలుదేరి వెళ్లనుంది. టిక్కెట్ల విక్రయం ఆరంభమవ్వగానే.. 25వేల మందికి సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం వెళ్లిపోయే వ్యవస్థ ఇండిగోకు ఉంది. అందుకే టిక్కెట్ల విక్రయం పెద్ద సమస్య కాదని ఇండిగో, విమానాశ్రయం, ఏపీఏడీసీ అధికారులు భావిస్తున్నారు. హాట్‌కేకుల్లా టిక్కెట్లు అమ్ముడైపోనున్నాయన్నారు. వారంలో గురు, మంగళవారాల్లో తొలుత నడపనున్నారు. ఈనెల 25 గురువారం అయ్యింది. మంగళవారం 30న వస్తోంది. ఈలోగా రెండో సర్వీసుకు టిక్కెట్ల విక్రయానికి సమయం ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read