తిత్లీ తుపాను ధాటికి జిల్లాలో కుప్పకూలిన విద్యుత్తు వ్యవస్థను గాడిన పెట్టేందుకు జిల్లా అధికారులు యత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సమీక్షలు నిర్వహిస్తూ అయిదు జిల్లాల నుంచి రప్పించిన ఉన్నతాధికారులు, సిబ్బందితో పనులు పరుగులెట్టిస్తున్నారు. విద్యుత్తు సిబ్బంది, స్థానికుల సహకారంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లలో విద్యుత్తు స్తంభాలు వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే భారీ నష్టం సంభవించినా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి.

vidyuth 13102018 2

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హుటాహుటిన జిల్లాకు చేరుకుని పనులు పర్యవేక్షించడంతో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సరఫరా ఇవ్వడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కొంత వరకు సఫలీకృతం అయ్యారు. అయినా జిల్లాలోని 38 మండలాల్లో ఎంతో కొంత ప్రభావం ఉంది. తిత్లీ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌పై నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితిల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఉన్నతాధికారులంతా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో నీటిమట్టం తగ్గితే పూర్తి నష్టం అంచనాలు తెలుస్తాయని చెబుతున్నారు. విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి విద్యుత్తు స్తంభాలను తెప్పించి కూలిన వాటి స్థానంలో ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నారు.

vidyuth 13102018 3

శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలో 75 శాతం గ్రామాలకు సరఫరా పునరుద్ధరించిన అధికారులు.. టెక్కలి డివిజన్లో 50 శాతం సరఫరా చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. కూలిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి వేయడంలో జరుగుతున్న జాప్యం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌.వై.దొర, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌, ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తో పాటు ఉన్నతాధికారులంతా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తుండటంతో శనివారం సాయంత్రానికి పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పచ్చని ఉద్దానంపై ప్రకృతి పగపట్టినట్లు సృష్టించిన విధ్వంసం చూసి... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలించిపోయారు! విద్యుత్తు సరఫరా పనులు కొలిక్కివచ్చే వరకూ.. జన జీవనం సాధారణ స్థాయికి చేరే వరకూ.. జిల్లాలోనే ఉంటానని ప్రజలకు అభయం ఇచ్చారు! జిల్లాలో ‘తిత్లీ’ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు...వారి కష్టాలను ఆలకించారు! పునరుద్ధరణ పనులు ఎలా పరుగులు తీయించాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు!! శుక్రవారం పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ప్రజా సమస్యలు ఆలకించారు.

cbn 13102018 2

తిత్లీ తుపాను తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఆయా గ్రామాల వద్ద బాధితులను ఓదార్చుతూ.. నష్టనివారణ చర్యలు, సహాయక పనుల తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తూ ముందుకువెళ్లారు. తుపాను తీరం దాటిన ప్రాంతం ఎలా రూపురేఖలు కోల్పోయిందో ప్రత్యక్షంగా వీక్షించారు. నేలకూలడాన్ని జీడి, కొబ్బరి, ఇతర భారీ వృక్షాలను పరిశీలించారు. తోటలకు తోటలు ఊడ్చుకుపోవడాన్ని గమనించి, మోడివారిన చెట్లనూ చూసి ఎంత కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటిపర్యంతమవుతున్న ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకునడిచారు. అధికారులు ఎప్పటికప్పుడు సత్వర పనులు చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు.

cbn 13102018 3

ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలంటూ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం తిత్లీ ప్రభావిత ప్రాంతాలైన పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించారు. హెలీకాప్టర్‌లో కాశీబుగ్గకు ఉదయం 11.30 గంటలకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వరకు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి పలాస చేరుకున్నారు. బీ కాశీబుగ్గలోని డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్‌ నుంచి దిగిన సీఎం అక్కడకు చేరుకున్న కొందరు మహిళలతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ రామ్మోహన్‌ నాయుడులతో మాట్లాడారు. కాన్వాయ్‌ ఆలస్యం కావడంతో 15 నిమిషాల పాటు కారులోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో తుపాను ప్రభావం గురించి సీఎంకు ఎంపీ వివరించారు.

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు రమేశ్‌ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ తెలిపారు.

rameshraids 12102018 2

తాము నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. సోదాలు ముగిసిన తరువాత సియం రమేష్ కూడా మీడియాతో మాట్లాడారు ‘‘మా ఇంట్లో ఐటీ అధికారులకు ఏమీ దొరకలేదు. గంటలోనే అన్ని సోదాలు ముగించారు. టీవీ చూస్తూ ఐటీ అధికారులు సాయంత్రం వరకు... కాలయాపన చేశారని మా కుటుంబసభ్యులు చెప్పారు. జాతీయ మీడియాలో ఐటీ దాడుల విషయాన్ని చూసి... చాలా మంది నాయకులు ఫోన్లు చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

rameshraids 12102018 3

రాఫెల్‌ కుంభకోణంపై జేపీసీ ఎందుకు వేయడం లేదు? రాఫెల్‌ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా? రిలయన్స్‌ కంపెనీకి అంత పెద్ద ఆర్డర్‌ ఇవ్వడం వెనుక.. మతలబు ఏంటో ప్రధాని మోదీ చెప్పాలి’’ అని సీఎం రమేష్‌ డిమాండ్ చేశారు. ఏపీ విభజన హామీలు అమలు చేయమని కోరితే.. ఐటీ దాడులతో భయపెడతారా అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్‌ అనే ఐటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు చేశారని, వారం క్రితం నుంచే ఐటీ దాడులకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ కార్యాలయంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాగర్‌ సొసైటీలోని సీఎం రమేశ్‌ కార్యాలయంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. అయితే నిన్నితోనే సోదాలు ముగిసాయనే లీక్ ఇచ్చారు అధికారులు. సోదాల్లో ఏమి దొరకలేదనే సమాచారం కూడా బయటకు వచ్చింది. సియం రమేష్ కూడా మా ఇంట్లో వాళ్ళకి ఏమి దొరకలేదు, చిన్న పేపర్ ముక్క కూడా మా ఇంటి నంచి పట్టుకువెళ్ళ లేదని చెప్పారు. దీంతో ఇక అందరూ ఐటి సోదాలు ముగిసాయనే అనుకున్నారు. కాని మళ్ళీ ఈ రోజు ఉదయం, ఐటి అధికారులు సియం రమేష్ ఇంట వాలిపోయారు.

ramesh 13102018 2

ఈ పరిణామం ఊహించని మీడియా కూడా మళ్ళీ అక్కడ వాలిపోయింది. నిన్న ఏమి దొరకలేదని, ఎదో ఒకటి తీసుకురావాలని పై నుంచి ఒత్తిడులు ఉన్నాయి కాబట్టే మళ్ళీ వచ్చారని సియం రమేష్ అన్నారు. మీరు ఎన్ని వెతికినా, నా దగ్గర ఏమి ఉండవని, నేను అన్నీ చట్ట ప్రకరామే చేస్తున్నా అని అన్నారు. సీఎం రమేష్‌ సోదరుడు సురేష్‌ సమక్షంలో ఐటీ సోదాలు జరిగాయి. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్‌ దాఖలుపై సురేష్‌ను అధికారులు విచారించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేష్.. మా నుంచి ఎలాంటి పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశాడు. నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సురేష్‌ చెప్పుకొచ్చాడు. ఐటీ అధికారుల సోదాలకు తామేం భయపడేది లేదని ఆయన తెలిపాడు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ అడిగినందుకే ఐటీ దాడులు జరిగాయన్నాడు.

ramesh 13102018 3

నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సోదాల్లో దాదాపు 60 మంది అధికారులు పాల్గొంటున్నారు. ఈ సోదాలు రేపటి వరకూ కొనసాగవచ్చని సమాచారం. సీఎం రమేశ్‌‌ ఇళ్లు, కార్యాలయాలపై శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో మోహరించి తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు ఆయన సొంత ఊరైన కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 60 మంది అధికారులు బృందాలుగా విడిపోయి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కడపలో మరో ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఏపీ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజ్యసభలో విభజన హామీలపై గళమెత్తడం, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ దీక్షలు చేపట్టడంతో సీఎం రమేశ్‌పై కేంద్రం కక్షసాధిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read