వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విడుదలలో కేంద్రం వివక్షపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసి... ఏపీకి మొండిచేయి చూపడంపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నిధులపై మంగళవారం ఇక్కడ సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఇదే పద్దు కింద గతంలో రూ.350 కోట్లు ఇచ్చి కేంద్రం మళ్లీ వెనక్కు తీసుకోవడాన్ని కూడా లేవనెత్తాలని నిశ్చయించారు. సీఎం లేఖకు ప్రతిస్పందన రానిపక్షంలో టీడీపీ ఎంపీల బృందం వచ్చేవారం ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రులు, అధికారులను కలిసి గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

cbn 10102018 2

రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కేంద్రం వివక్షపై బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నోరు తెరవకపోవడంపైనా గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయానికొచ్చారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చి.. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడం సమంజసమేనా అని రాష్ట్ర భూగర్భ గనుల మంత్రి సుజయకృష్ణ రంగారావు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

cbn 10102018 3

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందాలను వారు బయటపెట్టాలని మంగళవారం సచివాలయంలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జగన్‌, పవన్‌ ఏ ముఖంపెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

‘సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉంటే... రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించకపోవడానికి అదే కారణం’’ అని ఎన్నికల కమిషన్‌(ఈసీ) స్పష్టం చేసింది. ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించక్కరలేదని తెలిపింది. మంగళవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ‘‘కర్ణాటకలో 3 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలోని 5 లోక్‌సభ స్థానాలకు ముడిపెడుతూ మీడియాలో కథనాలు వచ్చాయి.

jagan 10102018 2

బళ్లారి, శివమొగ్గ, మాండ్య ఎంపీలు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఈ ఏడాది మే నెలలోనే ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. కానీ... ఏపీలోని ఐదు స్థానాలు జూన్‌ 20న ఖాళీ అయ్యాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 151ఏ ప్రకారం శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఖాళీ ఏర్పడిన 6 నెలల్లో ఎన్నికలు జరపాలి. అయితే, పదవీ కాలం ఏడాదిలోపు ఉంటే ఎన్నికలు నిర్వహించకూడదు. 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్‌ 3తో ముగుస్తుంది. ఈ రీత్యా కర్ణాటకలో ఏడాది పదవీకాలం మిగిలి ఉండగానే ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం’’ అని ఈసీ వివరించింది.

jagan 10102018 3

వైసీపీ ఎంపీలు ఏప్రిల్‌ 6న రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చారు. వాటిని తక్షణం ఆమోదించి ఉంటే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చేవి. కానీ జూన్‌ 20న వారి రాజీనామాలను ఆమోదించారు. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగి తీరుతాయని, ‘హోదా’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధిస్తామని వైసీపీ తెలిపింది. శనివారం వెలువడిన నోటిఫికేషన్‌, ఈసీ ఇచ్చిన వివరణతో వారి వాదన నిజం కాదని తేలిపోయింది. అయితే అప్పటి నుంచి, ఈసీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రంతో కుమ్మక్కు అయ్యే జగన్ నాటకాలు ఆడుతున్నాడనే కధనాలు జాతీయ స్థాయిలో రావటంతో, ఎలక్షన్ కమిషన్ మరోసారి ఈ వివరణ ఇచ్చింది.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యపై మావోయిస్టుల పేరుతో ఓ లేఖ మంగళవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. కిడారి, సోమలను గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులుగా ఆ లేఖలో విమర్శించారు. ఈ కారణంగానే వారిని ప్రజాకోర్టులో శిక్షించామని పేర్కొన్నారు. ‘‘గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు కిడారిని హెచ్చరించాం. అయినా, పట్టించుకోలేదు. పైగా బాక్సైట్‌ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు. అందుకే ప్రజాకోర్టులో శిక్షించాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

kidari 10102018

వారిద్దరికి రక్షణగా వచ్చిన ఉద్యోగులను మానవతా దృక్పథంతో వదిలిపెట్టామని, ఆయుధాలతో చిక్కినా చంపలేదన్నారు. అలా మావోయిస్టులు దొరికితే పోలీసులు వదిలిపెడతారా అంటూ ప్రశ్నించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆ లేఖలో తీవ్రంగా హెచ్చరించారు. ‘‘అధికార పార్టీకి తొత్తుగా మారావు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయావు. అలాంటి నీవు మాకు నీతులు చెబుతావా? ప్రజాకోర్టు సందర్భంగా నీ గురించీ కిడారి చెప్పారు. నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలి. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాలి. లేదంటే, వారికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఆ లేఖలో హెచ్చరించారు.

kidari 10102018

కాగా, ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టులు ఎప్పుడైనా, ఏదైనా సమాచారం పంపితే వాడే కాగితాలు గానీ, అందులో ఉపయోగించే భాష గానీ భిన్నంగా ఉంటాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీయగా, ‘‘అది మావోయిస్టులు రాసిన లేఖ కాదు. అది ఎవరు రాశారనేది ఆరా తీస్తున్నాం’’ అని వివరించారు. అలాగే ఇప్పటి వరకు, పత్రికలకు, మీడియాకు లేఖలు అందేవి, ఇది వెరైటీగా సోషల్ మీడియాలో తిరగటం ఆశ్చర్యానికి గురి చేసేంది. పార్టీ మారిన ఎమ్మల్యేలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పటం ఇంకా ఆశ్చర్యం. ఇలాంటి భాష సహజంగా జగన్ పార్టీ నేతలు చేస్తూ ఉంటారు. దీంతో ఈ దొంగ లేఖ పై, పోలీసులు విచారణ ప్రారంభించారు. తీగ లాగితే, ఏ పాండులో డొంక కదులుతుందో చూడాలి...

2013 తెలంగాణా ఇవ్వక ముందు గుర్తుందా ? తెలంగాణా దేవత సోనియమ్మ అంటూ, కెసిఆర్ తో పాటు, ఆయన ఫ్యామిలీ మొత్తం వెళ్లి, సోనియా గాంధీ పాద పూజ చేసి వచ్చారు. ఇంటిల్ల పాది గ్రూప్ ఫోటో దిగి, త్వరలోనే మా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నాడు కెసిఆర్. తరువాత, సోనియా దెయ్యం అన్నాడు.. దేవత అన్న నోటితోనే దెయ్యం అన్నాడు... ఇక 2009లో తెలుగుదేశంతో కలిసి మహా కూటమి అన్నాడు. చంద్రబాబు అంత నాయకుడు ఈ ప్రపంచంలోనే లేడు అన్నాడు. కట్ చేస్తే, ఎన్నికలు అయిన మరుసటి రోజే, ఫలితాలు కూడా రాకుండా వెళ్లి ఎన్డీఏలో చేరిపోయాడు. ఇక ఇప్పుడ, దేశం మొత్తం మోడీని వ్యతిరేకిస్తుంటే, వెళ్లి మోడీ పక్కన చేరాడు. ఎందుకంటే, 7 వేల కోట్ల రూపాయల సహారా స్కాంలో అడ్డంగా దొరికినందుకు..

ktr 10102018 2

అందుకే అమిత్ షా, మోడీ చెప్పినట్టు, తోక ఊపుతున్నాడు కెసిఆర్. ఒక పక్క బీజేపీని, మరో పక్క ఎంఐఎంని పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఇలాంటి రాజకీయ వ్యభిచారి, చంద్రబాబుని విమర్శ చేస్తున్నాడు. కేటీఆర్ ఈ రోజు చంద్రబాబు పై ట్విట్టర్ లో దాడి చేసాడు. ఆనాడు విభజన చేసిన సమయంలో, సోనియా గాంధీ పై చంద్రబాబు వేసిన ట్వీట్లు చూపిస్తూ, చంద్రబాబుని ఎద్దేవా చేసాడు కేటీఆర్... అయితే కేటీఆర్ వేసిన ట్వీట్ల కు అంతే రీతిలో జవాబు చెప్పారు తెలుగుదేశం శ్రేణులు.. ఆ రోజు సోనియాని తిట్టి ఈ రోజు కలుస్తున్నారు అంటే, నువ్వు, నీ అయ్యా సోనియా కంటే ఘోరం అని అర్ధం, అందుకే పెద్దగీత, చిన్న గీత అన్నట్టు, ఎవరి వల్ల తెలుగు జాతికి నష్టమో, ఎవరి వల్ల తెలంగాణా సమాజం నాశనం అవుతుందో, తెలుగుజాతిని దెబ్బ తీసే మోడీతో కలిసి కుట్ర చేస్తున్న వాళ్ళని ఎదుర్కోవటానికి, శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి, కాంగ్రెస్ తో కలిసారు అని కౌంటర్ ఇచ్చారు.

ktr 10102018 3

అంతే కాదు, కేటీఆర్ లాగే, ఆ రోజుల్లో, కెసిఆర్ సోనియా గాంధిని పొగిడిన పేపర్ క్లిప్పింగ్స్ చూపిస్తూ ట్వీట్ చేసారు. సోనియా గాంధీ తెలంగాణా పాలిట దేవత అన్న కెసిఆర్ మాటలు, ఆ రోజుల్లో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వటానికి తనకి పిసిసి పదవి కావాలని లాబీ చేసన పేపర్ క్లిప్పింగ్, హరీష్ రావు మేము కాంగ్రెస్ లో పార్టీని కలిపెస్తాం అన్న పేపర్ క్లిప్పింగ్, ఇవన్నీ ట్వీట్ చేసి, చంద్రబాబుని అనే ముందు, మీ బ్రతుకు ఏంటో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ తో, 2009లో తెలుగుదేశం పార్టీతో, 2014 నుంచి బీజేపీ, ఎంఐఎంతో కలిసి పని చేసిన మీకంటే రాజకీయ వ్యభిచారులు ఎవరూ లేరని కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read