ఒకప్పుడు చంద్రబాబు నీటి కుంటలు అంటే నవ్విన వారు, తాజగా చంద్రబాబు పంట కుంటలు అన్నా నవ్వారు.. కాని, కేంద్ర ప్రభుత్వం ఈ పంట కుంటల ప్రాముఖ్యత గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఈ పంట కుంటల తవ్వకం మొదలు పెట్టమని రాష్ట్రాలని కోరింది. దేశమంతా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వుతున్నాం అని చెప్పి, లక్ష వరకు పంట కుంటలు తవ్వారు. కాని మన రాష్ట్రంలోని ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష పంట కుంటలు తవ్వి, దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేసారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకప్పుడు అనంతపురం అంటే, కరవుకు నిదర్శనంలా నిలిచే ప్రాంతం. తీవ్ర వర్షాభావం. 500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి. కానీ, ఇలాంటి ప్రదేశంలో పాతాళ గంగ పై పైకి వస్తుంది. జిల్లాలో వ్యవసాయ భూముల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా పంట కుంటలు తవ్విస్తున్నారు.

farm ponds 09102018 2

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో పడిన ప్రతి వాన చినుకునూ ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేస్తుండడంతో, అనంతపురానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లాలో ‘లక్ష’ పంట సంజీవని సేద్యపు కుంటలు నిర్మించి రికార్డు సొంతం చేసుకుంది. సోమవారం నాటికి 1,00,405 కుంటలు తవ్వడం పూర్తయింది. నాలుగేళ్లలో ఈ ఘనత సాధించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగేళ్లల్లో 5,81,898 కుంటలను తవ్వారు. ఇందుకు రూ.2,225.5 కోట్లు వెచ్చించారు. 94 వేల కుంటలతో చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. సామాజిక ఉద్యమంలా మొదలై సేద్యపు కుంటల తవ్వకం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సామాజిక ఉద్యమంలా ఆరంభమైంది.

farm ponds 09102018 3

ప్రతి రైతు తమ పొలంలో కుంటను తవ్వుకునేలా చైతన్యం కల్పించారు. జిల్లాలో తొలి ఏడాది 2,075 కుంటలను తవ్వారు. 2016-17లో అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌, పీడీ నాగభూషణం ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏడాదే 54,272 సేద్యపు కుంటలు తవ్వించి రికార్డు నెలకొల్పారు. 2017-18లో 25,790 కుంటలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోమవారం(8న) నాటికి 18,268 కుంటలు పూర్తి చేసి.. లక్ష కుంటలు తవ్వాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇందుకోసం రూ.542.58 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో లక్ష కుంటల తవ్వకాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్‌ అభినందనలు తెలియజేసినట్లు డ్వామా పీడీ జ్యోతిబసు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఇద్దరూ ఏపిలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకు తిరుగుతున్నారు... తీరా చూస్తే ఇక్కడ ప్రజా సమస్యల పై మాత్రం వీరికి పట్టదు.. ఒకతనేమో సియం అయ్యేదాకా ఏమి చెయ్యను అంటాడు.. ఇంకో అతను, చంద్రబాబు మళ్ళీ సియం అవ్వకుండా చెయ్యటమే నా పని అంటాడు... వీళ్ళ ఇద్దరు చిందులు గత పది రోజులుగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాయి. ఒకాయన చింతమనేని నామస్మరణ చేస్తుంటే, ఇంకో అతను లోకేష్ నామస్మరణ చేస్తున్నాడు. వీరికి తన పని తాను చేసుకుపోయే చంద్రబాబే సాఫ్ట్ టార్గెట్. కెసిఆర్ ఆంధ్రా వారి పై అన్ని మాటలు అంటున్నా నోరు మెదపరు. 7 మండలాలు మన హక్కు, సీలేరు ప్రాజెక్ట్ మనది, మన విద్యుత్ వాడుకుని మనల్నే కెసిఆర్ తిడుతుంటే, ఈ ఇద్దరికీ కెసిఆర్ పేరు తలిచే దమ్ము లేదు..

jagn 09102018 2

కెసిఆర్ సంగతి సరే.. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు హైదరాబాద్ లో బ్రతకాలి కాబట్టి, భయపడుతున్నారు అనుకోవచ్చు.. మరి కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఎందుకు మాట్లడరు ? ఒకరికి కేసుల భయం, మరొకరికి పెన్ డ్రైవ్ ల భయమా ? నిన్న కేంద్రం, మన రాష్ట్ర ప్రజలని ఎలా కవ్వించిందో అందరూ చూసారు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం.. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(అవిభక్త) అభివృద్ధికి ప్రత్యేక సాయం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తాజాగా రూ.450 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.

jagn 09102018 3

2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది. కేంద్రం చర్యపై రాష్ట్రం ఇప్పటికే తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేసింది. దీనిపై చీమ కుట్టినట్టయినా లేని కేంద్రం మరోసారి ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేసింది. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు పైసా ఇవ్వకపోవడం, 2017-18కి సంబంధించిన బకాయిలు రూ.350 కోట్ల గురించీ పట్టించుకోకపోవడం కేంద్రం కక్ష సాధింపునకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఇంత జరుగుతున్నా, ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్, పవన్, ఇలాంటి విషయం పై కేంద్రాన్ని నిలదియ్యాలి అంటే భయం.. కేంద్రం పై ఆందోళన చెయ్యాలి అంటే భయం.. కాని కుల గొడవలు పెట్టటానికి మాత్రం చింతమనేని నామస్మరణ మాత్రం చేస్తారు.. వీళ్ళు దమ్ముల గురించి మాట్లడతారు....

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడు, ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు కుమారుడు శ్రీహర్ష మరణ వార్త పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కొమ్మినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో రెండు రోజుల కిందట మృతిచెందారు. రెండేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీహర్ష కెనడాలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొద్ది రోజుల క్రితమే కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు కెనడాకు వెళ్లారు.

kommineni 08102018 2

అయితే, ఆరోగ్యం మరింత విషమించడంతో శ్రీహర్ష కెనడాలోనే మృతి చెందారు. దీంతో కొమ్మినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. అలాగే, పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడి భార్య రైలు ప్రమాదంలో మృతిచెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. వెంకటరాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇద్దరు సీనియర్‌ పాత్రికేయులు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

kommineni 08102018 3

మంత్రి నారా లోకేష్ కూడా, సంతాపం తెలిపారు. ఒకే రోజు ఇద్ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల కుటుంబానికి తీర‌ని శోకం మిగ‌ల‌డం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్ విచారం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, రాజ‌కీయ విశ్లేష‌కులు కొమ్మినేని శ్రీనివాస‌రావు త‌న‌యుడు కొమ్మినేని శ్రీహ‌ర్ష మ‌ర‌ణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని, కొడుకును క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బ‌లిగొన‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని లోకేష్ విచారం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బోగాది స‌తీమ‌ణి మృతి ప‌ట్ల విచారం.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బోగాది వెంక‌ట‌రాయుడు స‌తీమ‌ణి రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ప‌ట్ల మంత్రి లోకేష్ త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేశారు.

మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. జగన్ మెప్పు కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెయ్యని ప్రయత్నమే లేదు. చీటికీ మాటికీ కోర్ట్ లో కేసులు వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డ్యూటీ తీసుకుని, ప్రతిసారి జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అయితే ప్రతి సారి, కోర్ట్ ఆ కేసులు కొట్టేసింది అనుకోండి అది వేరే విషయం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి దగ్గర నుంచి, ఫైబర్ గ్రిడ్ దాకా, అన్నిటి పై, కోర్ట్ ల్లో కేసులు వేసి, కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.

rk 09102018

ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయం వచ్చే సరికి, మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా, జగన్ ఏ మాత్రం మాట్లాడకుండా, మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదు. ఆర్కే మాత్రం, జగన్ ఏమన్నా సహాయం చేస్తాడేమో అని అనుకున్నాడు. కాని, జగన్ మాత్రం మొండి చెయ్య చూపించాడు...

rk 09102018

దీంతో, జగన్ ని నమ్ముకుంటే పని అవ్వడాని, అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే, కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా, నీ పై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్‌ లేదని చెప్పేసినట్లు తెలిసింది. దీంతో ఆర్కే షాక్ అయ్యాడు. అందరిలా 20-30 కోట్లు ఖర్చ్ పెట్టకపోయినా, నేను నెగ్గుకు రాగాలనని, బలమైన ప్రత్యర్ధి అక్కడ లేరని, జగన్ ను ఎంత బ్రతిమిలాడినా, చూద్దాములే, ముందు అందరినీ కలుపుకు వెళ్ళు అని చెప్పటంతో, ఆర్కే షాక్ అయ్యారు. ఇటీవల, బీజేపీ, జనసేనతో అంతర్గత పొత్తులో భాగంగా, కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు ఉన్నా, వాళ్ళను తీసి, బలహీనమైన అభ్యర్ధులను జగన్ పెట్టటం చూస్తుంటే, మంగళగిరి కూడా, బీజేపీకో, జనసేనకో ఇచ్చి, స్నేహపూర్వక పోటీ చేసే ఆలోచనలో జగన ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read