రేపు విశాఖపట్నం లో 13 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్.. మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొననున్న లోకేష్.. ప్రారంభిస్తున్న కంపెనీలు ఇవే... 1.సిఈఎస్ లిమిటెడ్ (CES Limited), 110 ఉద్యోగాలు, బిజినెస్ ప్రోసెస్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సిఈఎస్ లిమిటెడ్.. 2.సెరియం సిస్టమ్స్ (cerium systems pvt ltd), 1000 ఉద్యోగాలు, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ సెక్టర్ కి గ్లోబల్ డిజైన్ సర్వీసెస్ అందిస్తున్న సెరియం సిస్టమ్స్... 3.సహస్రమయ టెక్నాలజిస్ (sahasramaaya technologies inc), 500 ఉద్యోగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్,ఐఓటి,బ్లాక్ చైన్ టెక్నాలజి సర్వీసెస్ అందిస్తున్న సహస్రమయ టెక్నాలజిస్...

it 09082018 2

4.వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, 44 ఉద్యోగాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్... 5.బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (belfrics cryptex pvt ltd), 22 ఉద్యోగాలు, డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ అందిస్తున్న బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్... 6.స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ (sweya information technologies LLP), 50 ఉద్యోగాలు, ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్,వెబ్ మరియు మొబైల్ యాప్స్ సర్వీసెస్ అందిస్తున్న స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్.. 7.ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (inn data analytics pvt ltd), 32 ఉద్యోగాలు, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్... 8.హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్( hr square staffing solutions), 100 ఉద్యోగాలు, ఎండ్ టూ ఎండ్ హెచ్ఆర్ సర్వీసెస్ అందిస్తున్న హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్

it 09082018 3

9.ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్ (inso team consulting services ), 75 ఉద్యోగాలు, బిజినెస్ సొల్యూషన్స్,ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ స్కిల్స్,సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్... 10.న్యూవి సొల్యూషన్స్ (nueve solutions LLC), 32 ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు వెబ్ అప్లికేషన్స్ సర్వీసెస్ అందిస్తున్న న్యూవి సొల్యూషన్స్... 11.వివిలెక్స్ టెక్నాలజిస్ (vivilex technologies pvt ltd), 100 ఉద్యోగాలు, హై క్వాలిటీ సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్, బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న వివిలెక్స్ టెక్నాలజిస్.. 12.ఎన్వోయ్ మోర్ట్గేజ్ (envoy mortgage), 60 ఉద్యోగాలు, మోర్ట్గేజ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తున్న ఎన్వోయ్ మోర్ట్గేజ్... 13.హిప్పో క్యాంపస్(hippo campus), 250 ఉద్యోగాలు, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తున్న హిప్పో క్యాంపస్..

it 09082018 4

విస్తరణ... 1.సింబయోసిస్ (symbiosis ), 100 ఉద్యోగాలు, ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సింబయోసిస్.. 2.ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ (inspire edge it solutions pvt ltd ), 200 ఉద్యోగాలు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్,టెలికాం ఎక్సపెన్స్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్... 3.కాన్డ్యూయెంట్ (conduent ), 5000 ఉద్యోగాలు, బీపీఓ సర్వీసెస్ అందిస్తున్న కాన్డ్యూయెంట్... 4.పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ ( patra india bpo services pvt ltd ), 1600 ఉద్యోగాలు, బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న కుంభకోణం... బోఫోర్స్‌ కంటే చాలా పెద్దదని కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి ఆరోపించారు. అటల్‌ బిహారీ వాజపేయీ హయాంలో మంత్రులుగా పనిచేసిన ఈ ఇద్దరూ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఈ కుంభకోణం గురించి వివరాలు వెల్లడించారు. రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందం ఓ భారీ కుంభకోణమని, ఏకంగా దేశ భద్రతతోనే కేంద్రం రాజీపడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదేపదే చేస్తున్న ఆరోపణలను మరికాస్త ముందుకు తీసికెళుతూ- వారు ప్రధాని మోదీనే నేరుగా టార్గెట్‌ చేశారు.

raffeel 09082018 2

ప్రధానే స్వయంగా ఒప్పందపు రూపురేఖల్ని మార్చేశారని, కాంట్రాక్టు ఖరారులో రూల్స్‌ను కాలరాశారని ఆరోపించారు. రాఫెల్‌తో పోలిస్తే బోఫోర్స్‌ కుంభకోణం అసలు లెక్కలోకే రాదన్నారు. ఒప్పందంలో నిబంధనల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తుంగలో తొక్కారనీ ఆరోపించారు. రాఫెల్‌ ఒప్పందంలో రూ.35,000 కోట్ల ప్రజాధనాన్ని కోల్పోయామని ప్రశాంత్‌ భూషణ్‌ చెప్పారు. రూ.8000 కోట్ల నష్టాల్లో ఉంటూ విమానాల తయారీలో అనుభవం లేని రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీకి ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. కాగా, ఈ ఒప్పందంలో 126 యుద్ధ విమానాల సంఖ్యను ఏకంగా 36కు తగ్గించివేశారని, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు కూడా తెలుపకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

raffeel 09082018 3

‘ఇది నేరపూరిత దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఉద్దేశపూర్వకంగా చేసిన పని. అసలే క్షీణిస్తున్న రక్షణ బడ్జెట్‌పై ఒత్తిడి పెంచే చర్య. దేశ భద్రతను దెబ్బతీసే చర్య’’ అని వారిరువురూ మోదీ సర్కార్‌ను తీవ్రంగా అభిశంసించారు. ‘‘నేను గతంలో బోఫోర్స్‌ కుంభకోణాన్ని వెలికితీశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. రాఫెల్‌ ఒప్పందం బోఫోర్స్‌ కంటే పెద్దది. ’’ అని అరుణ్‌ శౌరి పేర్కొన్నారు. అటల్‌ బిహారీ వాజపేయీ హయాంలో ఈ ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. రహస్యం గా ఉంచేందుకు ప్రభుత్వం యత్నిస్తున్న విషయాలను బయ టికి తీసుకురావాల్సిన పని పాత్రికేయులదేనని అన్నారు.

raffeel 09082018 4

యశ్వంత్‌ సిన్హా లేవనెత్తిన ప్రశ్నలివీ.. అసలు ఒప్పందాన్ని రద్దు చేసి 36 యుద్ధవిమానాలు కొంటే చాలని వైమానికదళం ప్రభుత్వాన్ని కోరిందా? అంచనాలను వైమానిక దళం పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ 36 విమానాలకు ఒప్పుకుందా? కొత్త ఒప్పందానికి టెండర్లను ఎందుకు పిలవలేదు? 2007 నాటి ఆర్‌ఎ్‌ఫపీ, ఏడేళ్ల పాటు సాగిన చర్చలు.. అన్నీ రద్దు చేసేశారా? ప్రధాని ప్రకటనతో హెచ్‌ఏఎల్‌ను బయటికి తోసేసినట్లయింది. అది మేక్‌ ఇన్‌ ఇండియాకు విరుద్ధం కాదా? యుద్ధ విమానాల తయారీలో విశేషానుభవం ఉన్న దసాల్ట్‌ లాంటి సంస్థ అనుభవం లేని రిలయెన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను తన పార్ట్‌నర్‌ చేసుకుంటుందా? ఈ ఒప్పంద వివరాలను బహిర్గత పర్చరాదన్న వాదనలోనూ పసలేదు. వీటి సామర్థ్యానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినా ధర వివరాల్ని బయటపెట్టవచ్చు. ఎందుకలా చేయలేదు?

మల్టీప్లెక్స్‌... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు... ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు... నియంత్రణ లేక, అడిగేవారు లేక చలరేగిపొతూ ఉంటారు... కనీసం మంచి నీళ్ళు కూడా లోపలకి తీసుకు వెళ్ళనివ్వరు... లోపల కొందాం అంటే MRP మీద, నాలుగు అయిదు రెట్లు ఎక్కువ అమ్ముతారు.. ఏదైనా తిందాం అంటే, కనీసం 250 రూపాయలు పెట్టాలి... అయితే ఇప్పుడు ఈ దోపిడీకి చెక్ వినియోగదారుల ఫోరం. పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని, మాల్స్‌లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని ఆదేశించారు...

multiplex 09082018 2

విజయవాడలో మల్టీప్లెక్సుల్లో అధిక ధరలకు ఆహార పదార్థాల అమ్మకంపై వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు చెప్పింది. ఐదు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు వినియోగదారుల ఫోరం జడ్జి మాధవరావు రూ.5లక్షల భారీ జరిమానా విధించారు. అలాగే ఎల్‌ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్‌, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ పై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చారు. ప్రజలు బయట నుంచి తెచ్చుకునే ఆహారపదార్థాలు, తాగునీటికి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలు తప్పక అమలు చేయాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది.

multiplex 09082018 3

విజయవాడలోని కొన్ని మల్లీఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు మార్గదర్శక సమితి సహకారంతో గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఎల్‌ఈపీఎల్‌, ట్రెండ్‌సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై మల్లీఫ్లెక్స్ యాజమాన్యాలు, తూనికలు, కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. గతేడాది నుంచి దీనిపై పలుమార్లు వాద ప్రతివాదనలు జరిగాయి. సమగ్ర విచారణ చేసిన న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై గురువారం సంచలన తీర్పు వెలువరించారు.

multiplex 09082018 4

నగరంలోని ఐదు థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎమ్మార్పీ కంటే మూడురెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లు న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. దీంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలను ఆదేశించారు. ఒక్కక్కరికి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.25లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రెండు నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని తీర్పులో ఆదేశించారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదమని.. భవిష్యత్‌లో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని ఆదేశించారు.

నూటయాభై దేశాల్లో పరిశ్రమలున్న జపాన్‌ సంస్థ లిక్జిల్‌ భారత్‌లో తొలిసారి పశ్చిమగోదావరి జిల్లాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని భీమడోలు మండలం అంబరుపేటలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటు చేసిన నీరు, గృహావసరాల (శానిటరీ వేర్‌) తయారీ కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చినరాజప్ప చెప్పారు.

lixil 09082018 2

దావోస్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు లిక్జిల్‌ సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిందని వివరించారు. 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 400 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాలతో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించామని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు.

lixil 09082018 3

ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్న సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిలో 15 శాతం పురోగతి ఉంటే.. మన రాష్ట్రంలో 45 నుంచి 50 శాతం పురోగతి ఉందని వివరించారు. ఆహార రంగ యూనిట్ల ఏర్పాటులో 60 శాతం పురోగతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లిక్జిల్‌ సంస్థ అధ్యక్షుడు కిన్యాసెటో, సీఈఓ బిజోయ్‌మోహన్‌, జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌, జపాన్‌ రాయబారి హిరామట్ను, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

lixil 09082018 4

మరో పక్క, శ్రీసిటీ సెజ్‌లో మరో పారిశ్రామక సంస్థ కొలువుదీరింది. జపాన్‌, దక్షిణ కొరియా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎంసిఎన్‌ఎస్‌ పోలియూరీథేన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కిడాన్‌వాన్‌, మేనేజింగ్‌ ఎడ్యుకేట్‌ ఆఫీసర్‌ తడాని యోషినో, సిఇఒ యూజూన్‌లిమ్‌, షింగోషిబాక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఏటా 15,000 టన్నుల పోలియూరీఽథేన్స్‌ వస్తువులు తయారు చేస్తారు. ఈ ప్రారంభోత్సవంలో కంపెనీ ప్రతినిధులతోపాటు శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read