నాడు 2 రూపాయలకు కిలో బియ్యం దగ్గర నుంచి, నేటి 5 రూపాయల భోజనం దాకా... ఇది తెలుగుదేశం పేద ప్రజలకు కల్పించే ఆహార బధ్రత... ఇది ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన, ఘన నివాళి. పేదవాడికి కూడు, గూడు, బట్ట కోసం, ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అప్పట్లో జొన్న అన్నం తినే పేద కుటుంబాలకి, వరి అన్నం తినాలని, పేదలకు ఆహార బద్రత ఉండాలని, కిలో బియ్యం, రెండు రూపాయలకే ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు ఘనమైన నివాళిగా, 5 రూపాయలకే భోజనం పెడుతుంది ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్‌ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం.

anna 11072018 2

ఈ రోజు, రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పురపాలకశాఖ మంత్రి పీ నారాయణ మీడియాతో మాట్లడారు. బుధవారం నుంచి అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన శుచిరుచి కల్గిన భోజనాన్ని ఐదు రూపాయలకే అందించబోతున్నామన్నారు. రాష్ట్రం మొత్తంపై 100 మున్సిపార్టీల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించనుండగా తొలి విడతగా అధిక జనాభా కల్గిన 25 మున్సిపాల్టీల్లో 100 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, మిగిలినవి ఆగస్టు 15వ తేదీ ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ విద్యాధరపురంలో నిర్మితమైన అన్ని క్యాంటీన్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ఏక రూపంలో కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఫుడ్ కోర్ట్సు మదిరిగా అదే స్థాయిలో అంతర్గత డిజైన్లు, ఇంటర్నెట్‌తో కంప్యూటర్ సదుపాయం, ఎలక్ట్రానిక్ టోకెన్ విధానం, సీసీ కెమెరాలు లబ్ధిదారుల ముఖాలు గుర్తించే పరిజ్ఞానం, టీవీలు వీటి ప్రత్యేకత. ఈ క్యాంటీన్‌లో 50 కి.మీ పరిధిలో సరఫరా చేసేలా ఆధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది.

anna 11072018 3

ఇక మెనూ విషయానికొస్తే ఉదయం అల్పాహారం మూడు ఇడ్లీ లేదా పూరి, 25 గ్రాము ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం, రాత్రి 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబారు, 75 గ్రాముల పెరుగు పచ్చడి ఉంటుంది. రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం. ప్రతి ఆదివారం శెలవు దినం. ఇతర ఆరురోజుల్లో ఏదో ఒక రోజు స్పెషల్ రైస్. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్‌ల ద్వారా అల్పాహారం, భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ స్వీకరించింది. ప్రతి రోజూ మూడుపుటలా కల్సి కనీసం 2 లక్షల, 15వేల మంది ఉంటారని ఓ ప్రాథమిక అంచనా. ఇందుకు కోసం ప్రభుత్వం రోజుకు రూ. 75 చెల్లిస్తుంది. ఇందులో లబ్ధిదారు రూ. 15 చెల్లిస్తుండగా మిగిలిన రూ. 58లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తున్నది.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ రోజు పోలవరం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును నేడు సందర్శిస్తారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం పోలవరం పనులను వేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర మంత్రి పోలవరం సందర్శనకు రావడాన్ని అనుకూలంగా మలచుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నది. గత ఏడాది కాలంగా ఇదిగో అదుగో అంటూ గడ్కరీ పోలవరం సందర్శన కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆయన పోలవరం సందర్శనకు నేడు రానున్నారు. పోలవరం పనులకు సంబంధించి అయుదు కీలక విషయాల పై పట్టుబట్టి, హామీ తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

gadkari 11072018 2

1. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూ. 57 వేల కోట్లు కేంద్రానికి పంపింది. తక్షణం ఈ సవరించిన అంచనాలు ఆమోదం పొందడం ప్రధానం. ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. 2. పూర్తయిన పనుల్లో కేంద్రం నుంచి రూ. 2300 కోట్లు రావాల్సి ఉంది. వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అథారిటీకి బిల్లులను అందించింది. మరోవైపు స్పిల్‌వే, డయాఫ్రం వాల్‌, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం పనులకు సంబంధించి రూ.3,217 కోట్లు రావాల్సి ఉంది. జాతీయ హోదా ప్రకటించడానికి ముందు రూ. 5,135 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగా, మిగిలిన దాదాపు రూ. 11 వేల కోట్లు తామే భరిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే సమయం మించుతున్నా వాటి గురించి కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.

gadkari 11072018 3

3. సవరించిన అంచనాలు ఆమోదించే లోపు రూ.10 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేసి ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్రం కోరుతోంది. 4. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ పరంగా గతంలో ఎప్పుడో ఇచ్చిన వర్కుస్టాప్‌ ఆర్డర్‌ అప్పుడప్పుడు ప్రాజెక్టు పనులకు ఇబ్బంది కలిగిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్తర్వులకు స్టే తెచ్చుకోవాల్సి వస్తోంది. పోలవరం పనుల నిలుపుదల ఉత్తర్వులను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. 5. పోలవరంలో నిధులు ఎంత ముఖ్యమో, సకాలంలో కేంద్ర జలసంఘం ఆకృతులు ఆమోదించడమూ అంతే ముఖ్యం. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీయే పని చేస్తోంది. ఎప్పటికప్పుడు వారి సూచనలకు అనుగుణంగా గుత్తేదారులు ఆకృతులు సమర్పిస్తున్నారు. ఆకృతులు ఆమోదం పొందకపోవడం వల్ల కాంక్రీటు మొదటి బ్లాకులో పని ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే త్వరతిగతిన, ఆమోదం ఇవ్వాలని గడ్కరీని ప్రభుత్వం కోరనుంది.

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈయనను కూడా, ఆంధ్రప్రదేశ్ తర్లలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, రెండు రోజుల క్రితం కత్తి మహేష్ ను కూడా ఇలాగే హైదరాబాద్ నుంచి, చిత్తూరు తరలిస్తుంటే, ఆంధ్రపదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడకు తరలిస్తే, మేము తీసుకొచ్చి, మళ్ళీ హైదరాబాద్ లోనే పడేస్తాం అని చెప్పటంతో, కత్తి మహేష్ ను కర్ణాటకలోని బంధువుల ఇంట్లో దింపారు. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి విషయంలో కూడా, హైదరాబాద్ పోలీసులు, ఆంధ్రాకు తరలిస్తాం అని చెప్తూ ఉండటంతో, ఆంధ్రా పోలీసులు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

pariporana 11072018 2

గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ విధించడం గమనార్హం.

pariporana 11072018 3

ఇందులో భాగంగా.. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపినట్లు తెలుస్తోంది. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు. అయితే, హైదరాబాద్ లో తప్పు చేసినప్పుడు, శిక్ష వెయ్యకుండా, ఇలా బహిష్కరణ అంటూ, అక్కడ నుంచి తీసుకువచ్చి, ఆంధ్రపదేశ్ లో విడిచి పెట్టటం ఏంటో, ఎవరికీ అర్ధం కావటం లేదు. తప్పు ఎక్కడైనా తప్పే కాబట్టి, నిజంగా తప్పు చేస్తే, చట్టం ప్రకారం శిక్షలు వేసుకోవాలి.. దీని వెనుక ఏమి వ్యూహం ఉందో మరి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అయితే, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఈ సంవత్సరం కూడా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రం మళ్లీ సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ లో నిలవగా, తెలంగాణా రెండో స్థానంలో వచ్చింది. 2016 జూలై నుంచి ఈ సంవత్సరం జూలై వరకు వివిధ ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డిఐపిపి) మంగళవారం విడుదల చేశాయి. ఈ సారి ఈ జాబితాలో 98.42 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ సులభతర వ్యాపారానికి దేశంలో అత్యంత అనువైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఎపితో కలిసి మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ, ఈసారి 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది.

lokesh ktr 11072014 2

అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఫై, కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు తప్పిందన్నారు. అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. "We missed the 1st spot in EODB rankings 2018 by a whisker; 0.09% Nevertheless, inspirational leadership from @TelanganaCMO Garu & good work by our bureaucracy has resulted in a good rank this year too???? Congratulations to Andhra Pradesh led by @ncbn Garu on topping the list ????"

lokesh ktr 11072014 3

దీని పై లోకేష్, కేటీఆర్ కు రిప్లై ఇచ్చారు ‘ఈ విషయంలో మీకు కూడా అభినందనలు .. మేము నెంబర్ వన్, మీరు నెంబర్ టూ కాదు.. రెండు రాష్ట్రాలూ అగ్రస్థానంలో నిలిచాయి. తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే’ అంటూ ఆయన పేర్కొన్నారు. "Congratulations to you too . There's no "One and Two". There's only "Telugu states at the top". All for the good of Telugu people.". లోకేష్ రిప్లై తో, అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్ ఎప్పుడూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నిన్న మాత్రం, కేటీఆర్ అభినందనలు తెలపటం, దానికి లోకేష్, రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉండాలి అంటూ ట్వీట్ చేసి, తెలుగు వారు అందరూ కలిసికట్టుగా ఉంటే, ఈ దేశంలో టాప్ గా ఉండవచ్చు అనే విషయం చెప్పకనే చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాలు, ఇలాగే అభివృద్ధిలో పోటీ పడుతూ, ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల మార్క్ చూపించాలి అని కోరుకుందాం..

Advertisements

Latest Articles

Most Read