కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి సమీక్ష చేసారు. నితిన్ గడ్కరీతో పాటు, సీఎం చంద్రబాబు కూడా పోలవరంలో పర్యటించారు. పోలవరం స్పిల్ వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి పై గడ్కరీకి చంద్రబాబు వివరించారు. తరువాత, ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో, నితిన్ గడ్కరీ మాట్లాడిన మాటలతో, రాష్ట్ర బీజేపీ నేతలు ఫీజులు ఎగిరిపోయాయి. ప్రతి రోజు, పోలవరం పై రాష్ట్ర బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నారని, అసలు పోలవరంలో ఏమి పనులు జరగటం లేదని, ఇంకో రోజు పోలవరం మోడీ వేసిన భిక్ష అని, ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లడటం చూస్తున్నాం. అయితే, వారికి సామాధనంగా, వారి సొంత పార్టీ మంత్రే, ఈ రోజు చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు.

gadkari 11072018 2

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించారని, నేను పోయిన సారి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా ఉందని, రిమార్కబుల్ అంటూ చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, చంద్రబాబు సంకల్పం తనను ఆశ్చర్యపరుస్తోందని గడ్కరీ పొగడ్తలు గుప్పించారు. ఎంత పెద్ద మిషనరీ ఉన్నా, వనరులు ఉన్నా, చంద్రబాబు లాంటి పట్టుదల ఉన్న వారు ఉంటేనే, ఇలాంటి ప్రాజెక్ట్ లు పూర్తవుతాయి అన్నారు. ఇంతకు ముందే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించాల్సి ఉంది, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవేంటో మీకు తెలుసు అంటూ గడ్కరీ చమత్కరించారు.

gadkari 11072018 3

నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో రైతుగా తనకు తెలుసునని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏప్రిల్‌ నాటికి సివిల్స్‌ వర్క్స్‌ పూర్తిచేస్తామని అధికారులు అన్నారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించానన్నారు. పోలవరానికి నిధుల సమస్య లేదన్నారు. ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం అడిగారని, ఆర్థికశాఖతో చర్చిస్తాననని వెల్లడించారు. సహాయ, పునరావాసంలో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమని, పోలవరాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్నారు. సవరించిన అంచనాలపై ఆర్థిక శాఖ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఫైబర్ టెక్స్టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సెన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్ కు చెందిన టోరే సంస్థ ఏర్పాటుకు శ్రీసిటీలో బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అమరనాథ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శ్రీసిటీలో 110 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ పరిశ్రమలో రెండు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించనున్నారు. ఒకదానిలో వ్యక్తిగత పరిశుభ్రతకు వాడే డైపర్ల తయారీకి అవసరమైన పాలిప్ రొపిలిన్ ఫైబర్ వస్త్రం (టెక్నికల్ టెక్స్టైల్), రెండవ దానిలో ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ప్లాస్టిక్ రెజిన్ తయారు చేయనున్నారు.

tero 11072018 2 1

ఈ రెండు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం 2020 నాటికి పూర్తి కానుంది. కాగా, టోరే సంస్థకు ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల వ్యాపార కేంద్రాలున్నాయి. 2016లో గుజరాత్ లోని వాపిలో మోటార్ వాహనాల్లో వాడే ఎయిర్ బ్యాగుల ఉత్పత్తి సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించి సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భూమి పూజకు టోరే ఇండస్ట్రీస్ సీఈవో అకిహిరో నిక్కాకి, టోరే ఇండస్ట్రీస్ ఇండియా ఎం.డీ. షిగెకజు సునేగ జపాన్ వాణిజ్య రాయబారి యుచియామ, శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎం.డీ. రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.

tero 11072018 3 1

ప్రపంచంలోని వెయ్యి భారీ పరిశ్రమల్లో ఒకటిగా టోరేకు గుర్తింపు ఉంది. ఈ సంస్థను 1926లో ప్రారంభించారు. ఆ సంస్థ మన దేశంలో ఒక మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పటికే ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌, కింబర్లీ క్లార్క్‌, యూనీచార్మ్‌ వంటి సంస్థలు డైపర్ల తయారీలో ఉన్నాయి. వీటికి టోరే ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తాయని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులు, గత సంవత్సరం ఆగష్టు లో చంద్రబాబుని కలిసారు. అప్పట్లో, ఈ సంస్థ భారీ పెట్టుబడి పెడుతుంది అని వార్తలు రాస్తే, కొంత మంది ఎగతాళి చేసారు. సంవత్సరం తిరగకుండా, ఈ రోజు శంకుస్థాపన చేసారు. అందుకే ఏపి కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది.

ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ తో గొడవ పెట్టుకుని, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని న్యూస్ చానల్స్ చేత కవరేజ్ లేకుండా చేసుకున్న పవన్ కళ్యాణ్, తనకంటూ ఒక మీడియా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ విషయం పై, పవన్ కళ్యాణ్ దేవ్ టీం, తన సినిమా ఫాన్స్ అందరికీ మెసేజ్ పెట్టి, ఇక నుంచి మనం ఆ ఛానల్ మాత్రమే చూడాలి అంటూ మెసేజ్ లు కూడా పెట్టింది. గతంలో ఒక కమ్యూనిస్ట్ న్యూస్ ఛానల్ టేక్ ఓవర్ చేస్తారని, వార్తలు వాచ్చాయి. అయితే, చివరి నిమిషంలో ఆ డీల్ కాన్సల్ అయ్యింది. తరువాత మానేం ఒక సొంత న్యూస్ ఛానల్ మొదలు పెడదాం అని మెగా ఫ్యామిలీ అనుకుంది, కాని అదీ వీలు పడలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో, ఎదో ఒక న్యూస్ ఛానల్ కావాలనే ఉద్దేశంతో, ఇప్పటికే ఉన్న 99 న్యూస్ చానెల్ ని పవన్ కళ్యాణ్ టేక్ ఓవర్ చేసారు.

janasena 11072018 2

ఈ రోజుతో 99 న్యూస్ చానెల్ కు కొత్త మ్యానేజ్మెంట్ వచ్చింది. అదే విషయం వారి టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ రోజు కొత్త మ్యానేజ్మెంట్ వచ్చిన సందర్భంగా, పూజా కార్యక్రమాలు చేసారు. దీనిలో పవన్ కళ్యాణ్ కు భాగం ఉంది అని చెప్పే విధంగా, ఆపార్టీ నేత తోట చంద్ర‌శేఖ‌ర్, మిగతా జనసేన నాయకులు కూడా ఈ రోజు జరిగిన పూజల్లో ఉన్నారు. దీనిని బట్టి, ఇది పవన్ కళ్యాణ్ టేక్ ఓవర్ ఛానల్ గా దృవీకరించవచ్చని, అంటున్నారు. అయితే, ఈ ఛానల్ కోసం, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు మ్యానేజ్మెంట్ బోర్డు లో ఉంటారు, రోజు వారీ కార్యక్రమాలు చేసేది ఎవరు అనే విషయాల పై క్లారిటీ రావాల్సి ఉంది. న్యూస్ వేవ్ మీడియా పేరుతో 99చానెల్ న‌డ‌ప‌బోతున్న‌ట్టు ఆ ఛానల్ లో స్క్రోలింగ్ వస్తుంది.

janasena 11072018 3

అయితే, ఎన్నికల వరకు మాత్రమే, ఇది జనసేన చేతిల్లో ఉంటుంది అని, తరువాత పరిస్థితిని బట్టి చూస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ వార్తా తెలియటంతో పవన్ అభిమనులు కేరింతలు కొడుతున్నారు. ఇక టీవీ రంగాన్ని ఊపేస్తాం అంటూ హడావిడి చేస్తున్నారు. నిజానికి, ప్రతి రాజకీయ పార్టీకి ఛానల్ అనేది ఈ రోజుల్లో చాలా సాధారణంగా ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి స్థాపించిన సాక్షి, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని సియం ను చెయ్యటానికి, నానా పాట్లు పడుతుంది. కేవలం టీవీల్లో చెప్పే మన సొల్లు నమ్మేసి, ప్రజలు మనకు ఓట్లు వేసేస్తారు అనుకోవటం, మన పిచ్చి తనం. ఇలా అనుకునే వారికి, సాక్షి టీవీ నే ఒక ఉదాహరణ. టీవీలతో, ట్విట్టర్ లతో సియంలు అయిపోతే, ఇంకా ప్రజల అభిప్రాయలు ఎందుకు ?

మనం ఉండే ప్రపంచంలో, మన చుట్టూ చూస్తూ ఉంటాం... మనం మంచిగా ఉన్నా, సంతోషంగా ఏదన్నా పండగ చేసుకున్నా, మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు.. వాళ్లకి చేత కాదు, మనం కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ, మనం సాధిస్తే మాత్రం, మన మీద పడి ఏడుస్తారు... ఇంకా తేలిక బాషలో చెప్పాలి అంటే సైకోలు అంటారు.. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ లెక్క అనమాట... మనం సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తారు, మనం బాధపడుతూ ఉంటే వారు నవ్వుతారు.. ఇలాంటి వారు సమాజంలో అన్ని చోట్లా ఉంటారు. మన కుటుంబాల్లో, ఆఫీసుల్లో , స్నేహితుల్లో, చివరకు రాజకీయాల్లో కూడా... మన రాష్ట్రంలో అయితే, ఇంకాస్తా ఎక్కువ..

gvl 11072018 2

మొన్నటి దాక జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఈ క్యాటగిరీలో ఉండే వాడు. అప్పట్లో వైజాగ్ కి హూద్ హూద్ వస్తే, మా విజయమ్మను ఓడించిన మీకు, తగిన శాస్తి జరిగిందని సంతోషించారు... ఇలాంటి సందర్భాలు ఎన్నో... ఇప్పుడు జగన్ కు తొడు చాలా మంది తయారయ్యారు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇలాంటి వారు వస్తూ ఉంటారు... ఇందులో ఒకాయిన, కొత్తగా ఈ మధ్య తెర మీదకు వచ్చిన జీవీఎల్ నరసింహారావు... గుజరాత్ వీర భక్తుడు... గుజరాత్ మీద ప్రేమ చూపించే ప్రయత్నంలో, సొంత రాష్ట్రాన్ని కూడా, తక్కువ చేసి మాట్లాడే ఘనుడు... నిన్న ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

gvl 11072018 3

ఈ నేపధ్యంలో ఐటి మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేసారు. మనం మళ్ళీ సాధించాం, ఈ సారి కూడా మనమే నెంబర్ వన్ అంటూ ట్వీట్ చేసారు. దీని పై, మన ఏడుపుగొట్టు జీవీఎల్, ఏడుపుగొట్టు ట్వీట్ చేసారు. "‘‘ఔను మీరు సాధించారు. సులభతర అవినీతి బాగుంది. దేశంలోనే రెండో అవినీతి రాష్ట్రంగా చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు" అంటూ, ఎప్పుడో వచ్చిన సర్వే చూపించి, ఆంధ్రప్రదేశ్ ను తక్కువ చేసి ట్వీట్ చేసారు. నెల రోజుల క్రితం కూడా, మనం అవినీతిలో చివరి స్థానంలో ఉన్నాం అని సర్వే వచ్చినా, ఈ ఏడుపుగొట్టు బ్యాచ్ కు అది కనిపించలేదు. కడుపు మంట, ఉక్రోషం ఇలా తీర్చుకున్నారు. ఈ ట్వీట్ కు, చాలా మంది నెటిజెన్లు జీవీఎల్ కు గడ్డి పెట్టారు. అయినా వీరికి సిగ్గు ఉంటేగా... అయ్యా ఏడుపుగొట్టు బ్యాచ్, ఈ ర్యాంకు వచ్చింది, తెలుగుదేశం పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...

Advertisements

Latest Articles

Most Read