చంద్రబాబు వెంటనే రాజీనామా చేసే, నాతో కలిసి పోరాడాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై, మంత్రి యనమల స్పందించారు. మూడు పార్టీల లాలూచీ పై ధ్వజమెత్తారు. చంద్రబాబును రాజీనామా చేయమనడం మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగమని అన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధంగా లేదని తెలుసుకుని, ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలివితేటలు చూపిస్తున్నారని అన్నారు. అక్కడ అమిత్ షా ఏమి చెప్తే, అది ఇక్కడ పవన్ కళ్యాణ్ చెయ్యల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయినా పోరాటం చెయ్యాలి అంటే, ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి రావాలా అని ప్రశ్నించారు యనమల.

pavan 07072018 2

ఏపి ప్రయోజనాల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేసారు. టిడిపిని ఎలా ఓడించాలా అనేదే జగన్, పవన్ ఆలోచనలని, ఇద్దరూ నరేంద్ర మోది డైరక్షన్ లో గోతులు తవ్వుతున్నారు అని అన్నారు. వాళ్లిద్దరూ మోది, అమిత్ షాలపై నోరు తెరవరు, అటువంటి పార్టీలతో టిడిపి ఎలా కలిసి పోరాటం చేస్తుంది అని ప్రశ్నించారు. మోదిని చూసి చంద్రబాబు భయపడుతున్నట్లు పవన్, జగన్ వ్యాఖ్యలు పెద్ద జోక్ అని, ఇద్దరూ కలిసి, ఈ మధ్య ఒకటే డైలాగ్ మాట్లాడుతున్నారని అని అన్నారు.

pavan 07072018 3

"ప్రధానమంత్రిని చూసి ఏ ముఖ్యమంత్రి అయినా భయపడతారా..? భయపడితే 12ఛార్జిషీట్ల ప్రధాన నిందితుడు భయపడాలి. ఐటి దాడులు చేస్తారని అక్రమార్జన చేసేవారు భయపడాలి. జగన్,పవన్ లకే భయం ఉంటుంది కాని చంద్రబాబుకు ఎందుకు భయం ఉంటుంది..? మూడు ధర్మపోరాట సభల్లో మోదిని నిలదీసింది చంద్రబాబు కాదా..? బిజెపి మోసాన్ని ఎండగట్టింది చంద్రబాబు కాదా...? బిజెపి నమ్మకద్రోహాన్ని దేశం మొత్తం చాటింది చంద్రబాబు కాదా..? రాజీనామా చేసిన వైసిపి ఎంపిల వల్ల ఏం ప్రయోజనం వచ్చింది..?గోదా వదిలేసి పారిపోతే పోరాటంలో ఏవిధంగా గెలుస్తారు..? అందరూ రాజీనామా చేస్తేనే తాను పోరాటంలో దిగుతాను అనడం పిరికితనానికి పరాకాష్ట పోరాటంలో ముందుండాలి. పారిపోవడం వీరత్వం కాదు. ఇక్కడ జగన్, పవన్ అక్కడ నరేంద్ర మోది, అమిత్ షా, నలుగురి అజెండా టిడిపిని ప్రజలకు దూరం చేయడమే. ఆంధ్రప్రదేశ్ పాలిట దుష్టచతుష్టయంగా మారారని" ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజంమెత్తారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాక ముందే, ఏయ్ చంద్రబాబు, దండయాత్రకు వస్తున్నాం అంటూ, ఛాలెంజ్ విసిరిన రాం మాధవ్ పరిస్థితి, తారు మారు అయినా, ఇతని అహంకారం మాత్రం అలాగే ఉంది. కాశ్మీర్ లో ఒక విఫల ప్రయోగం చేసి, విఫల పురుష్ గా పేరు తెచ్చుకున్నా, అహంకారంతో కూడిన వెటకారం అలాగే ఉంది. నిన్నటికి నిన్న, తెలంగాణాలో, ఇక్కడ ఎమ్మల్యేలు మగాళ్ళు కాదా అంటూ, జుబుక్సాకరంగా మాట్లడారు. ఒక జాతీయ నాయకుడు, అందునా సంఘ్ నుంచి వచ్చాను, నాకు విలువులు ఉన్నాయి అని చెప్పుకునే నాయకుడు, ఇలా మాట్లాడుతుంటే, తన అహంకారాన్ని ఎలా ఉందో చూపిస్తుంది. అయితే దేశాన్ని మొత్తం కబలించాలి అనే ఏకైక ధ్యేయంతో, రాం మాధవ్ లాంటి వ్యక్తి మాటలు విశ్వసించి, అమిత్ షా, మోడీ చేస్తున్న పనుల వల్ల ఇలాంటి వారి అహంకారం మాత్రం అలాగే ఉంది.

lokesh 07072018 2

తెలుగుదేశం పార్టీ ముందస్తు జమీలీ ఎన్నికలకు ఒప్పుకోదు అనే ఒక వార్తా NDTV రాసింది. దాన్ని ట్యాగ్ చేసుకుని, ముందస్తు ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోకపోవడమే మోదీ పాపులారిటీ పెరిగిందనడానికి నిదర్శనం అంటూ రాంమాధవ్ ట్వీట్ చేశారు. దీనికి లోకేష్ ధీటైన జవాబు ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన బీజేపీకి.. ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిందని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటూ తొందర పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా మోదీ పాపులారిటీ అంటూ లోకేష్ ప్రశ్నించారు.

lokesh 07072018 3

ఇటీవలి కాలంలో బీజేపీ నేతల ట్వీట్లకు మంత్రి లోకేష్ సూటిగా కౌంటర్లు ఇస్తున్నారు. విభజన హామీలపైనా... కమలనాథులు చేసే కామెంట్లపైనా.. ఇప్పుడు జమిలి ఎన్నికలపైనా ట్విట్టర్ వేదికగా జవాబిచ్చారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నారు. మొన్న జీవీఎల్ చేసిన బ్రోకర్ వ్యాఖ్యలకు కూడా లోకేష్ సవాల్ విసిరారు. నేను ఏ మంత్రిని కలిసానో, ఆ మంత్రి పేరు చెప్పు అని జీవీఎల్ కు ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేసారు. దీనికి, జీవీఎల్ స్పందిస్తూ తొందరలోనే, ఆ పేరు చెప్తా అని తప్పించుకుంటే, దానికి కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చి, క్రియేటివ్ గా అలోచించి చెప్పాలా , సరే నేను ఎదురు చూస్తా ఉంటాను అని చెప్పి, 4 రోజులు అవుతున్నా జీవీఎల్ అడ్రస్ లేడు...

 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ బ్యానర్ ప్రజల్లోకి వచ్చిన అనతికాలంలో ఆయన అంతర్మథనం ఎవరికీ అంతుపట్టడం లేదు. పవన్ ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారని చిరంజీవి స్థాపించిన పార్టీ పిఆర్పీ కంటే చాలామెరుగ్గా ఉంటుందని రాజకీయ నేతలు ఊహించారు. ప్రత్యేక హోదా, కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులు తదితర వ్యవహారాల పై కేంద్రంతో ఢీ కొనడానికి పవన్ ఏర్పాటు చేసిన జెఎఫ్ సి నేతలు పలుమార్లు సమావేశమై తీర్మానించిన అంశాలన్నింటినీ పవన్ ప్రక్కనపెట్టి జేఎఫ్ సి తీర్మాణాల ఊసే కన్పించకపోవడం, కేంద్రంపై పవన్ రాజీధోరణిలో వ్యవహా రిస్తూ టిడిపినే టార్గెట్ చేసుకోవడంపై జెఎఫిసీ తమ సీను పక్కదారి పట్టిందని సీనియర్ నేతలు పవన్ వ్యవహారం పై అసంతృప్తితో ఉన్నారు.

janasena 07072018 2

పవన్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు అయినా ప్రజల్లోకి ఇటీవలే వచ్చారు. ఇక ఎన్నికలకు ఏడాది ఉండడంతో ఆ లోపు పవన్ రాజుకీయ ప్లాట్ఫారం ఏర్పాటుకు సమయం ఎంతకాలం పడుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. పవన్ కల్యాణ్ గత ఐదు నెలలుగా ఎపిలో పర్యటిస్తూ ఒక్కొక్క పర్యటన ఒక్కొక్క విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రకటనలు చేసి చివరికి కేంద్రాన్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు సందిస్తున్న తరుణంలో పవన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలో హడావిడి చేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి బాబును.. ప్రభుత్వ విధానాల పై నోరు మెదపని పవన్ ప్రస్తుతం చేస్తున ఆరోపణల పై పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతున్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ ఏ నిమిషానికి ఏమి మాట్లాడతారో, ఆయన అవేశభరిత ప్రసంగం పై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నింపుతోంది.

janasena 07072018 3

ఇక జనసేన పార్టీ అభాసుపాలు కాకుండా చిరంజీవి తెరపైకి వచ్చి, చివరి సీన్ లో పవన్ కల్యాణ్ కు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పవన్ వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. చిరంజీవిని రాజాకీయంగా ఇబ్బంది పెట్టిన వారి అంతు చూస్తా అంటూ పవన్ పదే పదే అంటున్నారు. మరో పక్క చిరంజీవి ఫాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు, చిరంజీవి అభిమాన సంఘాలు, కాంగ్రెస్ నుంచి జనసేనలోకి వెళ్ళటం చూస్తుంటే, అంతా ప్లాన్ ప్రకారమే, జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే చిరంజీవి గతంలో వ్యవహరించిన తీరు, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యటంతో చిరంజీవి పై ఏపి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

చివరి దశ లో చిరంజీవి తెరపైకి వచ్చినా, పవన్ వ్యవహరిస్తున్న తీరు పై ప్రజల్లో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత ఎదురవుతోంది. చివరంజీవి తోడైతే, జోగి జోగి సామెత మిగులుతుంది. పవన్ వ్యవహారం పై ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించడం లేదు. విభజన గాయాలు మనాక ముందే, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం పవన్ వ్యవహరిస్తున్న తీరు పై పీఆర్పీ అధినేత చిరంజీవినే మేలంటున్నారు ప్రజలు. ప్రజలను రెచ్చగోట్టటమే పనిగా పెట్టుకుని, ప్రజల మూడ్ అర్ధం చేసుకోకుండా, కేంద్రం పై పోరాడకుండా, రాష్ట్రం పై పోరాడటం చూస్తుంటే, పవన్ రాజకీయంగా రాణించడం అనుమానమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడకు వెళ్తే అక్కడ, ప్రజలు తమ కోపాన్ని చూపిస్తున్నారు. మొన్న ఒక లారీ డ్రైవర్ చెప్పు విసిరితే, ఈ రోజు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర పర్యటన చేపట్టారు కన్నా లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన పై చెప్పు విసిరేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటనలు మరువక ముందే కన్నా కడప జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా, భారీ స్వగతం పలుకుతారని ఆశించారు. మిగిలిన చోట్ల మాదిరికాకుండా ఇక్కడ లక్ష్మీనారాయణకు ఘనమైన స్వాగతం లభించలేదు. ఒంటిమిట్టలో కన్నా ఒంటరి అవ్వాల్సి వచ్చింది.

kanna 07072018 3

రాజంపేటలో నిర్వహించే కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లాలనుకున్న కన్నా, మధ్య లో ఒంటిమిట్ట ఉండటంతో అక్కడ పార్టీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఆయన ఒంటిమిట్టలో ఆగాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. ఒంటిమిట్టలో కన్నాను రిసీవ్ చేసుకునేందుకు ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. అక్కడ లోకల్ నాయకులు చెప్పినా ఎవరూ రాలేదు. ఇదే సమాచారం కన్నాకు అందింది. దీంతో ఆయన అసహనానికి గురయ్యి, ఇక చేసేది ఏమిలేక ఒంటిమిట్ట కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నేరుగా రాజంపేటకు వెళ్లారు. లోకల్ నాయకుల పై ఫైర్ అయ్యారు.

 

kanna 07072018 2

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కన్నా రాక సందర్భంగా కార్యకర్తలను తరలించేందుకు నేతలు రెండు బస్సులను ఏర్పాటు చేశారు. చివరకు బస్సులో ఒక్కరంటే ఒక్కరు ఎక్కలేదు. ఈ రెండు బస్సులు ఖాళీగా కన్నా వెంట వెళ్లాయి. నెల్లూరు జిల్లా కావలిలో కన్నాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కావలికి కన్నా వచ్చిన సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కన్నాపైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో కలకలం రేగింది. చెప్పు విసిరిన వ్యక్తి ఉమామహేశ్వరరావుగా గుర్తించారు. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

Advertisements

Latest Articles

Most Read