ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు చెయ్యలేదు. అయినా, తెలుగుదేశం పార్టీ చేసినవి చెప్పుకోలేక పోతుంది. ఎంతో మంది లబ్ధి పొందుతున్నా, ఆ పాజిటివ్ ఫీల్ తేవటంలో ఫెయిల్ అవుతున్నారు. దాదాపు 40 పథకాలపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నా, అవి సక్రమంగా, సకాలంలోనే లబ్ధిదారులకు అందుతున్నా, ఆశించినమేర స్పందన మాత్రం ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చాన్నాళ్లుగా వేధిస్తున్న ఈ చిక్కుముడిని కడప జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ విప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు అందుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళికశాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఆ తరువాత రెండురోజులకే ప్రణాళిక శాఖ దీనిపై బ్రోచర్లు తయారు చేసి, సూచనల కోసం కడప క లెక్టర్‌కు పంపింది.

kadapa 07072018 2

కడప జిల్లా చెన్నమరాజుపల్లెలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్‌ తాను రూపొందించిన విధానాన్ని సీఎంకు స్వయంగా చూపించారు. ఈ సభలో 9 అంశాలకు సంబంధించి 40 పథకాల నుంచి లబ్ధి పొందుతున్న వారితో ఆయన మాట్లాడించారు. ఈ పద్ధతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మానవ జీవన దశలతో ఈ పథకాలకు ఉన్న బంధాన్ని బలంగా ప్రచారం చేయగలిగితే, ప్రభుత్వ లక్ష్యం చాలావరకు నెరవేరుతుందని హరికిరణ్‌, సీఎంకు వివరించారు. దీనికి ఆయన పెట్టిన పేరు ‘ఎ లైఫ్‌ సైకిల్‌ అప్రోచ్‌’. అంటే, మనిషి పుట్టుక నుంచి మరణం దాకా.. మానవ జీవితంలోని తొమ్మిది ముఖ్య దశలను తాకేలా... అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ఒకే ప్రచార గొడుగు కిందకు తీసుకువస్తారన్నమాట.

kadapa 07072018 3

ఆ తొమ్మిది దశలివే.. 1) జననానికి ముందు, ఆ వెంటనే.. : గర్భవతులకు సీమంతం పథకం, న్యూట్రిషన్‌, సప్లిమెంటరీ న్యూట్రిషన్‌, అన్న అమృత హస్తం, బాలింతలకు మెటర్నిటీ బెనిఫిట్‌ స్కీం, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, సప్లిమెంటరీ, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, గోరుముద్దలు 2) శిశుదశ: సఫల స్కీం, ఎన్‌టీఆర్‌ బే బీ కిడ్స్‌, వ్యాక్సినేషన్‌ యూనేజేషన్‌, మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ క్లాస్‌ రూములు, బడికొస్తావంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 3) కౌమారం: ప్రీ మెట్రి క్‌, పోస్టుమెట్రిక్‌, స్కాలర్‌షి్‌పలు, ప్రతిభ అవార్డు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపాధి కల్పనకు శిక్షణ, ప్లేస్‌మెంట్‌, లింక్డ్‌ ట్రైనింగ్‌ 4) యువత: జాబ్‌ మేళాలు, నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాలు, చంద్రన్న బీమా, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ, చంద్రన్న సంచార చికిత్సలు, ఎన్‌టీఆర్‌ విద్య 5) పేదలు, మహిళల ఆరోగ్యం : మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌, టెలి రేడియాలజీ, జాతీయ ఫ్రీ డయాలసిస్‌, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రక్ష 6) గూడులేనివారు: ఎన్‌టీఆర్‌ రూరల్‌ హౌసిం గ్‌, ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌, జగ్జీవన్‌ జ్యోతి 7) సామాజిక వర్గాలు : చంద్రన్న పెళ్లి కానుక, దుల్హన్‌ మైనార్టీ స్కీం. 8) వృద్ధాప్యం : ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు 9) మరణానంతరం : మహా ప్రస్థానం పథకం. ఈ పథకం కింద చనిపోయిన వ్యక్తిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి, అంత్యకియ్రల నిర్వహణకు ప్రభుత్వం సాయం అందిస్తుంది.

కొన్నేళ్ళుగా ప్రైవేటు స్కూల్స్ పై ఆకర్షితులై తల్లిదండ్రులు విధ్యార్ధులను అక్కడ చేర్పించటంతో ప్రభుత్వ స్కూల్స్ విధ్యార్ధులు సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో చాలా స్కూల్స్ ముత పడ్డాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న చర్యల వల్ల మొత్తం మారిపోయింది. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ స్కూల్స్ లో సదుపాయాలు మెరుగు పరచటం, ఆడ పిల్లలకు సైకిల్స్, బయో మెట్రిక్ ద్వారా ప్రతి రోజు టీచర్స్ స్కూల్ కు వచ్చేలా చెయ్యటం, ఇలా అన్ని చర్యల వల్ల, గత సంవత్సరం నుంచి, నెమ్మదిగా మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడటం మొదలు పెట్టారు. అంతే కాదు చదువులో వెనుకబడిన పిల్లలకు స్పెషల్ క్లాసులు కూడా పెడుతున్నారు. పదవి తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లలను, ప్రోత్సహిస్తున్నారు.

schools 07072018

ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్ లు తీసుకుంటే కలిగే లాభాల పై ప్రచారం చేసారు. దీంతో మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ కు మంచి రోజులు వచ్చాయి. మూత పడతాయి అనుకున్న స్కూల్స్ అన్నీ, పిల్లలతో కళకళలాడుతున్నాయి. బడి ఈడు పిల్లలను గుర్తించి, బడిలో చేర్పించే ఉద్దేశంతో మొదలు పెట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ తరగతులతో ఒక విప్లవం సృష్టించిన ప్రభుత్వం, ఆ ఫలితాలతో, పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా కూడా చేస్తుంది.. దీంతో సామాన్య ప్రజలకు కూడా ప్రైవేటు స్కూల్స్ కాకుండా, మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రైవేటు స్కూల్స్ దీటుగా, మేము కూడా చదువు చెప్తున్నాం అంటూ, ప్రభుత్వ స్కూల్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి.

schools 07072018

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో, 2016-17లో కృష్ణా జిల్లాలో 3.25 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.49 లక్షల మంది ఉన్నారు. 2017-18లో కృష్ణా జిల్లాలో 3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.56 లక్షల మంది ఉన్నారు. 2018-19లో కృష్ణా జిల్లాలో 3.50 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 3.78 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ చూసుకుంటే, 2017-18లో కృష్ణా జిల్లాలో 2.3 లక్షల మంది పిల్లలు ఉండగా, గుంటూరు జిల్లాలో 2.83 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే, ప్రజలు ప్రభుత్వ స్కూల్స్ వైపు చుస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. వచ్చే ఏడాదికి, మరింత ఎక్కువ మంది వచ్చేలా ప్రణాలికలు రచిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెస్తున్నారని ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ద్వయంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ మేర‌కు శుక్ర‌వారం త‌న కార్యాల‌యం నుంచి ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా ప్రాంతాలలో బలంగా ఉన్నారని, వారిని బలహీన పరిచేందుకే జమిలి ఎన్నికల ఎత్తుగడను భాజపా వేస్తోందన్నారు. ఏ జాతీయ పార్టీకూడా సొంతబలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో లేదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో బలోపేతం కావడం రాజకీయంగా జాతీయ పార్టీలకు విఘాతంగా మారిందన్నారు.

modi 07072018 2

15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రమాదకరంగా పరిణమించాయని తెలిపారు. భాజపా నేతలే ఈ మార్గదర్శకాలను 15వ ఆర్థిక సంఘానికి సూచించారన్నారు. జీఎస్టీని కూడా రాష్ట్రాలను బలహీన పరిచేందుకే వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని వివరించారు. జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం, జమిలి ఎన్నికల వంటి ఆలోచనలన్నీ జాతీయ పార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకే అని విమర్శించారు.

modi 07072018 3

రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరచడమే అజెండాగా కేంద్రంలోని భాజపా నేతలు పెత్తందారీ పోకడల్లో వ్యవహరిస్తున్నారని యనమల అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ్‌బంగలోని మమతా బెనర్జీ, దిల్లీలో కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్‌కుమర్‌, లాలూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తోందో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నరేంద్రమోదీ తరహాలో గతంలో ఎవరూ ఇలా రాజకీయ కుట్రలు చేయలేదన్నారు. మోదీ, షా ద్వయం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం పై ముందుకు వెళ్లనున్న మోడీ సర్కార్ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలో కదలిక ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఈ నెలలో రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది. లా కమిషన్ ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, సూచనలు కోరుతుంది. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చలు సాగించనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం రాష్ట్ర విభజన సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికలపై దృష్టి సారించడాన్ని టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. అందుకే ఈ సమావేశానికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది.

ap 07072018 2

అయితే కేంద్రం మొదట్లో నవంబర్, డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిందని ప్రచారం అయింది. ఆరు నెలల ముందు కాదు, 8నెలల ముందేఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహం రూపొందించుకుంటు అన్నట్లుగా ఢిల్లీ పెద్దలు లీక్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని టిడిపితో పాటు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు ముందస్తు ఎన్నికలకు సైతం సిద్దమైనట్లుగా చెబుతున్నాయి. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం లబ్దిపొందాలని చూస్తుందని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత రెండు, మూడు ఏండ్లుగా దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన కేంద్ర పెద్దలు పదేపదే తెస్తున్నారు.

ap 07072018 3

చివరికి నూతన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ నోట కూడా వినిపింపచేశారు. దేశంలో ఏడాది పొడవునా వేర్వేరు ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి పనులు నిర్వహించడం కష్టంగా ఉందని, ఐదేళ్ల కొకసారి ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గడంతో పాటు అభివృద్ధి పనులు కూడా సులభంగా సాగుతాయని ఢిల్లీ పెద్దలు పదేపదే చెబుతు న్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగనున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసంగా సగం రాష్ట్రాలైనా కలుపుకుని లోక్ సభతో పాటు జమిలీ ఎన్నికలకు పోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read