నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలీదు అని, రెండు సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అశోక్ గజపతి రాజు గారు అన్నారు.. ఆ వ్యాఖ్య పట్టుకుని, రెండేళ్ళు అయినా, పవన్ కళ్యాణ్ అదే విషయం పై తన యాత్ర మొదలైన దగ్గర నుంచి ఎదో ఒక సందర్భంలో అంటున్నారు. "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్... గత పది రోజుల నుండి, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, పవన్ కొడుతున్న డైలాగ్లు చూసి ప్రజలు కూడా నవ్వుకున్నారు. అశోక్ గజపతి రాజు, నాకు పవన్ తెలుసు అనే దాక పవన్ ఈ విషయం వదలడు అనే మాటలు వినిపించాయి..

ashok 07062018 2

అయితే, నిన్న అశోక్ గజపతి రాజు గారు మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ విషయమై మాట్లాడుతూ ఆన్‌ స్క్రీన్ కాని, ఆఫ్‌ స్క్రీన్ కాని ఆయన గురించి నాకు తెలియదని అశోక్‌ అన్నారు. తెర వెనుక ఎవరో రాసి ఇచ్చినది చదివితే ఉన్న గౌరవాన్ని కోల్పోతారన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ లెజెండ్‌ అని, ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ కుమారుల పెళ్లి సమ యాల్లో కూడా ప్రజా సేవలోనే ఉండి ప్రజలే ముఖ్యమన్న సంకేతాలు పంపారన్నారు. మొత్తానికి, మళ్ళీ నాకు పవన్ అంటే ఎవరో తెలీదు అనటంతో, మళ్ళీ పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

ashok 07062018 3

మరో పక్క, ఎయిర్‌ ఆసియా విషయమై అశోక్‌ మాట్లాడుతూ సంబంధిత సీఈవో ఫోన్‌ సంభాషణతో తనకు సంబంధం లేదన్నారు. భారత్‌లో విమాన రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చి, యువతకు ఉపాధి కల్పించాలని అనుకున్నానని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు గ్రోత్‌ పెంచాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌ చైర్మన్‌ రామకృష్ణ, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, వీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

మిత్రపక్షం శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ సారథి అమిత్ షా చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడంలేదు. ఆ పార్టీ అథినేత ఉద్ధవ్ థాకరేతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అమిత్ షా భేటీ సానుకూలంగా ముగిసినప్పటికీ.. శివసేన మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు తేల్చి చెప్పింది. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ స్పష్టం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ‘‘అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయాలని పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. పార్టీకి సంబంధం లేని వెలుపటి వ్యక్తులు వచ్చి ఆ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేయగలరు?’’ అని ప్రశ్నించారు. అమిత్ షా ఎందుకు వచ్చారో తమకు తెలుసుననీ... అయితే శివసేన తీర్మానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదన్నారు.

bjp 07062018 2

మరో పక్క, బీజేపీకి మరో పార్టీ నుంచి ఊహించని షాక్ తగిలింది. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) నుంచి వైదొలుగుతున్నట్టు బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ప్రకటించింది. సీఎం నితీశ్ కుమార్ వైఖరికి నిరసనగా... ఇవాళ పాట్నాలో జరుగుతున్న ఎన్డీయే సమావేశాన్ని కేంద్రమంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ బహిష్కరించారు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలన్న బీజేపీ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

bjp 07062018 3

2019 ఎన్నికల్లో బీహార్ ఎన్డీయే సారథిని తానేనంటూ నితీశ్ కుమార్ ప్రకటించుకోవడంపై కుష్వాహ తీవ్రంగా కలత చెందినట్టు ఆర్ఎల్ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు ఎన్నెన్ని సీట్లు ఇస్తారో నిర్ణయించాలని కూడా ఈ నెల 2న ఆర్ఎల్ఎస్పీ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఆర్ఎల్ఎస్పీ... బీహార్ మహాకూటమిలో చేరేందుకు ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో, జగన్ ఒక్కడే కాదు, జగన్ కు మించిన ఆర్ధిక నేరగాడు గాలి జనార్ధన్ రెడ్డి. ఓబులాపురం మైనింగ్ పేరుతో, ఎలా సహజ సంపద దోచుకుని, లక్షల కోట్లు కొల్లగొట్టాడో చూసాం... ఇలాంటి వాడిని, బీజేపీ వారు కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘గోవా సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలన్నీ సక్రమంగానే జరిగాయి. ఎక్కడా గీత దాటలేదు’ అంటూ గాలి జనార్దన రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన గనుల అక్రమాలపైనా ఇదే జరిగే ప్రమాదముందని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. సరిహద్దులను తేల్చే సర్వే పనులను కర్ణాటకతో కలిసి పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడికి శిక్ష పడి తీరాల్సిందే అనే నిశ్చయంతో ప్రభుత్వం ఉంది.

gali 07062018 2

గోవా తరహాలోనే ఏపీ, కర్ణాటక సరిహద్దు తగాదాను ముగించేందుకు తెరవెనుక రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ భావిస్తోంది. గతంలో గోవాలోనూ సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలతోనే గాలి మైనింగ్‌ అంతా సక్రమంగా సాగిపోయిందంటూ ఆ కేసులు వీగిపోయాయని... ఏపీ వి షయంలో అలా జరగొద్దని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ, కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే సంయుక్త సర్వేకు ఏపీ నుంచి ఉన్నతాధికారులు వెళ్లాల్సిందేనని ఆదేశించింది. అటవీ శాఖలో ముఖ్య సంరక్షణాధికారి కేడర్‌ అధికారులు ముగ్గురితో కూడిన కమిటీని నియమించి వెంటనే అటవీ సర్వేకు పంపించాలని సోమవారం అత్యవసర మెమో జారీ చేసింది.

gali 07062018 3

అలాగే... జిల్లా నుంచి ఓ ప్రత్యేక స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని సర్వేకు పంపించాలని అనంతపురం కలెక్టర్‌ను ఆదేశించింది. ‘ఈ బృందం రోజువారీగా జిల్లా కలెక్టర్‌తో భేటీ అవుతూ ఎప్పటికప్పుడు సర్వే పురోగతిపై సమీక్షించాలి. సర్వేకు అవసరమైన గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్స్‌, సర్వే విధానం ఖరారైన తర్వాతే ఏపీ తరఫున అభిప్రాయాలు, విధానాలను సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా కు నివేదించాలి’ అని సర్కారు దిశా నిర్దేశం చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని లోపల వెయ్యాలని, సహజ సంపద కొల్లగొట్టి బయట తిరుగుతూ ఉన్న ఇలాంటి వాడిని, బీజేపీ వెనకేసుకు రావటం చూస్తుంటే, ఆశ్చరంగా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే అన్నీ పక్కాగా ఉంటే, ఎవరూ తప్పించుకోవటం కుదరదని, అప్పుడు చట్ట ప్రకారం కోర్ట్ లు తీర్పు ఇచ్చి తీరుతాయని, ప్రభుత్వం భావిస్తుంది.

ఈ రోజు లోటస్ పాండ్ లో ఒక అపూర్వ కలయిక జరిగిన విషయం తెలిసిందే.. ప్రతిపక్ష నేత జగన్, తిరుమల పై ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు భేటీ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘ఇప్పుడే టీవీలలో చెప్తున్నారు తమ్ముళ్ళు, జగన్‌ను రమణదీక్షితులు కలిశారట.. మరో కుట్రకు పథకం పన్నుతున్నారు. టీటీడీని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని చూసింది. చివరికి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. తిరుమల పవిత్రతను ఎవరు దెబ్బతీసినా సహించం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న సీఎంకు ఈ భేటీ విషయాన్ని ఆ పార్టీ నేతలు చేరవేశారు. అయితే భేటీని నిర్ధారించిన తర్వాత తనకు చెప్పాలని టీడీపీ శ్రేణులను ఆయన ఆదేశించారు.

cbn 07062018 2

మరో పక్క ఐటి మంత్రి లోకేష్ కూడా స్పందించారు.. ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసారు "Been saying this since long & now it’s in the open. Ramana Deekshithulu called on Jagan on instructions from BJP. Shame on them for their unholy nexus. Don’t ever play games with Lord Venkateswara Swamy. He will teach you guys a lesson that you will not forget! #OperationGaruda"

cbn 07062018 3

మరోవైపు జగన్, దీక్షితులు భేటీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అన్యమతస్థుడైన జగన్‌ను రమణ దీక్షితులు కలవాల్సిన అవసరం ఏంటని టీడీపీ నేత ముళ్లపూడి రేణుక ప్రశ్నించారు. జగన్‌, రమణదీక్షితుల డైరెక్షన్‌లోనే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ డ్రామాలో నటులు జగన్‌, రమణదీక్షితులు అంటూ ముళ్లపూడి రేణుక దుయ్యబట్టారు. జగన్‌ను రమణదీక్షితులు కలవడంతో కుట్ర బయటపడిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఒకరోజు కాకపోతే మరొకరోజు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. హాస్యనటుడు బ్రహ్మానందంలా తయారయ్యారని ఎద్దేవాచేశారు. వీళ్లందరి వేషాలు హనుమంతుడి ముందు కుప్పిగంతులేనని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

 

Advertisements

Latest Articles

Most Read