పసిబిడ్డ ఆంధ్ర రాష్ట్రం, పాకుతూ, లేచి నిలుచోవటానికి అపసోపాలు పడుతుంటే... అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, అధిపత్యం కోసం, అధికారం కోసం, చంద్రబాబుని నిలువరించేందుకు కేంద్రంలో పెద్దలు వంచన చేస్తుంటే... మీకు అడ్డం రాను, రాస్త్రనికి చేయూత నివ్వండి మహాప్రభూ అంటూ ఒకరకంగా తలవొగ్గారు చంద్రబాబు... అయినా ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి...మిత్రధర్మాన్ని విస్మరించి..ద్రోహం చేసిందెవరో తెలియదా...?వంచన చేసిందెవరో తెలియదా ...? మోడీ మోసం పై ధర్మ పోరాటం చేస్తుంటే, ఇదే రోజు జగన్, వైజాగ్ లో వంచన దీక్ష అంటూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా దీక్ష చెయ్యటం ఏంటి ?

చంద్రబాబు కి వ్యతిరేకంగా, రాష్ట్ర సమస్యలపై దీక్షలు చేయండి... పెన్షన్ లు ఇవ్వకపోతే , నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, రైతు ఋణమాఫీ చేయకపోతే, డ్వాక్రా ఋణమాఫీ చేయకపోతే, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టకపోతే, అన్న కాంటీన్ లు పెట్టకపోతే, ఉద్యోగులకు నలభైమూడు శాతం ఫిట్ మెంట్ ఇవ్వకపోతే, రిటైర్ మెంట్ ఏభైఎనిమిది నుండి అరవై చేయకపోతే, పట్టిసీమ నీరు కృష్ణ లో అనుసంధానం చేయకపోయి ఉంటే, కృష్ణా డెల్టా ఎండిపోయుంటే, పులివెందులకు నీరు ఇవ్వకపోయుంటే, అనేక ఆటంకాలమధ్య పోలవరం ఏభైశాతం పనిపూర్తవక పోయి ఉంటే, పక్క రాష్ట్రం ధనిక రాష్ట్రం ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వకపోయినా, రెండుసార్లు డియస్ సీ ప్రకటించకపోతే, ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకు రాకపోతే, రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేయకపోతే, సంవత్సరం లోపల మన రాష్ట్రం, మన రాజధాని మనదగ్గర నుండే పాలన చేయకపోతే, హుద్ హుద్ లాంటి జలప్రళయం ని సమర్థవంతంగా ఎదుర్కోక పోతే, కియామోటార్స్, హీరో మోటార్స్, ఆపిల్ లాంటి కంపెనీలు రాకపోతే, అన్నిటికన్నా ముప్పై మూడువేల ఎకరాలు ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం చుక్క కారకుండా కేవలం తన మీద నమ్మకంతో రైతులు ఇవ్వకపోతే, అప్పడు కదా చంద్రబాబు కి వ్యతిరేకంగా దీక్షలు చేయాల్సింది.

మరేంటయ్యా ...కేంద్రం మోసం చేసింది...మోదీ కక్ష గట్టాడు, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది...ప్రజలంతా ఆగ్రహంతో కేంద్రం మీద యుద్దం చేస్తుంటే... మీరేంటయ్యా ప్రజల మీద యుద్దం ప్రకటించారు... మీ కేసుల గురించా ? ప్రజలందరికీ తెలుసు ...ఇక డ్రామాలు చాలించి ...ముసుగులు తీసి ప్రత్యక్ష యుద్దం చేయండి...బాబు కావాలో, మీరు కావాలో ప్రజలు తేల్చుకుంటారు.. రోజులుమారాయి...మీ డ్రామాలు...అసలు నయవంచన మీదే, అని ప్రజలుకు బాగా అర్దమయింది...సమయం కోసం చూస్తున్నారు...

ఒక పక్క ఎన్ని రాజకీయ విమర్శలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మాత్రం గుర్తించకుండా ఉండలేని పరిస్థితి కేంద్రానిది... స్వయంగా ప్రధాని మోడీనే, మన రాష్ట్రానికి అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి.. ఇది చంద్రబాబు ముందు చూపుకు, కష్టానికి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు... గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో (స్కిల్ డెవలప్మెంట్) శిక్షణను ఇస్తూ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు, జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది... మొదటిస్థానంలో ఒడిసా ఉండగా, రెండో స్థానంలో కేరళ నిలచింది... మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి మరీ, ఆంధ్రప్రదేశ్ ఈ ర్యాంకు సాధించడం విశేషం.

నిజానికి ఈ అంశంలో కేరళ రాష్ట్రం కంటే, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.. కాని కేరళలో మెట్రోరైలులో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు, ఎక్కువగా చూపడంతో ఆ రాష్ట్రం రెండో స్థానం సాధించింది... ఈ ఏడాది వచ్చిన ర్యాంకు స్ఫూర్తితో, వచ్చే సంవత్సరం నెంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కోగంటి సాంబశివరావు చెప్పారు... ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఈ అవార్డు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా మే 5న రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డులను అందజేస్తారని తెలిపారు. యువతలో దాగిఉన్న విజ్ఞానాన్ని, నైపుణ్యాలను వెలికి తీసి ఉపాధి అవకాశాలను కల్పించేలా దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కె. సాంబశివరావును సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని గ్రామీణ యువతకు సోసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడ్‌ఏపీ) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది 5980 మందికి శిక్షణ ఇచ్చి, 10,923 మందికి ఉపాధి కల్పించింది. ఈ ఏడాది 17,977 మందికి శిక్షణ కల్పించింది. ఒక్కో విద్యార్థిపె రూ.60 వేల వరకు ఖర్చు చేస్తోంది. కాగా, నైపుణ్యాభివృద్ధిపై ఆసక్తిగల యువత జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని సీఈవో కోగంటి సాంబశివరావు సూచిస్తున్నారు.

అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..

ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. ఇంకా దారుణం ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు హజ్‌ యాత్రకు, గన్నవరం నుంచే వెళ్ళవచ్చు అని, ఇది వరకు అశోక్ మంత్రిగా ఉండగా ఆదేశాలు వచ్చాయి.. ఇప్పుడు మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, హజ్ యాత్రకు వెళ్ళే విషయం పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఈ ఏడాది కొత్తగా ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని, సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ తేల్చి చెప్పటంతో, ముస్లిం సోదరులు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మంది హాజీలు హజ్‌ యాత్రకు బయలుదేరబోతున్నప్పటికీ, మన రాష్ట్రంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కాకుండా, పొరుగురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హజ్‌యాత్రకు ప్రత్యేక విమానాలు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా.. విజయవాడ నుంచే తమ యాత్రను ప్రారంభించాలని హాజీలు భావిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఈ ఏడాది కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తీపి కబురు లేదు. సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ కొత్తగా ఎలాంటి ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని చెప్పటంతో భవిష్యత్తు ఆశలపై కూడా నీళ్లు చల్లుతున్నట్టు అవుతోంది. మూడు వేల మంది హాజీలు బయలుదేరే ప్రాంతానికి ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వకపోవటం అర్థరహితమని భావించిన రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మొయిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. ఆయన కేంద్ర మంత్రి నక్వీతో మాట్లాడినట్టు సమాచారం. నక్వీ సానుకూలంగా హామీ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో, ఇప్పటి వరకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలేదు..

జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు, మోడీ చేస్తున్న మోసం పై, ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, జగన్ మాత్రం వంచన దీక్ష పేరిట నాటకాలు ఆడుతున్నారని, మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. చంద్రబాబు పోరాటానికి రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లోని తెలుగువారు కూడా మద్దతు తెలియజేస్తే, జగన్ మాత్రం ప్రధాని మోడీకి మద్దతిస్తూ నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుజాతి పై కక్షగట్టి, కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఎదుర్కోకుండా, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నాటకాలు ఆడుతున్నారని, చంద్రబాబుని విమర్శిస్తున్న జగన్, ప్రత్యేక హోదా గురించి మోదీని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

ప్రతి రోజు ఢిల్లీలో హడావుడి చేసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, నేను మోడీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన ఆయన, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఆయనతో పాటు పలువురు వైకాపా నేతలు కర్ణాటకలో, గాలి అనుచరులను గెలిపించే పనిలో ఉన్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకు ప్రచారం చేయడమంటే, తెలుగుజాతికి నమ్మకద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు, ఈడీ నుంచి ఆస్తులు విడిపించుకోవటానికే జగన్, విజయసాయి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అమిత్ షా కనుసన్నల్లోనే వైకాపా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో భాజపా అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని.. దాన్ని జగన్‌ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎవరు ఏ పార్టీలో చేరాలనేది అమిత్ షా, ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని ఆరోపించారు. 40ఏళ్లు జగన్ కుటుంబానికి పదవులు ఇచ్చిన పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పులివెందుల చుట్టూ ఉన్న నీళ్లు నెత్తిన జల్లుకుంటే జగన్ పాపాలు సగమైనా పోతాయని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బయటి జిల్లాల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read