ఈ రాష్ట్రంలో మోడీని మొట్టమొదటి సారి, డైరెక్ట్ గా తిట్టి, పార్లమెంట్ వేదికగా "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" అంటూ వాయించి వదిలిన గల్లా జయదేవ్ పై, జనసేన ట్విట్టర్ నుంచి విమర్శలు వచ్చాయి... రెండు రోజుల క్రితం, గల్లా జయదేవ్ తన ట్విట్టర్ లో, జగన్ - పవన్ కలిసిపోతున్నారు అని, త్వరలోనే ప్రజల ముందుకు కలిసి వస్తున్నారు అంటూ, ఒక ట్వీట్ చేసారు.. దానికి, తాపీగా రెండు రోజుల తరువాత, జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది... ఆ ట్వీట్ లో వాడిన భాష, ఒక పార్టీ ఆఫిషయల్ హేండిల్ నుంచి వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది... మా అధినేతే, చౌకబారు భాషలో ట్వీట్ లు చేస్తుంటే, మేమేమి తక్కువ అన్నట్టు, జనసేన పార్టీ కూడా తమ ఆఫిషయల్ హేండిల్ నుంచి అలాంటి భాషలోనే ట్వీట్ చేసి, ఒక కొత్త సంప్రదాయానికి తెర లేపింది...

‘‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన ఆఫిషయల్ హేండిల్ నుంచి ట్వీట్ వచ్చింది.. దీనికి వెంటనే జయదేవ్ రియాక్ట్ అయ్యారు. ‘‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి’’ అంటూ గల్లా దానిని రిప్లై ఇచ్చారు...

అయినా, గల్లా పార్లమెంట్ పెర్ఫార్మన్స్ చూసి , జనసేన ట్వీట్ చెయ్యల్సింది... ఇక్కడ చూడండి... http://www.prsindia.org/mptrack/jayadevgalla ... ఇప్పటి వరకు 105 చర్చల్లో గల్లా పాల్గున్నారు.. 432 ప్రశ్నలు వేసారు... 84 శాతం అటెన్డేన్స్ ఉంది... 6 ప్రైవేటు మెంబెర్ బిల్ లు ప్రవేశ పెట్టారు.. అయినా గల్లా మంచివాడు కాబట్టి అలా రిప్లై ఇచ్చారు.. మీ చిరంజీవి ఏమి చేసాడు అని అడిగితే, జనసేన బ్యాచ్ ఇది చూపించాలి http://www.prsindia.org/mptrack/chiranjeevikonidala.. 6 ఏళ్ళ పదవి కాలంలో, 2 చర్చల్లో చిరంజీవి పాల్గున్నారు... అది కూడా రాష్ట్రం విడిపోయే సమయంలో... సున్నా ప్రశ్నలు వేసారు... 32 శాతం అటెన్డేన్స్ ఉంది... సున్నా ప్రైవేటు మెంబెర్ బిల్ లు ప్రవేశ పెట్టారు.. ఇలాంటి ప్రొఫైల్ ఉన్న వీళ్ళు, ఎదుటి వారిని, హేళన చేస్తూ, మాట్లాడతారు... ఆ ఎదుటి వాళ్ళు, క్లాసు ఫస్ట్ అయితే, మనం లాస్ట్... సరిగ్గా హోం వర్క్ చేసే చావం.. మనకి కౌంటర్ లు ఎందుకు...

‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, విలేకరులు అడిగిన ప్రశ్నకు, చంద్రబాబు చెప్పిన సమాధానం ఆసక్తి కలిగించింది... సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారయణ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఆయన మీ పార్టీలో చేరతారు అనే ప్రచారం జగుతుంది, దీనికి మీ సమాధానం చెప్పండి అని చంద్రబాబుని అడగగా, ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు.. ఇవన్నీ ఊహాగానాలు అని, ఊహాజనిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాం అంటూ, నవ్వుతూ చంద్రబాబు చెప్పారు... చంద్రబాబు చెప్పిన విధానం చూస్తుంటే, లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరతారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి...

మరో పక్క, తన పాదయాత్ర విశేషాలు చంద్రబాబు నెమరు వేసుకున్నారు... అయుదు సంవత్సరాల క్రితం, అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్‌ 2న పాదయాత్ర ప్రారంభించి, సరిగ్గా ఇదే రోజున విశాఖలో ముగించామని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు ఎంతో పవిత్ర భావంతో, పాదయాత్ర చేశానని, పాదయాత్ర చేపట్టక ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ పరిపాలన ఎంతో దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు... పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 47 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని, నిరంతర విద్యుత్‌ కోతలు ఉండేవని చెప్పారు.

పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు, రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశామన్నారు. విభజన గాయాలు ఎన్ని ఉన్నా సొంత కష్టంతో నాలుగేళ్లుగా ఎదుగుతూ వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేని పాలన ఇచ్చామని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లేవాళ్లమని వివరించారు. ఉద్యోగాల నుంచి రిటైర్డయిన కొందరు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై పుస్తకాలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

గన్నవరం సమీపంలో, అతి పెద్ద ఐటి కంపెనీ హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌), తమ కార్యకలాపాలని మే నెల నుంచి ప్రారంభించనుంది.. గన్నవరంలని మేధా టవర్స్ లో, హెచ్‌సీఎల్‌ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.. గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుగా, ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో, హెచ్‌సీఎల్‌ శాశ్వత భవనాలకు కూడా మే నెలలోనే భూమిపూజ జరగనుంది. ఒకే రోజు, అటు శాశ్వత భవనాలకు భూమి పూజ, మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలు పెట్టటానికి, హెచ్‌సీఎల్‌ సిద్ధమైంది.. ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చెందిన 27 ఎకరాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్‌సీఎల్‌ కు కేటాయించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ భూమిలో, చెట్ల తొలగింపు, నేల చదును పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ పనులు అన్నీ మరో 10 రోజుల్లో పూర్తవుతాయని, వెంటనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులు మొదలు పెడతామని, చెప్తున్నారు... ఇక్కడ నిర్మించే ఐటి టవర్ నిర్మాణానికి, సంవత్సరం దాకా పడుతుంది అని, అందుకే మేధా టవర్స్ లో, కార్యకలాపాలు కూడా మొదలు పెట్టనుంది... ఒక వైపు టవర్‌ నిర్మాణ పనులతో పాటే మరోవైపు మేథ టవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకుంది... దీని కోసం, మేథ టవర్‌లో ఏకంగా ఒక ఫ్లోర్‌నే లీజుకు తీసుకుంది.. ఇప్పటికే, ఇక్కడ ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి... ఐటి టవర్ భూమి పూజ, మేధాలో కార్యకలాపాలు ఒకేసారి ప్రారంభించేందుకు హెచ్‌సీఎల్‌ పూనుకుంది. మే రెండో వారంలో కానీ, మూడో వారంలో కాని, ఇవి మొదలు కానున్నాయి...

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి.. దాదాపు వెయ్య మంది వరకు, ఇక్కడ ఉద్యోగాలు చేసే అవకాసం ఉంది. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది...

మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. రోజు ఉదయమే, నవజీవన వేదం అంటూ, మనల్ని పలకరిస్తూ, నాలుగు మంచి మాటలు చెప్తారు.. మొన్నా మధ్య, తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పిలవలేదు అని, తనకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు... అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థుతల పై కూడా స్పందించారు..

సాత్వికుడైన ఒక పండితోత్తముడు తన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, దగాని చూసి కలిగిన ధర్మాగ్రహంవల్ల గద్గదస్వరంతో ఏమంటున్నారో చూడండి. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ చంద్రబాబు రావాలని అందరూ కోరుకున్నారని, రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్ర సహాయం కావాలని అందరూ భావించారని, కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని అన్నారు... ఇలా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని, నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు... అనుభవంతో, అంకితభావంతో, చిత్తశుద్ధితో ఈ పేదరాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడుతున్న నాయకుడ్ని వదులుకుని, 2019 మే నెల తర్వాత ఒక అవినీతిపరుడిని నేను పాలకుడిగా చూడాలా అని కంపిస్తున్న గొంతుకతో ప్రశ్నిస్తున్నారు ఆయన. తెలుగుజాతి మొత్తం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆణిముత్యాల్లాంటి పలుకులు ఆయన నోటివెంట వచ్చాయి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే మన రాష్ట్రానికి కర్తా కర్మ క్రియ, భవిష్యత్తు అని భావించే ప్రతి ఒక్కరూ...,ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో పుణ్యభూమి సస్యశ్యామలం అవుతుందని భావించే ప్రతి ఒక్కరు ఈ గరికపాటి నరసింహారావు గారి వీడియోను చూసి అయిదు కోట్ల ప్రజల ఆవేదనను, ఆకాంక్షను అర్థం చేసుకోవాలని, ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, పది మందికి చెప్పాలని ఆశిస్తూ... ఆ వీడియో ఇక్కడ చూడండి, https://youtu.be/kCpvK9BesY0

Advertisements

Latest Articles

Most Read