ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఉపయోగపడే కరెంటు చార్జీలు తగ్గించరు, ప్రజలకు ఉపయోగపడే బస్సు చార్జీలు తగ్గించరు, 25 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తే, మనం మాత్రం తగ్గించం. ఇంటి పన్నులు తగ్గించరు. కొత్తగా చెత్త పన్ను, బాత్ రూమ్ పన్ను లాంటివి వేస్తారు. ఇలా చిత్ర విచిత్రంగా రకరకాల రూపాల్లో ప్రజల నుంచి పిండేస్తున్నారు. ఇలాంటివి తగ్గించరు కానీ, సినిమా రేట్లు తగ్గిస్తారు. మందు రేట్లు తగ్గిస్తారు. మొన్నటి దాకా మందు రేట్లు పెంచి, షాక్ కొట్టే రేట్లు అని చెప్పారు. ఎందుకు షాక్ కొట్టే రేట్లు అంటే, ప్రజలు తాగాడు మానేస్తారని, మద్య నిషేధంలో భాగంగా, దీన్ని అమలు చేస్తూ, షాక్ కొట్టే రేట్లు పెడితే, ప్రజలు మద్యం తాగటం తగ్గిస్తారని అన్నారు. సరే అనుకుంటే, మళ్ళీ మద్యం రేట్లు తగ్గించారు. అంటే ఇప్పుడు ఫుల్ గా తాగమని తగ్గించారా ? అదేమి అంటే, పక్క రాష్ట్రాల నుంచి స్మగింగ్ జరుగుతుందని అంటున్నారు. మరి మన వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి. మరో అంశం సినిమా టికెట్లు సమస్య. అసలు టికెట్ రేట్లు గురించి ప్రజలు ఎవరూ అడగలేదు. సమోసా కూడా రాని రూ.5 కు, సినిమా టికెట్ అంటే, ధియేటర్లు వారు, నిర్మతాలు ఏమి బ్రతుకుతారు ? అసలు ప్రజలు అడగని విషయాల్లో ఎందుకు ఈ నిర్ణయాలు ?

అంటే ఎవరినో సాధించటానికి ఈ నిర్ణయాలు తీసుకుంటారు. రేపు డీల్ ఒకే అవ్వగానే మళ్ళీ మామూలే. సరే ప్రజలు అడగక పోయినా తగ్గించారు, మరి ప్రజలు అడిగినా ఎందుకు తగ్గించటం లేదు ? రేపు సంక్రాంతి పండుగ వస్తుంది. అందరూ ఆర్టీసి బస్సుల్లో వస్తారు. అంతే వెంటనే, 50 శాతం చార్జీలు పెంచుతున్నట్టు, ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. మరి ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ? సినిమా టికెట్లు అంటే ఎవడో పోతాడు, అదే ఇక్కడ ఆర్టీసి అయితే ప్రభుత్వం పోతుంది కదా ? అందుకే పెంచేసారు. సరిగ్గా ఇక్కడ తెలంగాణా అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో డైరెక్ట్ గా ఏపి పేరు చెప్పకపోయినా, అది ఏపి గురించే అని అర్ధం అవుతుంది. ఆయన ట్విట్టర్ లో మేమ్ పోస్ట్ చేసి, అందులో మా తెలంగాణా బస్సుల్లో టికెట్ రేట్లు అందరి లాగా పెంచం, హాయిగా మా బస్సుల్లో ప్రయాణం చేయండి అంటూ పోస్ట్ చేసారు. అయితే అందరి మీదకు వెళ్లే పేర్ని నాని గారు, ఇప్పటి వరకు దీని పైన అయితే కౌంటర్ ఇవ్వలేదు.

