జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన పై, మాజీ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. నిన్న విలేఖరులతో మాట్లాడిన ఆయన మాటలు, ఆయన మాటల్లోనే, "పోలవరం పర్యటనలో వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకొని స్పీల్ వే దగ్గరకు రాకుండా మీడియాను అడ్డుకొని పర్యవేక్షించడం సిగ్గు చేటు. పోలవరం డ్యాంలో ఏమి జరుగుతోంది. ఎన్ని మీటర్ల ఎత్తులో నీళ్లు వెళ్తున్నాయి. డ్యాం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ముఖ్యమంత్రి సమధానం కోసం ప్రజలు ఎదురు చూశారు. రివ్వూ పుస్తకం మీడియాకు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు. చంద్రబాబునాయుడు గారు పోలవరం పనులు 71శాతం పనులు పూర్తి చేశారు. ఆ సమాచారాన్ని నెట్ లో పెట్టేవారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నారు. సంవత్సరానికి ఒక్కోసారి వచ్చి మీరెందుకు భయ పడుతున్నారు. నాడు ఏమి ఉద్దరించారు. నేడు ఏమి ఉద్దరించారు. నాడు పోలవరం పనులు రద్దు చేశారు.. పవర్ ప్రాజెక్టుకు కక్కుర్తి పడ్డారు..నేడు పోలవరం పనులు రద్దు చేశారు. వేల కోట్ల అవినీతి అన్నారు. రీవర్స్ టెండర్స్ డ్రామా ఆడారు. మైనస్ 26 శాతం పనులు చేశారు. ధైర్యం ఉంటే పోలవరంలో ఎంత పనులు చేశారో ప్రజలకు తెలియజేయాలి. రూ.5,130కోట్లు ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 10ఏళ్లల్లో ఖర్చు చేశారు. చంద్రబాబునాయుడు గారు కేవలం 5ఏళ్లల్లో 11,567వేల కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం నుంచి నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానికి సుమారు రూ.4400కోట్లు తిరిగి ఇవ్వడం జరిగింది. వచ్చిన డబ్బులను లిక్కర్ కంపెనీలకు ఖర్చు చేశారు. నిర్వహితులకు కట్టడం ముఖ్యమా? తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి సంబంధించిన గ్రామాల నిర్వహితులను అన్ని రకాలుగా న్యాయం చేసిన తరువాతే డ్యాం కట్టడం జరిగింది. మీ పరిపాలనలో నిర్వహితులకు ఎంత చెల్లించారు..ఏ గ్రామంలో చెల్లించారో చేప్పే దమ్ము ఉందా? జగన్మోహన్ రెడ్డి డ్యాంను కట్టించినట్లు విగ్రహాం పెట్టుకొవడానికి..పాపికొండల్లో గెస్ట్హౌస్ లు కట్టుకొవానికి ప్రదేశం చూసుకోవడానికి వచ్చారా? లక్ష కుటుంబాలు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తుంటే పోలీసుల అండతో వారిని అడ్డుకోవడం సిగ్గుచేటు. నిర్వాసితులు బయట ఇల్లు అడుగుతుంటే కనీసం రూ.2లక్షలు అడుగుతున్నారు. హెలికాప్టర్ లో తిరిగి వచ్చి నేను పోలవరం కట్టాను అంటే సరిపోతుందా? 100 విగ్రహాం పెట్టుకుంటే సరిపోతుందా? రూ.55,655వేల కోట్లకు చంద్రబాబునాయుడు టెక్నకల్ అడ్వవేజర్ కమీటిలో పిబ్రవరి,2019లో అనుమతి తీసుకొస్తే... మీరు ఏవిధంగా రూ.47వేల కోట్లకు ఒప్పుకుంటారు? మీ సాయిరెడ్డి ట్విట్టర్ లో పెట్టారు. రూ.55వేల కోట్ల ప్రధాని ఒప్పించాడని డబ్బా కొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రూ. 55వేల కోట్లు కాకుంటే కనీసం రూ. 47వేల కోట్లు అడుక్కొని రమ్మంటున్నారు."

"28మంది ఎంపీలను పెట్టుకొని పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోతున్న అసమర్ధ ప్రభుత్వం ఈ దేశం లో ఉంటుందా? ఎందుకు ముఖ్యమంత్రి ప్రధాని మంత్రిని ఎదురించలేకపోతున్నారు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడుతున్నారా? 26నెలలగా ఎందుకు ముసుకొని కూర్చున్నారు. మీరు ఇచ్చిన రెఫరెండమ్ మీడియా కు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉందా? పోలవరం అంచనాలు, ప్రత్యేక హోదా ఇవాళ గుర్తుకొచ్చాయా? పోలవరం ఇర్నిగేషన్ లిప్ట్ ఇర్నిగేషన్ చేశారు. రూ.913కోట్లతో జీవో నెం 134 విడుదల చేశారు. పోలవరం ఇర్నిగేషన్ ను పోలవరం లిప్ట్ ఇర్నిగేషన్ చేసే అధికారం మీకెవర్చరు. 50గ్రామాలకు బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. కేంద్ర గెజిట్ లో బోర్డుల్లో ఎందుకు తీసుకెళ్లారు. పోలవరం కు లిప్ట్ పెట్టి రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం రూ. 18వేల కోట్లు ఖర్చు చేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం జౌన్ మొదటి వారానికి రూ.845కోట్లు ఖర్చు చేశారు. సమాచారం కూడా బయట పెట్టే ధైర్యం లేదు. వాటిలో కేవలం డ్యాంసైట్ కు రూ.445 కోట్లు ఖర్చు పెట్టారు. నిర్వాసితులకు ఇచ్చిన వాటిలో రూ.100కోట్లు అవినీతి జరిగిందని మేము బయట పెట్టడం జరిగింది. నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పారు. పాత వారికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. జీవో ఇచ్చి విడుదల చేసిన రూ.500కోట్లు ఎవరి అకౌంట్లల్లోకి వెళ్లాలాయి? పోలవరం ప్రాంత గిరిజనలు వారి ఆస్తులు, సాంస్కృతిని వదులుకున్న వ్యక్తులు. కాఫర్ డ్యాం 2019లో వరద నీళ్లు ఏ లెవల్ లో వచ్చాయో తెలియదా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తో లాలుచీ పడ్డారు. స్వయంగా శాసన సభలో ఒక్క అడుగు ఎత్తు తగ్గించుకోమంటే సమాధానం చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వెలుగొండకు , హాంద్రీనివా కు నీళ్లు ఎప్పుడు వెళ్తాయి? గాలేరు , సుజల శ్రవంతి కాలువలకు నీళ్లు ఎప్పుడు వెళ్తాయి? ముచ్చిమర్రికి నీళ్లు ఎప్పుడు వెళ్లాయి? రాయలసీమ లిఫ్ట్ ఇర్నిగేషన్ ఏమైంది? రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని బోర్డుకు అప్పచెప్పి గాడిదలు కాస్తారా? చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలినప్పుడు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ మూడు ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చమని చెప్పడం జరిగింది. నీటి వివాదాలకు సమాధానం చెప్పాల్సిన భాధ్యత ముఖ్యమంత్రికి లేదా? చంద్రబాబునాయుడు గారు రాసిన లేఖలు, పక్క రాష్ర్టాలు రాసిన లేఖలు, కేంద్రం రాసిన లేఖలు మీడియా కు ఇస్తా. వైవీ సుబ్బారెడ్డి రెండో సారి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవీ తీసుకున్నావు..వెలుగోండ ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? వెలుగొండ ప్రాజెక్టు స్రేలింగ్ మిస్టేక్ అంట? గడ్డి పీకుతున్నావా? రానీ సభ్యసభ కోసం కన్నీళ్లు పెడుతున్నావా? ప్రకాశం జిల్లా కు అన్యాయం జరిగితే ముసుకొని కూర్చుకొని ఉన్నారా?" అని దేవినేని ఉమా అన్నారు.

అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, ప్రభుత్వం వేసిన పిటీషన్ ని, నిన్న సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే దీని పై ఈ రోజు సుప్రీం కోర్టు పూర్తి తీర్పు అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పు కాపిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టు సమర్ధించింది. న్యాయమూర్తులు వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం నిన్న ఈ తీర్పు ఇచ్చింది. హైకోర్టు అన్ని వాస్తవాలను పరిశీలించిన తరువాతే, ఎఫ్ఐఆర్ ను కొట్టేసిందని, ఈ తీర్పులో చట్ట విరుద్ధమైన అంశాలు ఏమి లేవని, అన్ని కోణాలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుందని సుప్రీం కోర్టు తీర్పులో తెలిపింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రాజధాని ఎక్కడ అన్నది రహస్యం ఏమి కాదని, అది అందరికీ తెలిసిన విషయమే అని, పబ్లిక్ డొమైన్ లో ఎప్పటి నుంచో ఉందని, భూములు అమ్మిన వారికి నష్టం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. కొనుగోలు దారులు మోసం చేసారు అనే వాదనలకు కూడా ఎక్కడా ఆధారాలు లేవని చెప్పింది. ప్రైవేటు వ్యక్తుల మధ్య ఈ వ్యవహారం మొత్తం జరిగిందని, ప్రభుత్వ అధికారుల మీద కేసు పెట్టాలి అనే వాదనలో పస లేదని తెలిపింది. అంతే కాకుండా దర్యాప్తును ప్రాధమిక స్థాయిలో హైకోర్టు అడ్డుకుందని, ఆ అధికారం హైకోర్టుకు లేదనే వాదనను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

amaravati 20072021 2

హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతే కాకుండా, ట్రాన్స్ఫర్ అఫ్ ప్రాపర్టీ ఆక్ట్ అనేది కూడా ఇక్కడ రాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ లు ఏవైతే దాఖలు అయ్యయో, ఆ ఎఫ్ఐఆర్ లు అన్నిటినీ కూడా పరిశీలించిన తరువాతే, హైకోర్టు అన్ని లావాదేవీలు పరిశీలించి, ప్రభుత్వం ఉద్దేశాలు, దురుద్దేశాలు పరిశీలించిన తరువాతే, ఈ కేసుని కొట్టివేయటం జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వర్తించదు అనే హైకోర్ట్ వ్యాఖ్యలతో సుప్రీం ఏకీభవించింది. ఇక మరో అంశం సుప్రీం కోర్టు లేవనెత్తింది, టైం అంశం. ఇది అంతా 2014లో జరిగితే, ఇప్పటి దాకా ఏమి చేసారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆరేళ్ళ వరకు ఎందుకు సమయం వృధా చేసారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మారిన తరువాత మాకు ఈ అవినీతి విషయం తెలిసింది అని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పటంతో, కోర్టు ఇందులోని దురుద్దేశాన్ని గుర్తించిందనే చెప్పాలి. మొత్తానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ, సుప్రీం కేసుని కొట్టేసింది.

నర్సాపురం ఎంపీ రఘురామరాజు మరోసారి తనదైన శైలిలో పంచ్ లు వేసారు. ఇలా చెప్పాలి అంటే కూడా భయం వేస్తుంది. ఎందుకుంటే రఘురామరాజు ప్రెస్ మీట్ అయిన తరువాత, విలేఖరులు మీ పంచ్ బాగుంది అంటూ కామెంట్లు చేసారని, ఇది కూడా రాజద్రోహం కిందకు వస్తుంది అంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తరువాత, ఇలా కూడా చెప్పటం తప్పు ఏమో అనే విధంగా మీడియా ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. ఇక విషయానికి వస్తే, ఈ రోజు సాక్షి పేపర్ లో, రఘురామరాజు, లోకేష్, చంద్రబాబు మధ్య వాట్స్ అప్ సంభాషణ జరిగిందని, అందులో రఘురామరాజు , చంద్రబాబుకి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పంపించారని, చంద్రబాబు దాన్ని చూసారని, అలాగే లోకేష్ తో కూడా అనేక విషయాల పై రఘురామరాజు మాట్లాడారని, ఇదంతా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని, అందుకే రాజద్రోహం కేసు పెట్టారు అంటూ సాక్షిలో రాసుకొచ్చారు. రఘురామ రాజు ఫోన్ సీజ్ చేసి, తరువాత సిఐడి ఆ ఫోన్ లో ఉన్న మెసేజ్ లు అన్నీ చూడగా, ఇవి బయట పడినట్టు సాక్షిలో రాసుకొచ్చారు. అయితే అది చదివిన ఎవరికైనా ఇందులో రాజద్రోహం ఏమి ఉందో అర్ధం కావటం లేదు. జగన్ మీద కేసులు ఉన్నది నిజం, ఆయన బెయిల్ మీద బయట ఉన్నది నిజం, ఆ బెయిల్ రద్దు చేయమని, వివిధ కారణాలతో రఘురామరాజు పిటీషన్ వేసారు.

rrr 20072021 2

అది చంద్రబాబుతో మాట్లాడి వేసరా, లోకేష్ చెప్తే వేసారా అనేది కోర్టుకు అనవసరం, అందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది కోర్టు చుస్తుంది. అయితే బెయిల్ రద్దు పిటీషన్ వేయటమే రాజద్రోహం అనే విధంగా సాక్షి వండి వార్చింది. ఈ కధనం పై రఘురామరాజు స్పందించారు. అవును నేను చంద్రబాబుతో వాట్స్ అప్ చాట్ చేసింది నిజమే అనుకుందాం, అందులో తప్పు ఏముంది అని ప్రశ్నించారు ?తన ఫోన్ కోడ్ ను బ్రేక్ చేసి మరీ, వాట్స్ అప్ మెసేజ్ లు కల్పించి మరీ తాయారు చేస్తున్నారని అన్నారు.జగన్ బెయిల్ రద్దు చేయమని పిటీషన్ వేసి, దానికి సంబంధించిన సమాచారం వేల మందితో పంచుకున్నా అని, అందులో చంద్రబాబు కూడా ఉన్నది నిజమే అనుకున్నా, అది రాజద్రోహం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. సిఐడి విచారణ చేసే అంశాలు సాక్షిలో ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నా ఫోన్ లో నేను ఎవరికో మెసేజ్ లు పెట్టుకుంటే, మీకు వచ్చిన నొప్పి ఏంటి, నువ్వు ఎవరు అడగటానికి అని ప్రశ్నించారు. ఈ వాట్స్ అప్ చాటింగ్ ఆరోపణలతో నన్ను మీరు ఏమి చేయలేరని, అయితే పెగాసెస్ తో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు పై నిఘా పెట్టారని తనకు తెలిసింది అంటూ బాంబు పేల్చారు. మరి ఇది నిజమో కాదో ప్రభుత్వమా ఎలా స్పందిస్తుందో చూడాలి.

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ రోజు భేటీ అవ్వటం ఢిల్లీలోనే కాక, రాష్ట్రంలో కూడా చర్చనీయంసం అయ్యింది. అమిత్ షా కార్యాలయానికి వెళ్ళిన రఘురామరాజు, సుమారుగా 20 నిమిషాల పాటు, ఆయనతో చర్చించారు. ఈ భేటీ సందర్భంగా, రఘురామకృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. అలాగే రఘురామకృష్ణం రాజు అరెస్ట్ సమయంలో జరిగిన విషయాలను కూడా రఘురామకృష్ణం రాజు, అమిత్ షా కు వివరించారు. గతంలోనే రఘురామకృష్ణం రాజు కుటుంబ సభ్యులు, రఘురామ ఆరెస్ట్ సమయంలో, ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు, సుప్రీం కోర్టులో కేసు తరువాత, రఘురామరాజు బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత, రఘురామకృష్ణం రాజు , కేంద్రం హోం మంత్రిని కలవటానికి ప్రయత్నం చేసినా, అమిత్ షా బిజీ షడ్యుల్ లో కుదరలేదని తెలుస్తుంది. అయితే ఈ రోజు రఘురామకృష్ణం రాజు, అమిత్ షాని కలిసారు. ఆరోగ్య పరిస్థితి, అరెస్ట్ చేసిన తీరుతో పాటుగా, ఏపిలో రాజకీయ పరిస్థితులు పై కూడా, రఘురామరాజుని, అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఏపిలో రాజకీయ పరిస్థితితులు పై ఎక్కువ సేపు చర్చించినట్టు తెలుస్తుంది.

rrr 20072021 11 2

దీంతో పాటుగా, ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతున్న తీరు పై కూడా ఇరువురి మధ్య వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి రఘురామరాజు మరో విషయం కూడా తీసుకుని వెళ్లారు. వైసీపీ నేతలు తనను అనర్హుడిగా ప్రకటించాలని, స్పీకర్ కు ఫిర్యాదు చేయటం, అసలు ఎందుకు వాళ్ళు ఆ అనర్హత పిటీషన్ వేసారు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు కూడా, అమిత్ షాతో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే రాష్ట్రంలో సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారు తీరు, ఏపి పోలీసులు వ్యవహారం పై కూడా రఘురామరాజు, అమిత్ షా దృష్టికి తెచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి తన అరెస్ట్ నుంచి విడుదల వరకు, అలాగే తన ఫోన్ సంభాషణలు బహిర్గతం అవ్వటం పై కూడా, అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఇవన్నీ విన్న అమిత్ షా, పార్లమెంట్ సమావేశాల తరువాత, అన్ని అంశాల పై, మళ్ళీ కలుద్దాం అంటూ, రఘురామకృష్ణం రాజుకు చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read