ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో, హైదరాబాద్ రాష్ట్రాన్ని పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా చట్టంలో పెట్టారు. అయితే మనకంటూ ఒక రాజధాని అవసరం అని భావించిన చంద్రబాబు, 2015లో అమరావతి నిర్మాణం మొదలు పెట్టారు. అప్పటి వరకు హైదరాబాద్ నుంచి పని చేసిన సచివాయలంతో పాటుగా, ఇతర శాఖలు అన్నీ నెమ్మదిగా అమరావతి వచ్చేసాయి. అయితే హైదరాబాద్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న భావనలు అన్నీ మన హ్యాండ్ ఓవర్ లోనే ఉండేవి. పదేళ్ళ వరకు మనకు హక్కు ఉండటంతో, ఆ భవనాలు వాడుకుంటూ ఉండేవారు. అయితే చంద్రబాబు ఉండగా, ఆ భవనాలు తీసుకోవాలని కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తరువాత చంద్రబాబు ఓడిపోయి, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండానే, క్యాబినెట్ భేటీలో కనీసం నిర్ణయం తీసుకోకుండానే, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హ్యాండ్ ఓవర్ లో ఉన్న సచివాలయం భవనాలు, తెలంగాణాకు ఇచ్చేసారు. ఇక తెలంగాణా నుంచి రావలసిన 5 వేల కోట్లు విద్యుత్ బకాయల పై సౌండ్ లేదు, అలాగే ఇంకా చాలా అంశాల పై సౌండ్ లేదు. ఇంతలా జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కు సహకారం అందిస్తున్నా, కేసీఆర్ మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.

aptg 09072021 2

గత 20 రోజులుగా ఇరు రాష్ట్రాల మధ్య జల జగడం చూస్తూనే ఉన్నాం. ఇది ఉత్తుత్తి గొడవో, లేకపోతే ఏమిటో తెలియదు కానీ, మొత్తానికి ఇది చర్చలో పెట్టారు. అయితే ఇక్కడ కూడా తెలంగాణా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే, ఏపి మాత్రం లేఖల దగ్గరే ఉండి పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలంగాణా మరో షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి [పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం ఉంది. అయితే ఇదే భవనంలో తెలంగాణాకు కూడా ఉంది. రెండు అంతస్తుల్లో తెలంగాణాకు ఉంటే, మరో రెండు అంతస్తుల్లో ఏపికి ఉంది. అయితే ఈ కార్యాలయాన్ని ఏపికి తరలించినా, ఇది ఇంకా ఏపి హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. అప్పుడప్పుడు అధికారులు వచ్చి తమ కార్యకలాపాలు చేసుకుని వెళ్తారు. అయితే ఈ బిల్డింగ్ కు ఉన్నట్టు ఉండి తెలంగాణా ప్రభుత్వం సీల్ వేసింది. ఈ ఆఫీస్ ని ఏపి ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్‌కు ఇస్తుందని, అలా కుదరదు అంటూ, ఏపి హ్యాండ్ ఓవర్ లో ఉన్న బిల్డింగ్ కు, తెలంగాణా అధికారులు సీల్ వేసారు. మరి దీని పై ఏపి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు, అలాగే సభా హక్కుల కమిటీ చైర్మెన్ కు, నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ రోజు లేఖ రాసారు. తన పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కలిసిన అనంతరం, మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన, సభా హక్కుల చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు. అంతే కాకుండా, స్పీకర్ పక్షపతంగా వ్యవహరిస్తున్నారు అంటూ, లోక్సభ స్పీకర్ పై, విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, రఘురామరాజు ఫిర్యాదు చేసారు. అలాగే తన పై అనర్హత వేటు వేయకపోతే, వచ్చే పార్లమెంట్ సభని అడ్డుకుంటాం అంటూ కూడా విజయసాయి రెడ్డి బెదిరింపులకు దిగారని కూడా ఆ ఫిర్యాదులో తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా, రాజ్యసభలో, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారని, అప్పట్లో ఆయన చర్యల పై అందరూ అభ్యంతరం చెప్పటంతో, ఆయన రాజ్యసభకు, చైర్మెన్ కు సారీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ పై, ఇలా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం మంచది కాదని, ఒక పరిణితి చెందిన వ్యక్తి ఇలా స్పీకర్ పై కామెంట్ చేయటం కరెక్ట్ కాదని, ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, సభా హక్కల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లేఖలో రాసారు.

vsreddy 09072021 2

అయితే ఆయన రాజ్యసభకు చెందిన వ్యక్తి కావటం, ఇప్పుడు రఘురామరాజు లోక్సభ స్పీకర్ కు విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేయటంతో, దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మాములుగా సభా హక్కుల ఉల్లంఘన అనేది, తమ సభ సభ్యలు అయితేనే ఇస్తారు, ఇక్కడ మాత్రం వేరే సభలో ఉన్న వ్యక్తీ, ఇక్కడ సభలో ఉన్న స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు కాబట్టి, సభ హక్కుల ఉల్లంఘన కింద రఘురామకృష్ణం రాజు ఇచ్చిన నోటీసుని స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు ఢిల్లీలో ఉన్న విజయసాయి రెడ్డి, పార్లమెంట్ స్పీకర్ ని కలిసారు. ముఖ్యంగా రఘరామకృష్ణం రాజు పై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ని కలిసారు. ఆయన పై ఫిర్యాదు చేసి చాలా రోజులు అయ్యిందని, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అయితే బయటకు వచ్చి, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, సభను ఈ విషయంలో అడ్డుకుంటాం అంటూ బెదిరించటం పై రఘురామరాజు ఫిర్యాదు చేసారు.

ముందుగా మనకు తెలిసిన ఒక విషయం చెప్పుకుందాం. మనం ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఆ అప్పు ఊరికే ఇవ్వరు, నీకు ఉండే ఆదాయం ఏమిటో చూస్తారు, ఆ ఆదాయం సరిగ్గా లేదు అనుకుంటే, ఆస్తులు తనఖా పెట్టమంటారు, ఇంకా ఎక్కడైనా కక్కుర్తి పడే వాళ్ళు ఉంటే, ఎక్కవ వడ్డీకి అప్పు ఇస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పు తిరిగి కాట్టటం లేదు అనుకోండి అని ఏమి చేస్తారు ? మనకు బ్యాంకులో మన జీతం కానీ, మరే ఇతర లావాదేవీలు పడినా, వెంటనే అవి అప్పు బాకీ కింద లాగేసుకుంటారు. అదీ కుదరకపోతే, చివరకు మనం తనఖా పెట్టిన ఆస్తులు లాగేసుకుంటారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. అయితే ఇంకా తనఖా వరకు రాలేదు కానీ, బ్యాంకులో డబ్బులు లాగేసుకునే దాకా వచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే తొమ్మిదో తారీఖు వచ్చినా, ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. అంతే కాదు, పెన్షనర్లకు కూడా ఇంకా పెన్షన్లు పడలేదు. ఇలా నెల రెండో వారం దాకా జీతాలు పడకపోవటం, ఈ మధ్య గత 20 ఏళ్ళలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. అయితే సాంకేతిక కారణాలు అని చెప్తున్నా, ఖజానాలో నిధులు లేక చెల్లింపులు చేయలేదని అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఎలాగైనా అప్పు తెచ్చుకోవటం కోసం, ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మంత్రి బుగ్గన ఢిల్లీలో మకాం వేసి చివరకు ఆర్బిఐ దగ్గర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వడ్డీ కట్టి మరీ రెండు వేల కోట్లు తెచ్చారు.

rbi 09072021 2

చివరకు అస్సాం రాష్ట్రం కంటే, మనమే ఎక్కువ వడ్డీ కట్టాం అంటే, మన పరపతి ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఇక కేంద్రం నుంచి కూడా రెవిన్యూ లోటు భర్తీ కింద రూ.1470 కోట్లు వచ్చాయి. దీంతో ఇక జీతాలు, పెన్షన్లు చెల్లించవచ్చని ప్రభుత్వం భావించింది. సరిగ్గా ఇక్కడే ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లో కొన్ని నిధులు వాడుకుంది. అవి పరిమితి లోపే తిరిగి కట్టేయాలి. అవి తిరిగి కట్టక పోవటంతో, అప్పుగా తెచ్చుకున్న రెండు వేల కోట్లు, అలాగే రెవిన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లు మినాయించుకుంది. అయినా ఇంకా 800 కోట్లు ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. దీంతో అప్పు పుట్టిన ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళాలి అనుకున్నా, రూ.1400కోట్ల తీసుకుంటే నాలుగు రోజుల్లో, అంత కంటే ఎక్కువ తీసుకుంటే 14 రోజుల్లో తిరిగి చెల్లించాలి. ఇప్పటికే 800 కోట్లు బాకీ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తే, ఈ 14 రోజుల్లో అంత ఆదాయం రాకాపోతే, మళ్ళీ ఆర్బిఐ ఊరుకోదు. దీంతో ప్రభుత్వానికి ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితి. మరి జీతాలు, ఎలా ఇస్తారో చూడాలి.

ఈ నెల ఆరవ తేదీన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కంపెనీకి చెందిన రాంకీ సంస్థల పై ఐటి శాఖ అధికారులు, పెద్ద ఎత్తున, దాదాపుగా 20 బృందాలతో కలిసి సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా, ఇలా వీటికి సంబందించిన కార్యకలపాలు చేస్తూ ఉంటారు. అయితే రాంకీ ఐటి సోదాల్లో ఆసక్తికర విషయాలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థలో ఎక్కువ వాటాని, సింగపూర్ కు చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు అమ్మేసారు. తద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, సుమారుగా 1200 కోట్ల రూపాయలని, మొత్తాన్ని వైట్ లోకి మార్చుకునేందుకు రంగురంగుల స్కీంలను వీళ్ళు ప్రవేశ పెట్టారు అంటూ, ఐటి శాఖ ఈ రోజు ఇచ్చిన ప్రెస్ నోట్ లో తెలిపింది. అలాగే క్యాపిటల్ గెయిన్స్ నుంచి టక్స్ మినహాయింపు పొందటం కోసం, అనేక పధకాలు ప్రవేశపెట్టారని, ఈ 1200 కోట్ల రూపాయలు కృత్రిమంగా నష్టం వచ్చినట్టుగా, లెక్కలు చూపించారని, దొంగ లెక్కలు చూపించి పన్ను ఎగ్గొట్టారు అంటూ ఐటి అధికారులు తెలిపారు. ఎక్కవ స్టేక్స్ సింగపూర్ లో ఉన్న ఎన్ఆర్ఐ కు అమ్మారు అంటూ, సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా అధికారులకు తెలిసి, ఈ వచ్చిన ధనాన్ని ఏమి చేసారు అంటూ, ఇంకా లోతుగా ఐటి అధికారులు దర్యాప్తు చేస్తే, ఈ మొత్తం ధనాన్ని కృత్రిమంగా నష్టం వచ్చినట్టు చూపించారని గుర్తించారు.

ramky 09072021 2

కృత్రిమంగా నష్టం ఎలా వచ్చింది అని చెప్పటానికి, అనేక రంగు రంగుల స్కీంలు పెట్టినట్టు గుర్తించారు. ఇక మరో విషయం, రూ.288 కోట్లకు సంబంధించి, పత్రాలను సంస్థ నాశనం చేసిందని, ఐటి అధికారులు గుర్తించారు. మరో 300 కోట్లకు సంబంధించి, బ్లాక్ మనీ కూడా పట్టుకున్నారు. అయితే ఈ బ్లాక్ మనీ పై, పన్ను చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్టు ఐటి శాఖ తెలిపింది. మొత్తానికి పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది అంటూ ఐటి శాఖ ప్రకటించింది. సెబి ఇచ్చిన ఫిర్యాదులు మేరకు, ఐటి శాఖ సోదాలు చేసినట్టు తెలిపింది. దీని పై గత రెండు మూడు రోజులుగా అనేక ఆరోపణలు, అనేక విశ్లేషణలు నడిచాయి. 20 బృందాలు పాల్గునటంతో, అందరికీ ఆసక్తి నెలకొంది. రాంకీ అధినేత అయోధ్య రామి రెడ్డి, వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. ఈయన దేశంలోనే ధనవంతులు ఎంపీల్లో ఒకరుగా ఉన్నారు. అలాగే ఈయన జగన్ కేసుల్లో కూడా ఉన్నారు. జగన్ కేసుల్లో ఏ4గా అయోధ్య రామిరెడ్డి ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read