జగన్ మోహన్ రెడ్డి పై తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే "ప్రభుత్వం ఎవరిని మోసగించడానికి కేబినెట్ సమావేశం నిర్వహించిందో తెలియడంలేదు. నిరుద్యోగులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం మరోపక్కన రైతులను నిండాముంచడానికి చేతగాని దర్పాన్ని ప్రదర్శిస్తోంది. తాను ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణం తీర్చుకోవడానికి జగన్ రెడ్డి ఈ రోజు వరకు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాడు. చివరకు రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేసి, పొరుగు ముఖ్యమంత్రితో ఉత్తుత్తి యుద్ధాలకు తెరలేపుతున్నాడు. ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి, ఇరువురి మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయో అందరూ గమనించాలి. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలను ఆంధ్రాకు, 299టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. ఆ జలాలను వాడుకోవడంలో, మిగులుజలాల వినియోగంలో, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటివాటా సాధనలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? అక్కడేమో కేసీఆర్ సవాల్ చేస్తుంటే, ఇక్కడేమో పిల్లిలా జగన్మోహన్ రెడ్డి బయటకు తొంగిచూస్తున్నాడు. ఎందుకింత బాధవచ్చిందో ఆయనే చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన నీటిని సాధించడంలో ఎందుకింతలా భయపడిపోతున్నాడు? ఎందుకింతలా మెతకవైఖరి అవలంభిస్తున్నాడు? కృష్ణాజ లాల వినియోగంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో, రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. కృష్ణా వాటర్ బోర్డుని విజయవాడ నుంచి విశాఖపట్నం తరలించాలి అని భావించినప్పుడే ముఖ్యమం త్రి చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైంది. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా నది నీటి నిర్వహణకు సంబంధించిన బోర్డుని ఎప్పుడైతే విశాఖకు తరలించాలని, ఈ ముఖ్యమంత్రి భావించాడో, అప్పుడే కృష్ణాజలాలపై పెత్త నాన్ని తనకుతానే కేసీఆర్ కు అప్పగించాడు. జగన్మోహన్ రెడ్డి తాకట్టు రాజకీయాలకు కృష్ణా జలాల వివాదమే నిదర్శ నం. తెలంగాణలో, కేసీఆర్ కనుసన్నల్లో ఉన్న తన ఆస్తుల సంరక్షణ కోసమే ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగం ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్దమయ్యాడు. ధానికి, కేంద్రజలశక్తి మంత్రికి, లేఖలు రాస్తామంటున్నా రు. ఉన్న పుణ్యకాలం కాస్తా ముగియడానికే లేఖల రాయబారాన్ని తెరపైకి తెచ్చారు. ఈవ్యవహారం నుంచి ప్రజలదృష్టి, మరీముఖ్యంగా రైతులదృష్టి మళ్లించడానికే జగన్మోహన్ రెడ్డి పెదవా లంటీర్ గోదావరి నదీ పర్యటనకు వెళ్లాడు.

పోలవరం లో ఉన్న ప్రధాన సమస్య నిర్వాసితుల సమస్య. దాన్ని పరిష్కారంచేయకుండా, దానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించకుండా, నిర్వాసితులకు ఒక భరోసా కల్పించకుండా సజ్జల పోలవరం వెళ్లి, పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. సజ్జలకు నిజంగా సిగ్గుందా అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు టీడీపీ ప్రభుత్వ హాయాంలోనే 72శాతం వరకు పూర్తయ్యాయి. రూ.12వేల కోట్ల నిధులు వెచ్చించి, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు పరుగులు పెట్టించారు. అలాంటి వ్యక్తి గురించి పెద వాలంటీర్ సజ్జల పిచ్చిప్రేలాపనలు చేస్తున్నాడు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏంచెప్పాడో సజ్జలకు గుర్తులేదా? పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసి తులందరికీ న్యాయం చేస్తానని, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తానని చెప్పింది మర్చిపోయావా సజ్జలా ? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాయాంలో జరిగిన ఆర్ అండ్ ఆర్ , ల్యాండ్ అక్విజేషన్ కు అదనంగా రూ.5లక్షలిస్తానని చెప్పింది నిజంకాదా? అసలు ముంపునకే గురికాని 1300 ఎకరాల భూమిఉంటే, దానికి కూడా డబ్బులిస్తానని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పలేదా? అవేవీ పట్టించుకోకుండా, నేడు ముసుగేసుకొని తాడేపల్లిలో కూర్చుంటే, బాధ్యతలేని సజ్జల, అబద్ధాలే తన ఆహారంగా బతికే సజ్జల నిర్వాసితుల ముందు ఏదేదో మాట్లాడుతున్నాడు. ముంపు ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా కాఫర్ డ్యామ్ ఎలా మూసేస్తారో సజ్జల చెప్పాలి? ప్రభుత్వాని ప్రజలందరి పక్షాన బాధ్యతవహించడం తెలియదా? ఈవ్యవ హారంపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంగతేమిటో తేలుస్తాం. అఖిలపక్షనేతలంతా కలిసి పోలవరంప్రాంతాన్ని సందర్శించి, నిర్వాసితులను కలిసి, వారికి రావాల్సిన న్యాయమైన పరిహారం వారికి అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెలంగాణాతో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే, చంద్రబాబు లాగా జగన్ గట్టిగా ఆడగలేరు కాబట్టి, కేసీఆర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. జగన్ మొహన్ రెడ్డిని వాటేసుకోవటం, భోజనాలు పెట్టివ్వటం ఇవ్వన్నీ చూసాం. జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండానే, క్యాబినెట్ లో చర్చించకుండా, రాత్రికి రాత్రి, హైదరాబాద్ సచివాలయంలో ఉన్న ఏపి భవనాలు తెలంగణాకు ఇచ్చేసారు. మన దగ్గర ఉన్న గోదావరి నీరు, తెలంగాణా నుంచి పంపిస్తాం, కేసీఆర్ మ్యగ్నానమస్ అంటూ కీర్తించారు. అలాగే గతంలో చంద్రబాబు గొడవ చేసిన విద్యుత్ బకాయలు గురించి అడగటం లేదు. తొమ్మిది, పదో షడ్యుల్ ఆస్తులు విభజన ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందుకే ఏమో చంద్రబాబు కంటే, జగన్ రావాలని కేసీఆర్ కోరుకున్నారు. గత రెండేళ్లుగా ఇవన్నీ బాగానే సాగాయి. అయితే ఏమైందో ఏమో కానీ, ఏమి లేకుండా, అటు వైపు నుంచి తెలంగాణా అందుకుంది. గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల పధకం కడుతున్నారని, నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు అంటూ, హడావిడి మొదలు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అన్నారు, జగన మోహన్ రెడ్డి దొంగ అన్నారు, ఇలా ఎన్నో మాటలు అటు వైపు నుంచి వచ్చాయి.

jagan 30062021 1

అయితే ఇటు వైపు మాత్రం మౌనం. నిన్నటి నుంచి తెలంగాణా మరింత ముందుకు వెళ్ళింది. నీళ్ళు సరిపడా లేకపోయినా శ్రీశైలం సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టారు. దీంతో రాయలసీమకు దక్కాల్సిన నీళ్ళు ఆగిపోతున్నాయి. అలాగే పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు, దీంతో అక్కడ కృష్ణా డెల్టాకు నీళ్ళు రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అయ్యింది. ఇంకేముంది, తెలంగాణ పై సమరమే అని అందరూ అనుకున్నారు. అయితే కేవలం ప్రధానికి లేఖ రాయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కాబట్టి, ఓర్పుగా ఉంటున్నామని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై విమర్శలు వస్తున్నాయి. మరి గతంలో ప్రతిపక్ష నేతగా జలదీక్షలు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుకురాలేదా అని విమర్శలు వస్తున్నాయి. అప్పుడు పోరాడినట్టే, ఇప్పుడు ఎందుకు తెలంగాణా పై పోరాడరు, ఎందుకు ఈ బేల మాటలు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

విజయవాడలో నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొననున్న ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పునర్‌నిర్మాణం దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉన్నాం అని, హోదా విషయంలో రెండు ప్రభుత్వాలు విఫలం చెందాయని, రాష్ట్రంలో ధరల భారంపై జులై 7 నుంచి 17 వరకు నిరసనలు చేస్తున్నామని, అసలు అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఉమెన్ చాందీ అన్నారు. అయితే ఈ సందర్భంగా విలేఖరులు చిరంజీవి గురించి అడగగా, ఆయన ఇప్పుడు తమతో లేరని, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గునటం లేదని చెప్తూ, పార్టీకి దూరం జరిగారు అనే విధంగానే సమాధానం చెప్పారు. అయితే, ఈ విషయం పై, ఈ రోజు మళ్ళీ మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మాట్లాడుతూ, చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టీకరణ చేసినట్టు చెప్పారు. సినీ రంగంలో చిరంజీవి బిజీగా ఉండటం వల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మాత్రమే ఉమెన్ చాందీ అన్నారుని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదే అని భవిష్యత్ లో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి అంటూ శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో జల విద్యుత్ కేంద్రాల వద్ద, ఏపికి చెప్పకుండా తెలంగాణా వంద శాతం పవర్ జనరేషన్ జరుగుతూ ఉండటం పై మళ్ళీ వివాదం నెలకొంది. నాగార్జన సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వంద శాతం పవర్ జనరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పులిచింతల ప్రాజెక్ట్ వద్ద జల విద్యుత్ ఉత్పాదన కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. ఆంధ్రప్రదేశ్ లో పులిచింతల ఏపి భూభాగంలో ఉండగా, హైడల్ పవర్ ప్రాజెక్ట్ మాత్రం తెలంగాణా భూభాగంలో ఉంది. తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా చింతల పాలెం వద్ద ఈ ప్రాజెక్ట్ పవర్ జనరేషన్ అవుతూ ఉంటుంది. గత రాత్రి నుంచి కూడా తెలంగాణా ప్రభుత్వం పవర్ జనరేషన్ ప్రారంభించింది. 1500 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుని ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, విద్యుత్ ఉత్పాదన మొదలు పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కూడా సుతిమెత్తగానే వెళ్తుంది. తెలంగాణా దూకుడుగా వెళ్తుంటే, ఏపి మాత్రం కేవలం కేంద్రానికి లేఖలో ఫిర్యాదు చేసి ఊరుకుంది. గత వారం అక్రమ ప్రాజెక్ట్ లు విషయంలో కూడా అన్ని తిట్టులు తిట్టినా, కేవలం లేఖలు రాసి ఊరుకున్నట్టే, ఇక్కడ కూడా ఏపి ప్రభుత్వం అదే పని చేసింది.

power 30062021 2

తెలంగాణా అధికారులు విద్యుత్తు ఉత్పాదన చేస్తూ ఉంటే, నీరు అంతా బయటకు వెళ్లి పోతుయి, దీని వల్ల కృష్ణా డెల్టాలో సాగు తాగు నీరు అవసరాల కోసం, కృష్ణా డెల్టాలో నారు మళ్ళుకి, కృష్ణా, గుంటూరులో తాగు నీటికి ఇబ్బంది అయ్యే అవకాసం ఉంది. పులిచింతల ఉన్న నీటిని తెలంగాణా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటే, ఏపి ఇంకా దూకుడుగా వెళ్లకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపుగా రెండు వేల క్యూసేక్కుల నీటిని వాడుకున్నారు. ఇప్పుడు కూడా పవర్ జనరేషన్ జరుగుతూ ఉంది, దీంతో పులిచింతల ప్రాజెక్ట్ లో ఉన్న నీరు తగ్గిపోతుంది. మరో పక్క శ్రీశైలం, నాగార్జున సాగర్ లో కూడా వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు మొత్తం కృష్ణా నీళ్ళు తెలంగాణా వాడేసుకుంటుంది. అటు రాయలసీమకు , ఇటు కృష్ణా డెల్టాకు కూడా ఇబ్బంది అయ్యే అవకాసం ఉంది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read