క-రో-నా వ్యాక్సిన్లకు సంబంధించి, ప్రభుత్వం 13 లక్షల రికార్డు అంటూ చేస్తున్న హంగామా పై టిడిపి స్పందించింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ వెబ్ సైట్ వివరాలు చూస్తే, ఏ ఏరాష్ట్రాలు ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చాయో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2కోట్ల76లక్షల పైచిలుకు వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వగా, ఉత్తరప్రదేశ్ లో 2కోట్ల56 లక్షలు, రాజస్థాన్ లో 2కోట్ల12లక్షలు, గుజరాత్ లో 2కోట్ల21 లక్షల వ్యాక్సినేషన్ డోసులఇ వ్వడం జరిగింది. అలానే పశ్చిమ బెంగాల్లో కోటి90లక్షలు, కర్ణాటకలో కోటి84లక్షలు, మధ్యప్రదేశ్ లో కోటి50లక్షల వరకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఏదో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్లుచెబుతున్న రికార్డుస్థాయి వ్యాక్సిన్లు కలిపినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు వేసింది కేవలం కోటి39 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎంత వెనకబడి ఉందో అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ ఫేర్ వారిగణాంకాలే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి ఒకే రోజులో వ్యాక్సిన్లు వేసిగొప్పలు చెప్పుకుంటున్నా రు. మిగతా రాష్ట్రాలతో పోల్చిచూసి, వారెక్కడున్నారో ఎన్ని వ్యాక్సిన్లు వేశారో గ్రహిస్తే మంచిది. ఈప్రభుత్వమే ఒకమోసకారి ప్రభుత్వం. ముఖ్యమంత్రే పెద్ద మాయలఫకీర్ లా తయారయ్యాడు. అన్నీ మాయ మాటలే. 13లక్షలవ్యాక్సిన్ డోసులు ఒకే రోజులో వేసినట్లు తెగగొప్పలు చెప్పుకుంటన్నారు. 20వతేదీకి ముందు 5 రోజులపాటు ఎన్నివ్యాక్సిన్లు వేశారో, అదికూడా చెప్పమనండి. ఈ నెల 15వ తేదీన 83వేల వ్యాక్సిన్లు వేశారు. 16వతేదీన 31,600 ... 17న 22,300, 18వతేదీన 22,700, 19న సుమారుగా 28వేల వ్యాక్సిన్లు వేశారు. 5రోజులపాటు దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసి, తూతూమంత్రంగా అతితక్కువగా వ్యాక్సిన్లు వేశారు. ఈ ప్రభుత్వం నిర్వహించిన వరల్డ్ రికార్డు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఐదురోజుల ముందువేసిన వ్యాక్సిన్ డోసులు ఎన్నిఉన్నాయో చూశారుగా? 5రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేసి, ఏదో తూతూ మంత్రంగా వేసి, తరువాత ఒకేరోజు వాటన్నింటినీ భర్తీ చేసేలా వ్యాక్సిన్లు వేయించి ఏదో రికార్డులు సాధించినట్లు చెప్పుకుంటారా సిగ్గులేకుండా? ముఖ్యమంత్రి డ్రామాలు ఎవరికి తెలియవను కుంటున్నారు? ఈరోజు మేం చెప్పిన లెక్కలు తప్పనిచెప్పగల ధైర్యం మీకు, మీప్రభుత్వానికి ఉందా?"

"రోజులతరబడి వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపేసి, రికార్డు కోసమని ఒకేరోజున నిబంధనలకు విరుద్ధంగా జనాలను గుంపులుచేసి, 20వతేదీన వ్యాక్సిన్ల పంపిణీలో రికార్డు సాధించామని చెప్పుకుంటారా సిగ్గులేకుండా? రద్దీ లేకుండా భౌతికదూరం పాటించేలా ప్రజలను ఉంచి వ్యాక్సిన్లు ఇవ్వాలి. కానీ 20వతేదీన మీరేంచేశారు? ఒక్కసారిగా కొన్నివేల మందిని వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించి, భౌతికదూరం పాటించకుండా, రికార్డుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? మీరిచ్చేవ్యాక్సిన్ల కోసం ప్రజలు చనిపోవాలా? ముఖ్యమంత్రి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రాష్ట్రం ఇప్పటికీ బాగా వెనుకబడే ఉంది. నేటికీ ఇంకా రాష్ట్రంలో 74.15శాతంప్రజల కు ఒక్కడోసు కూడా వ్యాక్సిన్లు అందలేదు. 84లక్షల60వేల మంది రెండో డోసు కోసం కళ్లుకాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. గత ఏడురోజుల్లో (12వతేదీ నుంచి 19వతేదీవరకు) ఏపీ వ్యాక్సినేషన్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం 5.27శాతంమాత్రమే. దేశస్థాయిలో ఇది చాలా తక్కువ. 12వ తేదీనుంచి 19వతేదీ వరకుచూస్తే, మొత్తంగా ప్రభుత్వమిచ్చిన వ్యాక్సిన్లు 6లక్షలు. దానిలో 15 నుంచి 19వతేదీవరకు చూస్తే సుమారుగా లక్షా80వేలుమాత్రమే ఇచ్చారు. మిగతా రాష్ట్రాలేమో 3లక్షలు, 4లక్షలు, 5లక్షల వ్యాక్సిన్లు ఇస్తుంటే, మనరాష్ట్రం మాత్రం 20వేలు, 22వేలు, 28వేలకు పరిమితమైంది. మిగిలినరోజుల్లో తగ్గించిన వ్యాక్సిన్లన్నింటినీ ఒకేరోజు ఇవ్వడంకోసం గుంపులు, గుంపులుగా ప్రజలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించారు. తానేదో నంబర్-1 అనిచెప్పుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, గిమ్మిక్కులు, స్టంట్లు వేయవద్దని ముఖ్యమంత్రికి చెబుతున్నాం."

దేశంలో టెన్త్, ఇంటర్, అలాగే మిగిలిన పరీక్షల విషయంలో, వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం పై, సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ పై గతంలో వాదనలు జరగగా, ఈ రోజుకి పిటీషన్ వాయిదా పడింది. ఈ పిటీషన్ ను, ఏఎం ఖాన్ విల్కర్, దినేష్ మహేశ్వరీ బెంచ్ విచారణకు తీసుకుంది. గత విచారణలో, దాదాపుగా అన్ని రాష్ట్రాల వారు తాము పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే నిర్ణయం తీసుకోకుండా ఉన్నాయి, లేదా పరీక్షలు జరుపుతాం అని మొండి పట్టుదలలో ఉన్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర, పంజాబ్. అయితే పోయిన వాయిదాలో, ఈ నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పరిస్థితి ఇలా ఉంటే పరీక్షలు ఎలా పెడతారు అంటూ, వారికి నోటీసులు ఇచ్చి, విచారణను ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణ ప్రారంభం కాగానే, అస్సాం, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలు, తాము కూడా పరీక్షలు రద్దు చేస్తున్నాట్టు ప్రకటించాయి. తాము కూడా తమ బోర్డ్ ఎక్షామ్స రద్దు చేస్తున్నట్టు, సుప్రీం కోర్టుకు విన్నవించాయి. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వొకేట్ మహ్ఫూజ్ నజ్కి సమాధానం ఇచ్చారు.

sc 21062021 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, తాము పరీక్షలు నిర్వహిస్తాం అంటూ, సుప్రీం కోర్టుకు చెప్పటంతో, విద్యార్ధులు అవాక్కయ్యారు. సుప్రీం కోర్టు జోక్యంతో అయినా, ప్రభుత్వం దిగి వస్తుందని అనుకున్నారు. అయితే సుప్రీం కోర్టు దీని పై రేపు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది. కేరళ ప్రభుత్వం 11వ తరగతి పరీక్షలు రద్దు చేసే విషయమై తాము ఒక వారంలో సమాధానం చెప్తాం అని చెప్పగా, సుప్రీం కోర్టు మాత్రం రేపు మీ నిర్ణయం చెప్పాలి, లేకపోతే మేమే నిర్ణయం ప్రకటిస్తాం అని తేల్చి చెప్పింది. అంటే దీని బట్టి, రేపు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. రేపు మధ్యానం 2 గంటలకు విచారణకు వస్తుంది. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా రద్దు చేయటంతో, ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర పరీక్షల విషయంలో, సుప్రీం కోర్టు రేపు క్లారిటీ ఇచ్చే అవకాసం ఉంది. మరి రేపు సుప్రీం కోర్టు , ఏపి విషయంలో ఏమి చెప్తుందో అనే టెన్షన్ నెలకొంది.

ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బజారుమనుషుల్లా బరితెగించి, మానవత్వం మరిచి మాట్లాడుతున్నారని, వారు మంత్రులుగా ఉండటానికి అర్హులేనా అన్నట్లుగా వారి మాటలున్నాయని, ప్రశ్నిస్తే ఎగబడిపోవడం ఏమిటని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఆదివారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...! "ఒకసామాన్య మానవుడు, నిజమైన పౌరులు ఏమనుకుంటున్నారో అందరికీ తెలియాలి. ప్రజాస్వామ్యం పేరిట అధికారమంతా అసాంఘిక శక్తుల పరిధిలోకి వెళ్లిందను కుంటున్నారు. మంత్రుల మాట్లాడుతున్నభాష అతి జుగుప్సాకరంగా ఉంటుంది. మరీ బూతుల మంత్రి భాష చూస్తే, కృష్ణాజిల్లాలో అలాంటి అక్షరజ్ఞానంలేని నికృష్టుడు ఎలాపుట్టాడని అందరూ వాపోతున్నారు. అక్షరజ్ఞానం లేదు, చదువు సంధ్యలు లేవు, తల్లిదండ్రులు పెద్దలంటే గౌరవం లేనివ్యక్తి అతను. రోడ్లవెంట తిరిగి చేతులుకడుక్కుంటూ, మూతులు తుడుచుకునే భాష అది. తెలుగుదేశానికి అధికారంలేనంత మాత్రాన, సుదీర్ఘ రాజకీయం కలిగిన వ్యక్తిని, తండ్రి వయసున్న వ్యక్తిని పట్టుకొని అలాంటి మాటలంటారా? అలా మాట్లాడే వ్యక్తి తండ్రి బతికుంటే, ఏమిటి తనకిలాంటి కొడుకుపుట్టాడు...ఇలా మాట్లాడుతు న్నాడని మనస్తాపంతో, బాధతో ఉరేసుకునేవాడు. పెద్దలను గౌరవించాలనే స్పృహ లేదా అతనికి? కర్నూల్లో ఇద్దరు కార్యకర్తలు అతి దారుణంగా చం-ప-బ-డ్డా-రు. అక్కడ జరిగిన హ-త్య-లు చూశాక, బంధువులు, భార్యాపిల్లల రోదనలు చూశాక చలించిపోయి లోకేశ్ ఏదో మాట్లాడితే, దాన్ని తప్పంటారా? అదికాదు తప్పు.. నువ్వు బూతులు మాట్లాడటం తప్పు. రైతులంతా తమకు ధాన్యం బకాయిలు రావాలని అడిగితే, వారిని బూతులుతిడతారా? దళితులకు ఎస్సీ,ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది.. వారికి బేడీలెందుకు వేశారంటే దా-డి- చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదా? అలా లేదని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి. మరోమంత్రి అనిల్ కుమార్ యాదవ్ లజ్జా విహీనంగా మాట్లాడుతున్నాడు. బూతుల మంత్రి వ్యాఖ్యలు, మాటల గురించి తిరిగి చెప్పడానికి, మాకు సభ్యత, సంస్కారం అడ్డొస్తున్నాయి. రోడ్లు ఊడవడానికి, చెప్పులు కుట్టడానికి ప్రత్యేకంగా కొందరున్నట్లు, ఈ ప్రభుత్వంలో బూతులు మాట్లాడటానికే ఒకతన్ని మంత్రిగా నియమించినట్టున్నారు. "

"అలాంటి వ్యక్తికి పీడీఎస్ అనేపదానికి అర్థంకూడా తెలియదు. ముఖ్యమంత్రి ఏదో సెల్ఫ్ గోల్ వేసుకున్నప్పుడు అతను బయటకు వస్తాడు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో కూడా అతను చెప్పలేడు కానీ, బూతుల్లో మాత్రం ఎన్ని బూతులున్నాయో కచ్చితంగా చెప్పగలడు. వైసీపీ మహిళా నేతలంతా సదరు మంత్రి గారి భార్యా పిల్లలతో మాట్లాడాలి. ఇతను ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడుతుంటే, వారెలా భరిస్తున్నారో అడగాలి. అతను ప్రెస్ ముందుకొస్తున్నాడంటేనే ఇంట్లోవారంతా భయపడిపోతారట. ఈరోజు ఎవరిని ఎంత అసహ్యంగా తిడతారోనన్నదే వారి భయమంతా? ప్రశ్నకు సమాధానం చెప్పడంచేతగాని వారే బూతులు మాట్లాడుతారు. ఈ రోజు నుంచైనా బూతుల మంత్రి తన తప్పుతెలుసుకొని సభ్య సమాజం గౌరవించేలా ప్రవర్తించాలి. విజయనగరం రాజులకు ఒకచరిత్రఉంది. వేలాది ఎకరాలు ప్రజలకు ఉదారంగా దానమిచ్చారని అలాంటివారిని పట్టుకొని అలా మాట్లాడతారేమిటని తాను ఏ2ను అడిగాను. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు, భూములకు సంబంధించి 2019వరకు ఆడిట్ జరిగిందో లేదో చెప్పమన్నాను. విజయసాయి అబద్ధాలకోరు అని రాష్ట్రమంతా తెలుసు. ఆడిట్ జరగలేదని విజయసాయి నిరూపిస్తే, రాజుగారిది తప్పని మేము ఒప్పుకుంటాము. పదేళ్ల నుంచి ఆడిట్ జరగలేదంటున్న విజయసాయి దాన్ని నిరూపించాలి. ఆడిట్ జరిగిందని తేలితే, తనకుసిగ్గులేదని విజయసాయి ఒప్పుకోవాలి. ఈ ఛాలెంజ్ కు నిలబడాలని అతన్ని కోరాము. అధికారం ఉందికదా అని ఏదిపడితే అది మాట్లాడితే వాస్తవం అవుతుందా? టీడీపీ, వైసీపీలకు చెందనివారితో చెప్పించండి... రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వమని. ప్రశ్నించే అధికారం ప్రతిపక్షానిది, సమాధా నంచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ విషయం బూతులమంత్రి గ్రహించాలి. అధికారం ఎవరికీశాశ్వతం కాదనే వాస్తవాన్ని గుర్తుంచు కోండి. అధికారం పోయిననాడు చెంప -దెబ్బ, గోడ దె-బ్బ రెండూ బూతులమంత్రికి తగలడం ఖాయం. ఇప్పటికైనా అతను తనవ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని మార్చుకోవాలి."

మొన్నటి వరకు రాజధాని రచ్చబండ పేరుతో, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రఘరామరాజు, స్టైల్ మార్చి, ఇప్పుడు రోజుకి ఒక లేఖ వదులుతూ, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు విస్మరించటం, ఇచ్చిన మాట తప్పి, వెనకడుగు వేయటం, ఇలా అనేక అంశాల పై లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే పదికి పైగా లేఖలు రాసిన రఘురామరాజు, తాజాగా మరో లేఖ ఈ రోజు రాసారు. శాసనమండలి రద్దుకు సంబంధించిన అంశాన్ని, ఈ రోజు తన లేఖలో ప్రస్తావించారు. శాసనమండలిలో బలం లేనప్పుడు శాసనమండలిని రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ నమ్మలేదని, ఏడాదికి 60 కోట్లు వృధా ఖర్చు అంటూ ఆయన చెప్పనా ఎవరూ నమ్మలేదని, బలం లేదు కాబట్టి, శాసనమండలి రద్దు చేయాలని అంటున్నారని, అందరూ ఆరోపణలు గుప్పించిన సంగతి గుర్తు చేసారు. ఇప్పుడు శాసనమండలిలో బలం వచ్చింది కాబట్టి, ఈ సమయంలో శాసనమండలి రద్దు చేయాలని ఒత్తిడి తీసుకుని వస్తే, అప్పుడు జగన్ మాటలు అందరూ విశ్వసిస్తారని, ఆయనకు గౌరవం పెరుగుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన సహజంగా ప్రదర్శించే వ్యంగ్యాన్ని అంతా రంగరించి, ఈ లేఖలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు.

sajjala 21062021 2

అధికారంలోకి వచ్చిన రెండేళ్ళకు శాసనమండలిలో మెజారిటీ సాధించినందుకు ధన్యవాదాలు చెప్తూనే, శాసనమండలి రద్దు అంశం పై మీ నిర్ణయం ఏమిటి అంటూ ప్రశ్నించారు. మీరు మాట తప్పరు, మడమ తిప్పరు కాబట్టి, వెంటనే శాసనమండలిని రద్దు చేసేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని ఆ లేఖలో రాసారు. అయితే ఎప్పుడూ రఘురామరాజు లేఖలకు స్పందించిన ప్రభుత్వం, అనూహ్యంగా ఆయన లేఖకు స్పందిస్తూ, సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పారు. మండలి రద్దు తీర్మానం తాము వెనక్కు తీసుకోవటం లేదని, అది ఎత్తుగడతో చేసింది కాదని సజ్జల చెప్పారు. అయితే దీనికి మళ్ళీ రఘురామరాజు రియాక్ట్ అవుతూ, హర్షం వ్యక్తం చేసారు. సజ్జలకు అభినందనలు తెలిపారు. తన లేఖ పై , సజ్జల స్పందిస్తూ , మండలి రద్దు పై వెనక్కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పారని, ఏకంగా నలుగురు కొత్త శాసనమండలి సభ్యులు ప్రమాణస్వీకరం రోజు ఈ విషయం చెప్పారని, ఇక నుంచి ప్రతి రోజు శాసనమండలి రద్దు కోసం, నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ, మండలి రద్దు దిశగా కర్తవ్యోన్ముఖుడినై పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read