ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుజరాతీ కంపెనీ అముల్ విషయంలో, హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఆస్తులు అన్నీ కూడా, వాటిని గుజరాతీ కంపెనీ అయిన అముల్ కంపెనీకి అప్పగించి, దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలోనే, ఈ అవగాహనా ఒప్పందాన్ని సవాల్ చేస్తూ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటీషన్ వేసారు. దీని పై ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అలాగే ఇటు నర్సాపురం ఎంపీ రఘురామరాజు వైపు నుంచి వాదనలు జరిగాయి. రఘురామరాజు తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో అముల్ ని, పాల సేకరణ చేయవద్దని తాము చెప్పటం లేదని, కానీ అముల్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వటం, ఖర్చు పెట్టటం, రాష్ట్ర ప్రభుత్వమే పబ్లిసిటీ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉండే ఆస్తులు అన్నీ కూడా అముల్ కంపెనీకి కట్టబెట్టటానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయటం, ఒప్పందాలు చేసుకోవటానికి తాము వ్యతిరేకం అని చెప్పారు.

hc 04062021 2

రాష్ట్రంలో పాల ఉత్పత్తిధారులకు చెందిన ఆస్తులు అన్నీ, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అముల్ కంపెనీకి ఎలా అప్పగిస్తారని చెప్పి, ఆదినారాయణ రావు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్, హైకోర్టులో అందుబాటులో లేకపోవటంతో, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. నిన్న సాయంత్రం డివిజనల్ బెంచ్ లో, ఈ అంశం పై వాద ప్రతివాదనులు జరిగాయి. ఈ రోజు మధ్యానం రాష్ట్ర హైకోర్టు డివిజనల్ బెంచ్, దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసుని వాయిదా వేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిందో, ఆ కౌంటర్ ని అప్పటి లోగా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, అముల్ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం పై, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదని, హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో అముల్ కి నోటీసులు జారీ చేసింది. అయితే అముల్ పై హడావిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ఆదేశాలు ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే పోలీసులు పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నర్సాపురం ఎంపీ, దేశంలోని అందరి ఎంపీలకు పంపిన లేఖలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ లేఖల్లోని అంశాలు చూసి, పలువురు ఎంపీలు ఘాటుగా స్పందిస్తున్నారు. తమ సహచర ఎంపీకి జరిగిన అన్యాయం పై ఆందోళన వ్యక్తం చేసారు. ఏపిలో, ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. తన అరెస్ట్, తదనంతర పరిణామాల పై ఎంపీ రఘురామకృష్ణం రాజు, పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలకు, వివిధ సభా సంఘాల సభ్యులకు కూడా లేఖలు రాసారు. ఈ లేఖల పై వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు స్పందించారు. కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్ రఘురామరాజు లేఖ పై స్పందిస్తూ, షాక్ కు గురయ్యారు. రఘురామకృష్ణం రాజు పై పోలీసులు థ-ర్డ్ డి-గ్రీ ప్రయోగించటం తనకు షాక్ గురి చేసిందని అన్నారు. పోలీస్ కస్టడీలో ఇలాంటివి జరగటం దారుణం అంటూ, వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం దీని పై సరైన చర్యలు తీసుకోక పొతే, ఏపి పోలీసులు పై ఇది ఒక మచ్చగా మిగిలిపోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ చర్యలకు పాల్పడిన వారి పైన సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము రఘురామకృష్ణం రాజుకి మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు.

sumalatha 04062021 2

ఇక శివసేన రాజ్యసభ సభ్యురాలు, ప్రియాంకా చతుర్వేది కూడా రఘురామకృష్ణం రాజు పంపించిన లేఖ పై స్పందించారు. ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, రఘురామకృష్ణం రాజు విషయం తెలిసిన తరువాత, తాము షాక్ అయ్యామని అన్నారు. పోలీసులు ఉన్నది లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేయటానికి అని, అంతే కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటానికి కాదు అంటూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని పై బాధ్యత తీసుకుని, సరైన చర్యలు తీసుకుని, ప్రజా ప్రతినిధులను గౌరవిస్తారని ఆశిస్తున్నాం అంటూ ట్వీట్ చేసారు. ఇప్పటికే ఈ అంశం పై, కాంగ్రెస్ ఎంపీ అయిన మానిక్కం ఠాగూర్ కూడా స్పందించారు. సిద్ధాంతపరంగా తాము వేరే పార్టీలు అయినా, రఘురామకృష్ణం రాజుకి జరిగిన అన్యాయం పై తాము ఆయనకు అండగా ఉంటామని అన్నారు. పార్లిమెంట్ సెషన్ ప్రారంభం అయిన తరువాత, రఘురామకృష్ణం రాజు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని, దానికి అన్ని పార్టీల మద్దతు కావాలని, ఇప్పటికే ఎంపీలు అందరికీ లేఖలు రాసారు.

గత రెండు వారల నుంచి జరుగుతున్న పరిణామాల పై, రఘురామకృష్ణం రాజు, లోకసభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాతో సమావేశం అయ్యి మొత్తం వివరించారు. తన అరెస్ట్ దగ్గర నుంచి, సుప్రీం కోర్టు ఆదేశాల వరకు జరిగిన అన్ని సంఘటనలు ఆయనకు వివరించారు. గతంలో లోకసభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి, లోకసభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సూచనతోనే, ఆయన వై క్యాటగిరీ బద్రత తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన పై వేధింపులు, అక్రమ కేసులు, ఇలా అనేక విషయాల పై, స్పీకర్ కు చెప్పి, కేంద్ర బలగాల బద్రత తెచ్చుకున్నారు. అయితే ఈ రోజు స్పీకర్ తో సమావేశం అయిన రఘురామరాజు, సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. అక్రమ కేసులు బనాయించటమే కాకుండా, అరెస్ట్ చేయటం, కస్టడీలో చేసిన థ-ర్డ్ డి-గ్రీ-తో పాటుగా, మెడికల్ రిపోర్ట్ ల తారు మారు, ఆర్మీ హాస్పిటల్ లో వేసిన ఎత్తులు, ఇలా అన్ని విషయాలు ఆయనకు వివరించారు. పార్లమెంట్ సభ్యడుగా తనకు ఉన్న హక్కులు కూడా ఏపి పోలీసులు ఉల్లంఘించారని, నలుగురి పై తాను సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తానని, చెప్పి, నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నలుగురు పేర్లు ఏమిటో మాత్రం స్పష్టంగా తెలియలేదు.

rrr 03062021 2

సిఐడి చీఫ్ సునీల్ కుమార్ , డీజీపీ, గుంటూరు ఎస్పీ ఉన్నట్టు తెలుస్తుంది. వారి పై విచారణ చేసి, తగు చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది. స్పీకర్ కూడా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే రఘురామరాజు కుటుంబ సభ్యులు కూడా, స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రఘురామరాజు స్వయంగా వెళ్లి, మరిన్ని వివరాలు కూడా అందచేసినట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జెనెరల్ పొన్నవోలుపైఆయన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేసారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ది పొందతున్నారని, కొన్ని చానల్స్ కో కూర్చుని తన పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేసారు. హైకోర్ట్ ల కూడా ఇలాగే మాట్లాడితే, హైకోర్టు చివరి వార్నింగ్ ఇచ్చి వదిలేసిన సంగతి గుర్తు చేసారు. ఆయన బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి పనులు చేయకూడదని, ఆయన పై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఒక్కోటి ఒక్కో సెన్సేషన్ అనే చెప్పాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని కూడా లేకుండా, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తమ పై ఉన్న కేసులును, తమ సొంత ప్రభుత్వమే ఎత్తేస్తుంది. కోర్టుల వరకు వెళ్లి, తప్పో, రైటో కోర్టులు చెప్పాలి కానీ, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మాత్రం, తమ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. వివిధ సందర్భాల్లో, నేతల పై వివిధ కేసులు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం. అలా పెట్టిన కేసులు, తమకు అధికారం రావటంతో, ప్రభుత్వం ఆ కేసులు ఉపసంహరించుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే ఇలా అనేక కేసులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు కూడా ఈ మధ్య ఇలాగే కొట్టేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే పై ఉన్న పది కేసులు ఒకేసారి కొట్టేయటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసులు కోసం, ఇప్పటికే విజయవాడలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉంది. ఆ కోర్టులో, ఎమ్మెల్యే ఉదయభాను పై ఉన్న ఈ పదకొండు కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి.

udaybhanu 04062021 2

అయితే ఈ కేసులు అన్నీ ఒకేసారి ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. మార్చ్ 23న రాష్ట్ర డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఆధారంగా తీసుకుని, హోం శాఖ, ఈ కేసులు అన్నీ ఎత్తివేస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులకు తగ్గట్టుగా ఆయా కోర్టుల్లో ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో, కేసు ఉపసంహరించుకున్నట్టు పిటీషన్ వేయాలని డీజీపీని ఆదేశించింది. సామినేని ఉదయభాను పై, జగ్గయ్యపేట స్టేషన్‌ తో పాటుగా, వత్సవాయి పోలీస్ స్టేషన్, నందిగామ పోలీస్ స్టేషన్, చిల్లకల్లు స్టేషన్లలో కూడా వివిధ కేసులు ఉన్నాయి. ఇందులో సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్‌ సర్వే చేస్తున్న సిబ్బందిని అపహరించి, బెదిరించారనే తీవ్రమైన కేసు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులు అన్నీ ఒకేసారు ప్రభుత్వం ఎత్తేసింది. ఈ పరిణామం పై ప్రతిపక్షం టిడిపి ఫైర్ అయ్యింది. కోర్టులో తేలాల్సిన విషయాలు, ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందని ప్రశ్నిస్తుంది. అవకాసం ఉంటే, జగన్ కూడా సిబిఐ కేసులు కొట్టేస్తారేమో అని ప్రశ్నిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read