త‌న బాబాయ్ హ‌త్య‌కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అడ్డంగా బుక్క‌య్యార‌ని, నేడో రేపో అరెస్టు త‌ప్ప‌ద‌ని సీబీఐయే ప్ర‌క‌టించింది. కోర్టుకి కూడా ఇదే విష‌యాన్ని అఫిడ‌విట్ రూపంలో తెలియ‌జేసింది. కోర్టు కూడా సీబీఐ ఇచ్చిన విచార‌ణ ప్రాసెస్, వాంగ్మూలాలు, సేక‌రించిన సాక్ష్యాలు ప‌రిశీలించి సీబీఐ అరెస్టుని ఆప‌లేమ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఆ త‌రువాత రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిల‌ను సీబీఐ అరెస్టు చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. స‌డెన్‌గా అసెంబ్లీ స‌మావేశాలు కూడా వ‌దిలేసి జ‌గ‌న్ రెడ్డి అవినాష్ రెడ్డిని తీసుకుని ఢిల్లీ చేరాడు. మోడీ, అమిత్ షాల‌ను క‌లిశాడు. అటునుంచి జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చిన వెంట‌నే సీబీఐ అవినాస్ రెడ్డిని విచార‌ణ‌కి కూడా పిల‌వ‌డంలేదు. ఏపీకి సంబంధించి అదానీ అడిగిన కీల‌క ఆస్తులు అప్ప‌గించ‌డానికి జ‌గ‌న్ రెడ్డి సై అన‌డంతో అదానీ కేంద్రంలో పెద్ద‌ల‌ను మేనేజ్ చేశార‌ని, దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయింద‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్ ని కూడా ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని అదానీని కోర‌గా,  కోర్టు ప‌రిధి అంశం కావ‌డంతో సాధ్యం కాలేద‌ని ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఏ తాయిలాలు ఇచ్చాడో కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుని ఆప‌గ‌లిగాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

దివంగ‌త కింజ‌రాపు ఎర్రంనాయుడు కుమార్తె భ‌వానీని సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ చేశారా? ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు సోద‌రిపై వైసీపీ పెద్ద‌లు క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ్డారా? ఇవేవో గాసిప్స్ కావు. ఎర్ర‌న్న సోద‌రుడు ఏపీ టిడిపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వెల్ల‌డించిన క‌ఠోర వాస్త‌వాలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టిడిపి ఎమ్మెల్యే అయిన ఎర్ర‌న్న కుమార్తె భ‌వానీని టిడిపి అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనూరాధ‌కి ఓటేయ‌వ‌ద్దంటూ వైసీపీ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. ఓటింగ్ కి గైర్హాజ‌రు కాక‌పోతే, భ‌వానీ మామ‌, భ‌ర్త‌ల‌ని అరెస్టు చేయిస్తామంటూ వైసీపీ పెద్ద‌ల నుంచి వార్నింగ్ ల మీద వార్నింగులు వ‌చ్చాయ‌ని అచ్చెన్నాయుడు వివ‌రించారు. అయినా స‌రే త‌న అన్న కుమార్తె ధైర్యంగా వ‌చ్చి ఓటేశార‌ని వివ‌రించారు. అంటే టిడిపి నుంచి న‌లుగురి ఎమ్మెల్యేల‌ను ప‌శువుల్లా కొన‌డ‌మే కాకుండా, ఉన్న టిడిపి ఎమ్మెల్యేల‌నూ టిడిపి అభ్య‌ర్థికి ఓటేయ‌కుండా చూడాల‌ని జ‌గ‌న్ రెడ్డి చేసిన కుతంత్రాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. ఎర్ర‌న్న కుమార్తె భ‌వానీ భ‌ర్త‌, మామ వ్యాపారాల‌ను బూచిగా చూపించి ప్ర‌తీసారీ వైసీపీ పెద్ద‌లు బ్లాక్ మెయిలింగ్ కి పాల్ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. చిట్స్‌, రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లు మూయించేస్తామ‌ని, సీఐడీతో దాడులు చేయిస్తామ‌ని వైసీపీ బెదిరించి, టిడిపి అభ్య‌ర్థికి ఓటేయ‌కుండా చూడాల‌నే వ్యూహం ఈ సారికి బెడిసికొట్టింది. గ‌త సారి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్ల‌కుండా వేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అంటే అప్పుడు కూడా వైసీపీ బెదిరింపుల‌తోనే ఇలా చేసి వుండొచ్చ‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

వైసీపీ ప‌త‌నం గురించి ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగురాష్ట్రాల్లోనే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీ మ‌ద్ద‌తు అభ్య‌ర్థుల ఓట‌మి త‌రువాత వైసీపీలోనూ అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సంద‌ర్భంగా వైసీపీలో అస‌మ్మ‌తి సెగ‌లు కాక రేపాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోనూ వైసీపీ డౌన్ ఫాల్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అయితే వైసీపీ ఎంపీలే త‌మ పార్టీ సీను కాలిపోయింద‌ని వ్యాఖ్యానిస్తుండ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ ఎంపీలలో అంతర్మథనం మొద‌లైంద‌ని స‌మాచారం. సీఎం జగన్ రెడ్డి అహంకార ధోర‌ణి, విఫ‌ల పాలనపై వైసీపీ ఎంపీలు గుర్రుగా ఉన్నారు. చెబితే వినే ప‌రిస్థితి లేద‌ని, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని వైసీపీ ఎంపీలే బ‌హిరంగంగా ఢిల్లీలో స‌హ‌చ‌ర  ఎంపీల‌తో చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు వ‌చ్చిన వైసీపీ ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలతో మాట‌ల సంద‌ర్భంలో బ‌ర‌స్ట్ అయ్యార‌ని ఓ చాన‌ల్ వెల్ల‌డించింది. మళ్లీ  వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలంగాణ ఎంపీ ఎదుట వైసీపీ ఎంపీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.  జగన్ రెడ్డికి అన్నివిధాలా కావాల్సిన వ్య‌క్తి అయిన ఆ ఎంపీ.. తాము అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొక‌ట‌ని వ్యాఖ్యానించార‌ని స‌మాచారం. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్రబాబు చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటార‌ని, ఆయ‌న ఎత్తుల ముందు వైసీపీ తేలిపోతోంద‌ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి వేవ్‌ని త‌ట్టుకుని నిల‌వ‌డం అసాధ్య‌మ‌ని తెలంగాణ ఎంపీ ఎదుటే తేల్చేశారు. ఆ న‌లుగురు కోట‌రీలో జ‌గ‌న్ రెడ్డి ఇరుక్కుపోయార‌ని, ఏం చెప్పినా వినే ప‌రిస్థితిలో లేడ‌ని వాపోయారు. వైనాట్ 175 అని, అంతా బాగుంద‌ని మేము చెబుతున్నా, ప‌రిస్తితులు చాలా ప్ర‌తికూలంగా వున్నాయ‌ని  వైసీపీకి చెందిన మ‌రో ఎంపీ మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డ్డారు.

మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా చేశార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత హ‌ర్ష‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలోనూ జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన హ‌ర్షకుమార్ ని అక్ర‌మ కేసుల్లో ఇరికించి జ‌గ‌న్ రెడ్డి అరెస్ట్ చేయించారు. అప్ప‌టి నుంచీ అడ‌పాద‌డ‌పా వైసీపీ స‌ర్కారు తీరుపై విరుచుకుప‌డుతున్న హ‌ర్ష‌కుమార్ తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రోసారి మీడియా ముందుకొచ్చారు. మోదీ ఇంటి పేరున్న‌వారంతా దొంగ‌లేన‌ని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీకి కోర్టు జైలుశిక్ష విధించ‌డం, వెనువెంట‌నే పార్ల‌మెంటు స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌డం వంటి ప‌రిణామాల‌పై హ‌ర్ష‌కుమార్ స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వమే కేసులు పెడుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ స్థానాల‌ని త‌న‌ చేతుల్లోకి తీసుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టిన వారినందరినీ మోదీ విదేశాలకు పంపేశార‌ని, రాహుల్‌ని లోక్‌సభ నుంచి సస్పెన్షన్ చేయటం దుర్మార్గం అని ఖండించారు. మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా కోర్టుల‌ని మేనేజ్ చేశార‌ని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్య‌ల‌తో బీజేపీ-జ‌గ‌న్ మ్యాచ్ ఫిక్సింగ్ బంధం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

Advertisements

Latest Articles

Most Read