వివేక కేసు విషయంలో, రోజుకి ఒక వార్త, గత నెల రోజులు నుంచి చోటు చేసుకుంటుంది. వివేక కుమార్తె సునీత ఢిల్లీ వెళ్లి, నాకు న్యాయం చేయండి అంటూ, బహిరంగంగా వేడుకున్న దగ్గర నుంచి, ఈ కేసు రోజు వార్తల్లోకి వస్తుంది. వివేక కుమార్తె ఆరోపణలు చేస్తే, టిడిపి పైన ఎదురు వైసీపీ అరొపణలు చేయటం, లోకేష్ సవాల్ విసరటం, ప్రమాణం చేయటం, వైసీపీ నేతలు ఎవరూ రాకపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇందులో ఒక టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే, ఆ రోజు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వర రావు, సిబిఐకి రాసిన లేఖలు బయటకు రావటం. ఈ కేసుకి సంబంధించి, తన వద్ద చాలా సమాచారం ఉంది అంటూ, ఆయన సిబిఐకి లేఖ రాసారు. ఈ విషయంలో సిబిఐకి గతంలో రెండు సార్లు ఫోన్ చేసినా, తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పారు. వివేక కుటుంబ సభ్యులు అక్కడ స్పాట్ లో ఉండి ర-క్తం తుడవటం, కుట్లు వేయటం లాంటివి కూడా చెప్పారు. తరువాత విజయసాయి రెడ్డి, గుండె పోటు అని మీడియాకు చెప్పిన విషయం కూడా ఆ లేఖలో తెలిపారు. అయితే ఇవన్నీ వాస్తవాలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వివేక కుటుంబం నుంచి, జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి ఏబి వెంకటేశ్వర రావుకి కౌంటర్ ఇవ్వాలి కానీ, ఎందుకో ఏపి పోలీసులు కౌంటర్ ఇచ్చారు.

abv 18042021 2

ఈ రోజు డీజీపీ, ఏబీ వెంకటేశ్వర రావు ఆరోపణల పై, ప్రెస్ మీట్ పెడతారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే డీజీపీ కాకుండా, డిఐజి మీడియా ముందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు ఖండించారు. ఏబీవీ దెగ్గర అంత సమాచారం ఉంటే, సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని, నేరం కూడా అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆరోపణలు వస్తుందే జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అయితే, మళ్ళీ జగన్ ప్రభుత్వానికే ఆధారాలు ఎలా ఇస్తారు ? అందుకే కదా ఆయన ఏడాది నుంచి సిబిఐకి రాస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, అప్పట్లో ఏబివి జగన్ కుటుంబ సభ్యుల పై ఆధారాలు లేకపోయినా, వాళ్లని అరెస్ట్ చేయాలని, దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఒత్తిడి తెచ్చారని, డిఐజి ఆరోపించారు. ఇక ఫోర్జరీ డాక్యుమెంట్ లు అంటూ, ఆయన చేసిన ఆరోపణలు కూడా నిరాధారం అయినవి అని అన్నారు. కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలు ఆయన మీడియాకు చెప్పటం కూడా తప్పు అని, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని అన్నారు. మరి దీని పై ఏబి వెంకటేశ్వర రావు ఎలా స్పందిస్తారో చూడాలి..

తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఆ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావటంతో, ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి, ఇరు పార్టీల ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి ప్రత్యెక సమావేశం అయిన నేతలు, భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఇరు పార్టీల అభ్యర్ధులు, ఏ ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంది అనే అంశం పై చర్చలు నడిచాయి. ఈ నేపధ్యంలో, మరోసారి భేటీ అయ్యి, అభ్యర్ధులని ఖరారు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం జనసేన అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని రెండు రాష్ట్రాల్లో, ఇరు పార్టీలు కలిసి పాల్గుంటున్నాయి. హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే, ఇద్దరూ వేరు వేరుగా పోటీ చేయాలని భావించటం, అప్పటి పరిస్థితితుల్లో జనసేన లిస్టు ప్రకటించిటం , తరువాత వెనక్కు తగ్గటం, పవన్ ని అవమానించారని జనసేన నేతలు అనటం, పవన్ బహిరంగంగా మాట్లాడటం, ఇవన్నీ చర్చకు దారి తీసాయి. అయితే ఇప్పుడు మాత్రం, ముందుగానే కూర్చుని మాట్లాడుకున్నారు.

సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితం వారి కుటుంబ సభ్యులు మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన, యశోదా హాస్పిటల్ లో , ఐసియిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. నిజానికి ఆయన వారం రోజులు క్రితమే క-రో-నా నిర్ధారణ కావటంతో, ఆయన యశోదా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. నిన్న, ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు, ఆక్సిజన్ తీసుకోవటానికి మోత్కుపల్లి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు షుగర్, బీపీ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు, పెద్ద వయసు కావటంతో, క-రో-నా సోకటంతో, ఆయన ఆరోగ్యం పై మరింతగా దెబ్బ పడిందని చెప్తున్నారు. ఆయనకు ప్రస్తుతం డాక్టర్లు ఐసియిలో చికిత్స అందిస్తున్నారు. క-రో-నా నిర్ధారణ కావటంతో, మొతుకుపల్లి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన ఐసియిలో చికిత్స అందిస్తున్నా, ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ప్రాణాపాయం ఏమి లేదని, నిన్న, ఈ రోజు కొంత ఇబ్బంది పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానాలు ప్రార్ధిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో, ఈ వేసవి కాలంలో, అన్ని గ్రామాల్లో కూడా పంట చేతికి వస్తుంది. ఆ తరువాత అక్కడ ఊరిలో ఉండే రాములు వారికి, అవి సమర్పించి, తిరునాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా నెల్లూరులోని విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో అందరూ చందాలు వేసుకుని భక్తీ శ్రద్ధలతో ఈ తిరునాళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారం రోజుల పాటు, సీతారాముల వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆ గ్రామమే కాకుండా, చుట్టుపక్కల వారు కూడా, ఆ ఉత్సవాల్లో పాల్గుని, రామనామం జపిస్తూ, తమ భక్తీని ప్రదరిస్తుంటే, ఇదే అదనుగా, వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ తిరునాళ్ళు చేసే పెత్తనం తీసుకున్న వైసిపీ నేతలు, ఈ తిరునాళ్ళలో రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేసారు. ఇతర జిల్లాల నుంచి యువతులను తీసుకుని వచ్చి, ఇక్కడ వారి చేత సినిమా పాటలకు రికార్డింగ్ డ్యాన్స్ లు వేయించారు. ఇందులో వైసీపీ నేతలు కూడా స్టేజ్ ఎక్కి, వారితో పాటు చిందులు తొక్కారు. కొమ్మిరెడ్డి మురళీ కృష్ణా రెడ్డి అనే సీనియర్ వైసీపీ నేత అయితే ఏకంగా చొక్కా విప్పి , లుంగీ మీద వారితో కలిసి డ్యాన్సులు వేయటం, జిల్లలో చర్చిగా మారింది. గ్రామస్తులు కూడా ఈ తతంగం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

Latest Articles

Most Read