రాజధాని అమరావతిలో దళితుల అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి నారాయణ ప్రమేయం ఉన్నట్టు సిఐడి ఎలాంటి ఆధారాలు చూపకపోవటంతో, నాలుగు వారాల పాటు ప్రాసిక్యూట్ చేయరాదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం లేదా సుప్రీం కోర్టుకు అప్పీలకు వెళ్లే యోచనలో సీఐడీ అధికారులు ఉన్నారు. అసైన్ భూములకు సంబంధించి కేసు పెట్టిన సీఐడీ ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న ఆధారాలతో ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా చంద్రబాబుకు ఇటీవలే నోటీసులు అందజేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే మంజూరు చేయటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, సాక్షాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదనతో హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీం కోర్టులో అప్పీల్ పిటిషన్ వేసేందుకు సీఐడీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అసైన్ భూములు కొనుగోళ్లు చేసిన కొందరు వ్యక్తులు అప్పటి ప్ర భుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉన్నారని అవే భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించి ప్రత్యామ్నాయంగా నివాస, వాణిజ్య స్థలాలను కేటాయించారనేది సీఐడీ ఆరోపణ. ఇందులో భాగంగానే జీవో 41 జారీ చేశారనేది ప్రభుత్వ వాదన. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కేసుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకూడా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

CID 22032021 2

అయితే కోర్టు ఆధారాలు అడగగా, ఇప్పటిప్పుడు ఏమి ఆధారాలు లేవని, విచారణకు అనుమితి ఇస్తే, అప్పుడు ఇస్తాం అని సిఐడి చెప్పింది. వీటన్నింటిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. నాలుగు వారాల పాటు ప్రాసిక్యూషన్ తో పాటు అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకే వర్తిస్తుందని సింగిల్ జడ్జి స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధాని తుళ్లూరు మండల గ్రామాల్లో సీఐడీ అధికారులు రైతులు, సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఏమైనా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దళిత రైతుల తరుపున ఫిర్యాదు చేసాను అంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారించిన సందర్భంగా అసైన్ భూముల వ్యవహారంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూసినట్లు చెప్తున్నారు కానీ, కోర్టు అడిగితే మాత్రం చెప్పలేక పోయారు. ఇదిలా ఉండగా ప్రాసిక్యూషన్ చేసేందుకు సీఆర్ డీఏ చట్టం అనుమతించదని దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడిన నేపథ్యంలో సీఆర్‌డీఏ చట్టంతో పాటు ఇతర క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్‌లను సీఐడీ అధికారులు తిరగేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా సీఐడీ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

నేను గవర్నరు రాసిన లేఖలు లీక్ అయ్యా యి.. అవి పూర్తిగా కాన్ఫిడెన్షియల్ .. లీకేజీపై గవర్నర్ కార్యా లయ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినా విచారణలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీస్లకు తగిన మార్గదర్శకాలు జారీచేస్తే ఆ పని నేనే చేశానని చెప్తారు. అందువల్ల సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శతో పాటు , కేంద్ర హోంశాఖ, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారా యణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదిక ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక లపై ఎస్ఈసీపై పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిని కూడా ప్రతివాదిగా చేర్చారు. నిమ్మగడ్డ పిటీషన్ సారాంశం ఇలా ఉంది...గవర్నర్‌కు నేను రాసిన లేఖలు అత్యంత గోప్యమైనవి... రాజ్యాంగంలోని 2433 ప్రకారం ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు గవర్నర్ సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటు న్నందున కొన్ని అంశాలను గోప్యంగా గవర్నర్‌కు లేఖ ద్వారా తెలియజేశాను.. రెండు రాజ్యాంగ సంస్థలకు చెందిన కీలకమైన ఆ లేఖలను బహిర్గతం చేసయానికి వీల్లేదు. అయితే గోప్యత, ప్రత్యేక _ హక్కుల్లో భాగంగా కొందరు ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేశారు. లీకేజీ పై విచారణ జరపాలని పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శిని కోరాను.

nimmagadda 22032021 12

నేను కోరిన అంశంపై విచారణ జరపకపోవటంతో పాటు ఎలాంటి లీకులు లేవని గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి త్రోసి పుచ్చారు. ఇప్పటి వరకు లీకేజీ వెనుక వ్యక్తులను గుర్తించలేకపోయామని కోర్టుకు వివరించారు. కాగా ఈ నెల 18వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు లేఖ వచ్చింది. నేను రాసిన లేఖలు సోషల్ మీడియాలో లీకవ్వటం వల్ల వాటి ఆధారంగా సభాహక్కుల ఉల్లంఘన కింద మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో ఉంది. నా లేఖలు మంత్రుల ప్రతిష్టకు భంగం కలిగించాయనేది అందులో సారాంశం. కమిషనర్‌గా నేను నిర్వహించే విధుల పట్ల ప్రభుత్వ పెద్దలు సంతృప్తికరంగా లేరు.. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించటంతో పాటు కుల ప్రస్తావన తీసు కొచ్చారు. నేను ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించా లని కోరుతూ గుంటూరుకు చెందిన మెట్టు రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు నేను గవర్నరు రాసిన లేఖను జతపరిచారు.

ఆయనకు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు.. నా నుంచి లీక్ అయ్యే అవకాశం లేదు.. నేను రాసే లేఖలు కార్యాల య ఉద్యోగులు, అధికారులెవరికీ తెలియదు.. ఈ పరిస్థితుల్లో లీకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. ప్రభుత్వ చెప్పుచేతల్లో పనిచేసే ఏపీ పోలీసులకు మంచి సామర్థ్యం ఉందని ఆ లేఖల లేకేజీ తానే చేసినట్లుగా ఇరికించగలరు.. రాజ్యాంగ వ్యవస్థల మధ్య గోప్యత బహిర్గతమైతే మనుగడ కష్టమవుతుంది.. అందువల్ల సీబీఐచే విచారించాలని కోరారు. నిమ్మగడ్డ తరుపు సీనియర్ న్యాయవాది బీ ఆదినారాయణరావు వాదనలకు సిద్ధమయ్యారు. ఈ వ్యాజ్యం శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు బెంచి ముందుకు వచ్చింది. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినందున తాను ఈ వ్యాజ్యాన్ని విచారించబోనని జస్టిస్ రఘునందనరావు నిరాకరిస్తూ అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

విద్యఅనేది చదువుకున్నవారికి గుప్తధనం లాంటి దని, ఆవిద్యే వారికిధనాన్ని, సకలసౌఖ్యాలను కలిగిస్తుందని, ఈగొప్పతనం వైసీపీనేతలకు, మంత్రుల కు తెలియకపోతే, వారంతా వారి మనవలు, మనవరాళ్ల పాఠ్యపుస్తకాల్లోచూసి, తెలుసుకోవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ సూచించారు. ఆదివారం ఆయన మంగళగిరిలో ని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యను చులకనచేసి మాట్లాడుతున్న అధికారపార్టీ నేతలంతా ముందు వారేంచదువుకున్నారో, ఆ విద్య యొక్క గొప్పతనమేమిటో తెలుసుకోవాలని ప్రసాద్ హితవుపలికారు. లోకేశ్ గారి విద్యాభ్యాసంపై స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖరాస్తామంటున్న వారి వైఖరి చూస్తోంటే నవ్వోస్తోందని, పదోతరగతి ఫెయిలైన వారు రాష్ట్రమంత్రులుగా ఉండటం, ఏపీప్రజల దురదృష్టమని టీడీపీనేత వాపోయారు. లోకేశ్ ఎక్కడెక్కడ చదివాడో, తెలియనివారు ఏమని లేఖలు రాస్తారన్నారు. లోకేశ్ పేరుమోసిన ఉన్నతవిద్యాలయాల్లో తనవిద్యను అభ్య సించాడని, అమెరికాలో చదవాలంటే, కొన్నిపద్ధతులు, పరీక్షలుంటాయని, వాటిన్నింటిలో నెగ్గినవారినే అక్కడ చదువుకోవడానికి అనుమతిస్తారనే ఇంగితమైనా వైసీ పీవారికి తెలుసునా అని రామ్ ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రమంత్రులెవరికైనా సరే, అమెరికాలో విద్యాభ్యాసం గురించి తెలుసునా అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూతుళ్ల లో, ఒకమ్మాయి లండన్ లోచదువుతోందని, జగన్ స న్నిహితులుచెప్పినప్రకారం, ఆయనకుమార్తెలు బాగానే చదువుతారని తనకు తెలిసిందని రామ్ ప్రసాద్ చెప్పా రు. నైతికత ఉన్నవారెవరూకూడా పిల్లల విద్యాభాసా న్ని గురించి చులకనగా మాట్లాడరన్నారు. లోకేశ్ చదు వుపై స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖరాస్తామంటు న్నవారు, ముందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడచదివాడో ఆ యూనివర్శిటీకి కూడా లేఖరాయలని, అలానే వారె క్కడ చదివారో, ఆవిద్యాలయానికి కూడా లేఖరాస్తే మం చిదని టీడీపీనేత సూచించారు.

ఆ విధంగా లేఖలు రాస్తే, విశ్వవిద్యాలయాలనుంచి ఎలాంటిసమాధానం వస్తుందో తెలుస్తుందన్నారు. వైసీపీలో ఎవరైనా సరే, ఏం చదివినవారైనా సరే, ఏ టీవీ ఛానెల్లోనైనా సరే, లోకేశ్ గారితో ఒకగంటపాటు చర్చకురావాలని, ఆచర్చలోనే ఆయన ప్రావీణ్యం ఏమిటో తెలుస్తుందన్నారు. ఊరికే లోకేశ్ ను ఆడిపోసుకోవడం మానేసి, పప్పులో ఉండే పోషకాలు, మాంసకృత్తులగురించి తెలుసుకుంటే మంచి దన్నారు. శాఖాహారులెవరైనా సరే పప్పు తినకుండా ఉంటారా అని, వైసీపీలో ఎవరైనాసరే పప్పుతినకుండా ఉంటున్నారా అని రామ్ ప్రసాద్ ప్రశ్నించారు. లోకేశ్ జూనియర్ అయిన వ్యక్తి, చంద్రబాబు అమెరికా వెళ్లిన ప్పుడుఆయన్నికలిసి, లోకేశ్ గొప్పతనం గురించి చెప్పడం జరిగిందన్నారు. లోకేశ్ చదువుని అపహాస్యం చేస్తున్న వైసీపీనేతలు, వారికుమారులు ఎక్కడ చదువుతున్నారో, లేదా ఎక్కడ పేకాడుతున్నారో చెప్ప గలరా అని టీడీపీనేత ప్రశ్నించారు. వైసీపీనేతలు, మంత్రులకు దమ్ముంటే లోకేశ్ తో గంటసేపు టీవీ ఛాన్ ల్ లో చర్చకు రావాలని రామ్ ప్రసాద్ సవాల్ చేశారు. డబ్బులుకడితే అమెరికాలో చదవ్వొచ్చనే ఆలోచన ఉన్న వైసీపీనేతలెవరైనా సరే, అలారాగలిగితే, వారి చదువుకు అయ్యేఖర్చుకి హాఫ్ మిలియన్ డాలర్లు కట్ట డానికి తానుసిధ్దమని ప్రసాద్ తెలిపారు. వైసీపీమంత్రు లెవరైనా సరే ఆవిధంగా అమెరికాలో చదవడానికి ముం దుకురాగలరా అని రామ్ ప్రసాద్ నిలదీశారు. లోకేశ్ ని పప్పుఅనేవారంతా పప్పుతినేవారిమనోభావాలను దెబ్బతీసున్నారని టీడీపీనేత మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతరుపున పోటీచేసిన అనేకమంది బ్రాహ్మణులపై తప్పుడుకేసులుపెట్టి, బెదిరించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. జగన్ ప్రభుత్వం దేవాలయాల్లో దోపి డీకోసం ఎటువంటి అర్హతలేనివారిని ఉద్యోగులుగా నియమిస్తోందన్నారు.

మాస్క్ లు లేకుండా తిరిగే వారికి షాక్ ఇస్తూ, జరిమానా విధించారు విజయవాడ పోలీసులు. కో--వి--డ్-19 సందర్భంగా విపరీతంగా కరోన కేసులు పెరిగిపోవడంతో ప్రజలు విచ్చల విడిగా ఎటువంటి సామాజిక బాధ్యతను పాటించకుండా దానిని విస్మరించి ఎటువంటి మాస్టు, భౌతిక దూరం పాటించకుండా తిరగడం జరుగుతుందని విజయవాడ పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో కరోన కేసులు కట్టడి దృష్ట్యా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ బి. శ్రీనివాసులు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి రోడ్ల మీద మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి జరిమానాలను విధించారు విజయవాడ పొలీసులు. ఈ సందర్భంగా ది.21.03.2021వ తేదీన విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారిపై 217 కేసులు నమోదు చేసి రూ.20,550/-లు జరిమానా విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు. విజయవాడ నగర ప్రజలు బయటకు వచ్చే వారు విధిగా మాస్క్ లు ధరించి తమకు తాము క-రో-న బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మాస్టలు ధరించాలని, యిందుకు భిన్నంగా వ్యవహరించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని విజయవాడ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

srinivasulu 21032021 2

క--రో--నా ఇక రాదనే నిర్లక్ష్యం ... అజాగ్రత్తే ముప్పు తెచ్చిపెడుతోంది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉంది. చాలా మంది నిర్లక్ష్యంతో మాస్కులు ధరించడం లేదు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గినట్లే తగ్గి .. మళ్లీ పడగ విప్పుతుండడంతో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో చాలా మందిలో యాంటీబాడీలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారిలో క--రో--నా వచ్చే ముప్పు ఉంది. ముఖ్యంగా 20- 50 ఏళ్లలోపు వారిలో ఎక్కువ నిర్లక్ష్యం కనిపిస్తోంది. క--రో--నా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే వారు. అయితే క--రో--నా బెడద ఇంకా పోలేదని, రెండో దశతో ప్రమాదం పొంచి ఉందని ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని యంత్రాంగం సూచిస్తోంది. కానీ ఆదేమీ పట్టించుకోవడం లేదు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. ముఖ్యంగా బయట తిరిగేవారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. మాస్కులు వినియోగం కూడా ఉండటం లేదు. పట్టణ ప్రాంతాల్లో కొందరు పాటిసు న్నా.. గ్రామీణ ప్రాంతాల్లో అసలు మాస్కులే ధరించడం లేదు. అంతే కాదు బౌతిక దూరం పాటించడం లేదు. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద ఎలాంటి నిబంధనలు కనిపించడం లేదు. ఇంటి నుంచి బయటకి వస్తున్న వారిలో సగం మంది కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ నిర్లక్ష్యం ఫలితంగానే కేసులు మళ్లీ పెరగడానికి కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read