టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ పంచాయితీ ఎన్నికల్లో వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ఉద్రిక్తతలు సృష్టించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు, ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడుల స్వగ్రామం నిమ్మాడ టిడిపికి కంచుకోట. అలాంటి ప్రశాంతమైన గ్రామంలో వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూడటం హేయం. దీనిపై ఎన్నికల సంఘం అదనపు డిజి సంజయ్ కు, విశాఖ డిఐజి రంగారావు చంద్రబాబు ఫోన్ చేశారు. పంచాయితీ ఎన్నికల్లో వైసిపి చేస్తున్న హిం-సా కాం-డ పై ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. తక్షణమే జోక్యం చేసుకుని నిమ్మాడలో ప్రశాంతత కాపాడాలని కోరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పెరియంబాడిలో టిడిపి ఎమ్మెల్సీ దొరబాబు వాహనం ధ్వం-సం చేయడాన్ని, గ్రామంలో టిడిపి శిబిరంపై దా-డి చేయడాన్ని, నిమ్మాడలో ఉ-ద్రి-క్త-త-లు రెచ్చగొట్టడంపై అదనపు డిజి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెరియంబాడిలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
news
పంచాయతీ ఎన్నికల వేళ, భారీ స్కాం బయట పెట్టిన టిడిపి... దీని పై ప్రభుత్వ సమాధానం ఏమి చెప్తుందో...
స్కీమ్ ఫర్ స్కామ్ అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా ఇష్టపడతారని, వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20నెలల కాలంలో స్కీముల ముసుగులో కొన్నివేలకోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో టీడీపీ అనేకసార్లు ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే " ఇళ్లపట్టాలపేరుతో జగన్ ప్రభుత్వం ఏస్థాయిలో అవినీతికి పాల్పడిందో ప్రజలకు వివరించడం జరిగింది. పేదవాడికి సాయం చేద్దామనే ఆలోచన ఏనాడూ జగన్ కు కలగదు. ప్రతినిత్యం ఏదోఒకపథకం పేరుచెప్పడం, దానిముసుగలో ఎలా దోచేయాలనే ఆలోచననే ఆయన చేస్తుంటాడు. అదేకోవలో ఇప్పుడు జగనన్న విద్యాకానుక పథకం చేరింది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ వంటివి అందచేయడం జరిగింది. కానీ ఇవన్నీ గతప్రభుత్వాలు కూడా గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే మెరుగ్గానే అమలు చేశాయి. ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో విద్యార్థులకుకానుకలు ఇవ్వడానికి బదులు జగన్ తనకు తానే కానుకలు ఇచ్చుకున్నాడు పేదవిద్యార్థులు ఉపయోగించే నోటుపుస్తకాల పంపిణీలో కూడా జగన్ ప్రభుత్వం ఎలాఅవినీతికి పాల్పడిందో, విద్యార్థులకుఇచ్చే నోట్ బుక్స్ లో జగన్ఎంతలా కక్కుర్తిపడ్డాడో రాష్ట్రప్రజలంతా తెలుసుకోవాలి. విద్యార్థులకు మేనమామనంటూ జగన్ భారీగా మేసేస్తున్నాడు. అందుకే ఆయన విద్యార్థులపాలిట కంసమామ అని ఎప్పుడో చెప్పాం. విద్యార్థులకు పంచే నోటుపుస్తకాలను ఏపీటీపీసీవారు లేపాక్షి నంది బ్రాండ్ తో ముద్రించేవారు. నాణ్యతతో కూడిన నోటుపుస్తకాలను సదరు సంస్థ ఎప్పటినుంచో ప్రభుత్వానికి రాయితీపై అందిస్తోంది. వైసీపీప్రభుత్వం ఏపీటీపీసీ (లేపాక్షి నంది) ని కాదని, పుణెలోని బాఫ్నా కంపెనీని గత విద్యాసంవత్సరంలోనే తెరపైకి తీసుకొచ్చింది.
06-10-2020న ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం- 55లో ఏపీటీపీసీ (ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్) విశిష్టతను గురించి పేర్కొని, రాష్ట్రంలోని అన్నిశాఖల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, అన్నిరకాల ప్రభుత్వపాఠశాలలువారు, నోట్ బుక్స్ ఆర్డర్ ని ఏపీటీపీసీ కి మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది. జీవోనెం55ని స్వయంగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలంసాహ్ని గారు జారీచేయడంజరిగింది. ఆజీవోను తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం తాజాగా ఈ విద్యాసంవత్సరం (2021-22) నోటు పుస్తకాల సేకరణకు సంబంధించి 21-01-2021న ఒక టెండర్ విడుదలచేసింది. 2కోట్ల56వేల476నోటు పుస్తకాల ప్రచురణకు సంబంధించిన టెండర్ అది. చీఫ్ సెక్రటరీ గతంలో ఏపీటీపీసీ ఆధ్వర్యంలోని లేపాక్షినంది నోటు పుస్తకాలను వాడాలని చెప్పి, జీవోనెం55ని జారీచేసినా, దాన్ని కాదని బయట కంపెనీలకు దోచిపెట్టడానికి ఇప్పుడు 2కోట్ల పైచిలుకు నోటు పుస్తకాల ముద్రణకు టెండర్ విడుదలచేస్తారా? నోటుపుస్తకాల అంచనాలు ఇంకా15శాతం పెరిగే అవకాశం కూడా ఉందని టెండర్లో చెప్పారు. ఒక్కో నోటు పుస్తకం ఖరీదు రూ.40 వేసుకున్నా దాదాపు రూ.80కోట్లు అవుతుంది. అంచనాలుపెరిగితే అది రూ.100కోట్లు కావచ్చు. పేదవిద్యార్థులకు ఇచ్చే నోటు పుస్తకాల్లో కూడా ప్రైవేట్ కంపెనీ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, రాష్టప్రభుత్వ సంస్థ అయిన ఏపీటీపీసీవారి లేపాక్షి నంది నోటుపుస్తకాలను నాశనం చేయడమేంటి?
నోటుపుస్తకాలముద్రణావ్యవహారంపై కొందరు కోర్టుకి వెళితే,12-07-2020న స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. తదనంతరం, అక్టోబర్ మొదటివారంలోకూడా న్యాయస్థానం స్టేటస్ కోను కొనసాగించిం ది. అటుపిమ్మట గత్యంతరంలేని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోనుజారీచేస్తే, దాన్నికూడా పట్టించుకోరా? టెండర్లప్రక్రియపై న్యాయ స్థానం ఇచ్చిన స్టేటస్ కో తరువాత జీవోనెం 55ను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇస్తే, దాన్ని కూడా ఖాతరుచేయరా? ప్రభుత్వం తన కక్కుర్తికోసం హైకోర్టు స్టేటస్ కోను, జీవోనెం 55ను పక్కనపెట్టింది. జగనన్నవిద్యాకానుక పథకంకింద అవసరమైన అనేకరకాల వస్తువులును సేకరించడం కోసం, 12-03-2020న జీవోనెం-12ను విడుదలచేశారు. దానిలో పాఠ్య పుస్తకాలు, నోటుపుస్తకాలప్రస్తావన చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రెస్ లోనే పాఠ్యపుస్తకాల ముద్రణ జరగాలని జీవోలో చెప్పిన ప్రభుత్వం, మరి నోటుపుస్తకాల అంశంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచే కొనుగోలు చేయాలనే నిబంధనను ఎందుకు పెట్టలేదు? నోట్ పుస్తకాల ముద్రణకు ఏపీటీపీసీ వారి లేపాక్షినంది సంస్థ ఉందని ఎందుకు సదరుజీవోలో ప్రభుత్వం పేర్కొనలేదు? జీవోనెం55, జీవోనెం-12లోని అంశాలద్వారా దాదాపురూ.100కోట్ల విలువైన నోటుపుస్తకాల టెండర్ల వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి సిద్ధమైందని స్పష్టమవుతోంది. గత విద్యాసం వత్సరంలో కూడా ఇదేవిధంగా నిబంధనలనుతుంగలో తొక్కి బాఫ్నా కంపెనీకి నోటుపుస్తకాల ముద్రణను అప్పగించారు. లేపాక్షి నోటు పుస్తకాల నాణ్యతతో పోలిస్తే, బాఫ్నా కంపెనీవారి పుస్తకాల నాణ్యత అధ్వానంగాఉంది. రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇచ్చిన జీవోనెం-55ను తుంగలో తొక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వం నేడు కమీషన్ల కోసమే పలు ప్రైవేట్ కంపెనీలతో బేరసారాలు సాగిస్తోంది. ప్రభుత్వం తక్షణమే నోటుపుస్తకాల టెండర్ ను రద్డుచేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ఆదివారం అర్జెంట్ హౌస్ మోషన్ పిటీషన్ వేసిన ప్రభుత్వం... ఎస్ఈసీ, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్ట్...
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఇంటిఇంటికీ రేషన్ కార్డు కార్యక్రమం ప్రారభం కావాల్సి ఉంది. ఇప్పటికే వాటికి సైరెన్ లు పెట్టి, ఊరు ఊరు ఊరేగించారు కూడా. అయితే ఈ పధకం ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించాలని జగన్ మోహన్ రెడ్డి భావించారు. జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాన్ లు రేపు ప్రారంభం చేయాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో, పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించి, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ పధకం కొత్త పధకం కావటం, ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శసూత్రాలు విడుదల చేసింది. ముందుగా ఈ వాహనాలు అన్నిటి పై, పార్టీ రంగులు తొలగించాలని సూచించింది. రాజకీయ పార్టీ నేతలు, ఎమ్మెల్యే, మంత్రులు పాల్గునకుండా ఈ కార్యక్రమం సాగాలని చెప్పి సూచించింది. అయితే రేపు ప్రారంభం కావలసి ఉన్న ఈ కార్యక్రమం పై, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం హడావిడిగా హౌస్ మోషన్ పిటీషన్ మూవ్ చేసింది. ఈ రోజు ఉదయం హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. కొద్ది సేపటి క్రితం హైకోర్టు విచారణలో కొన్ని కీలకమైన సూచనలు చేసింది. రెండు రోజుల్లో దీనికి సంబంధించి, దీని పై ఒక కార్యాచరణ రెడీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని ఆదేశించింది.

ఆ తరువాత అయుదు రోజుల్లో దీనికి సంబంధించి, ప్రభుత్వ నిర్ణయం పై పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీంతో పటు రాజకీయ పార్టీ రంగులు కానీ, దీంతో పాటు రాజకీయ పార్టీ నేతల జోక్యం కానీ ఈ పధకం అమలులో ఉండకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్పిందో, అదే విషయం హైకోర్టు కూడా చెప్పింది. ఈ పధకాలు అన్నీ పేద ప్రజలకు సంబదించినవి అని, దీనికి పెట్టె ఖర్చు అంతా ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదని, ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇస్తున్నవని, ఏ రాజకీయ పార్టీ కానీ ఇది ఓన్ చేసుకోకూడదు అని హైకోర్టు చెప్పింది. ముఖ్యంగా ఎన్నికల మోడల్ కోడ్ అఫ్ కాండాక్ట్ ను అనుసరించి కార్యక్రమం ఉండాలని, హైకోర్టు చెప్పింది. అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో, అదే విషయం హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వ్యాన్ లు పై వేసిన వైసీపీ రంగులు, జగన్ ఫోటోలు లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా ఈ పధకం అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరి, ప్రభుత్వం దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రతి నెలా రేషన్ బియ్యం, కొన్ని ఏళ్ళుగా ఎలా ఇస్తున్నారో, ఈ నెల కూడా అలాగే ఇస్తారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ సారి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చిన ఎస్ఈసి... ఫిబ్రవరి రెండు లోపు సమాధానం చెప్పాలని నోటీసులు...
అధికార పార్టీ చేస్తున్న పనుల పై, మాట వినని అధికారుల పై, జూలు విదిల్చుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ సారి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడితే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వెయ్యండి అంటూ, వాళ్ళు గెలిస్తే గ్రామాలను ఏమి చేస్తారో చెప్తూ, ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది. శుభ్రమైన త్రాగు నీరు, భద్రత, పన్నులు బాదుడు నుంచి విముక్తి, స్వయం ఉపాధి, పరిశుభ్రమైన పల్లెలు అంటూ, పంచ సూత్రాలతో ఒక మ్యానిఫెస్టో విడుదల చేసారు. అయితే దీని పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని, ఇందులో తెలుగుదేశం మ్యానిఫెస్టో ఏమిటి అంటూ, వైసిపీ అభ్యంతరం తెలిపింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ, వ్యాఖ్యలు చేసింది. అయితే ఒక పక్క మంత్రులు, 90 శాతం, 95 శాతం పంచాయతీలు మావే అంటూ ప్రచారం చేసుకుంటూ, మరో పక్క టిడిపి బలపరిచిన అభ్యర్ధుల కోసం మ్యానిఫెస్టో విడుదల చేస్తే ఏమిటి అభ్యంతరం అంటూ, టిడిపి ఎదురు దాడి చేసింది. ఈ 20 నెలల్లో మీరు గ్రామాలకు ఏమి చేయలేదు కాబటి, మేము బలపరిచిన అభ్యర్దుల కోసం, ఇది చేస్తున్నాం అని చెప్తే తప్పు ఏమిటి అని ప్రశ్నించింది.

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది "రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బలపరచే విషయంలోగానీ, మేనిఫెస్టో విడుదల చేసే విషయంలోగానీ ఎటువంటి ఆటంకం లేదన్న అంశాన్ని స్పష్టంగా ఏపీ పంచాయతీరాజ్ యాక్టు మరియు పీపుల్స్ రెప్రజెంటేషన్ యాక్టు సెక్షన్ 123 నందు పేర్కొన్న విషయాన్ని గుర్తించాలి" అంటూ టిడిపి అధికార ప్రతినిధి చెప్పారు. అయితే వైసీపీ దీని పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత, మ్యానిఫెస్టో విడుదల చేయకూడదని తెలిపింది. టిడిపి మ్యానిఫెస్టో బయటకు వెళ్ళకుండా సీజ్ చేయాలని, అలాగే చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. దీని పై ఎస్ఈసి టిడిపికి నోటీస్ పంపించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు, ఎస్ఈసి నోటీస్ పంపిస్తూ, దీని పై ఫిబ్రవరి 2 లోపు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఎస్ఈసి దీని పై విచారణ చేసి, తగు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మరి దీని పై టిడిపి ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.