ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసిన జగన్ ప్రభుత్వం, ఆయన పై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ నోటీస్ పై ఆన్లైన్ లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, మహారాష్ట్ర ఎన్నికల కమీషనర్ తరహాలో, నిమ్మగడ్డ పై కూడా చర్య తీసుకోవాలని వైసీపీ తరుపు సభ్యులు ప్రతిపాదించారు. అయితే దీని పై టిడిపి తరుపున అనగాని సత్యప్రసాద్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకంచారు. దీంతో ఈ రచ్చ జరగటంతో, సమావేశం ఈ రోజుకి, ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. ప్రివిలేజ్ కమిటీ తీరుపై అనగాని సత్యప్రసాద్ అసహనం వ్యక్తం చేసారు. ప్రివిలేజ్ కమిటీని కూడా వైసీపీ ప్రభుత్వం తన నియంతృత్వ విధానాలకు వాడుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరకంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిందే తడవుగా.. విచారణకు రావలని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్ సమావేశం నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడిన మంత్రులపై చర్యలు తీసుకోకుండా.. ఎన్నికల కమిషనర్ పై చర్యలు అంటూ మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసలు ఎన్నికల కమిషనర్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడం బ్లాక్ మెయిల్ చేసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

pc 0202022021 2

గతంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీ శివనాధరెడ్డిపై ఫిర్యాదు చేసిన సందర్భంలో.. గవర్నర్ నియమించిన తనపై సభా హక్కుల చట్టం కింద చర్యలు ఎలా తీసుకుంటారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అదే వైసీపీ నేతలకు.. ఎన్నికల కమిషనర్ ను కూడా నియమించింది గవర్నర్ అనే విషయం ఎలా మరిచిపోయారు.? తాము ఏం మాట్లాడినా తప్పులేదు.. కానీ.. తమను ఎదురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు అనేలా మంత్రులు వ్యవహరించడం, రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన స్పీకర్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేయడం ఎంత మాత్రమూ రాజ్యాంగ బద్దం కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నోసార్లు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చినా స్పందించని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందించడం విస్మయం కలిగిస్తోంది. ప్రివిలేజ్ కమిటీనే నవ్వుల పాలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం ఎంత మాత్రమూ సరికాదని గుర్తుంచుకోవాలి అని అనగాని సత్యప్రసాద్ అన్నారు.

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, వైసీపీ ఎంపీల పై ధ్వజమెత్తారు. "కేంద్ర బడ్జెట్ 2021-22లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విఫలమయ్యారు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. రాజ్యసభ సభ్యులతో కలిపి 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ హామీల అమలుకు ఎందుకు నిధులు రాబట్టలేకపోయారు? పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రతీసారి హోదా విషయంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఏపీకి విభజన చట్టం హక్కులు, హామీలు ఉన్నా వాటి అమలుకు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనలుగాని, కేటాయింపులుగాని లేకపోవడానికి బాధ్యత వహించి 28 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి. మనకంటే ఎంతో మెరుగైన బెంగళూరు, చెన్నై, కోచితో పాటు మహారాష్ట్రంలోని నాగ్ పూర్, నాసిక్ లలోని మెట్రోరైల్ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలోని మెట్రో రైల్ ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో విఫలమయ్యారు. తమిళనాడుకు 1,03,000 కోట్ల వ్యయంతో 3,500కి.మీ మేర జాతీయ రహదారుల పనులు, కేరళలో 1100 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణాలకు రూ.65,000 కోట్లు కేటాయించారు. "

kesineni 02022021 2

"టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర బడ్జెట్ లో ఇప్పటికన్నా మెరుగైన కేటాయింపులు ఉన్నా ఆనాడు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. గతంలో డిమాండ్ చేసిన విధంగానే మీరు ఇప్పుడు రాజీనామా చేయాలి. వైకాపా 28 మంది ఎంపీలు ఉండేది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికా? లేక జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కేసుల నుంచి బయటపడటానికి బేరాలు చేయడానికా? జగన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై ఎందుకు నోరు మెదపడంలేదు? బడ్జెట్ లో ఆర్థికలోటు భర్తీ లేదు, 7 వెనుకబడిన జిల్లాలకు నిధుల్లేవు, అమరావతికి లేవు, పోలవరానికి నిధుల కేటాయింపులు లేవు. ఇది జగన్ రెడ్డి వైఫల్యం కాదా? ఢిల్లీ చుట్టూ పదేపదే ప్రదిక్షణలు చేసేది జగన్ రెడ్డి తన వ్యక్తిగత కేసుల మాఫీ కోసమే. తన వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ రెడ్డి 5 కోట్ల మంది ఏపీ ప్రజల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారు. తక్షణమే వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి. " అంటూ నాని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కొమ్మారెడ్డి పట్టాభిరాం పై వైసీపీ డుండగులు దాడి చేసారు. ఈ రోజు ఉదయం విజయవాడలో ఉన్న తన ఇంటి దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు బయలు దేరిన సందర్భంలో, కారులో ఎక్కగానే, కారు పై రాడ్డులు, కర్రలు, రాళ్ళతో, కారు పై దా-డి చేసారు. ఈ దా-డిలో 15 మంది పాల్గున్నారని పట్టాభి చెప్పారు. పది రోజుల క్రితమే, ప్రెస్ మీట్ పెట్టిన పట్టాభి, తన పై దా-డికి కొడాలి నాని, వంశీ కలిసి ప్లాన్ చేసారని, చెప్పారు. తనకు ఏదైనా జరిగితే డీజీపీ దే బాధ్యత అని పట్టాభి చెప్పారు. ఆయన చెప్పినట్టే, ఇప్పుడు ఆయన పై దాడి జరిగింది. ఈ దా-డి పై స్పందించిన పట్టాభి, తనకు తగిలిన గాయాలు చూపించారు. కాలుకు, చేతులకు మొత్తం గాయాలు అయ్యాయి. కారు మొత్తం ధ్వంసం అయ్యింది. పట్టాబి స్పందిస్తూ, తన ఇంటిలో నుంచి మరో డ్రైవర్ వచ్చి అరుస్తూ అప్రమత్తం చేయటంతో, వదిలేసి వెళ్లిపోయారని, లేకపోతే తనను చంపేసేవారని పట్టాభి అన్నారు. పట్టాభి పై దాడి జరగటం ఇది రెండో సారి.

నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ఒక సంఘటన మీద దృష్టి పెట్టే లోపు మరో సంఘటన జరుగుతుంది. ఒక దాని తరువాత మరొక సంఘటన రావటంతో, టిడిపి నిరంతరం పోరాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, మీడియా కూడా, ఏ సంఘటన కవర్ చేయాలో తెలియని పరిస్థితి. ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయంలో, ఇవి మీడియా, అంటూ ప్రతిపక్షం పడుతున్న తిప్పలు. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో, టిడిపి సర్పంచ్ అభ్యర్ధి మృతి చెందారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించిన టిడిపి, ఈ రోజు అక్కడకు లోకేష్ వెళ్తారని ప్రకటించింది. దీంతో ఈ రోజు మొత్తం అక్కడ ఫోకస్ ఉంటుందని అందరూ భావించారు. ఉదయం ఏడు గంటలకు, శ్రీకాకుళంలో అచ్చేన్నాయుడు అరెస్ట్ అని వార్తలు. ఎందుకు అంటే, తన బంధువు ఫోన్ చేస్తే, చూడు అవకాసం ఉంటె, నిన్ను బలవంత పెట్టటం లేదు అని చెప్పినందుకు, కేసు పెట్టి, అరెస్ట్ చేసారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యుడు అరెస్ట్ కావటంతో, రచ్చ రచ్చ అయ్యింది. అక్కడ నుంచి వార్తలు వస్తున్న సమయంలో, వెంటనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై జరిగిన ఘటన హైలైట్ అయ్యింది. అన్నిటికంటే ఇది తీవ్రమైనది కావటంతో, ఫోకస్ అక్కడ నుంచి ఇక్కడకు వచ్చింది. ఏకంగా చంద్రబాబు కూడా పట్టాభి ఇంటికి వచ్చారు.

pattabhii 020202021 2

అయితే చంద్రబాబు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్రంలో బ్రతికే స్వేఛ్చ ఉందో లేదో, జగన్ దగ్గరే తేల్చుకుంటాం అని చంద్రబాబు అన్నారు. పట్టాభి సహా, మా నేతలు అందరూ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తారని, అక్కడ జగన్ నే అడుగుతారని అన్నారు. అయితే చంద్రబాబు తిరిగి వెళ్ళిపోయిన తరువాత, తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు, జగన్ ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యారు. పట్టాభి కారు ఏదైతే పగలుగొట్టారో, అదే కార్ లో , పట్టాభిని కూడా తీసుకుని , జగన్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు, పట్టాభిని వేరే వ్యాన్ లో ఎక్కించి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. అయితే ఈ సందర్భంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టాభిని తమ అధీనంలోకి తీసుకునే సమయంలో, తోపులాట జరిగింది. ఇక అక్కడ ఉన్న తెలుగుదేశం నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడటంతో, పోలీసులు వాళ్ళని పక్కకు లాగేసారు.

Advertisements

Latest Articles

Most Read