ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త సంఘటన, దేశ వ్యాప్తంగా చర్చనీయంసం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు అంటూ, కొన్ని జాతీయ బ్యాంకులు ముందు, చెత్త పోసి మునిసిపల్ సిబ్బంది నిరసన తెలిపారు. కమిషన్ చేయమంటేనే చేసాం అని చెప్పారు. అయితే ఈ చెత్త సంఘటన పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే చూస్తాం కూర్చోం అని వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు, దీని పై విచారణ కూడా జరుపుతున్నామని చెప్పింది. అయితే ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం దిద్దు బాటు చర్యలు చేపట్టింది. కేంద్రం విచారణ చేస్తే, పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయనో ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరుపునే విచారణ చేసి, చర్యలు తీసుకున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును, అలాగే మున్సిపల్‌ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. అయితే ఈ ఘటనలు విజయవాడ, మచిలీపట్నంలో కూడా జరిగాయి. అయితే అక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం వారి వద్ద నుంచి వివరణ కోరినట్టు తెలుస్తుంది. అయితే కేవలం ఉయ్యూరు మున్సిపల్‌ కమిషనర్ ను తొలగించటం పై, విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్‌ శాఖ కమిషనర్లను వదిలేయటం పై, విమర్శలు వస్తున్నాయి.

chetta 28122020 2

టిడిపి నేత వర్ల రామయ్య స్పందిస్తూ, కేంద్రం కన్నెర్రతో తోకముడిచిన రాష్ట్ర ప్రభుత్వం దళితుడని ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేసి మిగతావారిని ఎందుకు చేయలేదు? అంటూ ప్రశ్నించారు. బ్యాంకర్స్ పై కక్షపూరిత చర్యకు పూనుకున్నారని, బ్యాంకర్స్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఒక ముఖ్య ఆధికారి ఆదేశాలతో జిల్లాలో పలుచోట్ల “చెత్త”ను తీసుకెళ్లి ఆయా బ్యాంకుల ప్రధాన ద్వారాల ముందు వెయ్యాలని మున్సిపాలిటీలకు అనధికార ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలు ఆయా మున్సిపల్ కమిషనర్లు తూ..చా.. తప్పకుండా పాటించి, తాము సేకరించిన చెత్తను ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బ్యాంకుల ముందు పడవేయడం ఈ ప్రభుత్వ కక్షసాధింపుకు ప్రబల నిదర్శనం అని అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన దళిత వర్గానికి చెందిన కమిషనర్ ప్రకాశ్ రావు ను సస్పెండ్ చేసింది. ఎన్నోచోట్ల బ్యాంకుల ముందు చెత్త వేస్తే ఒక్క ప్రకాశ్ రావును సస్పెండ్ చేయడం ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం." అని వర్ల రామయ్య అన్నారు.

మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత తీసుకున్న ఒక నిర్ణయం, ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. విజయనగరం మహారాజా కోటలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభానికి తరలించలాని, ఆమె ఆదేశాలు జారీ చేసారు. విజయనగరం గజపతి రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ కు, విజయనగరం జిల్లాకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ ట్రస్ట్, విజయనగరం జిల్లాలో పలు విద్యా సంస్థలు నడుపుతుంది. తాజాగా ట్రస్ట్ ను విజయనగరం నుంచి విశాఖపట్నంకు మార్చటమే కాక, ట్రస్ట్ ఉద్యోగులను కూడా అక్కడికే రామ్ముంటున్నారని సమాచారం. మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుతం విజయనగరం మహా రాజా కోటలో, 5800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఉంది. ఇక్కడే 25 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇది ప్రస్తుత కార్యకలాపాలకు ఇరుకుగా ఉందనే నెపంతో, విశాఖకు మారుస్తున్నారు. మహా రాజా కోటలో ప్రస్తుతం, ఆరు విద్యా సంస్థలు, ఒక గర్ల్స్ హాస్టల్ నడుస్తున్నాయి. ఇప్పటికే వేరే కారణాలు చెప్పి, విశాఖ జిల్లా పద్మనాభంలో ఉన్న గర్ల్స్ హాస్టల్ ను మూసేసారు. 3.5 ఎకరాల్లో ఉన్న ఈ కాలేజీ బిల్డింగ్ లోకి మాన్సాస్ ట్రస్ట్ ను మార్చాలని, ఈ నెల 26న నిర్ణయం తీసుకున్నట్టు, సంచయత సంతకంతో ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, ఒకవేళ ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఇరుకుగా ఉంటే, అక్కడ మరొక కార్యాలయం కట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

sanchayita 298120200 2

కేవలం ఈ వంకతోనే, మాన్సాస్ కార్యాలయాన్ని విజయనగరం నుంచి విశాఖ తరలించటాన్ని విజయనగరం వాసులు ఖండిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఢిల్లీలో ఉంటున్న సంచయతను తీసుకుని వచ్చి, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా విజయసాయి రెడ్డి కూర్చోబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీని పై ప్రస్తుతం అంతకు ముందు చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు కోర్టు లో కేసు వేసారు. కేసు నడుస్తూ ఉండగానే, సంచయిత పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం, కార్యాలయాలు తరలించటం వంటివి చేస్తున్నారు. ఆమెకు విజయనగరంలో ఎక్కువ సేపు గడపటం ఇష్టం లేక, కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని, అదీ కాక విశాఖలో అయితే అధికార పార్టీ నేతలు అందుబాటులో ఉంటారు కాబట్టి, అన్నిటికీ అండగా ఉంటారని, ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని, పలువురు ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. అయితే సంచయిత తీసుకున్న నిర్ణయం పై, అదితి గజపతిరాజు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. భూములు రికార్డులు తారు మారు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

విశాఖలో డాక్టర్ సుధాకర్ కు ప్రభుత్వం వైపు నుంచి జరిగిన అన్యాయం నేపధ్యంలో, ఆయన కేసుని హైకోర్టు, సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ కేసు విచారణ హైకోర్టులో జరిగింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా, సిబిఐ అధికారులు ఇచ్చిన నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదటిగా, సుధాకర్ కేసుకు సంబంధించి ఏపి పోలీసులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానికంగా ఉన్న పోలీసులు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, కేసు విషయంలో వాస్తవాలు బయటకు రావాలి అంటే, న్యాయం జరగాలంటే, ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని, సుధాకర్ తల్లితో పాటు, పౌర సంఘాలు కూడా డిమాండ్ చేసాయి. ఈ నేపధ్యంలోనే ధర్మాసనం ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జరీ చేసింది. అయితే సిబిఐ గత కొంత కాలంగా ఈ కేసు పై విచారణ చేస్తూ వచ్చింది. అనేక మందిని ఈ కేసుకు సంబంధించి విచారణ చేసారు. సుధాకర్ ని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు పై, మానసిక వైద్యులు నుంచి, చేసిన వైద్యం గురించి కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేసారు. అయితే సిబిఐ ఇప్పటి వరకు చేసిన విచారణ, దర్యాప్తు జరిగిన తీరు, ఈ వివరాలు మొత్తం, సిబిఐ సీల్డ్ కవర్ లో హైకోర్టు ముందు పెట్టింది.

cbi 28122020 2

అయితే సీల్డ్ కవర్ లో సిబిఐ ఇచ్చిన వివరాలు, విచారణకు సంబధించిన సమాచారం పరిశీలించిన ధర్మాసనం, పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. సిబిఐ అధికారులు కూడా కేసుకు సంబంధించి విచారణ సరిగ్గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, దీని పై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా హైకోర్టు కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ఈ కేసు పై ఒక పర్యవేక్షణాధికారిని నియమించాలని, ఆ అధికారికి అడిషనల్ డైరెక్టర్ స్థాయి ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణ పై పూర్తి నివేదిక తమకు మార్చి 31లోపు అందించాలని హైకోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్ మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. అప్పట్లో ఈ కేసు సంచలన కేసుగా అయ్యింది. క-రో-నా వచ్చిన కొత్తలో, డాక్టర్లకు కూడా కనీసం మాస్కులు ఇవ్వటం లేదని, డాక్టర్ సుధాకర్ అడగటం, ఆయన్ను సస్పెండ్ చేయటం, తరువాత ఆయన్ను పిచ్చి వాడిగా ముద్ర వేసి, నడి రోడ్డు మీద పడేయటం, ఇవన్నీ జరిగి, చివరకు ఈ కేసు హైకోర్టుకు చేరి, సిబిఐ విచారణ వరకు వెళ్ళింది.

సాక్షి ఛానల్ అంటే జగన్ మోహన్ రెడ్డి సొంత ఛానల్ అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో రాజశేఖర్ రెడ్డి, సాక్షి ఛానల్ పెట్టించారు. మొదట్లో జగన్ మోహన్ రెడ్డి, అన్ని పనులు చూసుకునే వారు. తరువాత ఆయన భార్య సాక్షి వ్యవహారాలు చూస్తున్నారు. ఇక సాక్షిలో పెట్టుబడులు విషయంలో అడ్డంగా దొరికిన జగన్ పై సిబిఐ కేసులు, జైలుకు వెళ్ళటం, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట ఉండటం, అన్నీ తెలిసిందే. అయితే సాక్షి అనేది జగన్ భజన, తెలుగుదేశం పార్టీని డీగ్రేడ్ చేస్తూ వార్తలు రాయటం తప్ప ఏమి ఉండదు. సహజంగా చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇతర ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటనలు, ప్రెస్ మీట్ లు లాంటివి సాక్షి అసలు కవర్ చేయదు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెడితే అసలు అవి సాక్షిలో చూపించటం అనేది ఎప్పుడూ ఉండదు. అంత వన్ సైడ్ గా సాక్షి చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు రైతు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ, మూడు రోజుల కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నారా లోకేష్ అవినగడ్డలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. పంట నష్టపోయిన పొలాలు పరామర్శించారు. రైతులు పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు పర్యటన కొనసాగుతూనే ఉంది.

ln 28122020 2

అయితే ఈ పర్యటన చివర్లో నారా లోకేష్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. అయితే అనూహ్యంగా ఈ సమావేశానికి సాక్షి విలేఖరి కూడా వచ్చారు. ప్రెస్ మీట్ కు కూర్చున్న లోకేష్ కు, సాక్షి లోగో తో కూడిన మైక్ కనిపించింది. దీంతో లోకేష్, సాక్షి విలేఖరికి కౌంటర్ ఇచ్చారు. సాక్షి వచ్చింది ఏంటి కధ అంటూ మాట్లాడిన లోకేష్, గట్టిగా తీసి, మొత్తం మీ ముఖ్యమంత్రి గారికి పంపించండి అంటూ సెటైర్ వేసారు లోకేష్. అంతే కాదు, విలేఖరుల సమావేశం అయిపోయిన తరువాత కూడా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు, మీ సాక్షి కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను మీ ముఖ్యమంత్రి లాగా పారిపోను అంటూ లోకేష్ కౌంటర్ వేసారు. అయితే అక్కడే ఉన్న తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ, ప్రెస్ మీట్ ఒక్క దానికే కాదని, మీ పర్యటన మొదలైన దగ్గర నుంచి, ఈ రోజు సాక్షి మనల్ని ఫాలో అయ్యింది అంటూ నారా లోకేష్ కు చెప్పారు. అయితే దీనికి స్పందించిన లోకేష్, బాగా తీయండి, కష్టాలు అన్నీ కవర్ చేయండి, మా డిమాండ్లు మీ ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ కౌంటర్ వేసారు.

Advertisements

Latest Articles

Most Read