ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరిని, ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేస్తూ, కేంద్ర న్యాయ శాఖ కొద్ది సేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆరూప్ కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాలు వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి అమల్లోకి వస్తాయని, ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 14 వ తేదీన సుప్రీంకోర్టు కోలీజియం సమావేశం అయ్యి, దేశంలో ఉన్నటు వంటి 16 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. తెలంగాణాకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సిక్కిం చీఫ్ జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామిని ఏపి హైకోర్టుకు, అదే విధంగా ఒరిస్సా చీఫ్ జస్టిస్ మహ్మద్ రఫీక్ ను, మధ్యప్రదేశ్ కి కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న న్యాయమూర్తి కోహ్లిని, తెలంగాణాకు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి ఇచ్చారు. మొత్తం 5 గురుకి చీఫ్ జస్టిస్ హోదా ఇస్తూ, సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది.

maheswhari 31212020 2

ఆ సిఫారుసులు కేంద్ర న్యాయ శాఖకు సుప్రీం కోర్టు పంపగా, కేంద్ర న్యాయ శాఖ, కేంద్ర హోం శాఖకు పంపగా, అక్కడ నుంచి పీఏంఓకు, అక్కడ నుంచి రాష్ట్రపతి వద్దకు ఈ సిఫారుసులు వెళ్ళాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత, ఈ సిఫార్సుల్లో ముగ్గురు నియమాకలకు మాత్రమే బదిలీ చేస్తూ, ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా న్యాయమూర్తులు బదిలీ కూడా ఈ రోజు, లేదా రేపు వచ్చే అవకాసం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పై అనేక కీలక కేసులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా, 29 వేల మంది రైతుల జీవితాలు అయిన అమరావతి కేసుని, జస్టిస్ మహేశ్వరీ బెంచ్ లో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు దాదాపుగా నెల రోజులుకు పైగా, ప్రతి రోజు విచారణ చేసి విన్నారు. సంక్రాంతి పండుగ అయిన తరువాత, ఎప్పుడైనా అమరావతి పై తీర్పు రావచ్చని అందరూ భావిస్తున్న టైంలో, జస్టిస్ మహేశ్వరీ బదిలీ కావటంతో, ఇప్పుడు ఈ కేసు పరిస్థితి ఏమి అవుతుంది అనేది చూడాలి. మళ్ళీ మొదటి నుంచి కొత్త చీఫ్ జస్టిస్ విచారణ చేస్తారా, లేక ఏమి చేస్తారు అనేది వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఇచ్చిన ఒక తీర్పులో సంచలన కామెంట్స్ చేసింది. బిల్డ్ ఏపి కేసు సందర్భంగా, జస్టిస్ రాకేశ్ కుమార్ ఆ కేసు నుంచి తప్పుకోవాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదిస్తూ, తాను అనని మాటలు అన్నట్లుగా చెప్తూ, తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన కారణంగా, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మీద కేసు నమోదు చేయాలని, క్రిమినల్ కేసు పెట్టాలని, ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ వ్యవస్థలతో ఎలా వ్యవాహరిస్తుందో ప్రస్తావించారు. అయితే ఇదే సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి తీరు పై కూడా నిప్పులు చెరిగారు. తనకు జగన్ మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియని టైంలో, ఎవరో ఒక నెంబర్ కొడితే చాలు, అతని వివరాలు వస్తాయని చెప్తే, గూగుల్ లో ఆ నెంబర్ కొడితే, తన హిస్టరీ తెలిసింది అని, రకరకాల చరిత్రలు తెలిసాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకునేలా ప్రభుత్వం తీరు ఉందని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించింది. అంతే కాదు, సుప్రీం కోర్టు తీరు పై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. అమరావతి కేసు విచారణలో ఉండగా, సుప్రీం కోర్టు, చీఫ్ జస్టిస్ లను బదిలీ చేయటం గురించి ప్రస్తావిస్తూ, హైకోర్టు జడ్జిలు కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని గుర్తించాలని ఆ తీర్పులో తెలిపారు.

hc 30122020 1 1

సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్, ప్రజాప్రతినిధుల పై కేసులు విషయంలో విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జగన్ మోహన్ రెడ్డి పై ఏడు కేసులు కొట్టేసారని, ఇదేమి న్యాయం అని తన తీర్పులో తెలిపారు. ముందుగా కౌన్సిల్ ని రద్దు చేసారని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై చేసిన విషయాలు, ఇప్పుడు కోర్టు మీదకు కూడా వచ్చారని అన్నారు. 55 పేజీల సుదీర్ఘ తీర్పులో అనేక సంచలన విషయాలు ఈ ఆర్డర్ కాపీలో ఉన్నాయి. ముఖ్యంగా జగన్ పై చేసిన వ్యాఖ్యలు, గూగుల్ లో ఆయన ఖైదీ నెంబర్ కొడితే వచ్చిన వివరాలు, ఈ ఆర్డర్ కాపీలో పెట్టారు. ఇది కాక, ఎన్వీ రమణ ఆదేశాలు తరువాత, జగన్ పై ఉన్న ఏడు కేసులు తొలగించటం పై, ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను చేయని వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తూ, ఎలా చేసింది, అసలు ఈ పరిణామాలు ఎందుకు వచ్చాయో చెప్తూ, సుదీర్ఘంగా తన 55 పేజీల ఆర్డర్ కాపీలో తెలిపారు. జస్టిస్ రాకేశ్ కుమార్, రేపు రిటైర్డ్ అవుతారని తెలుస్తుంది. రిటైర్డ్ అయ్యే ముందు, ఆయన ఇచ్చిన ఈ తీర్పు, ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది. మరి ఎప్పటి లాగే అధికార పార్టీ ఎదురు దాడి చేస్తుందో, లేక సరి చేసుకుంటుందో చూడాలి.

కడప జిల్లాలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను అతి దారుణంగా చం-పే-సి-న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక ఇళ్ళ స్థలాల కుంభకోణం ఉందని అంటున్నారు. ఘటన జరిగిన మూడు రోజుల ముందు, నందం సుబ్బయ్య ప్రెస్ మీట్ పెట్టి, ఇళ్ళ స్థలాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టారు. ఎమ్మెల్యే అతని అనుచరులు ఈ ఘటన వెనుక ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరో పక్క కొంత మంది ఈ రోజు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇవన్నీ ఒకటి అయితే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ కడప వెళ్లి నందం సుబ్బయ్య బౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్భంగా అక్కడ కుటుంబ సభ్యులు, ఎఫ్ఐఆర్ లో అందరి పేర్లను తొలగించి కుందా రవి పేరును మాత్రమే పెట్టారని, నేను చెప్పిన వారి పేర్లు ఎఫ్ఐఆర్ లో పెట్టక పొతే,తన భర్త మృ-త దే-హా-న్ని ద-హ-నం చేయనివ్వను అంటూ ఆమె చెప్పటంతో, నారా లోకేష్ కూడా అక్కడే సంచలన ప్రకటన చేసారు. ఆమెకు న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులోనే ఉంటానని, ఇక్కడే దీక్షకు కూర్చుంటాను అని చెప్పటంతో, ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు పరిస్థితి ఎటు దారి తీస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. పోలీసులు వచ్చి చర్చలు జరుపుతారా ? వారి అడిగినట్టు కేసు పెడతారా ? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటో తీసుకుని వెళ్లి చెత్తలో పడేసారు. మాజీ రాష్ట్రపతికి ఏపి సెక్రటేరియట్ లోనే తీవ్ర అవమానం జరిగింది. ఇదేదో ఏదో చిన్న ఆఫీస్ లోనే, ఎక్కడో ఒక కార్యాలయంలోనే జరిగిన సంఘటన అయితే ఏదో అనుకోవచ్చు. ఇది జరిగింది ఏకంగా ఒక రాష్ట్ర సచివాలయంలో. ఈ ఘటన చూసి, సచివాలయంలో పని చేసే ఉద్యోగులు కూడా అవాక్కయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఉన్న ఫోటో ఫ్రేమ్ నార్త్ బ్లాక్ లో ఉన్న చెత్తలో పడేసారు. ఇది ఎవరు చేసారో తెలియదు కానీ, ఈ ఘటన అందరికీ షాక్ అయ్యేలా చేసింది. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, విశాఖ పర్యటన చేసారు. ఆ సమయంలో  అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి ముఖ్య అతిధిగా  ప్రణబ్ ముఖర్జీ వచ్చారు. ఆయన పర్యటన గుర్తుగా, ఈ ఫోటో ఫ్రేమ్ ని రాష్ట్ర సచివాలయంలో పెట్టారు. ఇదే ఫోటోలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోలో చంద్రబాబు ఉన్నారని, ఆ ఫోటోని పడేసారో లేదో తెలియదు. ఒక వేళ ఆ ఫోటో చూడటం ఇష్టం లేకపోతే, ఎదో ఒక స్టోర్ రూమ్ లో బధ్రపరచాలి కానీ, తీసుకుని వెళ్లి చెత్తలో పడేయటం పై, విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఘటన పై సీరియస్ అయ్యి, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read