రాష్ట్రంలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావని, హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోంది అని, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం అంటూ, టిడిపి నేత, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రాంప్రసాద్ ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో "జగన్ రెడ్డి 18 నెలల పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి. తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం వరకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి తిరుమల కొండపై, ద్వారకా తిరుమలలోనూ వైకాపా నేతలు, మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జగన్ రెడ్డి విధానాలకు నిదర్శనం. తిరుమలకు వెళ్లే బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత కీర్తనలు పెట్టారు. నేడు తిరుమల వైకుంఠ దర్శనం విషయంలో మూడు రోజులు కొనసాగించే దర్శనాన్ని 10 రోజులు పాటు పెట్టారు. హిందూ గౌరవాలపై పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం దాడి చేస్తోందని దీనిని బట్టి అర్థమవుతోంది. ప్రతి రోజూ హిందూ దేవాలయాలపై ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. తిరుమలలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి 5,6 వందల మందితో దర్శనానికి వెళ్లారు. డ్రోన్ లు ఎగురవేసి తిరుమల నిబంధనలు ఉల్లంఘించారు. ఇది శాంతిభద్రతలకు విఘాతం కాదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం మాస్క్ లు కూడా వేసుకోకుండా ర్యాలీగా వెళ్లారు. ప్రకాశం జిల్లా దర్శిలో కృష్ణుడి ఆలయంలో రక్తం, మాంసపు ముక్కలు పడేసి వెళ్లారు."

"ద్వారకా తిరుమలలో పందిమాంసం అమ్మే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం? ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. అంతర్వేది రథం దగ్ధం చేసినా చర్యలు లేవు. చర్చిలో దాడి జరిగిందని చెప్పి 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సంఘటనలు చూసేందుకు వెళ్లే వారిని కూడా అనుమతించడం లేదు. కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయ్యాయి. హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రోడ్లపైకి రాకపోయినా సరైన సమయంలో బుద్ధి చెబుతారు. ఓ మతంపై పథకం ప్రకారం దాడి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మత మార్పిడులు, దాడుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పోరాటం చేస్తుంది. త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తాం. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధంపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు, దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు మనం చూశాం. జగన్ రెడ్డి ఏనాడూ స్పందించలేదు. బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయి. అన్ని వర్గాలను, మతాలను గౌరవించే సంప్రదాయం నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు. ఇది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరిచి సమస్యలు పరిష్కరించాలి. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు." అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రతి జిల్లాలో వైసిపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కొన్ని సార్లు ఇవి బహిరంగం అవుతున్నాయి కూడా. సీనియర్ నాయకులు కూడా ఇందుకు అతీతం కాదు. పిల్లి శుభాష్ చంద్రబోస్ లాంటి సీనియర్ నేతలు కూడా, తమ అసంతృప్తి బహిరంగంగా వ్యక్త పరుస్తున్నారు అంటే, వైసీపీలో జరుగుతున్న కోల్డ్ వార్ అర్ధం అవుతుంది. ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు తారా స్థాయిలో ఉన్నాయి. అప్పుడప్పుడు బయటకు వచ్చి బాంబు పెల్చుతున్నారు సీనియర్ నేతలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు ఎక్కువ. ఆనం కుటుంబం, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి, ఆదాల కుటుంబాలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెత్తనం మొత్తం, జగన్ మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వటంతో, ఈ పెద్ద కుటుంబాలకు రుచించలేదు. మరో మంత్రి మేకపాటి ఉన్నా, ఆయన జిల్లా పై పెద్దగా పట్టు సాధించటం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనిల్ కుమార్ మాత్రం, పెత్తనం మొత్తం తీసుకోవటంతో, కొంత అసంతృప్తి సీనియర్ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఆనం కుటుంబం జరుగుతున్న పనుల పై తీవ్ర అసంతృప్తిలో ఉంది. సీనియర్ నేత అయిన ఆనం రాం నారాయణ రెడ్డి, అప్పుడప్పుడు బహిరంగ వేదికల పైనే అసంతృప్తి వ్యక్తం చేసారు.

aanam 26122020 2

మరో ఏడాది చూస్తాను, తరువాత నేరుగా రంగంలోకి దిగుతా అని నాలుగు నెలల క్రిందట వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ప్రతి సారి అసెంబ్లీలో ఆక్టివ్ గా కనిపించే ఆనం, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా మాట్లాడలేదు. ఇది ఇలా ఉంటే, ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి వేడుకలు జరిగిన సందర్భంలో, ఆనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూ, ఆస్కిక్తర వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, త్వరలోనే మళ్ళీ నెల్లూరు నగరం రాజకీయాల్లో తమ ముద్ర ఏమిటో చూపిస్తాం అంటూ, వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు, ఎవరికీ ఇవి వార్నింగ్ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక నిన్న జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ విషయంలో కూడా, సబ్ కలెక్టర్ తో స్వల్ప సంవాదం జరిగింది. మీరు స్టేజ్ మీద ఉంటే నేను రాను అంటూ, ఆనం సభా వేదిక నుంచి వెళ్ళిపోయారు. అయితే దీనికి, గతంలో ఆనంకు, సబ్ కలెక్టర్ పలు విషయాల్లో సహకరించకపోవటానికి వల్ల ఏర్పడిన వివాదం కారణంగా, ఆనం ఇలా చేసారని తెలుస్తుంది. మొత్తంగా, నెల్లూరు వైసీపీలో సీనియర్ లు అందరూ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. వైసీపీ అధిష్టానం దాన్ని చల్లారుస్తుందా లేదా అనేది చూడాలి.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన స్కాం అంటూ వివరాలు బయట పెట్టారు. ఆయన మాటల్లో.... ఏ1 జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆయన ఏ పథకం ప్రారంభించినా అందులో అవినీతి ఉంటుంది. ఇళ్ల పట్టాల స్కీంలోనూ వేల కోట్ల అవినీతి చేశారు. 30 లక్షలమందికి ఇళ్లు ఇస్తామంటున్నారు. ఇందుకోసం 60 వేల ఎకరాల భూమి సేకరించారు. స్థల సేకరణ కోసం 22 వేల 355 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఏ1, ఏ2, కొందరు ఎమ్మెల్యేలు రూ. 6500 కోట్ల అవినీతి చేశారు. అవినీతిని నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. అవినీతి చేయడంలో జగన్మోహన్ రెడ్డి , అతనికి సలహాలు ఇవ్వడంలో విజయసాయి రెడ్డి ఘనులు. 10, 15 లక్షల విలువుండే భూమిని 40 లక్షలకు పైగా చెల్లించి కొనుగోలు చేశారు. ఇందులో భారీ అవినీతికి పాల్పడ్డారు. భూ సేకరణలో రేట్లు పెంచి సుమారు రూ. 4వేల కోట్లు దోపిడీ చేశారు. కొండలు, గుట్టలు, చెరువులు, స్మశానాల్లో భూములు సేకరించారు. ఆ భూమి చదును చేయడానికి మళ్లీ డబ్బు ఖర్చు పెట్టారు. అందులోనూ రూ. 2 వేల కోట్లు తినేశారు. భూమిలిస్తాం, పట్టాలిస్తామంటూ గ్రామాల్లోని వైసీపీ నేతలు, వాలంటీర్లు అమాయక ప్రజల దగ్గర రూ. 5 వందల కోట్లు వసూలు చేశారు. టీడీపీ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 8 లక్షల ఇళ్లు నిర్మించాం.

vs 25122020 2

వాటిని పేదలకు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. నర్సీపట్నంలో 2, 595 మందికి ఇళ్లు కేటాయిస్తే వాటిని తీసేసేందుకు చూస్తున్నారు. నర్సిపట్నంలో 624 మంది డిపాజిట్ లు కట్టినా ఇళ్లు ఇవ్వడంలేదు. ఎందుకు ఇవ్వరంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవ్వకపోవడానికి కారణాలు చెబుతూ నోటీస్ ఇచ్చారా? డిపాజిట్ కట్టిన వారికి ఇళ్లు కేటాయించాల్సిందే. లేకుండా ప్రజా పోరాటం తప్పదు. టిడ్కో ఇళ్లకు లోన్ మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. రూపాయికే ఇళ్లు అని మాయమాటలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇంతలా మోసం చేస్తారా? డిపాజిట్లు కట్టిన వారికి అన్యాయం చేస్తూ సంబరాలా? మంత్రులు అవంతి, నారాయణ స్వామి తిరుమల కొండపై నుంచి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం సరికాదు. కొండపై అన్యమత ప్రచారం చేయకూడదని కోర్టులు కూడా చెప్పాయి. సంప్రదాయాలను కాపాడాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా? అవంతి శ్రీనివాస్ సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో వైసీపీ బ్లూ బ్యాచ్ (రౌడీమూకలు) అరాచకాలనేపథ్యంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిందని, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకొని, చట్టాన్ని తనచుట్టంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి, అనంతపురంలో బలైన స్నేహలత కుటుంబానికి ఏం సమాధానం చెబుతాడని టీడీపీఅధికారప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు జగన్ అండగా ఉన్నాడని, రక్షణకల్పిస్తున్నాడని సినిమావారిని తలదన్నేలా అసెంబ్లీలో వైసీపీ మహిళానేతలు చెప్పిన డైలాగులు (మాటలు) ఏమయ్యాయని దివ్యవాణి ఎద్దేవాచేశారు. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినవారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రమంతా గన్ ఎక్కడ...జగన్ ఎక్కడాఅని ఎదురుచూస్తున్నారన్నారు. మరో మహా తల్లి నిండుఅసెంబ్లీలో మాట్లాడుతూ, తన గుండె జగన్... జగన్ అని కొట్టుకుంటున్నట్లు చెప్పుకుందని, నేడు ఆగిపోయిన స్నేహలత గుండెను తిరిగికొట్టు కునేలా సదరుమహిళా ఎమ్మెల్యే చేయగలదా అని టీడీపీ మహిళా నేత నిలదీశారు. స్నేహలత కుటుంబానికి డబ్బులిచ్చి సరిపెట్టినం త మాత్రాన చనిపోయిన ఆమెఆత్మకు శాంతికలగదనే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మహిళలు తెలుసుకోవాలన్నారు. జగన్ మాట ఇస్తే శాసనమని మరొకామె చెప్పిందని, వారివారి మాటల ద్వారా సదరుమహిళానేతలంతా ఆస్కార్ అవార్డుకు పోటీపడ్డారని దివ్యవాణి దెప్పిపొడిచారు. వ్యక్తిగతప్రయోజనాలకోసం, మంత్రి పదవులకోసం జగన్ ను పొగిడినవారంతా, స్నేహలత కుటుంబాని కి న్యాయంచేసే దిశగా ఎందుకుఆలోచించడం లేదన్నారు. దిశాచట్టం అని మభ్యపెడుతున్న ప్రభుత్వం, స్నేహలత తల్లికి ఏం సమాధానం చెబుతుందన్నారు. దిశా స్టేషన్ కు ఆమె కాల్ చేసినా అక్కడున్న సిబ్బంది ఎందుకు స్పందించలేదో , ముఖ్యమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏమైందో చెప్పాలన్నారు. జగన్ 18నెలల పరిపాలనలో దాదాపు 260మంది మహిళలపై లైంగికవేధింపులు, అత్యాచారాలు, దారుణాలు జరిగాయన్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం ప్రకారం 21రోజుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని పాలకులు చెప్పారని, ఇప్పటివరకు జరిగిన దారుణాలకు సంబంధించి ఏ కేసులో, అలా ఎంతమందికి శిక్షపడిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం నిజంగా అమల్లో ఉంటే, అనంతపురం జిల్లాలో ముక్కుపచ్చలారని 13ఏళ్లబాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన లారీడ్రైవర్ ను ఏం చేశారో, ఎలాశిక్షించారో, దిశాచట్టం ఏచేసిందో చెప్పాలన్నారు. సదరు చట్టంలో చెప్పినట్లుగా 354(e), 354 (f) సెక్షన్లప్రకారం ప్రభుత్వం ఎందరిపై చర్యలు తీసుకున్నారని దివ్యవాణి నిలదీశారు. పాలకులు, అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పరుచూరి బ్రదర్స్ ను మించిపోయేలా డైలాగులు చెప్పడంతప్ప, ఆచరణలో అందుకు తగినవిధంగా పనులుచేయడంలేదన్నారు. న్యాయమూర్తుల కొరత అనేది దేశవ్యాప్తంగా ఉందని, జాతీయ లా కమిషన్ కూడా ఇదే విషయం చెప్పిందని, ఇవన్నీ తెలిసీకూడా దిశాచట్టంలో కేవలం 21రోజుల్లోనే నిందితులకు శిక్షపడేలా చేస్తామని చెప్పడంముమ్మాటికీ ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డల ను మోసగించడమే అవుతుందన్నారు. మృగాళ్ల చేతిలో బలైపోయిన ఏ ఆడబిడ్డకు, ఆమె కుటుంబానికి జగన్ తనపాలనలో న్యాయంచేశాడో, ఎందరుదోషులను శిక్షించాడో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. వైసీపీనేతలు, కార్యకర్తలు పలుకేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే ఘటనలు రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయన్న కేంద్ర ప్రభుత్వ నివేదికపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు ఇప్పటికైనా డైలాగులు చెప్పడంమానేసి, వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తే మంచిదన్నారు.

Advertisements

Latest Articles

Most Read