రాష్ట్రంలో ఏప్రభుత్వ హయాంలో మానవహక్కులు కాపాడ బడ్డాయో, ఎవరిపాలనలోప్రజలు తమహక్కులను స్వేచ్ఛగా వినియోగించుకున్నారో, జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు సూచించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడిపై, పరిటాల రవీంద్ర, ఆయనకుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన మాధవ్ ఎప్పటిలానే అతని అలవాటు ప్రకారమే వ్యవహరించాడన్నారు. మాధవ్ ఎంపీకాకముందు అతని పరిస్థితేమిటో అందరికీ తెలుసు నని, పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఏనాడూ ఆయన తన విధినిర్వహణను సక్రమంగా చేసిందిలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తొడలుకొట్టినవారికి, తగలబెట్టినవారికి, సభ్యతలేకుండా ఎదుటివారిని తూలనాడేవారికి ఏరికోరి మరీ ఎంపీ పదవులిచ్చా డనటానికి మాధవ్ ప్రత్యక్షఉదాహరణ అని మాణిక్యరావు స్పష్టం చేశారు. వైసీపీతరుపున పార్లమెంట్ కు ఎన్నికైనవారిలో 80శాతం మంది నేరప్రవృతి కలిగినవారేనని సాక్షాత్తూ పార్లమెంట్ కమిటీయే చెప్పడం జరిగిందన్నారు. మాధవ్ ఎక్కడున్నా తన నేర స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. ఆయనపై చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసుమోపబడిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇంకాఅనేక కేసులు మాధవ్ పై ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడిగురించి, పరిటాలరవీంద్ర, ఆయన కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మాధవ్ గురించి చెప్పాలంటే చాలానే ఉందన్న మాణిక్యరావు, 1983కి ముందు రాష్టప్రజల పరిస్థితి ఎలాఉందో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి దీనస్థితిలో బతికారో ఇప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేదనే నిజాన్ని గోరంట్ల తెలుసుకోవా లన్నారు.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే, నిజమైన టువంటి స్వేచ్ఛావిధానం రాష్ట్రంలో అమలైందని, ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిటాల నెత్తురు పారించాడంటున్న మాధవ్, టీడీపీ హాయాంలో రవీంద్ర అక్కడ నీళ్లుపారించాడనే నిజాన్ని తెలుసు కోలేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేశాడని నేరచరితుడైన మాధవ్ చెప్పడం సిగ్గుచేటన్నా రు. నేరచరితులు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారి నోటివెంట మంచిమాటలు వస్తాయని ఆశించడం ప్రజల మూర్ఖత్వ మే అవుతుందన్నారు. టీడీపీ అంటేనే బీసీలపార్టీ అని, ఎందరు బీసీలను రాష్ట్ర, దేశస్థాయి నాయకులను తయారుచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దేవేందర్ గౌడ్, కింజారపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కింజారపు అచ్చెన్నాయుడు వంటివారు టీడీపీలో ఎలాంటి స్థానాల్లో ఉన్నారో మాధవ్ కి తెలియదా అని మాణిక్యరావు నిలదీ శారు. బీసీల్లోని రౌడీలకు పదవులిచ్చిన వైసీపీప్రభుత్వం, వారి ప్రవర్తన చూసి సిగ్గుపడాల్సిన సమయం వచ్చిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి జలాలను ఆప్రాంతానికి తరలించిన చరిత్ర టీడీపీదని మాణిక్యరావు స్పష్టంచేశారు. సీమప్రాంతంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి, అక్కడివారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఆంధ్రర్పదేశ్ రాష్ట్రంలో వచ్చిన వింత వ్యాధి దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, 5 రోజులు క్రితం ప్రజలు వింత వ్యాధి బారిన పడిన, హాస్పిటల్ పాలు అయిన సంగతి తెలిసిందే. మూర్చతో పడిపోయి, నురగ కక్కుకుంటూ, ప్రజలు హాస్పిటల్ పాలు అయ్యారు. ఈ రోజుకి పరిస్థితి కొంచెం కుదుట పడింది. ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది ఈ వ్యాధి బారిన పడగా, ముగ్గురు చనిపోయారు. అయితే ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం, దీనికి గల కారణాలు చెప్పలేక పోయింది. మంచినీరు కారణంగానే ఇంత మంది జబ్బు బారిన పడి ఉంటారని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం నీటిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన బృందాలు మాత్రం, నీటిలో సీసంతో పాటుగా, క్లోరిన్ అధికం అవ్వటం వలన, నీరు కలుషితం అయి ఉంటుందని ఇప్పుడిప్పుడే ఒక నిర్ధారణకు వస్తున్నారు. దీని పై ఈ రోజు, రేపటిలోగా, కేంద్ర బృందం తమ పరిశీలనలో అంశాలు చెప్పనుంది. అయితే ప్రాధమికంగా అందరూ నీరు కలుషితం పైనే ద్రుష్టి పెట్టారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలల్లో పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి రాసిన లేఖ, ఇప్పుడు సంచలనంగా మారింది.

jagan 10122020 2

మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఆ లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. ఏలూరు పరిస్థితి, విశాఖకు రాక ముందే మేల్కోవాలని హెచ్చరించారు. ఏలూరులో నీరు కలుషితం అయ్యి, సీసం కలిసిందని చెప్పినట్టే, విశాఖ నీటిలో కూడా సీసం కలిసిన ఆనవాళ్లు ఉన్నాయని మాజీ అధికారి ఈఏఎస్‌ శర్మ తెలిపారు. విశాఖపట్నం నగరంలో నీటి కాలుష్యం అధికంగా ఉందని, ఇక్కడ నీరు కూడా కలుషితం అవుతుందని, జాగ్రత్త పడాలని లేఖలో తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా ఆయన జత చేసారు. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక కూడా ఇదే చెప్తుందని అన్నారు. విశాఖతో పాటుగా ఇతర నగరాలకు కూడా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా పైపులైన్ల వ్యవస్థ, వాటికి ఉపయోగించే మెటీరియల్ కూడా ఈ కాలుష్యానికి కారణం అవుతున్నాయని అన్నారు. దీని పై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మరి శర్మ గారు రాసిన లేఖ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందించి, ఇలనాటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంసం అయ్యింది. ముఖ్యంగా అధికార వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఆ జీవోలో వాడిన భాష చూసి, అధికార వర్గాలు అవాక్కయ్యాయి. ఈ జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ. ఈ ఆదేశాలు ఇచ్చింది, వాణీ మోహన్‌ అనే ఐఏఎస్ కి. ఆ జీవోలో "మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి చట్టాలు చదువుకుని రండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ పని తనం పెంచుకోండి" అంటూ జీవోలో రాసారు. సహజంగా ఇలా ఒక అధికారి పని తనం గురించి జీవొలో ప్రస్తావన ఉండదు. ఏదైనా డిసిప్లిన్ ఆక్షన్ తీసుకుంటే, అంట వరకు చెప్పి వదిలేస్తారు. ఇలా ఏదైనా ఆ అధికారికి చెప్పాలి అనుకుంటే, ఇంటర్నల్ గా మేమోలు ఇస్తారు. ఆ మేమోలో వార్నింగ్ ఇవ్వటం కానీ, లేదా ఇంకా ఏమైనా సలహాలు కాని, సూచనలు కానీ ఇస్తారు. అయితే ఏకంగా జీవోలో ఇలా ఒక ఐఏఎస్ పై రాయటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ జీవోలు ప్రజలు ఎవరైనా చూసేందుకు వీలుగా ఓపెన్ గా ఉంటాయి. మరి ఏకంగా చీఫ్ సెక్రటరీ సంతకంతో బయటకు వచ్చిన ఈ జీవో పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

secretariat 09122020 2

వాణీ మోహన్‌ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె 1996 బ్యాచ్ ఐఏఎస్‌. అయితే ఈ జీవో ఇవ్వటానికి కారణం, ఆమె సర్వే సెటిల్మెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఇదంతా 2016లో జరిగింది. తరువాత దీని పై ఎంక్వయిరీ జరిగింది. ఆ నివేదికలో తప్పు చేసారని తేలింది. తరువాత ఆమె ఆమె తన పై వచ్చిన ఆరోపణలు కొట్టేయాలని, ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వాణీ మోహన్ అభ్యర్ధనను, గతంలో ఇచ్చిన విచారణ నివేదికను పరిశీలించి, ఆ జీవో విడుదల చేసారు. ఇక్కడ వరకు అంతా ప్రొసీజర్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం జరిగింది. అయితే జీవోలో చివర్లో, అసాధారణ రీతిలో, ఐఏఎస్ ను చీఫ్ సెక్రటరీ హెచ్చరించటం, వెళ్లి చట్టాలు చదువకురండి అని చెప్పటం, పని తీరు మెరుగుపరుచుకుని, నైపుణ్యం పెంచుకోండి అని చెప్పటం పై అందరూ షాక్ అయ్యారు. ఆమె చట్టాలు గౌరవించలేదని, ఆ జీవో సారంశం. అయితే ఇలాంటివి సహజంగా మెమోలో ఇస్తారు కానీ, ఇలా ప్రజలు అందరూ చూసేలా జీవోలో ఎందుకు ఇచ్చారు అనేది చర్చగా మారింది. ఈ అంశం పత్రికల్లో వచ్చినా, ఎలాంటి వివరణ అధికారులు నుంచి రాలేదు.

జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. సుప్రీం కోర్టు జస్టిస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. అప్పట్లో సుప్రీం కోర్టు జడ్జీలు తిరుగుబాటుకి సారధ్యం వహించారనే ప్రచారం ఉండి. అయితే రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, ఆయనకు కావాల్సిన న్యాయ సలహాలు ఇస్తున్నారని, ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ స్థానాలకు, జడ్జిలకు మధ్య వచ్చిన గ్యాప్ తరువాత, చలమేశ్వర్ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇక ఆయన కుమారుడు జాస్తి నాగభూషణ్ కూడా జగన్ క్యాంప్ లో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన పలు సందర్భాల్లో, జాస్తి నాగభూషణ్ కూడా వెళ్ళే వారని వార్తలు వస్తూ వచ్చేవి. అయితే ఇప్పటి వరకు ఇరు పక్షాలు ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా జాస్తి నాగభూషణ్ కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్ ను ఏపీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒక విధంగా ఎదో ఒకసాయం చేస్తారని ఊహించిందే అయినా, ఇంత తొందరగా తెర ముందుకు రావటం పై రాజకీయ పరంగా కూడా చర్చ జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read