విశాఖ ఎప్పుడెప్పుడు వెళ‌దామా అని ఎదురుచూస్తోన్న సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఏ ముహూర్తం క‌లిసి రావ‌డంలేదు. తానొక‌టి త‌లిస్తే, సుప్రీంకోర్టు మ‌రొక‌టి త‌ల‌చింది. ఇల్లు చూసుకున్నానని, పోర్టు గెస్ట్ హౌస్ విడిది, రుషికొండ సీఎం ఆఫీసు అంటూ త‌న బులుగు మీడియాలో ప్ర‌చారం చేసుకున్నారు. మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ ఒక‌డుగు ముందుకు వేసి ఏకంగా మార్చి 22న సీఎం విశాఖ వ‌చ్చేస్తున్నార‌ని ప్ర‌క‌టించారు. అమరావ‌తి రాజ‌ధానిపై సుప్రీంకోర్టులో కేసులు ఉండ‌డంతో అవి త్వ‌ర‌గా తేల్చాల‌ని ఏపీ స‌ర్కారు న్యాయ‌వాదులు కోరినా ఫ‌లితంలేకుండా పోయింది.  జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ముందు ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాదులు త్వ‌ర‌గా విచార‌ణ ముగించాల‌ని కోరారు. స్పందించిన బెంచ్‌ మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతి పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేస్తూ సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు ఇవ్వ‌డంతో వాయిదా ప‌డింది. ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తే అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లింది ఏపీ స‌ర్కారు. ఈ పిటిషన్ల పై విచారణ తేదీ కూడా ప్రకటించలేదు. అయితే వైసీపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న టీవీ9 అయితే విశాఖ రాజ‌ధానికి లైన్ క్లియ‌ర్ అంటూ సుప్రీంకోర్టు పేరుతో బ్రేకింగ్ కూడా వేసేసింది.  ఈ నేప‌థ్యంలో విశాఖ తొంద‌ర‌గా షిఫ్ట్ అవ్వాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న న్యాయవాదుల‌తో మార్చి 7 లోగా విచార‌ణ‌కొచ్చేలా చేయాలని కోరినా కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.మార్చి 28వ తేదీ విచారణ జాబితాలో ఉంచుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో విశాఖ రాజ‌ధానికి అనుకూలంగా తీర్పు వ‌స్తే వెంటనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల‌నుకున్న స‌ర్కారు ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాాలంటూ గ‌త ఏడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ స‌ర్కారు ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్‌ దాఖలు చేసింది.

ఏపీలో రౌడీల కంటే ఘోరంగా పోలీసులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కేంద్ర హోంశాఖ డిజి స్థాయి అధికారి సునీల్ కుమార్ పై చ‌ర్య‌లు తీసుకున్నా, అదురూ బెదురూ లేని పోలీసులు చెల‌రేగిపోతున్నారు. వీరిని పోలీసులు అనే కంటే గూండాలు అని పిల‌వ‌డం క‌రెక్ట్ అంటున్నారు టిడిపి నేత‌లు. క‌దిరిలో సీఐ త‌మ్మిశెట్టి మ‌ధు మీసం మెలేస్తూ, ప్ర‌జ‌ల‌పై చాలెంజ్‌లు విసురుతూ, వైసీపీ నేత‌ల‌తో క‌లిసి దాడుల‌కు తెగ‌బ‌డ‌డం చూస్తుంటే దీని వెన‌క ఏదో ప్ర‌యోజ‌నం ఉంద‌ని అనుమానాలు వ‌స్తున్నాయి. అయితే గ‌త టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో అనంత‌పురం జిల్లాలో సీఐగా ప‌నిచేసిన గోరంట్ల మాధ‌వ్ కూడా ఇలాగే మీసాలు తిప్పుతూ, రోడ్ల‌పైనే ప్ర‌జ‌ల‌పై దాడులు చేస్తూ, చివ‌రికి వైసీపీ ఎంపీ టికెట్ సాధించి ఎంపీ అయిపోయాడు. ఇప్పుడు ఏపీలో పోలీసులు చాలా మంది గోరంట్ల మాధ‌వ్‌లాగే అధికార వైసీపీ మెప్పు పొంది, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ సాధించి ఎంపీ అయిపోవ‌చ్చ‌నే దురాశ‌తో ఇంత‌లా బ‌రితెగిస్తున్నార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. గ‌న్న‌వ‌రం సీఐ క‌న‌కారావు వైసీపీ రౌడీల‌ను తీసుకొచ్చి టిడిపి ఆఫీసుపై దాడి చేయించి, త‌న‌పై టిడిపి నేత‌లు దాడి చేశార‌ని రివ‌ర్స్ కేసు పెట్టిన అరాచ‌కంపై టిడిపి పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో కూడా అన‌ప‌ర్తి సీఐ శ్రీనివాస్ చేసిన రౌడీ యిజం ఏపీలో పోలీసు గూండాగిరీకి ప‌రాకాష్ట‌. చంద్ర‌బాబు క‌ద‌ల‌కుండా పోలీసుల‌ను ఆయ‌న కాన్వాయ్‌కి ఎదురుగా బైఠాయింప‌జేసిన సీఐ శ్రీనివాస్‌..టిడిపి నేత‌ల‌ని చిత‌క‌బాదారు. ఓ రైతుని కొట్టి ట్రాక్ట‌ర్ తాళం లాగేసుకుని రోడ్డుకి అడ్డంగా ట్రాక్ట‌ర్‌ని పెట్టించిన సీఐ శ్రీనివాస్ తీరు చూసి ఇంతగా బ‌రితెగించిన పోలీసులు అధికారుల‌ను దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని నేత‌లు విస్తుపోతున్నారు. అయితే ప్ర‌భుత్వం మారితే త‌మ ప‌రిస్థితి ఏమ‌వుద్ద‌నే ఆలోచ‌న లేకుండా చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ రాజ్యాంగ వ్య‌తిరేకంగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది, వైసీపీ టికెట్ల కోస‌మేన‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిగ్రీ చ‌ద‌వ‌లేద‌ని, టిడిపి ప‌దే ప‌దే ఆరోపిస్తోంది. ఎన్నిక‌ల అఫిడ‌విట్, కేసుల అఫిడ‌విట్లో రెండు ర‌కాలుగా త‌న విద్యార్హ‌తలు ఎందుకు పేర్కొన్నారో చెప్పాల‌ని టిడిపి చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఒక చోట ఎంబీఏ అని రాసిన జ‌గ‌న్ ఏ కాలేజీ, ఏ యూనివ‌ర్సిటీయో చెప్పాలంటూ ర్యాగింగ్ చేస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ వైసీపీ స్పందించ‌లేదు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి ఓటు లేద‌నే వార్త‌తో జ‌గ‌న్ విద్యార్హ‌త‌ల‌పై మ‌రోసారి దుమారం రేగుతోంది. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. టీచ‌ర్, స్థానిక‌, ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిల‌కు నామినేష‌న్ల ఘ‌ట్టం జ‌రుగుతోంది.  సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప కూడా  పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉంది. అయితే ముఖ్య‌మంత్రికి ఓటు లేదు. ప‌ట్ట‌భ‌ద్రుడు కాక‌పోవ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓట‌రుగా న‌మోదు చేసుకోలేద‌ని టిడిపి ఆరోపిస్తోంది.  అసెంబ్లీలో తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని గొంతు చించుకునే జ‌గ‌న్ రెడ్డి అస‌లు డిగ్రీయే పూర్తి చేయ‌లేద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంట‌ర్ వ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ అని చెబుతున్నా..ఆ త‌రువాత జ‌గ‌న్ చ‌దువుకి సంబంధించిన ఏ రికార్డులూ లేవ‌ని టిడిపి ఆరోపిస్తోంది.  అసలు 'జగన్ డిగ్రీ పూర్తి చేశారా? చేస్తే ఓటరుగా ఎందుకు నమోదవలేదు?'అని ప్రశ్నిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని, గ్రాడ్యుయేట్ ఓటరుగా ఎందుకు నమోదు చేయించుకోలేదని తెదేపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి ప్రశ్నించారు. జగన్ డిగ్రీ పూర్తిచేశారా? లేదా? పూర్తిచేసి ఉంటే పులివెందులలో ఎందుకు ఓటరుగా నమోదు చేసుకోలేదు? అని అడుగుతున్నారు. వైసీపీ నుంచి జ‌గ‌న్ రెడ్డికి ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు లేద‌నే టిడిపి ఆరోప‌ణ‌ల‌పై కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అనుమానాలు నిజ‌మేన‌నుకుంటున్నారు జ‌నాలు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో నారా లోకేష్ సెల్ఫీల‌తో ఛాలెంజ్‌లు విసురుతున్నారు. చాలా ప్లాన్డ్‌గా పాద‌యాత్ర‌లో తాను తెచ్చిన కంపెనీల ముందుగా న‌డుచుకుంటూ వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. దిగ‌డ‌మే కాదు తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు తెచ్చిన కంపెనీ ఇద‌ని, నువ్వు తెచ్చిన కంపెనీలు ఏమైనా ఉంటే సెల్ఫీ తీసి పంపు అంటూ చాలెంజ్‌లు విసురుతున్నారు. డిక్స‌న్, జోహో, టీసీఎల్ ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్ తెచ్చిన కంపెనీలు మీదుగా సాగింది పాద‌యాత్ర‌. లోకేష్ చాలెంజుల‌తో అస‌హ‌నంగా ఉన్న వైసీపీ స‌ర్కారు నేరుగా కౌంట‌ర్ ఇవ్వ‌కుండా జ‌గ‌న్ తెచ్చిన కంపెనీలు అంటూ ప్ర‌చారం ఆరంభించారు. అయితే ఇవి కూడా టిడిపి హ‌యాంలో వ‌చ్చిన‌వి, ఒప్పందం చేసుకున్న‌వి ఉన్నాయ‌ని టిడిపి సోష‌ల్మీడియా కౌంట‌ర్ ఎటాక్ చేస్తోంది.  మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఈ స‌ద‌స్సుకు ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, మరో 282 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు ఒప్పందాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వంగా వైఎస్ జ‌గ‌న్ రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా ఏ కంపెనీలు రాలేదు. ఉన్న‌వి తామే వెళ్ల‌గొడుతున్నామ‌ని అమ‌ర్ రాజా విష‌యంలో గ‌ర్వంగా ప్ర‌క‌టించింది ఏపీ స‌ర్కారు. దేశ‌వ్యాప్తంగా ఏపీ పేరు వింటేనే పారిశ్రామిక‌వేత్త‌లు బెంబేలెత్తి పోతుండ‌డంతో త‌న క్విడ్ ప్రోకో టీముతో కొన్ని ఒప్పందాలు చేసుకుని ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌ని వైసీపీ భావిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నారా లోకేష్  సెల్ఫీ దెబ్బకు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రచారం మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం .. ఈ స‌ద‌స్సుని కూడా బాగా హైలైట్ చేసుకోవాల‌నుకుంటోంద‌ని స‌మాచారం

Advertisements

Latest Articles

Most Read