ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీ మీద వస్తే, భుజాలు తడుముకుంటూ, జీవీఎల్ వచ్చి చేసిన హడావిడి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ మీద ఏ ఆరోపణ వచ్చినా, వచ్చేసి హడావిడి చేసే జీవీఎల్, ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి ఏమి సంబంధం ? కేంద్రం పరిధిలోకి రాదు అంటూ, అందుకున్నారు జీవీఎల్. అయితే జీవీఎల్ వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చారు రఘురామరాజు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి లేఖ రాసాను కాబట్టి, తాను ఈ విషయం పై స్పందిస్తున్నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ "ఈ రోజు నేను ఈ వార్త సాక్షి పేపర్ లో చదివాను. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన సూచన చూసాను. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి, ఆయన ఏ రాష్ట్రానికైనా సూచన ఇవ్వచ్చు. సూచన ఇవ్వటంలో తప్పు లేదు కానీ, చంద్రబాబు గారు రాసిన లేఖ ప్రధానికి, అంటే గవర్నమెంట్ అఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే నేను ఆయన మాట్లాడిన వీడియో చూడలేదు. సాక్షిలో వచ్చింది చూసాను. రెండూ వేరు అవ్వచ్చు. అయితే ఈ రోజు నేను చేసిన కధనం ప్రకారం, చంద్రబాబు గారికి అవసరం ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాని, ముఖ్యమంత్రికి కానీ లేఖ రాసుకోవచ్చు అని జీవీఎల్ గారు సూచన అయితే ఇచ్చారు."

"చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసారు, అయితే వేరే పార్టీ అధికార పార్టీ సూచన వినాల్సిన పని లేదు, అయినా జీవీఎల్ ఎదో చెప్పారు. కానీ నేను అయితే, ఈయన మాటలు పాటించను. ఎందుకంటే స్టేట్ ఇంటలిజెన్స్ నా ఫోన్ ట్యాప్ చేస్తుంది అని, అదే రాష్ట్రానికి రాయటం భావ్యం కాదు కాబట్టి, నేను కేంద్ర ప్రభుత్వానికి రాసాను. అలాగే చంద్రబాబు గారు కూడా కేంద్రానికి రాసారు. ఆయనే కాదు, ఎవరైనా కేంద్రానికే రాస్తారు. అనుమానమే వారి మీద ఉన్నప్పుడు, వారికే ఎలా రాస్తాము. కేంద్రం జోక్యం చేసుకోదు అని, జీవీఎల్ అనటం పై నేను క్లారిటీ ఇవ్వాలి, నేను కేంద్రానికి ట్యాపింగ్ పై లేఖ రాసాను కాబట్టి. ఈ విషయం కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తుంది. కేంద్రానికి సంబంధం లేదు అనంతం, అసంబద్ధంగా ఉంది. రాజస్తాన్ లో ఒక విధానం, కర్ణాటకలో ఒక విధానం, ఇక్కడ ఒక విధానం ఉండదు. రాజస్తాన్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీజీపీ ఆరోపిస్తూ సిబిఐ కోరింది. ఏడాది క్రితం, కర్ణాటకలో కూడా బీజేపీ ఇలాగే కేంద్రాన్ని కోరింది. మరి ఏపిలో మాత్రం కేంద్రానికి సంబంధం లేదు, ఇక్కడ రాయకూడదు అని చెప్పటం ఏమిటి ? ఒక జాతీయ పార్టీకి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండదు కదా. అది జీవీఎల్ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుంది." అని రఘరామరాజు అన్నారు.

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లక్ష్యంగా జరుగుతున్న దర్యాప్తు వేగం పుంజుకుంది. గుంటూరులోని రమేష్ ఆసుపత్రి స్థలం లీజు వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. క్రిస్టియన్ మిషనరీ (ఎఈఎల్‌సి) సంస్థకు చెందిన స్థలాన్ని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో రమేష్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంకు, రాయపాటి సోదరులకు బంధుత్వం ఉంది. రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత గుంటూరు రమేష్ ఆసుపత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సాంబశివరావు సోదరుడి కూతురు రాయపాటి శైలజ విజయవాడ రమేష్ ఆసుపత్రి చైర్మన్‌గా ఉన్న రామ్మోహనరావుకు కోడలు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు సహకారంతోనే గుంటూరులో డాక్టర్ రమేష్ ఆసుపత్రిని నెలకొల్పారు. స్వర్ణ ప్యాలెస్ ఘటన నేపధ్యంలో రాయపాటి సోదరుల వ్యవహారాల పైనా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. సాంబశివరావు కుటుంబ సభ్యులు రమేష్ ఆసుపత్రికి సబ్ లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు నగర నడిబొడ్డున ఈ స్థలం ఉండటంతో ఆసుపత్రికి బాగా ఉపయోగపడింది.

ఇందుకు సంబంధించిన వ్యవహారాలను ఆరా తీసేందుకు ఇప్పటికే రాయపాటి మమతను విచారించిన విజయవాడ పోలీసులు తాజాగా మంగళవారం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఆయన సోదరుడి కూతరు అయిన శైలజను విచారించారు. ఆమె అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారన్న సమాచారంతో కొంత మంది వైసిపి నాయకుల సలహాతో రాయపాటి కుటుంబంపై దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని కానీ ఇంతలా కొంత మందిని లక్ష్యం చేసుకుని వేధింపులు ఎక్కడా ఎప్పుడూ చూడలదేని రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ పేర్కొన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కేర్ సెంటర్లను ఎక్కడైనా పరిశీలించారా అని తనను పోలీసులు అడిగారని కానీ తాను 8 నెలలుగా వైద్య వృత్తికి దూరంగా ఉన్నానని చెప్పారు. నా పుట్టుపూర్వోత్తరాలు కూడా అధికారులు అడిగారని తెలిపారు. 30 ఏళ్లుగా పేరు తెచ్చుకున్న ఒక సంస్థను లక్ష్యంగా చేసుకుని కులం పేరుతో దుష్ప్రచారం చేయడం తగన్నారు. రమేష్ బాబును రమేష్ చౌదరిగా ప్రచారం చేస్తుంటే ఒక టార్గెట్ గానే తమకు కనబడుతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, వైసీపీ పార్టీ వైపు వెళ్ళిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే మద్దాలి గిరితో పాటుగా, గుంటూరు అర్బన్ పోలీసులకు కూడా హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సామగ్రి అపహరణ కేసులో, అటు ఎమ్మెల్యే మద్దాలి గిరికి, ఇటు గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఇక కేసు విషయానికి వస్తే, గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో, డీబీ ఫ్యాషన్‌ అనే ఒక షాపు ఉంది. ఆ షాపు పై కొన్ని రోజులు క్రితం కొంత మంది వచ్చి దౌర్జన్యం చేసారు. షాపు మూసి ఉన్న సమయంలో, తాళం పగులుకొట్టి మరీ, కోటీ యాభై లక్షల విలువ కలిగిన సామగ్రిని షాపులో నుంచి అపహరించారు. దీంతో షాపు ఓనర్లు గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసుల నుంచి సరైన సహకారం వారికి అందలేదు.

దీంతో ప్రతి వారం పెట్టే గ్రీవెన్స్‌కు వెళ్లి, తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అక్కడ కూడా సహకారం అందలేదని చెప్తున్నారు. అధికారులు ఎవరూ స్పందించకపోవటంతో, ఇక న్యాయ దేవతే దిక్కు అనుకుని, షాపు ఓనర్ కొప్పురావూరి శివ ప్రసాద్ హైకోర్టుకు మోర పెట్టుకుంటూ, పిటీషన్ దాఖలు చేసారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి చేస్తున్న ఒత్తిడితోనే, పోలీసులు తనకు సహకారం అందించలేదని, తన షాపులో దొంగతనం చేసిన వారికి మద్దలి గిరి మద్దకు ఉందని, కోర్టుకు తెలిపారు. తన షాపుని ఆక్రమించే ఎత్తుగడ వేసారని అన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఈ మొత్తం తాతంగం జరిగిందని ఆరోపించారు.. దీంతో పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, ఎమ్మెల్యే మద్దాల గిరితో పాటుగా, పోలీసులు, రెవిన్యూ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసింది.

తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోదావరి వరదలో చిక్కుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలంలోని చించినాడ వద్ద, నిమ్మల రామానాయుడు వెళ్తున్న పడవ నిలిచిపోయింది. ఆ పడవలో నిమ్మల రామానాయుడుతో పాటుగా, మరో 8 మంది ఉన్నట్టు తెలుస్తుంది. బోటు ఆగిపోవటంతో, రామానాయుడు, అధికారులకు విషయం చేర వేసారు. ఆగిపోయిన పడవను ఒక చెట్టుకు లంగరు వేసినా, గోదావరి ఉగ్ర రూపానికి, కదిలిపోతుందని చెప్తున్నారు. గోదావారి వరదల్లో చిక్కుకున్న బాడవ గ్రామానికి నిమ్మల రామానాయుడు పరామర్శించటానికి వెళ్లారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్టటంతో బోటు ఆగిపోయింది. విషయం అధికారులను తెలియ చేసారు. అయితే అధికారులు ఒక చిన్న బోటు పంపించగా, ఆ బోటు కూడా వరదకు తట్టుకోలేక తిరిగి వచ్చేసింది. దీంతో మరో పెద్ద బోటు కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

చివరకు పర్యాటక బోటు పమించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక బోటు కోసం నిమ్మల ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చీకటి పడుతూ ఉండటంతో, ఎమ్మెల్యే వర్గంతో పాటుగా, అధికారులు కూడా కంగారు పడుతున్నారు. ముందుగానే పెద్ద బోటు పంపించి ఉంటే, ఈ టెన్షన్ ఉండేది కాదని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. మరో పక్క, గోదావరి వరదల్లో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిక్కుకోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. విషయం తెలుసుకుని, హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఫోన్ కాల్ చేసారు. ఎమ్మెల్యే రామానాయుడుతో సహా వరదల్లో చిక్కుకున్న గ్రామ ప్రజలను కాపాడాలని చంద్రబాబు కోరారు. తగిన ఏర్పాట్లు చేసి, వెంటనే ఆయనతో పాటు ఉన్న మిగతా వారిని కూడా సేఫ్ గా తీసుకు రావాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read