ఏపీలో ప్రతిపక్షనేత పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నాలుగుదశాబ్దాలు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు చంద్రబాబు పట్ల అనపర్తిలో పోలీసులు వ్యవహరించిన తీరు అరాచకానికి పరాకాష్టగా నిలిచింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబుని చిమ్మచీకట్లో 8 కిలోమీటర్లు నడిపించిన పోలీసులు, ఆయనకేమైనా జరగాలని కోరుకున్నారా అనే అనుమానాలూ వస్తున్నాయి. అనపర్తి సభకి అనుమతి ఇచ్చిన పోలీసులే సభ ఆరంభం అయ్యేముందు వేదిక మార్చుకోవాలని కోరడం అంతా అనుమానాస్పదమే. ఒక ప్రతిపక్షనేత పట్ల పోలీసులు అలా వ్యవహరిస్తారా? పోలీసుల ముసుగులో అసాంఘికశక్తులా? లేకపోతే ఎన్ ఎస్ జీ భద్రతలో వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ కదలకుండా పోలీసుల్ని రోడ్డుపై కూర్చుని అడ్డుపెట్టుకున్న నేర వ్యూహం ఎవరిది? ఆ పోలీసుల్ని లేవమన్నా, లేపినా పోలీసులపై దాడి చేశారని కేసు పెట్టటానికేనన్నది వైసీపీ క్రిమినల్ ప్లాన్ అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతోంది. పోలీసుల బస్సులని చంద్రబాబుకి అడ్డంగా పెట్టారు. అటుగా ట్రాక్టర్ తో వెళుతున్న ఓ రైతుని కొట్టి దింపేసి ట్రాక్టర్‌ని అడ్డంపెట్టారు. బ్యారికేడ్లు అడ్డంపెట్టడం, టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జి, చంద్రబాబు నడిచే తోవ..సభ ప్రాంతంలో కరెంట్ తీసేయడం..జనరేటర్లు ఆపేయడం.. షాపులు మూసేయించడం చూస్తుంటే...పోలీసుల్లా మాత్రం కనిపించలేదు. ప్రత్యర్థులపై దాడులు చేసే ఫ్యాక్షన్ ముఠాలని తలపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అనపర్తిలో పోలీసు చర్యలు చూశాక కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు కూడా తెరవెనుక పెద్దలు ప్లాన్ చేసినవేనని అనుమానాలు వస్తున్నాయి. టిడిపి సభపై, కార్యకర్తలపై దాడులకు నేతృత్వం పోలీసులు అధికారులే వహించడం విశేషం. సీఐ శ్రీనివాస్ టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసిన దృశ్యాలు చూసి ప్రజలు అవాక్కయ్యారు. డిఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కేసు నమోదు చేయించడం ఇది పెద్దల ఆదేశాలతో జరుగుతున్న కుతంత్రం అని అర్థం అవుతోందని టిడిపి నేతలు అంటున్నారు.
అడ్డుకుని ఏం సాధించారు అంటే..చంద్రబాబుని మరింత కరడుగట్టినట్టు చేశారు. మామూలు సభ అయితే తాను చేసిన అభివృద్ధి వివరించి వెళిపోయేవారు చంద్రబాబు. వైసీపీ-పోలీసులు కల్పించిన అడ్డంకులతో ఆవేశంతో కూడిన ప్రసంగంతో కేడర్‌లో నూతనోత్తేజం నింపారు. అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటుకి అనపర్తిని సంకేతంగా నిలిపారు బాబు. విపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుని ముక్తకంఠంతో ఖండించాయి.
news
కామెడీ యాక్టర్ జోగినాయుడి కోసం క్రియేటివ్ హెడ్ పోస్ట్ క్రియేట్ చేసిన జగన్
ఫేమస్ యాంకర్ ఝాన్సీ మాజీ భర్త జోగినాయుడు తెలుసు కదా. అంటే సినిమాల్లో జోగిబ్రదర్స్ పేరుతో పేరు తెచ్చుకున్న నటుల్లో ఒకరైన జోగినాయుడు వైసీపీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఓ కొత్త పదవిని క్రియేట్ చేసి మరీ కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. అదే ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ పోస్టు. తాగుడు, వ్యసనాలతో జోగినాయుడు వేధింపులు తాళలేక ఝాన్సీ విడాకులు ఇచ్చేసింది. ఆ తరువాత డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పూరి జగన్నాధ్ పంచన చేరాడు. పూరి సోదరుడు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేయడంతో ఆయనతోపాటు వైసీపీలో చేరాడు. టీవీ ఆర్టిస్టు జోగినాయుడు తన కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు సంపాదించాడు. అప్పట్లో ఝాన్సీ కూడా బుల్లితెరపై రాణించింది. ఈ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతర కాలంలో ఝాన్సీ సంపాదనపై ఆధారపడి జోగినాయుడు వ్యసనాలకు బానిసై ఆమెపై దాడి కూడా చేశాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోగినాయుడికి విడాకులిచ్చేసింది ఝాన్సీ. వైసీపీలో చేరిన తరువాత నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మాఫియాకి అండదండలు అందించడం, రంగురాళ్ల ముఠాలతో లావాదేవీలు జోగినాయుడు నడుపుతున్నారనే ఆరోపణలు తెలుగుదేశం క్యాంప్ నుంచి వచ్చాయి. దీనికి ఊతం ఇచ్చేలా భమిడికలొద్ది రిజర్వ్ ఫారెస్టులో బాక్సైట్ తవ్వకాలు పరిశీలించేందుకు ఎన్జీటీ టీము వస్తే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలం అయిన జోగినాయుడు, అక్కడ తవ్వకాలు జరగడంలేదని పెయిడ్ ఆర్టిస్టులతో కమిటీకి చెప్పించారని ప్రచారం ఉంది. మొత్తానికి ఏజెన్సీలో గనుల మాఫియాకి అండగా నిలుస్తూ వచ్చిన క్రియేటివ్ జోగినాయుడుని ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించడం జగన్ కే చెల్లిందని టిడిపి ఎద్దేవ చేస్తోంది.
ఏపి పోలీసులకు ఎన్ఎస్జీ షాక్... జెడ్ ప్లస్ కేటగిరి నేతను ఇలా చేస్తారా అని ఆగ్రహం...
అంబేద్కర్ చట్టం ప్రకారం కాకుండా, తాడేపల్లి పెద్దల ఆదేశాలు పాటిస్తూ, కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అందరికీ తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, చివరకు చంద్రబాబు లాంటి వాడిని కూడా మీటింగ్ లు పెట్టించం, రోడ్డు మీద నడిపించుకుంటూ ఆయన వెళ్ళే దాకా వెళ్ళటం వరకు వ్య్వహరాం వెళ్ళింది. నిన్న చంద్రబాబు పై పోలీసులు వ్యవహరించిన తీరుతో అందరూ షాక్ అయ్యారు. బ్యారికేడ్లు పెట్టటం, లారీలు పెట్టటం, బస్సులు పెట్టటం, పోలీసులు అడ్డుగా కూర్చోవటం, జనరేటర్ లాక్కోవటం, విద్యుత్ ఆపటం, వ్యాన్ లు సీజ్ చేయటం, ఇలా ఇవన్నీ చూసి, పోలీసులు అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరి కలిగిన నేత. చంద్రబాబుతో పోలీసులు వ్యవహరించిన తీరుతో, ఢీల్లీ ఎన్ఎస్జీ స్పందించింది. రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నడుచుకుంటూ, రాత్రి పూట నడిచే సందర్భం రావటం పై ఎన్ఎస్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెడ్ ప్లస్ కేటగిరి వ్యక్తికి భద్రత ఇవ్వాలనే కనీస సోయ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జామర్లు లేకుండా, అంబులెన్స్ ఇవకుండా, చంద్రబాబుని నడిపించారని, ఎవరైనా రాళ్ళ దా-డి చేసి ఉంటే, ఏమి చేసే వారని, ఏపి పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీరు పై మండిపడింది.
తారకరత్న మృతిపై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీ సైకోలు, సాక్షి
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నందమూరి-నారా కుటుంబాలు శోకసముద్రంలో మునిగాయి. శవం కనబడితే రాజకీయాలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్న వైసీపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విషప్రచారంతో వైసీపీ వికృతానందం పొందుతోంది. వీరికి తోడు సాక్షి కూడా తారకరత్న మరణంపై పైశాచిక రాతలు అచ్చేస్తోంది. తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, ఆయన శవం వద్దే సీఎం కావడానికి సంతకాలు సేకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాచు నుంచి ఇంతకంటే సంస్కారం ఎక్స్‌పెక్ట్ చేయకూడదంటున్నారు టిడిపి నేతలు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని చంపేసి, నారాసుర రక్తచరిత్ర అని తమ సాక్షిలో అచ్చేయించిన వైసీపీ పెద్దలు శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. సొంత బాబాయ్ ని చంపుకున్న చరిత్ర వైసీపీది అయితే, అబ్బాయ్ కోసం బాబాయ్‌లు, కుటుంబమంతా ప్రార్థనలు చేసిన చరిత్ర టిడిపిది అని సోషల్ మీడియాలో టిడిపి ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ ఫేక్ నుంచే కాకుండా ప్రభుత్వ పదవుల్లో వున్నవారు సైతం తారకరత్న మృతిపై పెడుతున్న సైకో పోస్టులు చూశాక, తాడేపల్లి కేంద్ర కార్యాలయ ఆదేశాలతోనే ఇలా విషం చిమ్ముతున్నారని అర్థం అవుతోంది. తారకరత్న గుండెపోటుకి గురైన రోజే అల్లుకుని ఉంచిన విషకథనాలు, ఆయన కోలుకుంటుండడంతో ఆపేశారు. 23 రోజుల తరువాత మృత్యువుతో పోరాడి ఓడిపోయాక మళ్లీ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె దీర్ఘకాలిక మానసిక అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా తమ సైకో ఆనందాన్ని బయటపెట్టుకున్నాయి. మళ్లీ తారకరత్న విషయంలో వైసీపీ విషనాగులు బుసకొడుతున్నాయి.