ఏ పార్టీలో వున్నా చిన్న‌మ్మ‌గా పిల‌వ‌బ‌డే మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి వివాదాల‌కు దూరంగా ఉంటారు. అయితే బీజేపీలో మాత్రం ఏ వ‌ర్గం ముద్ద ప‌డ‌కుండా ఇన్నాళ్లు నెగ్గుకొచ్చారు. కానీ ఏపీ బీజేపీ దేశంలోనే విచిత్ర‌మైన స్ట్రాట‌జీ. బీజేపీకి రాష్ట్రంలో ఒక వార్డు మెంబ‌ర్ కూడా లేరు. కేంద్రంలో అధికారమే బ‌లంగా ఇక్క‌డ రాజ‌కీయాలు చేస్తుంటారు. ఎన్నిక‌ల్లో గెలిచిన ఒక్క ప‌ద‌వీ లేక‌పోయినా, వ‌ర్గాలు మాత్రం బోలెడు. బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచినా, అవి అప్పుడు అధికారంలో వున్న టిడిపి భిక్ష‌. ఇప్పుడు వైసీపీ కోసం ప‌నిచేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీజేపీ ఏపీ కీల‌క నేత‌లు..ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన‌, ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నా, ఇత‌ర పార్టీల‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ని పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టేస్తున్నారు. బీజేపీ తేనె పూసిన క‌త్తి రాజ‌కీయాలు త‌ట్టుకోలేక మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్లో చేర‌గా, తాజాగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఆ ఇద్ద‌రి నేత‌ల టార్గెట్ పురందేశ్వ‌రిని బ‌య‌ట‌కి పంప‌డం అని ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన‌ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అన్ని ప‌థ‌కాల‌కు వైఎస్ఆర్, ఎన్టీఆర్ పేర్లే పెడుతున్నారని, పథకాలకు పెట్టేందుకు ఆ ఇద్దరి పేర్లే ఉన్నాయా? ఇంకా ఎవరూ లేరా? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్, వైఎస్ పేర్ల గురించి జీవీఎల్ చేసిన  వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వ‌రి స్పందించారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు అంటూ జీవీఎల్ కి కౌంట‌ర్ ఇచ్చారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరోకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అయితే ఇదంతా బీజేపీ గేమ్ లో భాగ‌మ‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాగే పురందేశ్వ‌రిని కూడా పొమ్మ‌న‌కుండా పొగ‌బెడుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వైసీపీకి ఏమైనా డ్యామేజ్ చేసేలా మాట్లాడే బీజేపీ నేత‌ల‌ను సోము వీర్రాజు, జీవీఎల్ టార్గెట్ చేస్తార‌ని బీజేపీలో ఓ వ‌ర్గం గుర్రుగా ఉంది.

క‌మ‌లంతో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌యాణం ముగిసింది. అయితే ఆయ‌న టిడిపిలో చేర‌తారా? జ‌న‌సేన‌కి వెళ‌తారా? అనే దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీకి రాజీనామా చేయ‌డంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది.  2014లో మోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చాన‌ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నాన‌ని త‌న రాజీనామా సంద‌ర్భంగా క‌న్నా చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉంద‌ని, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయింద‌ని, బీజేపీ ముందుకు వెళ్లడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తుండ‌డంతో బీజేపీకి రాజీనామా చేశాన‌ని తెలిపారు. త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన క‌న్నా ఏ పార్టీలో చేర‌తార‌నేది మాత్రం వెల్ల‌డించ‌లేదు. కన్నా లక్ష్మినారాయణ రాజీనామా ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు స్పందించారు. కన్నా లక్ష్మినారాయణకు బీజేపిలో సముచిత గౌరవం ఇచ్చామ‌ని, సోము వీర్రాజుపై వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితంగా చేస్తున్నార‌ని చెప్పారు. త‌న‌పై  కన్నా చేసిన వ్యాఖ్యలు స్పందించేందుకు జీవీఎల్ నిరాక‌రించారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఉడ‌త ఊపుల‌కు కేంద్రం బెద‌ర‌లేదు. ఎమ్మెల్యేల బేరం పేరుతో పెట్టిన కేసులూ తేలిపోయాయి. కేంద్రంలో బీజేపీ విసిరిన లిక్క‌ర్ స్కామ్ ఉచ్చు  కవిత మెడ‌కి మరింతగా గ‌ట్టిగి బిగిసింది. ఇతరులతో కలిసి కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నట్లు ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. క‌వితని అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో నిందితులపై ఈడీ చేసిన ఆరోపణలకూ ఆధారాలున్నాయన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయ‌న త‌న‌యుడు రాఘవ రెడ్డి క‌లిసి లిక్క‌ర్ స్కామ్‌ని  న‌డిపిన‌ట్లు ఆధారాల‌ను కోర్టుకి స‌మ‌ర్పించారు. ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పిన మాగుంట రాఘ‌వ‌రెడ్డి విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసిన వారు క‌విత‌నీ అరెస్టు చేస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉందని, డ‌బ్బు త‌ర‌లిన  వ్యవహారాలు తేలాల్సి ఉందని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో మ‌నీల్యాండ‌రింగ్‌ వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిలు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో  నిందితులైన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ లు బెయిలు కోసం చేసిన అభ్యర్థనలపై విచారణ జరిపిన కోర్టు నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

ఈ రోజు అనపర్తిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే నిన్న అనపర్తిలో సభకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు, ఈ రోజు సభకు పర్మిషన్ లేదని చెప్పారు. దీంతో టిడిపి శ్రేణులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇప్పటికే అనేక మంది అనపర్తి చేరుకోవటంతో, పోలీసులు బ్యారికేడ్ లు పెట్టారు. ప్రజలు, అవి పడగొట్టి ముందుకు వెళ్ళారు. అయితే మరో పక్క చంద్రబాబు అనపర్తి వస్తూ ఉండటంతో, మధ్యలోనే చంద్రబాబుని పోలీసులు ఆపేసారు. దీంతో చంద్రబాబు మొదట, పోలీసులకు 5 నిముషాలు టైం ఇచ్చారు. పోలీసులు అనమతి ఇవ్వకపోవటంతో, చంద్రబాబు కాలినడకన బయలుదేరారు. చంద్రబాబు కేవలం ధర్నా చేసి వెళ్లిపోతరాని పోలీసులు అనుకున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయం తో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ జనాలను చూసి, పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. చంద్రబాబు నడుచుకుంటూ అనపర్తి బయలుదేరారు.

Advertisements

Latest Articles

Most Read