అంబేద్కర్ చట్టం ప్రకారం కాకుండా, తాడేపల్లి పెద్దల ఆదేశాలు పాటిస్తూ, కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అందరికీ తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, చివరకు చంద్రబాబు లాంటి వాడిని కూడా మీటింగ్ లు పెట్టించం, రోడ్డు మీద నడిపించుకుంటూ ఆయన వెళ్ళే దాకా వెళ్ళటం వరకు వ్య్వహరాం వెళ్ళింది. నిన్న చంద్రబాబు పై పోలీసులు వ్యవహరించిన తీరుతో అందరూ షాక్ అయ్యారు. బ్యారికేడ్లు పెట్టటం, లారీలు పెట్టటం, బస్సులు పెట్టటం, పోలీసులు అడ్డుగా కూర్చోవటం, జనరేటర్ లాక్కోవటం, విద్యుత్ ఆపటం, వ్యాన్ లు సీజ్ చేయటం, ఇలా ఇవన్నీ చూసి, పోలీసులు అసలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరి కలిగిన నేత. చంద్రబాబుతో పోలీసులు వ్యవహరించిన తీరుతో, ఢీల్లీ ఎన్ఎస్జీ స్పందించింది. రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నడుచుకుంటూ, రాత్రి పూట నడిచే సందర్భం రావటం పై ఎన్ఎస్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెడ్ ప్లస్ కేటగిరి వ్యక్తికి భద్రత ఇవ్వాలనే కనీస సోయ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జామర్లు లేకుండా, అంబులెన్స్ ఇవకుండా, చంద్రబాబుని నడిపించారని, ఎవరైనా రాళ్ళ దా-డి చేసి ఉంటే, ఏమి చేసే వారని, ఏపి పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీరు పై మండిపడింది.

వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో మ‌రోసారి క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి పిలుపు వ‌చ్చింది. ఇటీవ‌లే సీబీఐ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించార‌ని ప‌రిణామాలు స్ప‌ష్టం చేశాయి. మ‌ళ్లీ విచార‌ణకి పిల‌వ‌డంతో ఈ సారి అరెస్టు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హ-త్య కేసులో సిబిఐ దూకుడు పెంచేసింది. మరో మారు విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు వాట్స‌ప్ ద్వారా పంపింది. ఈనెల 24న సాయంత్రం మూడు గంటలకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. హైదరాబాదులోని సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది సిబిఐ. గతంలో 9 గంటల పాటు అవినాష్ రెడ్డి ని విచారించిన సీబీఐ, భార‌తి పీఏ న‌వీన్‌, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహ‌న్ రెడ్డిని పిలిచింది. ఈ నేప‌థ్యంలో రెండోసారి అవినాశ్ రెడ్డిని విచార‌ణ‌కి పిల‌వ‌డంతో కీల‌క ఆధారాలు దొరికాయ‌ని, ఈ సారి అరెస్టు త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో వెసులుబాట్ల‌ను వాడుకుని ఏళ్లుగా త‌న‌పై న‌మోదైన సీబీఐ, ఈడీ, మ‌నీల్యాండ‌రింగ్ కేసులు విచార‌ణ‌కి రాకుండా చూస్తున్నార‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ బెంచ్ హంటింగ్‌కి జ‌గ‌న్ గ్యాంగ్ పాల్ప‌డింద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.  అంటే త‌మ‌కు అనుకూల‌మైన జ‌డ్జి వ‌ద్ద‌కే కేసు విచార‌ణ వ‌చ్చేలా చేసుకున్నార‌ని ఓ ఇన్విస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టు జ‌గ‌న్ బండారాన్ని ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టాడు. ఈ నేప‌థ్యంలో సుప్రీం కోర్టులో భారతీ సిమెంట్స్ కేసు విచారణకు రాక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భారతీ సిమెంట్స్ కేసును 16వ నెంబర్ కేసుగా జాబితాలో రిజిస్ట్రీ పేర్కొన్నారు. 15వ నెంబర్ కేసును విచారించిన తర్వాత నేరుగా 17వ నెంబర్ కేసును ధర్మాసనం విచారించిందిద‌. అంటే బెంట్ హంటింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన భార‌తీ సిమెంట్స్ కేసు విచార‌ణ‌కి రాలేద‌ని తేలిపోయింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను అప్ప‌ట్లో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‍మెంట్‍కు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ స‌వాల్ చేసింది. ఈ కేసుని  జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ ధర్మాసనం ముందుకు విచార‌ణ‌కి వ‌చ్చేలా జ‌గ‌న్ రెడ్డి మ‌నుషులు చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ జాబితా నుంచి చివరి నిమిషంలో డిలీట్ అయినట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులు సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డికి రాజ్య‌స‌భ సీటు కూడా ఇచ్చారు ఏపీ సీఎం. ఆ నిరంజ‌న్ రెడ్డి బంధువు ప‌నిచేసే జ‌డ్జి బెంచ్‌కి కేసు వెళ్లేలా చేశార‌ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ బయట పెట్టారు. సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్ విషయంలో జగన్ రెడ్డి ప్రకటన చేయాల‌ని టిడిపి డిమాండ్ చేసింది. భారతి సిమెంట్స్ ఆస్తుల జప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో జరగబోయే కేసు విచారణలో బెంచ్ హంటింగ్ జరిగిందని, అవినీతి మార్గంలో తనపై కేసులు మాఫీ చేయించుకోవడానికి తెలంగాణకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చార‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.  సుప్రీంకోర్టు బెంచ్ హంటింగ్‌లో ఎంపీ నిరంజన్ రెడ్డి బంధువు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంద‌ని, దీనిపై సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు.

చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు రివర్స్ కేసులు బనాయించారు.చంద్రబాబు ఏ1, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జవహర్ ఏ3 గా కేసులు నమోదు చేసిన బిక్కవోలు పోలీసులు మరో వెయ్యి మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏకంగా వెయ్యి మంది పై కేసులు పెట్టటంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు. అనపర్తి, బిక్కవోలు పీఎస్ ల పరిధిలో 143, 353, 149 సెక్షన్ల కింద  మొత్తం 3ఎఫ్ఫై ఆర్ లు పెట్టారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో  నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జవహర్ సహా పలువురు తెలుగుదేశం నేతలపై 143, 353, 332, 149 సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేశారు.అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొందరు తెలుగుదేశం శ్రేణులపై 188, 506, 34 సెక్షన్ల కింద మరో కేసు నమోదు అయింది.

Advertisements

Latest Articles

Most Read