వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏ ప్ర‌భుత్వ ఉద్యోగికి ప్ర‌తీ నెలా ఒక‌టో తేదీన జీతం ప‌డిన దాఖ‌లాలు లేవు. కొంద‌రికి మూడు వారాలు త‌రువాత కూడా జీతాలు ప‌డుతున్నాయి. కొంద‌రికైతే నెల‌ల త‌ర‌బ‌డి జీతాలు లేవ‌ని ఆందోళ‌న‌లు సాగుతున్నాయి. జీతాలు స‌కాలంలో చెల్లించ‌క‌పోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి త‌మ జీతాలు స‌కాలంలో ఇప్పించాల‌ని కోర‌డం దేశంలోనే క‌ల‌క‌లం రేపింది. ఉద్యోగసంఘంపై ఏపీ స‌ర్కారు సీరియ‌స్ అయి నోటీసులు ఇచ్చింది. గ‌వ‌ర్న‌ర్ అపాయింట్మెంట్ ఇప్పించిన కార్య‌ద‌ర్శి ఆర్ పి సిసోదియాని జీఏడీకి అటాచ్ చేసింది. కానీ జీతాలు మాత్రం ఇవ్వ‌డంలేదు. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది ఉద్యోగ‌, ఉపాధ్యాయుల‌కు జీతాలు స‌కాలంలో చెల్లించ‌ని స‌ర్కారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మాత్రం ఠంచ‌నుగా ఒక‌టో తేదీనే జీతాలు, వేత‌నాలు, భ‌త్యాలు చెల్లిస్తూ వ‌స్తోంది. జీత‌భ‌త్యాలు అవ‌స‌ర‌మే లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ‌గ‌కుండానే ఒక‌టో తేదీనే జీత‌భ‌త్యాల‌న్నీ వేసేస్తున్న ప్ర‌భుత్వం ...ఈఎమ్ఐలు, లోన్లు క‌ట్టాల్సిన ల‌క్ష‌లాది ఉద్యోగుల‌కు మాత్రం ఒక‌టో తేదీ వెళ్లి మూడు వారాలైనా జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇటీవ‌ల అన్నివైపుల నుంచి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. సీనియ‌ర్ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుని ఎలాగైనా డిస్మిస్ చేయాల‌నుకున్న వైసీపీ స‌ర్కారుకి కేంద్రం నిర్ణ‌యంతో స‌గం మోదం-స‌గం ఖేదం మిగిలింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తిర‌స్క‌రించింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసింది. క్ర‌మ‌శిక్ష‌ణ  చర్యల్లో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసేందుకు వెసులుబాటు క‌ల్పించింది. టిడిపి హ‌యాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కోడిక‌త్తి కేసులోనూ, బాబాయ్ హ‌త్య కేసులోనూ త‌న గుట్టుమ‌ట్ల‌న్నీ ప్ర‌భుత్వానికి అందించింది ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అని వైసీపీ అధినేత‌కి అనుమానాలున్నాయి.వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన నుంచి ఏబీవీని ఏదో ర‌కంగా వేధిస్తూ వ‌చ్చారు. టిడిపి హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న‌ ఏబీ వెంకటేశ్వరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, విధుల నుంచి తొలగించింది. దీనిపై ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు న్యాయపోరాటం చేయ‌గా సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గతేడాది సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ పోస్టింగ్ ఇచ్చి, ఓ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారని మ‌ళ్లీ సస్పెండ్ చేశారు. వైసీపీ పాల‌న‌లో అస‌లు పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఏబీవీని రిటైర్ అయ్యేలా, లేదంటే ఉద్యోగం నుంచి తొల‌గించాల‌నుకున్న వైసీపీ అధినేత కోరిక నెర‌వేరలేదు. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని స్పష్టం చేసింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని, రిటైర్ అయ్యే వరకు లభించే ఇంక్రిమెంట్లను రద్దు చేయవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏపీ సీఎస్ కు లేఖ రాసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

యువ‌గ‌ళం పాద‌యాత్ర చాలా నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా సాగింది. అయితే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ‌చ్చిన జోష్‌తో తెలుగుదేశం శ్రేణులు క‌దం తొక్కాయి. రోడ్డు షో, బ‌హిరంగ‌స‌భ‌కి హాజ‌రైన‌ జ‌నం ప్ర‌భంజ‌నాన్ని త‌ల‌పించింది. సంద‌ర్భం చూసుకుని నారా లోకేష్ కూడా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, ప‌ర్యాట‌క‌శాఖా మంత్రి రోజాని టార్గెట్ చేశారు. మొత్తం రోజా అవినీతి, అరాచ‌కాలు, అహంకారాన్ని జ‌నం ముందుంచారు. త‌న‌పై టిడిపి యువ‌నేత ఇంత‌లా విరుచుకుపడుతుంటే, వైసీపీ నుంచి ఎవ‌రైనా మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని రోజా ఆశ‌గా చూసింది. ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డంతో త‌న‌కు తానే మీడియా ముందుకొచ్చి పిచ్చి మాట‌లు మాట్లాడింది. లోకేష్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోలేని స్థితిలో సంయ‌మ‌నం కోల్పోయి, నోటికొచ్చిన‌ట్టు మాట్లాడింది. రోజా మాట్లాడిన ప్ర‌తీ అంశానికి మ‌ళ్లీ లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అవినీతిని ప్ర‌శ్నిస్తే..మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్ట‌ట‌. నా ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ వార్నింగ్‌లు ఇస్తోంది. ప‌ళ్లు రాల‌గొట్టాల్సి వ‌స్తే ముందుగా జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్టాలి ఆంటీ`` అని రోజాకి త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. రోజూ నాకు చీర‌-గాజులు పంపుతాన‌ని ప్ర‌క‌టించే రోజాకి తెలుగు మ‌హిళ‌లు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్టు చేయించింద‌న్నారు. సాటి మ‌హిళ‌ల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మ‌హిళ‌ల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేట‌న్నారు. న‌న్ను ప‌ళ్లు రాల‌గొడ‌తానంటోన్న జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ చంద్ర‌బాబుని న‌డివీధిలో కొట్టాలి, కాల్చాలంటూ జ‌గ‌న్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ప్పుడు జ‌గ‌న్‌ ప‌ళ్లు రాల‌గొట్టాల్సింద‌న్నారు.

నా త‌ల్లిని అసెంబ్లీలో అవ‌మానించిన‌ప్పుడు ఏమైంది ఈ రోజా? అప్పుడు జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్ట‌లేదు ఎందుకు జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ? అని నిల‌దీశారు. రోజా త‌మ‌పై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పైనా స్పందిస్తూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు 16 హౌస్‌ క‌మిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్క‌టీ నిరూపించ‌లేక‌పోయార‌ని, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైసీపీలో ఉన్న‌ ల‌క్ష్మీపార్వ‌తి కూడా మాపై సుప్రీంకోర్టు వేసిన‌ కేసుల్లో క‌నీసం ఆధారాలు కూడా చూప‌లేకపోవ‌డంతో కేసుల‌ను కోర్టు కొట్టేసింద‌ని తెలిపారు. ఇదీ మా చిత్త శుద్ధి జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూనే మేము మా ఆస్తులు ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నాం. మీ వైసీపీ లో మీరు, మీ 150 మంది దొంగ‌లు కూడా ఆస్తులు ప్ర‌క‌టించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.మొత్తానికి పాద‌యాత్ర‌తో నారా లోకేష్ యువ‌గ‌ళం వైసీపీలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ పాద‌యాత్ర విజ‌య‌వంతం కావ‌డంతో మంత్రి రోజా ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి చేరింది.

సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపైన సోష‌ల్మీడియా వేదిక‌గా యుద్ధ‌మే ప్ర‌క‌టించింది వైసీపీ. అధిష్టానంతో గ్యాప్ రావ‌డంతో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను విమ‌ర్శించాడ‌ని ఏకంగా సీఐడీని పుర‌మాయించి క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశారు. మ‌రోవైపు ఎంపీ అని చూడ‌కుండా సోష‌ల్మీడియా వేదిక‌గా ర‌ఘురామ‌కృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్‌)ని విగ్గురాజు, పెగ్గు రాజు అంటూ వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్చార్జి గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి పోస్టులు పెట్ట‌డం చేసేశాడు. ఎంపీ ఫోన్ నెంబ‌ర్ షేర్ చేసి ఎవ్వ‌రూ ఫోన్ చేసి తిట్టొద్దంటూ లంఫెన్ గ్యాంగుల‌ని వ‌దిలేవాడు. అప్ప‌ట్లో గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్‌ డైరెక్ట‌ర్ కూడా. త‌న‌పై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు ఎంపీ ఆర్ఆర్ఆర్‌ ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త కేసు నేప‌థ్యంలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తప్పయిపోయిందని… ఇంకెప్పుడు అలా అనని గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లిఖిత పూర్వకంంగా రాసిచ్చారు. లోకాయుక్త గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి క్ష‌మాప‌ణ‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకి పంపారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎటువంటి స‌మాధానం రాక‌పోయేస‌రికి ఈ కేసుని ముగిస్తున్న‌ట్లు లోకాయుక్త ప్ర‌క‌టించింది.

Advertisements

Latest Articles

Most Read