ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలు షాక్ ఇస్తున్నాయి. కరోనా కేసుల్లో, ఆంధ్రప్రదేశ్ రోజురోజుకీ దూసుకుపోతూ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ లో జాగ్రత్తలు ఏమో కానీ, పక్క రాష్ట్రాలు మాత్రం, అలెర్ట్ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మొహమాటం లేకుండా షాకులు ఇస్తున్నాయి. ఒక పక్క తెలంగాణాలో, గత వారం రోజుల నుంచి, రోజుకి 10, 15 కేసులకు మించి రావటం లేదు. నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తూ వస్తుంది. దీంతో తెలంగాణా యంత్రాంగం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. అయితే, ఇలాంటి సమయంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రోజుకి 80 కేసులు కొడుతూ, తెలంగాణాకు దూసుకు పోవటంతో, తెలంగాణా తమ సరిహద్దు గ్రామాలను అలెర్ట్ చేసింది. ముఖ్యంగా కర్నూల్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో, తెలంగాణా అలెర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రావద్దు, మనం కర్నూల్ కు వెళ్ళద్దు, ఏమి వచ్చినా మన రాష్ట్రంలోనే చూసుకుందాం, కర్నూల్ నుంచి కూరగాయలు వచ్చినా మాకు చెప్పండి అంటూ, అక్కడ పోలీసులు మైకులు ద్వారా చెప్పారు.

ఈ నేపధ్యంలోనే, తెలంగాణా ఇచ్చిన షాక్ కు మర్చిపోక ముందే, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. తమిళనాడు ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా, సరిహద్దు గ్రామాల నుంచి, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే రహదారులు అన్నిటి పై, ఏకంగా గోడ కట్టేయమని ఆదేశాలు వచ్చాయి. దీంతో అక్కడ రోడ్డుకి అడ్డంగా ఏకంగా గోడలు కట్టేసారు. వేలూరు జిల్లాలోని సరిహద్దులో, అక్కడి కలెక్టర్ ఆదేశాలు ప్రకారం, ఇలా చేసారు. ఒక పక్క, సరిహద్దు రాష్ట్రాలు, ఏపిని బూచిగా చూస్తుంటే, ఇక్కడ మాత్రం, who, అమెరికా, బ్రిటన్ మన రాష్ట్రంలో , జగన్ గారు చేస్తున్న కరోనా పోరాటం గురించి, ఆరా తీస్తుంది అంటూ, వైసీపీ నేతలు ఊదర గొడుతున్నారు. జరుగుతుంది ఇది, అయితే ప్రచారం వేరేలాగా ఉంది.

ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదలచేసింది. కొత్త కేసులతో... రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 1,177కు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదుకాలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ‌వివిధ ఆస్పత్రుల్లో 911 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 33 కేసులు నమోదుకాగ... మొత్తం కేసుల సంఖ్య 210కి చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 23 కేసులు వచ్చాయి. వీటితో కేసులు 237కు చేరాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,517 నమూనాలు పరీక్షించామని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 292కు చేరాయి. నెల్లూరు జిల్లాలో 79, పశ్చిమ గోదావరి జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 4కు చేరాయి.

ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా మహమ్మారి, అల్లాడిస్తుంది. కర్నూల్ జిల్లాలో, అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. మూడు వందలకు చేరువలో కేసులు ఆ జిల్లాలో ఉన్నాయి. దీంతో కర్నూల్ జిల్లాలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అయితే ఇప్పుడు కర్నూల్ జిల్లా బాధితుల లిస్టులో, వైసీపీ ఎంపీ కూడా చేరారు. వైసీపీలోని ఒక ఎంపీ కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు క-రో-నా పాజిటివ్ రావటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఎంపీనే స్వయంగా ఒక టీవీ ఛానల్ లో కూడా ప్రకటించారు. ఈ విషయం పై, ఒక పత్రిక ఈ రోజు ఉదయమే ప్రచురించింది. ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, మరో ఇద్దరికి క-రో-నా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే ఆరుగురిలో నలుగురు డాక్టర్లు కావటం, మరో షాకింగ్ అంశం. ఇదే విషయం పై ఎంపీ కూడా మీడియాతో మాట్లాడుతూ, జరిగిన విషయాన్నీ ధృవీకరించారు.

తన కుటుంబంలో ఆరుగురికి క-రో-నా సోకినట్టు చెప్పారు. అందరూ ప్రభుత్వ కరోనా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క-రో-నా వస్తుంది అంటే, లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని అర్ధం అవుతుందని అన్నారు. ఇక మరో పక్క ఆ ఎంపీకి క-రో-నా పరీక్షలు చేయగా, నెగటివ్ అని వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో తరుచూ ఆ ఎంపీని కలుస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరో పక్క, కర్నూల్ జిల్లాలో, ఇప్పటికే ఒక వైద్యుడు క-రో-నా-తో చనిపోయారు. ఆ వైద్యుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మామగారు. అలాగే మరి కొంత మంది వైద్యులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం.

రాష్ట్రంలో కొత్తగా 81 క-రో-నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో... రాష్ట్రంలో క-రో-నా సోకిన వారి సంఖ్య 1,097కు చేరిందని హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. కోవిడ్ వల్ల ఇప్పటి వరకూ 31 మంది చనిపోయినట్లు తెలిపింది. కరోనా నుంచి 231 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది. వివిధ ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. గత 24 గంటల్లో క-రో-నా వల్ల ఎవరూ చనిపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 52 కేసులు నమోదవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2 క-రో-నా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కేంద్ర హోం శాఖకు మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తెదేపా నాయకులు లేఖ పంపినట్లు తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. కరోనా నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని, వైకాపా ప్రభుత్వ దురుసుతనం మూలంగా రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని స్వయంగా రమేష్ కుమార్ వెల్లడించినా విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భావ్యం కాదని ఖండించారు. రమేష్ కేంద్రాన్ని రక్షణ కోరితే సిగ్గుపడాల్సిన ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ``తెదేపా నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య పేర్లు వాడి మా గౌరవానికి భంగం తెచ్చినందుకు సోమవారం పరువునష్టం దావా వేస్తున్నట్లు నోటీస్ పంపిస్తున్నాను.’’అని వర్ల స్పష్టం చేశారు. లేఖ తాము సృష్టించలేదని మీడియా ముందు క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తా నని తేల్చి చెప్పారు. నేరాల్లో, ఘోరాల్లో మునిగిన జగన్, విజయసాయిరెడ్డిలకు పరువునష్టం దావాలు ఎన్ని వచ్చినా చీమకుట్టినట్లుండని తెలుసన్నారు.

రమేష కుమార్ సంతకాన్ని తెదేపా నాయకులు ఫోర్జరీ చేశారని డీజీపీకి ఆధారరహితంగా ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు. ``దొంగ సంతకాలు చేయడంలో విజయసాయిరెడ్డి నేర్పరి. ఆ లేఖ ఫోర్జరీ రమేష్ కుమార్ రాశానను చెప్పారు అంతకన్నా ఏంకావాలి. న్యాయస్థానాలను తప్పు పట్టించడానికి తాపత్రయపడుతున్నారు. రమేష్ కుమార్ పై అనుమానాలు రేకెత్తేలా ఆరోపణలు, ఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని కోర్టులను తప్పుదారి పట్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారు. కనకరాజ్ ను ఎస్ ఈ ఎస్ గా.నియమించడంపై కోర్టు సోమవారం వాదన విననుంది. రమేష్.రాసిన లేఖ వ్యవహారంలో తప్పుడుఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు మోసాల్లో ఫోర్జరీల్లో మునిగి తేలినవాళ్ళు. ``ప్రతిశుక్రవారం బోనులో నిలగడి వస్తారు. కోర్టులలో ఎన్ని మొట్టి కాయలు వేసినా దున్నపోతుపై వర్షం కురిసినట్లు’’ వ్యహరిస్తున్నారని విమర్శించారు. జగన్ బృందంపై 9 ఏళ్ళుగా కేసులున్నాయి. సత్వరంపరిష్కారం చేయాలని కోర్టులను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా. కోర్టుల్లో కేసులు వాదనలు పూర్తయితే నిందితుల బండారం బయటపడుతుంది. జగన్ పరిపాలించడానికి , బయట తిరగడానికి అర్హులా లేదా తేలుతుంది.

సీఎంకు కూడ విచారణ వేగవంతంగా పూర్తీ చేయలని కోర్టులను ఎందుకు కోరారు. పోలీసులు, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్ ను చీకటిలో బందీగా ఉంచుతున్నారా? ముఖ్యమంత్రికి తెలిసినట్లయితే కరోనా విభృంచడానికి కారణమైన విజయతోపాటు పలువురు ఎమ్మెల్యేలను కోరంటైన్ లో ఉంచమని ఆదేశించేవారే. ప్రజలకు, ముఖ్యమంత్రికి మధ్య దూరం పెడుతున్నారు. వైకాపా నేతల చరిత్ర అందరికీ తెలుసు. న్యాయస్థానాలలో వాదనలను పక్కదారి పట్టించడానికి లేనిపోని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం తగదని వారించారు. ``వెనుకటి గుణమేల మాను వినరా’’ అని సుమతీ శతకంలో పేర్కొన్నట్లు అధికారంలోకి వచ్చిన పెద్దలు ఏ1,ఏ 2ల తీరు ఉందని ఆక్షేపించారు. జగన్,విజయసాయిరెడ్డిలు 11 కేసుల్లో ముద్దాయిలని ప్రజల సొమ్ము రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. వీళ్ళతోపాటు మోపిదేవి, ధర్మాన ప్రసాద రావులు 16 నెలలు ఖైదీలుగా ఉంది వచ్చిన వాళ్ళు స్వేచ్చగా తిరగడానికిలేదు. వీళ్ళను అదుపులో పెట్టాలని సవినయంగా పోలీసులు, న్యాయస్థానాలకు విన్నవిస్తున్నాను. కండిషన్ బెయిల్ పై ఉన్న ముద్దాయిలు తిరుగుతూ ఉంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మూమెంట్స్, వ్యవహారశైలిపై వాచ్ చేయాలి. అవసరమైతే సస్పెక్ట్ షీట్లు పెట్టాలి. తప్పుడు ఫిర్యాదులపై సమయం వృధా చేయవద్దు. అనిపోలీసులకు వర్ల సూచించారు. అధికారంలో ఉన్నప్పటికీ వీరంతా ఔన్నత్యం కోల్పోయారని పేర్కొన్నారు. ``ప్రజలు గుడ్డివారు, అమాయకులు కాదు వైకాపా నేతల చరిత్ర తెలిసిన వారే’’ అని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు లాక్ డౌన్ ను గౌరవిస్తూ భౌతిక దూరం పాటిస్తేనే నియంత్రించగలమని జల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శనివారం కృష్ణలంకకు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్ బోర్ కొడుతుందని, టైంపాస్ కావడం లేదని ఇరుగు పొరుగు వారందరినీ పిలచి పేకాట ఆడాడని కలెక్టర్ చెప్పారు. అలాగే పిల్లలు, ఆడవాళ్లు, హౌసీ నిర్వహించారని వీటితో సంబంధిత ప్రజలు భౌతిక దూరాన్ని ఉల్లంఘించడం ద్వారా ఒక్కరి వల్ల సుమారు 24 మందికి కరోనా సోకి పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కార్మికనగర్ కు చెందిన మరో ట్రక్కు డ్రైవర్ కుటుంబ సభ్యులతో, ఇరుగుపొరుగువారితో కలిశాడని ఆయనతో సుమారు 15 కేసులు కార్మికనగర్ లో వచ్చాయని కలెక్టర్ బాధ పడ్డారు.

ఇందులో అధికార యంత్రాంగం గుర్తిస్తున్నదేమిటంటే సామాజిక దూరం, భౌతిక దూరం పాటించడం లేదని కలెక్టర్ చెప్పారు. దాదాపు 40 పాజిటివ్ కేసులు ఈ రెండు సంఘటనల ద్వారా రావడంపై కలెక్టర్ ఆవేదన వ్యక్తం చెప్పారు. సమాజంలో కరోనా ప్రబలుతుందన్న కారణంతో లాక్ డౌన్ పెట్టామని దానిని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి వ్యక్తి పై ఉందన్నారు. పోలీసు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది రెవెన్యూ ఎన్నిశాఖలు నియంత్రించడానికి ప్రయత్నించినా భౌతికదూరమే ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ దయచేసి ఇంటి నుండి బయటకు రావద్దని ఎవ్వరినీ కలవద్దని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలను వేడుకున్నారు.

ఇక మరో పక్క, రేపు ఆదివారం కావటంతో, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్. ఈ విషయం పై మరొక ప్రకటన చేసారు, వీఎంసీ కమిషనర్‌ వెంకటేశ్‌. కరోనా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో, రేపు విజయవాడలో నాన్ వెజ్ బంద్ చేస్తున్నట్టు చెప్పారు. మటన్ కాని, చికెన్ కాని, ఫిష్ మార్కెట్ కాని ఉండవని చెప్పారు. అలాగే విజయవాడలో ఉన్న కబేళా మూసివేస్తున్నాం అని, చేపల మార్కెట్ కూడా మూసేస్తున్నాం అని వీఎంసీ కమిషనర్‌ వెంకటేశ్‌ చెప్పారు. విజయవాడలో పరిస్థితి పై, గత వారం పది రోజులుగా, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.

Advertisements

Latest Articles

Most Read