గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు ప్రాంతాల్లో మూడు సీట్లు గెలిచేసిన టిడిపి మ‌ద్ద‌తుదారులు మంచి జోష్ లో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనూరాధ‌ని నిలిపిన టిడిపి జ‌గ‌న్ రెడ్డికి పంచుమ‌ర్తి మార్క్ పంచ్ ఇవ్వ‌డం ఖాయ‌మం అంటున్నారు విశ్లేష‌కులు.  ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు 7 స్థానాలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంల‌ను అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించారు. ఏక‌గ్రీవం అయిన‌ట్టేన‌ని వైసీపీ భావించ‌గా స‌డెన్‌గా టిడిపి  కూడా పంచుమ‌ర్తి అనూరాధ‌ని త‌మ అభ్యర్థిని దింపింది. దీంతో పోటీ అనివార్య‌మైంది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం నేప‌థ్యంలో వైసీపీ అలెర్ట‌య్యింది.  ఓట్లు చెల్ల‌క‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారుతాయ‌ని ఎమ్మెల్యేల‌కు ఓట్లు ఎలా వేయాలో శిక్ష‌ణ ఇచ్చారు. ఒక్కో మంత్రికి 20 మంది ఎమ్మెల్యేలను అప్ప‌గించారు. మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల‌తో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక‌కి మార్చి 23న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానం గెల‌వాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు స‌రిపోతాయి. టిడిపి త‌ర‌ఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, న‌లుగురు వైసీపీ పంచ‌న చేరారు. వారిని కూడా ఇర‌కాటంలో పెట్టేందుకా అన్న‌ట్టు టిడిపి చివ‌రి నిమిషంలో త‌మ అభ్య‌ర్థిని రంగంలోకి దింపింది. విప్ జారీ చేయ‌డం ద్వారా జంపింగ్ ఎమ్మెల్యేలు టిడిపి అభ్య‌ర్థి అనూరాధ‌కి ఓటు వేయ‌క‌పోతే న‌లుగురిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు కోర‌వ‌చ్చు. ఒక‌వేళ ఈ న‌లుగురూ వైసీపీకే వేసినా..వైసీపీలో ఉన్న కొంద‌రు అస‌మ్మ‌తి ఎమ్మెల్యేలు టిడిపి అభ్య‌ర్థికి ఓటు వేస్తారు. దీంతో పంచుమ‌ర్తి అనూరాధ గెలుపు ప‌క్కా అని ఫిక్స్ అయ్యారు.  23న జరిగే ఎన్నికల్లో పాల్గొని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలని టిడిపి ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అటు జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతోపాటు ఎమ్మెల్సీ స్థానం గెలిచి జ‌గ‌న్ రెడ్డికి షాక్ ఇవ్వ‌నుంది టిడిపి అని అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read