తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, మాల్దీవులకు వెళ్ళారు. హైదరాబద్ నుంచి మాల్దీవులకు ఫ్లైట్ లో వెళ్తున్న ఫోటోలు, అదే విధంగా మాల్దీవుల ఎయిర్ పోర్ట్ లో ఆయన దిగిన ఫోటోలు కూడా వైసిపి సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. గత మంగళవారం టిడిపి కార్యాలయం పై దా-డి, ఆ తరువాత పట్టాభి ఇంటి పై దా-డి, అనంతరం జగన్ ని పట్టాభి తిట్టారు అంటూ, ఆయన పై కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్ట్ చేయటం, ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. అయితే ఆ తరువాత రాజమండ్రి జైలు నుంచి విడుదల అయిన పట్టాభి, కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ గెట్ వరకు వచ్చి, అక్కడ నుంచి ఆయన అదృశ్యం అయ్యారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్ళారో తెలియక కొద్ది సేపు అలజడి రేగినా, ఆ తరువాత పోలీసులు ఆయన్ను మేము అరెస్ట్ చేయలేదని, మాకు తెలియదని చెప్పారు. అయితే పట్టాభి రహస్య ప్రదేశానికి వెళ్ళారని, సేఫ్ జోన్ లో ఉన్నారని, టిడిపి నేతలు చెప్పారు. అయితే ఆయన ఈ రోజు ఉదయం హైదరబాద్ నుంచి మాల్దీవ్స్ కు బయలుదేరి వెళ్ళారు అంటూ, వైసిపీ సోషల్ మీడియా అల్లరి అల్లరి చేస్తుంది. ఆయన ఫ్లైట్ లో ఉన్న ఫోటోలతో పాటు, ఆయన అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు కూడా వైసిపీ సోషల్ మీడియా వైరల్ చేసింది.

pattabhi 25102021 2

అంటే పట్టాభి మూమెంట్స్ ని, ఎంత నిశితంగా వైసిపి గమనిస్తుంది అనేది ఈ ఫోటోలు, ఆయన కదలికలు అనుక్షణం చెప్పటం చూస్తే అర్ధం అవుతుంది. పట్టాభిని తెలుగుదేశం పార్టీ నేతలే మాల్దీవులు పంపారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే అసలు వైసిపీ ఇంతగా పట్టాభి వ్యక్తిగత పర్యటన గురించి ఎందుకు హడావిడి చేస్తుందో అర్ధం కావటం లేదు. పట్టాభి మీద పెట్టిన కేసు ఒక చిన్న కేసు. దానిలో కోర్టు బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్ళకూడదని ఏమి చెప్పలేదు. మరి వీళ్ళకు వచ్చిన నొప్పి ఏమిటో అర్ధం కావటం లేదు. ఆయన తన కుటుంబంతో కలిసి, వెళ్లారు. ముఖ్యంగా ఆయన పాప ఆ దా-డి దృశ్యాలు చూసి షాక్ కి గురి అవ్వటంతో, ఆ పాపను కొంచెం మామూలు మనిషిని చేసే దానికి ఆయన వెళ్లి ఉంటారు. అయితే ఇక్కడ వైసీపీ నేతలు జగన్ ని తిట్టంచటానికి, ఇలా చేసారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డికి కండీషనల్ బెయిల్ ఉందని, కోర్టు పర్మిషన్ లేనిదే ఆయన ఎక్కడికీ వెళ్ళటానికి ఉండదు కాబట్టి, అందరికీ అలాగే ఉండాలని వైసీపీ కార్యకర్తలు అనుకుని, బకరా అయ్యారు అంటూ టిడిపి కౌంటర్ ఇస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read